Home Blog Page 295

Amaravati development updates: అమరావతి పై పెరుగుతున్న ప్రచారం

Amaravati development updates: అమరావతి రాజధాని నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉంది ప్రభుత్వం. ఒక రూపం తీసుకువచ్చి ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఓటమి వచ్చిన తర్వాత అమరావతి పునర్నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అమరావతిని ప్రపంచ నగరాల్లో ఒకటిగా నిలపాలన్నది చంద్రబాబు ఆలోచన. ఆ వ్యూహానికి తగ్గట్టు పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలోనే అమరావతిపై చర్చ జరిగేది. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో సైతం అమరావతిపై చర్చ జరుగుతోంది. దేశంలోని ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, జర్నలిస్టులు ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో జాతీయస్థాయిలో విస్తృత ప్రచారం జరుగుతోంది అమరావతిపై.

అమరావతి చుట్టూ అనుకూల కథనాలు
అమరావతి నిర్మాణంలో సాంకేతిక అంశాలను జోడిస్తోంది ప్రభుత్వం. ప్రధానంగా గ్రిడ్ తరహా డిజైన్, కృష్ణానది తీరాన అభివృద్ధి చెందుతున్న జోనల్ సిస్టం ఇప్పుడు ప్రచారంలోకి వస్తోంది. ప్రముఖ యూట్యూబర్ రాజన్ సింగ్ అమరావతి పనులపై రూపొందించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దేశ ప్రజలను ఆకర్షిస్తోంది. కేవలం సంక్షేమ పథకాలు కాదు.. శాశ్వతమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రాధాన్యతను అమరావతి నిరూపిస్తోందని ఈ వీడియో చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే.. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అమరావతిని రూపుదిద్దుతున్నారు. ఇప్పటికే ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, ప్రపంచ స్థాయి విద్యాసంస్థల క్యాంపస్లు అమరావతిలో నెలకొల్పుతున్నారు. ఇదే విషయాన్ని చెబుతున్నారు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు.

ఎండలను సైతం లెక్క చేయకుండా..
ప్రస్తుతం ఎండలకు తీవ్రత అధికంగా ఉంది. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ ఎండల్లో సైతం అమరావతి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు ఎండలను కూడా లెక్క చేయకుండా జాతీయస్థాయి ఇన్ఫ్లుయెన్సర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి.. అక్కడ జరుగుతున్న అద్భుతమైన మౌలిక వసతుల కల్పనను రికార్డ్ చేస్తున్నారు. అత్యాధునిక రవాణా సౌకర్యాలు, విశాలమైన రహదారులు, పక్కాగా విభజించిన నివాస, వాణిజ్య జోన్లను చూసి ఇండియాలోనే అద్భుత నగరం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రాబోయే తరాలకు ఒక ఆదర్శప్రాయమైన మాడల్ అవుతుందని ఎక్కువమంది కామెంట్స్ చేస్తున్నారు. జాతీయ మీడియాలో సైతం ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. తద్వారా అమరావతిలో పెట్టుబడులు పెడుతున్న ప్రైవేటు సంస్థలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Modi impressed with Lokesh: లోకేష్ లో మోడీకి నచ్చింది అదే!

Modi impressed with Lokesh: వారసత్వం అనేది కేవలం పరిచయం చేసేందుకు మాత్రమే అక్కరకు వస్తుంది. వారసులు తమకు తాము ప్రూవ్ చేసుకోకపోతే రాణించలేరు కూడా. అయితే ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల నడుమ రాజకీయ వారసుడిగా వచ్చిన లోకేష్ చాలా ఇబ్బందులు పడ్డారు. రాజకీయ ప్రత్యర్థుల చేతిలో వ్యక్తిత్వ హననానికి గురయ్యారు. కానీ అదే లోకేష్ ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో కీర్తించబడుతున్నారు. అది చిన్న విషయం కాదు.. రాజకీయాల కోసమో.. రాజకీయ మద్దతు కోసమో.. ప్రధాని నరేంద్ర మోడీ ఏ నేతను కూడా ప్రశంసించరు. ఆయన ప్రశంసించారంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. ఇప్పుడు నారా లోకేష్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా అనుకూలంగా ఉన్నారు. రాజకీయ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.

గంటన్నరకు పైగా..
హైదరాబాద్ పర్యటనకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లి దాదాపు గంటన్నర పాటు గడిపారు. ప్రధాని ఎక్కువగా లోకేష్ తో సమకాలిన రాజకీయాలు, ప్రపంచ పరిణామాలు, మారుతున్న యువత ఆలోచన ధోరణి పై సుదీర్ఘంగా చర్చించడం.. వారి మధ్య బలమైన అనుబంధానికి నిదర్శనం. లోకేష్ ను అభినందించడం ప్రధానికి కొత్త కాదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయనను ప్రశంసిస్తూనే ఉన్నారు. అందుకే ఆ కుటుంబానికి ప్రత్యేక విందు ఆహ్వానం కూడా పలికారు అప్పట్లో. అందుకే లోకేష్ సతీ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీతో విందు భేటీ జరిగింది. లోకేష్ పనితీరులో ప్రధాని మోదీని ఆకట్టుకున్నది ఆయన పనితనం. కేవలం ప్రణాళికలు రచించడం కాదు.. వాటిని 100% విజయవంతంగా అమలు చేసే తీరు ఆకట్టుకుంటూ వస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఏర్పాట్లను చూసి ప్రధాని ఫిదా అయ్యారు. దానిపై ఒక పుస్తకాన్ని సిద్ధం చేయించి సహచర క్యాబినెట్ మంత్రులకు ప్రధాని ఇచ్చారంటే లోకేష్ విషయంలో ఎంతలా ఆసక్తిగా ఉన్నారు అర్థం అవుతోంది.

ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానం..
ప్రధానిని కలవాలంటే చాలా రకాల తతంగం ఉంటుంది. అటువంటిది లోకేష్ కు ప్రత్యేకంగా ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన కుటుంబంతో కలిసి భోజనం చేసేందుకు రెండు గంటలకు పైగా సమయాన్ని కేటాయించారు. లోకేష్ మిత్రపక్ష నేత కావచ్చు కానీ.. దేశంలో చాలామంది యువ నేతలు మిత్రపక్ష పార్టీలకు చెందినవారు. కానీ ఎవరికి ఇవ్వనంత ప్రాధాన్యం లోకేష్ కు దక్కుతోంది ప్రధాని నరేంద్ర మోడీ వద్ద. యువ నేతలతో ఉండాల్సిన అసలైన రాజకీయ పరిణితి లోకేష్ లో ఉందన్న విషయాన్ని గ్రహించారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే లోకేష్ ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలి అన్న ఆలోచన నరేంద్ర మోడీ చేసిన ఆశ్చర్యపడనవసరం లేదు.

Modi offer to Revanth Reddy: మాతో కలువు.. డెవలప్ చేద్దాం.. రేవంత్ కు మోడీ ఆఫర్ వెనుక.. ఇంత ఉందా..

Modi offer to Revanth Reddy: రాజకీయాలలో ఏమైనా జరుగుతాయి.. ఎంతైనా జరుగుతాయి. కాకపోతే అది జరిగే సందర్భం ద్వారానే ఫలితం ఆధారపడి ఉంటుంది.. ఉదాహరణకు అస్సాం రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న హిమంతా.. ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు. రాహుల్ గాంధీ వల్ల బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏకంగా బిజెపిలో కీలక నాయకుడిగా ఉన్నాడు. అస్సాం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. బెంగాల్ రాష్ట్రాన్ని తీసుకుంటే.. సువేందు అధికారి ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో కీలక నాయకుడిగా ఉన్నాడు. మమత బెనర్జీ ఏకపక్ష పోకడలను తట్టుకోలేక అతడు బయటికి వచ్చాడు. ఇప్పుడు బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. బిజెపి లో కీలక నాయకుడిగా ఎదిగాడు.

ఇవన్నీ చూస్తుంటే ఏదో సాధారణంగా జరిగిన ప్రక్రియల మాదిరిగా అనిపించవచ్చు. హిమంత, సువేందు సాధారణ నాయకులు దర్శనమియ వచ్చు. కానీ, వీరిద్దరిని పార్టీలోకి తీసుకురావడంలో కీలకంగా పని చేసింది మాత్రం నరేంద్ర మోడీ. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అమిత్ షా చెప్పడం.. నరేంద్ర మోడీ క్యాప్చర్ చేయడం.. పార్టీలోకి తీసుకురావడం.. ఆ తర్వాత పార్టీ అవసరాలకు అనుగుణంగా వారిని మర్చిపోవడం ఇవన్నీ చక చకా జరిగిపోయాయి.

ఇప్పుడు ఈ వంతు తెలంగాణకు వచ్చిందా.. తెలంగాణలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారా.. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం చాలా కష్టం. కానీ ప్రధానమంత్రి ఆదివారం నాటి తెలంగాణ పర్యటనలో మాత్రం అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈసారి రేవంత్ రెడ్డి మీద ఆయన అంతగా విమర్శలు చేయలేదు. మాతో రండి.. కలిసి పనిచేద్దామని ఆఫర్ ఇచ్చారు. ఒక ప్రధానమంత్రి.. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇటీవల స్థాయిలో ఎన్నడూ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. నరేంద్ర మోడీ ఇలాంటి మాటలు మాట్లాడారు అంటే.. దాని వెనుక ఏదో జరిగి ఉంటుందని చర్చ నడుస్తుంది. నిజానికి చర్చకు ఆస్కారం ఇచ్చింది నరేంద్ర మోడీ.. ప్రధానమంత్రి ఆఫర్ ను అటు తిరస్కరించలేక.. ఇటు అవునన లేక ఇబ్బంది పడింది రేవంత్ రెడ్డి.. కాకపోతే రేవంత్ రెడ్డి బిజెపిలోకి వస్తారా.. అది సాధ్యమవుతుందా.. రాహుల్ గాంధీ అంత సులభంగా రేవంత్ రెడ్డిని వదులుకుంటారా.. అనే ప్రశ్నలు వ్యక్తం కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో బలమైన పునాదులు నిర్మించుకున్నారు. పెద్దపెద్ద వ్యక్తులు ఉదాహరణకు కేసి వేణుగోపాల్, ఆమధ్య ఉపరాష్ట్ర పదవికి పోటీ చేసిన అభ్యర్థి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఆయనకు మూల స్తంభాలుగా ఉన్నారు.

ఊకూకేనే రాలేదు రా బిడ్డ కూకున్న సీటు.. అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఓ పాటను అప్పట్లో రూపొందించారు. ఆ పాటకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి తన పొలిటికల్ కెరియర్ నిర్మించుకున్నారు. అలాంటప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి అంత సులభంగా బయటికి వచ్చే అవకాశం లేదు. నరేంద్ర మోడీ ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన బిజెపిలో చేరే ఆస్కారం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీకి ఏ స్థాయిలో అయితే రాజకీయ లెక్కలు ఉన్నాయో.. రేవంత్ రెడ్డికి కూడా అటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి.

8500 rupees pasta viral news: ప్లేట్ పాస్తా 8,500.. సల్మాన్ ఖాన్ సోదరి రెస్టారెంట్ లో అంతే మరి..

8500 rupees pasta viral news: ప్లేట్ పాస్తా ఎంత ఉంటుంది.. మహా అయితే 100.. ఒకవేళ ఖరీదైన రెస్టారెంట్ అయితే 250 కి మించదు. కానీ ప్లేట్ పాస్తా ₹8,500.. అదేంటి అదేమైనా బంగారంతో చేశారా.. వెండి కోటింగ్ ఏమైనా ఇచ్చారా.. అని అనుకోకండి. ప్లేట్ పాస్తాకు నిజంగానే అంత ఛార్జ్ చేశారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి ఆర్పిత ఖాన్ ముంబైలో ఒక రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్ మీద రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. విభిన్నమైన వీడియోలు సర్కులేట్ అవుతూనే ఉంటాయి. ఆర్పిత ఖాన్ ఏర్పాటుచేసిన రెస్టారెంట్లో రేట్లు విపరీతంగా ఉంటాయని రకరకాల పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ రెస్టారెంట్ లో క్రౌడ్ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా అంతకుమించి అనే స్థాయిలో వ్యాపారం సాగుతోంది.

అర్పిత హోటల్లో ఇటీవల ఒక వ్యక్తి పాస్తా ఆర్డర్ చేశాడు. ఆస్వాదించుకుంటూ తిన్నాడు. బిల్లు చూసేసరికి గుండెలు బాదుకున్నాడు. మహా అయితే 300 కు మించి ఖరీదు చేయని పాస్తా కు ఏకంగా 8,500 బిల్లు వేశారు. దీంతో అతడు కళ్ళు పిండుకుంటూ ఆ బిల్లు కట్టాడు.. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.. పాస్తాకు అంత ఖరీదా అంటూ నెటిజన్లు నోళ్లు వెళ్లబెడుతున్నారు.

సాధారణంగా సెలబ్రిటీలు రెస్టారెంట్లకు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. పైగా అక్కడ ధరలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అందువల్ల చాలామంది ఆ ధరలను తట్టుకోలేక అక్కడికి వెళ్లలేరు. కేవలం బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఆ రెస్టారెంట్లకు వెళుతుంటారు. అప్పుడప్పుడు డబ్బున్న వాళ్ళకు కూడా ఆ ధరలు చూసి భయం మొదలవుతుంది. ఈ పాస్తా తిన్న వ్యక్తి కూడా అటువంటివాడే. 350 రూపాయలతో పోయేదాన్ని.. 8500 పెట్టి తిన్నాడు. చివరికి ఇదిగో ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. తనకు జరిగిన క్షవరం గురించి చెప్పుకున్నాడు. ఎంతైనా సెలబ్రిటీల రెస్టారెంట్ల వేరు. అదే కస్టమర్ల జేబుకు చిల్లు పెట్టడానికి..

Tilak Varma dropped catch: తెలుగోడు ఆ క్యాచ్ పట్టి ఉంటే.. ముంబై బతికి బట్ట కట్టేది..

Tilak Varma dropped catch: ఐపీఎల్ లో ప్రతి పరుగు అత్యంత విలువైనది. ప్రతి వికెట్ అంతకంటే ఎక్కువ విలువైనది. అందువల్లే ప్రతిక్షణం ఆటగాళ్లు అప్రమత్తంగా ఉండాలి. లేనిపక్షంలో జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఐపీఎల్ లో ముంబై జట్టుకు వచ్చింది.

ఐపీఎల్ పేరు ప్రస్తావన వస్తే ముంబై జట్టు గురించి అభిమానులు గొప్పగా చెబుతుంటారు. ఎందుకంటే ముంబై జట్టు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి ఏకంగా ఐదుసార్లు ట్రోఫీలను అందుకుంది. అంతేకాదు ఐపిఎల్ చరిత్రలో సరికొత్త ఘనతను తన పేరు మీద రాసుకుంది. ముంబై జట్టు అంతటి స్థాయి ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో సరిగ్గా ఆడలేక పోతోంది. ముఖ్యంగా ఐపీఎల్ లో దారుణమైన ప్రదర్శన చేస్తోంది.

ముంబై ఇండియన్స్ జట్టు దారుణమైన ఆట తీరు కొనసాగిస్తున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే అతడి సారధ్యంలో ముంబై జట్టు 2024లో చివరి స్థానానికి పరిమితమైంది. ఇప్పుడు కూడా గ్రూప్ దశ నుంచి వెళ్లిపోతోంది. గత ఏడాది నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.. ఆదివారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో గెలవాల్సిన సందర్భంలో ముంబై జట్టు ఓడిపోయింది. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన ప్లే ఆఫ్ నుంచి ముంబై అవుట్ కావడం పట్ల అభిమానులు మండిపడుతున్నారు.

బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఎలిమినేట్ కావడం పట్ల అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రారంభంలో వికెట్లు పడగొట్టినప్పటికీ.. బెంగళూరు ఆటగాడు కృణాల్ పాండ్యా గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ఒక దశలో 17 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన క్రమంలో పాండ్యా భారీ షాట్ కొట్టాడు. బౌండరీ వద్ద నమన్ బంతిని అందుకున్నాడు. తిలక్ వర్మ వైపు విసిరేశాడు. ఆ బంతిని తిలక్ అందుకోలేకపోయాడు. తర్వాత పాండ్యా 2 భారీ సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించాడు. తెలుగోడైన తిలక్ వర్మ ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. చివరికి కృణాల్ పాండ్యా తిలక్ వర్మ పట్టిన క్యాచ్ తోనే అవుట్ అయ్యాడు.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Politics behind Religious Riots: మత కల్లోలాల వెనుక రాజకీయం.. హాపూర నుంచి కడప వరకు ఒకే నిజం

Politics behind Religious Riots: దేశవ్యాప్తంగా ఒకే రకమైన చిత్రం కనిపిస్తోంది.. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కడప వరకు, మత కల్లోలాల వెనుక దాగి ఉంది ఒక వ్యూహాత్మక రాజకీయం. ఇది కేవలం సంఘటనల పాట కాదు, దేశ సమగ్రతపై చేయబడే దాడి.

మత కల్లోలాల వ్యూహం
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో రాణాప్రతాప్‌ జయంతి సందర్భంగా అల్లర్లు, ఆంధ్రప్రదేశ్‌లో టిప్పు సుల్తాన్‌ జయంతి పేరుతో పార్టీల పోటీ పడుతున్నాయి. కశ్మీర్, మణిపూర్‌లలో అల్లర్లు పెద్ద ప్రాధాన్యత పొందకపోవడం వల్ల, రాజకీయ నేతలు ఇప్పుడు ఉత్తర, దక్షిణ భారతదేశంలోని ప్రాంతాలపై దృష్టి సారించారు. ఉద్రిక్తతలను పెంచేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు, మరియు ఒక వర్గం ఈ ప్రయత్నాలకు మద్దతు ఇస్తోంది. హాపూర్‌లో ధౌలానా ఏరియాలో రాణాప్రతాప్‌ జయంతి ర్యాలీని భగ్నం చేయడానికి ప్రయత్నం జరిగింది. అక్బర్‌ సైనికాధికారితో యుద్ధం చేసిన రాణాప్రతాప్‌ జయంతిని కొందరు వ్యతిరేకించారు. యోగి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవడం గమనించదగినది – రాళ్లు రువ్వినవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మత రాజకీయాలు..
ఆంధ్రప్రదేశ్‌లో చిత్రం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ, టీడీపీ టిప్పు సుల్తాన్‌ జయంతి విషయమై పోటీ పడుతున్నాయి. ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే టిప్పు సుల్తాన్‌ సర్కిల్‌ ఏర్పాటు చేశాడు, కడపలో గత వైసీపీ మేయర్‌ టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుకు తీర్మానం చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో విగ్రహం ఏర్పాటు చేయిస్తానని వాగ్దానం చేశారు.

ముస్లిం ఓట్ల కోసమే..
అల్మాస్‌గూడ ఏరియాకు టిప్పు సర్కిల్‌ అని పేరుపెట్టడానికి ప్రయత్నించినప్పుడు, హిందువులు దానిని హనుమాన్‌ సర్కిల్‌గా మార్చారు. దీంతో ముస్లింలు రోడ్లపైకి వచ్చి దాడి చేశారు, పోలీసులు గాయపడ్డారు, లాఠీచార్జి జరిగింది. జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది, శాంతి కమిటీ మీటింగ్‌లో గొడవ ఆపే ప్రయత్నం చేశారు, కానీ సమస్య పరిష్కరించలేదు.

హిందువుల్లో అసంతృప్తిని గుర్తించని నేతలు..
గుంటూరులో మహ్మద్‌ జిన్నా టవర్‌ విషంలో గొడవ జరిగింది. హిందువులు ఆగ్రహించడంతో టవర్‌కు జాతీయ జెండా రంగులు వేశారు. జాతీయ జెండా ఎగురవేయడం మొదలైంది. హిందువులు తలుచుకుంటే ఇలా మార్పు వస్తుంది. ఇది కేవలం మాట కాదు, నిజం. కానీ ప్రశ్న ఎక్కువ ముఖ్యమైనది: హిందువుల్లో పెరుగుతున్న అసంతృప్తి, కోపాన్ని రాజకీయ నేతలు గుర్తించకపోతే ఇబ్బందులు తప్పవు.

గుణపాటం నేర్చుకోవాల్సిన సమయం
టీడీపీ, వైసీపీ బెంగాల్‌ అస్సాంల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఈ రాష్ట్రాల్లో మత కల్లోలాల ఫలితాలు ఏమిటో చరిత్ర చెబుతోంది. మత రాజకీయాల్లో లాభం లేదు, కేవలం దేశ విభజనే ఉంది.

మత కల్లోలాల వెనుక ఉన్నది కేవలం ముస్లిం ఓట్ల కోసం రాజకీయం మాత్రమే. ఇది నైతికంగా తప్పు, దేశసమగ్రతకు హానికరం. హిందువుల అసంతప్తిని గుర్తించి, బాధ్యతాయుతమైన రాజకీయాలు చేయాలి. జాతీయత్వం ముఖ్యం, మతం కాదు.

Ram Charan farmer role in Sukumar Movie: సుకుమార్ మూవీ లో రామ్ చరణ్ రైతుగా కనిపించబోతున్నాడా..

Ram Charan farmer role in Sukumar Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఆయన నుంచి రాబోయే సినిమాల విషయంలో సైతం ఆయన చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ‘పెద్ది’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి స్టార్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… రామ్ చరణ్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే సుకుమార్ తో చేయబోయే సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందే రంగస్థలం సినిమా వచ్చి భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఈ కాంబినేషన్ కి అయితే మంచి క్రేజ్ దక్కింది. ఇక వీళ్ళిద్దరు ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తారు. ప్రేక్షకులను విశేషంగా అలరిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

సుకుమార్ తో చేయబోయే సినిమాలో రామ్ చరణ్ రైతుగా కనిపించబోతున్నాడట. రంగస్థలం సినిమాలో ఆల్మోస్ట్ పల్లెటూరు పాత్రను పోషించిన ఆయన ఈ సినిమాలో సైతం అలాంటి ఒక డిఫరెంట్ పాత్రలో నటించబోతున్నాడట.

చిట్టిబాబు క్యారెక్టర్ ఎంత పాపులారిటిని క్రియేట్ చేసుకుందో ఇప్పుడు చేయబోయే క్యారెక్టర్ సైతం అదే రేంజ్ ఇంపాక్ట్ ను ఇవ్వబోతుందట. సుకుమార్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పర్చదనే ఉద్దేశ్యంతో ప్రతి ప్రేక్షకుడు ఆయన సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు.

కాబట్టి ఈ సినిమా కోసం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు…ఈ సినిమా విషయానికి వస్తే సుకుమార్ ఈ సినిమా విషయంలో కూడా చాలా వరకు ఇన్వాల్వ్ అవుతున్నాడట. బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు కావడంతో ఈ ప్రాజెక్టును సెట్ చేసింది కూడా సుకుమార్ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

 

PM Modi greater vision: ప్రధాని మోదీ ‘గ్రేట్’ర్ ఆలోచన!

PM Modi greater vision: తెలంగాణలో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోడీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు పదివేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ జరిగింది. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డితో సైతం సన్నిహితంగా మెలిగారు ప్రధాని. ఒక విధంగా చెప్పాలంటే పక్క పొలిటికల్ వ్యూహంతోనే సాగింది నరేంద్ర మోడీ పర్యటన. అయితే మరోవైపు హైదరాబాదులో ఉంటున్న ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో గడిపారు మోదీ. అయితే దీని వెనుక గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల వ్యూహం ఉన్నట్టు అర్థం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలను గమనిస్తే ఒక వ్యూహం ప్రకారమే సాగుతుంటాయి. ఇప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ విషయంలో కూడా ప్రధాని ఆలోచన అదేనని ఒక టాక్ నడుస్తోంది.

గ్రేటర్ ఎన్నికలు త్వరలో..
మరి కొద్ది రోజుల్లో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. భారతీయ జనతా పార్టీ వీటిని ఒక సెమీఫైనల్స్ గా భావిస్తున్నాయి. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో సైతం ఇక్కడ మంచి ఫలితాలు సాధించింది.. అందుకే ఈసారి మేయర్ పీఠం సాధించడం ద్వారా తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అన్నట్టు సంకేతాలు పంపాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఇళ్లకు వెళ్లి.. టిడిపి తో పాటు జనసేన మద్దతును పరోక్షంగా పొందినట్టు అర్థం అవుతోంది.

టిడిపికి బలమైన క్యాడర్..
గ్రేటర్ పరిధిలో టిడిపికి క్యాడర్ ఉంది. ఒక బలమైన సామాజిక వర్గం దన్ను ఉంది. ఆ రెండింటిని తిప్పుకుంటే బీజేపీకి ఇక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది. పైగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా గ్రేటర్ పరిధిలో ఎక్కువ. ఏపీలో ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా ఉండడంతో సెటిలర్స్ తప్పకుండా బిజెపి వైపు మొగ్గు చూపుతారని అంచనాలు ఉన్నాయి. అయితే ఆ ఇద్దరు నేతలను కలవడం ద్వారా సరికొత్త సంకేతాలను పంపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పోటీకి దూరంగా ఉండిపోయింది. అది అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చిందని విశ్లేషణలు ఉన్నాయి. ఒకవేళ గ్రేటర్ ఎన్నికల పరిధిలో టిడిపి ఓటు బ్యాంకును బిజెపి వైపు మళ్లించగలిగితే.. భారతీయ జనతా పార్టీ గెలుపు నల్లేరు మీద నడక కానుంది. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు ఇంటికి వెళ్లిన మోడీ గంటా పది నిమిషాల పాటు ఆయన కుటుంబ సభ్యులతో గడిపారు.

పవన్ ఇమేజ్..
పవన్ కళ్యాణ్ బిజెపికి సానుకూలంగా ఉంటారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లోనే బీజేపీతో కలిసి పోటీ చేశారు కొన్నిచోట్ల. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ కంటే గ్రేటర్ పరిధిలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ. అందుకే వారిని మచ్చిక చేసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శ పేరుతో పవన్ ఇంటికి వెళ్లారు అనేది పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మొత్తానికి అయితే ప్రధాని టూర్ వెనుక గట్టి వ్యూహమే ఉన్నట్టు స్పష్టమైంది.

YSRCP silence on Vijay: విజయ్ ప్రమాణ స్వీకారం.. వైసిపి ఫుల్ సైలెన్స్!

YSRCP silence on Vijay: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా సైలెంట్ అయింది. తమిళనాడులో విజయ్ 2 పార్టీలను వెనక్కి నెట్టుకుంటూ.. అత్యధిక స్థానాలను సాధించారు. అది మొదలు ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది. ఒకటి ఒంటరిగా వెళ్లి విజయ్ ఎక్కువ స్థానాలు సాధించడంతో పవన్ పై వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టింది. రెండు విజయ్ తన ఎన్నికల ప్రచారంలో జగన్ ఫోటోను వాడుకున్నారన్నది వైసిపి చూపిస్తున్న అంశం. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా విజయ్ జపం మొదలుపెట్టారు. మంత్రి రోజా లాంటి వారు అయితే టీవీ ఇంటర్వ్యూలో కూడా దీనిపైనే మాట్లాడారు. ఆమె డీఎంకేకు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. విజయ్ గెలిచేసరికి ప్లేటు ఫిరాయించారు. అయితే ఎప్పుడైతే విజయ్ ప్రమాణస్వీకారం చేశారో.. నాటి నుంచి ఫుల్ సైలెన్స్ అయ్యింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.

డీఎంకేను వీడి విజయ్ తో..
తమిళనాడులో గత కొద్ది రోజులుగా రాజకీయ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రాలేదు. అత్యధిక స్థానాలు దక్కించుకుంది విజయ్ పార్టీ. దాదాపు పది అసెంబ్లీ స్థానాలకు కూత వేటు దూరంలో 108 స్థానాలతో నిలిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ డిఎంకెను విడిచిపెట్టి విజయ్ తో చేతులు కలిపింది. వామపక్షాలు సైతం మద్దతు పలికాయి. దీంతో అధికారం చేపట్టేందుకు అవసరమైన సంఖ్యాబలం విజయ్ కు వచ్చింది. అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ప్రత్యేకంగా పిలిచారు విజయ్. రాహుల్ గాంధీని సోదరుడితో పోల్చారు విజయ్. ఇది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రుచించలేదు.

రాహుల్ గాంధీని పిలవడంతో..
ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఈ క్రెడిట్ వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ మద్దతుతో పూర్తిగా సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి విజయ్ ప్రభుత్వంలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది ఇప్పుడు. కాంగ్రెస్ పార్టీ వాసన అంటేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడదు. అటువంటిది రాహుల్ గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించడం.. ఆయనను సోదరుడితో విజయ్ పోల్చడం.. వంటివి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను డిఫెన్స్ లో పడేసాయి. అందుకే వారు ఫుల్ సైలెన్స్ లోకి వెళ్లిపోయారు.

Spirit movie latest schedule: స్పిరిట్ కొత్త షెడ్యూల్ లో ఈ సీన్స్ షూట్ చేస్తున్నారా..

Spirit movie latest schedule: ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగానే సందీప్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ షూటింగ్ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ మీద కొన్ని భారీ యాక్షన్స్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక క్రేజ్ ని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో సందీప్ రెడ్డి వంగ ఉన్నారట. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు.

తద్వారా ఆయనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతను 1000 కోట్ల క్లబ్ లో మాత్రమే ఉన్నాడు. 2000 కోట్ల క్లబ్లో చేరాలంటే మాత్రం ఆయన మరింత కసరత్తులు చేయాల్సిన అవసరం అయితే ఉందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

నిజానికి సందీప్ రెడ్డివంగా సినిమాలో అసలు సిజీ షాట్స్ అనేవి ఉండవు. అయిన కూడా ఆయన ఒక ఎమోషన్ ని పట్టుకొని ముందుకు సాగుతూ ఉంటాడు. కాబట్టి అతనికి భారీ క్రేజ్ దక్కింది. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ల నుంచి వచ్చే సినిమాకి ఎంత క్రేజ్ అయితే ఉంటుందో సందీప్ రెడ్డి వంగ నుంచి వచ్చే మూవీకి సైతం అదే రీతిలో క్రేజ్ దక్కుతుంది. ఇక అలాంటి సందీప్ రెడ్డివంగా ఇప్పుడు స్పిరిట్ సినిమా విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు.

ప్రభాస్ ని డిఫరెంట్ లుక్ లో ప్రజెంట్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…ఇక సందీప్ మాత్రం ప్రభాస్ డూప్ తో కాకుండా ప్రభాస్ తోనే ఎక్కువ షాట్స్ షూట్ చేస్తున్నాడట…

Spirit Prabhas Spirit : స్పిరిట్ కొత్త షెడ్యూల్ లో ఈ సీన్స్ షూట్ చేస్తున్నారా…

Spirit Prabhas Spirit : ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగానే సందీప్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ షూటింగ్ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ మీద కొన్ని భారీ యాక్షన్స్ సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక క్రేజ్ ని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో సందీప్ రెడ్డి వంగ ఉన్నారట. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు.

తద్వారా ఆయనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతను 1000 కోట్ల క్లబ్ లో మాత్రమే ఉన్నాడు. 2000 కోట్ల క్లబ్లో చేరాలంటే మాత్రం ఆయన మరింత కసరత్తులు చేయాల్సిన అవసరం అయితే ఉందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

నిజానికి సందీప్ రెడ్డివంగా సినిమాలో అసలు సిజీ షాట్స్ అనేవి ఉండవు. అయిన కూడా ఆయన ఒక ఎమోషన్ ని పట్టుకొని ముందుకు సాగుతూ ఉంటాడు. కాబట్టి అతనికి భారీ క్రేజ్ దక్కింది. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ల నుంచి వచ్చే సినిమాకి ఎంత క్రేజ్ అయితే ఉంటుందో సందీప్ రెడ్డి వంగ నుంచి వచ్చే మూవీకి సైతం అదే రీతిలో క్రేజ్ దక్కుతుంది. ఇక అలాంటి సందీప్ రెడ్డివంగా ఇప్పుడు స్పిరిట్ సినిమా విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు.

ప్రభాస్ ని డిఫరెంట్ లుక్ లో ప్రజెంట్ చేసి ప్రేక్షకుల మన్ననలు పొందడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…ఇక సందీప్ మాత్రం ప్రభాస్ డూప్ తో కాకుండా ప్రభాస్ తోనే ఎక్కువ షాట్స్ షూట్ చేస్తున్నాడట…

CM Chandrababu Delhi tour: నిన్ననే ప్రధాని రాక.. నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు..

CM Chandrababu Delhi tour: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఉత్సాహంగా గడిపిన ప్రధాని నరేంద్ర మోడీ.. తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా వెళ్లారు. ఇటీవల అస్వస్థతతో ఆపరేషన్ చేసుకున్న పవన్ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు ప్రధాని పర్యటన తర్వాత రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి..
ఈరోజు ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. ఉదయం 11:30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు. తరువాత జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై వారి మధ్య చర్చలు జరగనున్నాయి. నిధుల విడుదలకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో ఆయన చర్చిస్తారని తెలుస్తోంది. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశం కానున్నారు చంద్రబాబు. సాయంత్రం నాలుగు గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో జరిగే భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ మీటింగుకు కూడా హాజరవుతారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్రదేవ్, నీతి ఆయోగ్ సభ్యులకు కూడా సమావేశం కానున్నారు. చంద్రబాబు రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్నారు. రేపు గౌహతి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు చంద్రబాబు. అక్కడ నుంచి నేరుగా అమరావతికి చేరుకోనున్నారు.

మొన్ననే పశ్చిమ బెంగాల్ కు..
మొన్ననే బెంగాల్ సీఎం సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం చంద్రబాబు.. ఎన్డీఏ లో తెలుగుదేశం కీలక భాగస్వామి కావడంతో కేంద్రంలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఆహ్వానం అందుతోంది చంద్రబాబుకు. గతం కంటే ఎక్కువగానే గౌరవిస్తున్నారు. నిన్ననే హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు నివాసానికి వెళ్లి గంట పది నిమిషాల పాటు గడిపారు. అధికారిక పర్యటనకు వచ్చి ఒక నేత ఇంటికి ప్రధాని స్థాయి వ్యక్తి వెళ్లడం చాలా అరుదు. అయితే గతం కంటే చంద్రబాబుకు కేంద్ర పెద్దలు ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈరోజు అంతా ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీగా గడుపుతారు.

Mahesh Babu : మహేష్ బాబుతోపాటు స్టార్ హీరో అవ్వాల్సిన అక్కినేని నటుడి పరిస్థితి ఏంటి…

Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరు ఏ పొజిషన్ లో ఉంటారో చెప్పడం చాలా కష్టం… ఎందుకంటే ఒక్క సినిమాతో స్టార్ పొజిషన్ ని అందుకున్న హీరోలు ఉన్నారు. ఒక ప్లాప్ తో పాతాళానికి పడిపోయిన నటులు ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీలో ఎవరు శాశ్వతంగా ఉండరనేది వాస్తవం. ఇక ఏది ఏమైనా కూడా సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన నటుడు సుమంత్…

నాగేశ్వరరావు మనవడిగా ఇండస్ట్రీలో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఆయన మహేష్ బాబు రేంజ్ లోనే తను కూడా స్టార్ హీరోగా మారుతాడని అందరు అనుకున్నారు. కానీ కెరియర్ స్టార్టింగ్ లోనే అతనికి అనుకున్న విజయాలైతే దక్కలేదు. దాంతో కొంతవరకు డీలా పడిపోయాడు. ఇక తర్వాత కొన్ని సినిమాలు సక్సెస్ లను సాధించిన కూడా స్టార్ హీరో అయ్యే రేంజ్ లో సక్సెస్ లను సాధించలేకపోవడం వల్ల ఆయన చాలా వరకు వెనుకపడిపోయాడు.

స్క్రిప్ట్ సెలక్షన్లో ఆయన చేసిన మిస్టేక్స్ దానికి కారణమని చాలా మంది చెబుతుంటారు. ఆయన చేసిన సినిమాలతో కొంతవరకు తన కెరియర్ ను బిల్డ్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఇప్పటికి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన అనగనగా సినిమా సక్సెస్ సాధించింది.

ఓటిటి లో ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ రావడంతో మరోసారి సుమంత్ లైన్ లైట్ లోకి వచ్చాడు. ప్రస్తుతం ‘మహేంద్రగిరి వారాహి’ అనే సినిమాని కూడా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరోసారి ఆయన పేరు మారుమ్రోగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

Rajamouli reaction to Dragon movie: ‘డ్రాగన్ ‘ మూవీ రషెస్ ను రాజమౌళి కి చూపించిన ఎన్టీఆర్..జక్కన్న రియాక్షన్ ఏంటంటే..

Rajamouli reaction to Dragon movie: పాన్ ఇండియా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రీతిలో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తెలుగులో ఆయనకు భారీ క్రేజ్ ఉంది. కానీ పాన్ ఇండియాలో మాత్రం తనకు అనుకున్న రేంజ్ లో ఆదరణ అయితే దక్కడం లేదు. దేవర సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తానని ఆశించినప్పటికి అది కేవలం ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చింది. దాంతో ఆయన మరోసారి డీలా పడిపోయాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమాతో మరోసారి లైన్ లైట్ లోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పటికే ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.

అయితే డ్రాగన్ సినిమా రషెస్ ను చూసిన ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక రీసెంట్ గా రాజమౌళికి ఈ సినిమా రషెస్ ని చూపించారట. ఆయన కూడా ఈ సినిమాతో తారక్ మరోసారి భారీ సక్సెస్ ని సాధిస్తున్నావని చెప్పారట. దాంతో ఎన్టీఆర్ ఖుషీ అవుతున్నాడట. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ అయితే రాలేదు.

అయినప్పటికి సినిమా మీద హైప్ ని పెంచాలనే ప్రయత్నంలో అటు దర్శకుడు, ఇటు హీరో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక జక్కన్న సైతం ఈ సినిమా మీద పాజిటివ్ రివ్యూ ను ఇవ్వడంతో ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేవట. ఇక ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ 1500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడతాడనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? తద్వారా తనకంటూ ఒక క్రేజ్ ను క్రియేట్ చేసి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు…

healthy foods for health problems : ఈ పదార్థాలు తింటే ఆరోగ్య సమస్యలు రానే రావు..

healthy foods for health problems : ప్రస్తుతం చాలామంది ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి సమయంలో సరైన ఆహారం తీసుకోవడం మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. అరటిపండులో ఉండే పొటాషియం, విటమిన్-B6 నరాలను ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. పుచ్చకాయలో అధికంగా నీటి శాతం ఉండటంతో శరీరాన్ని చల్లగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. బాదంలో ఉండే మెగ్నీషియం మెదడు పనితీరును మెరుగుపరచి మానసిక ఒత్తిడిని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అలాగే మరికొన్ని ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం..

కంటి ఆరోగ్యానికి..
కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే విటమిన్-A సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. క్యారెట్‌లో బీటా కెరోటిన్ అధికంగా ఉండి అది శరీరంలో విటమిన్-Aగా మారి చూపును మెరుగుపరుస్తుంది. పాలకూరలో ల్యూటిన్, జియాక్సాంథిన్ వంటి పోషకాలు ఉండి కళ్లకు రక్షణ కల్పిస్తాయి. విటమిన్-A ఉన్న ఆహారాలు కంటి పొడిబారడం, రాత్రిపూట చూపు తగ్గడం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో ఇవి చేర్చుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

చర్మం మెరవడానికి:
ఆరోగ్యవంతమైన చర్మం కోసం పోషకాహారం చాలా అవసరం. నిమ్మకాయలో ఉండే విటమిన్-C చర్మ కాంతిని పెంచి ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆపిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షించి తాజాగా ఉంచుతాయి. క్యారెట్‌లోని బీటా కెరోటిన్ చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. సరైన నీరు, పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంది.

దగ్గు, జలుబు తగ్గడానికి:
వాతావరణ మార్పుల వల్ల దగ్గు, జలుబు సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. తేనె గొంతును మృదువుగా ఉంచి దగ్గును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. వేడి పానీయాలు తీసుకోవడం వల్ల ముక్కు బ్లాకేజ్ తగ్గి ఉపశమనం లభిస్తుంది.

రక్తహీనత నివారణకు:
రక్తహీనత సమస్య ఎక్కువగా ఐరన్ లోపం వల్ల వస్తుంది. బీట్‌రూట్‌లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉండి రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది. పాలకూరలో అధికంగా ఐరన్ ఉండటంతో రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఐరన్ రిచ్ ఫుడ్‌లైన పప్పులు, ఖర్జూరాలు, గుడ్లు వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన రక్తం ఉత్పత్తి అవుతుంది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా అలసట, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి.

Chandrababu Royal Enfield : రాయల్ ఎన్ఫీల్డ్ ను ఊరికే చంద్రబాబు ఏపీ తీసుకురాలేదు.. ఆ కంపెనీ ఇమేజ్ ఈ స్థాయిలో ఉంది మరి..

Chandrababu Royal Enfield : మొన్ననే కదా ఏపీ రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీని చంద్రబాబు తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ కంపెనీ ఏపీ వచ్చిన తర్వాత వైసిపి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. ఏకంగా కేసులు కూడా వేయించేందుకు కోర్టు దాకా వెళ్ళింది. ఆ మధ్య గూగుల్ మీద కూడా అలానే కదా కేసులు వేయించింది. అసలు ఆ పార్టీకి ఏపీ ప్రయోజనాలు ఏ మాత్రం నచ్చవు. కేవలం విధ్వంస విధానాలు మాత్రమే ఆ పార్టీకి కావాలి. అభివృద్ధి అనేది అవసరం లేదు. ప్రజల జీవితాలు మెరుగుపడాలని కోరుకోదు. అది ఆ పార్టీ దురవస్థ. 11 స్థానాలు వచ్చినప్పటికీ ఇంకా ఆ పార్టీ మారడం లేదంటే.. భవిష్యత్తులో కూడా మారే అవకాశం లేదని అర్థమవుతుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ అనేది కుర్ర కారు మనసు దోచుకున్న బ్రాండ్. యువత ఇష్టానికి అనుగుణంగా రాయల్ ఎన్ఫీల్డ్ నిత్యం కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. ఈ కంపెనీ అంత ఈజీగా ఒక ప్రాంతంలో పెట్టుబడి పెట్టదు. పైగా దీనికి అంతర్జాతీయంగా బ్రాండ్ వ్యాల్యూ ఉంది. ఆడి రేంజ్ లో దీనికి స్థాయి ఉంది. అయితే ఇంతటి కంపెనీని ఏపీ తీసుకురావడం అంత ఈజీ కాలేదు. నారా లోకేష్ చాలా ఇబ్బంది పడ్డారు. నారా చంద్రబాబు నాయుడు అనేక మందితో మాట్లాడారు. చివరికి ఏపీకి తీసుకొచ్చారు.

ఏపీకి తీసుకొచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ మాములు బ్రాండ్ కాదు. 2026 సంవత్సరానికి బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ రూపొందించిన బలమైన వాహన బ్రాండ్ల జాబితాలో ఇది మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద వాహన బ్రాండ్ గా అవతరించింది. అంతేకాదు ఆడి, ఫెరారీ వంటి బ్రాండెడ్ సైతం వెనక్కినట్టుంది. టయోటా, బీఎండబ్ల్యూ తర్వాత స్థానంలో ఈ కంపెనీ కొనసాగుతోంది. బ్రాండ్ స్ట్రెంత్ జాబితాలో 100 పాయింట్లకు గానూ 88.6 పాయింట్లను స్కోర్ చేసింది. త్రిబుల్ ఎ రేటింగ్ సాధించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఏకంగా మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రఖ్యాత ఆడి కంపెనీకి నాలుగవ స్థానం, ఫెరారీ కంపెనీకి ఏడో స్థానం లభించాయి. మన దేశానికి చెందిన టాటా మోటార్స్ కంపెనీకి ఐదవ స్థానం దక్కింది. మారుతి సుజుకి ఆరవ స్థానం, మహీంద్రా అండ్ మహీంద్రా 8వ స్థానం, హీరో మోటో కార్ప్ 10వ స్థానం సంపాదించాయి.

అంతర్జాతీయంగా 10 బలమైన వాహన కంపెనీలలో మన దేశం నుంచి దాదాపు ఐదు కంపెనీలు స్థానం సంపాదించుకున్నాయి. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ ప్రపంచ వ్యాప్తంగా 80 కి పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. అంతర్జాతీయంగా ఈ బ్రాండ్ విశేషమైన ఆదరణ దక్కించుకున్నది. టయోటా కంపెనీ ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్ గా అవతరించింది. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. హైయెస్ట్ వాల్యూ ఉన్న 10 వాహన బ్రాండ్లలో ఇండియా నుంచి ఏ కంపెనీ కూడా స్థానం దక్కించుకోకపోవడం విశేషం.

Today horoscope in telugu 11.5.2026 : ఈ రాశుల వ్యాపారులకు ఈరోజు అన్ని విజయాలే..

0

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా మారడంతో అధిక లాభాలు పొందుతారు. మరికొన్ని రాశుల వారు ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈరోజు ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో కొత్తవారిని నమ్మకూడదు. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో వ్యాపార అభివృద్ధిని చేసుకోవడానికి కృషి చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం అవుతుంది. ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కొత్తగా ప్రాజెక్టులను ప్రారంభించాలని అనుకుంటే ఇదే మంచి సమయం. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. అవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో పోటీపరీక్షల్లో రాణిస్తారు. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఉద్యోగులకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకోకుండా ధన లాభం ఉండే అవకాశం ఉంది. అయితే ఇదే సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారులు లాభాలు పొందుతారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులను ఓడించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది