Balakrishna story for Ravi Teja: మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు నేటి తరం యూత్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా తనని తాను మార్చుకున్నట్టుగా అనిపిస్తోంది. ‘ధమాకా’ తర్వాత రవితేజ చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఒకప్పుడు 40 నుండీ 50 కోట్ల రూపాయిల రేంజ్ లో ఉండే రవితేజ మార్కెట్ , ఈ ఫ్లాప్స్ కారణంగా 10 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఆయన గత చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల రూపాయలకు జరిగితే , కేవలం 11 కోట్ల రూపాయిలు మాత్రమే రాబట్టింది , దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు రవితేజ మార్కెట్ ఏ రేంజ్ లో పడిపోయింది అనేది.
అయితే రవితేజ ని ఈ ఫ్లాప్స్ బాగా అలర్ట్ చేశాయి. అందుకే ఇకపై ఆయన చేసే ప్రతీ సినిమా మినిమం గ్యారంటీ రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు. రీసెంట్ గా ఆయన ప్రముఖ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ‘సరిపోదా శనివారం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న వివేక్ ఆత్రేయ తన తదుపరి చిత్రాన్ని బాలయ్య బాబు తో చెయ్యాలని అనుకున్నాడు. బాలయ్య కి కథ వినిపించగా, ఆయనకు తెగ నచ్చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అయితే కానీ, మన సినిమా సెట్స్ మీదకు వెళ్ళదని బాలయ్య క్లారిటీ ఇవ్వడం , సమయం వృధా చేయకుండా వివేక్ ఆత్రేయ అదే స్టోరీ ని రవితేజ కి వినిపించాడు. రవితేజ కి కూడా ఈ స్టోరీ తెగ నచ్చేసింది. వెంటనే ఈ సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ ఏడాది లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వం లో ‘ఇరుముడి’ అనే చిత్రం చేస్తున్నాడు. తన ఇమేజ్ కి పూర్తి భిన్నమైన ఈ సినిమాని రవితేజ ఎంచుకోవడం తో , ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియా భావాన్ని శంకర్ నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం , ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
















హిందువులకు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన కమెడియన్ అలీ.. వీడియో వైరల్..
Comedian Ali apology to Hindus: ప్రముఖ కమెడియన్ అలీ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నాడు. రీసెంట్ గానే ఆయన ఒక సబ్బుకు సంబంధించిన కమర్షియల్ యాడ్ లో నటించాడు , అందులో ఆయన హిందువుల మనోభావాలను దెబ్బ తీసాడని సోషల్ మీడియా లో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇది బాగా వైరల్ అవ్వడం తో హిందూ సంఘాలు కూడా అలీ పై మండిపడ్డాయి. పూర్తి వివరాల్లోకీ వెళ్తే అలీ రీసెంట్ గా ఘర్ సోఫ్ యాడ్ లో నటించాడు. ఈ యాడ్ లోని బ్యాక్ గ్రౌండ్ పవిత్రమైన లక్ష్మీ దేవి మంత్రాలు వినిపించాయి. దీనిపై హిందూ సంఘాలు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేందుకు అలీ కి ఏ హక్కు ఉందని , తక్షణమే ఇతన్ని సినీ ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయితే దీనిపై అలీ కాసేపటి క్రితమే క్షమాపణలు చెప్తూ వివరణ ఇచ్చాడు , అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘ఘర్ సోఫ్ యాడ్ లో దేవుడు చేసిన మనుషులు చిత్రం లోని ఒక చిన్న బిట్ ని రీ క్రియేట్ చేశాము. అది కొంతమందిని బాధ పెట్టిందని తెలిసింది. అందుకే ఇప్పుడు ఆ యాడ్ ని తొలగించాము , ఎవరికైనా బాధ కలిగి ఉండుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు అలీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇక అలీ సినిమాల విషయానికి వస్తే, ఒకప్పుడు ఈయన టాప్ మోస్ట్ కమెడియన్ , అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ ఎందుకో ఇప్పుడు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. అంతే కాకుండా రాజకీయాల నుండి కూడా ఆయన తప్పుకున్నాడు , గతం లో ఆయన వైసీపీ పార్టీ లో కొనసాగిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోవడం తో ఇప్పుడు అలీ బుల్లితెర పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన స్టార్ మా ఛానల్ లో ప్రతీ శని ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘కూకూ విత్ జాతి రత్నాలు 2’ కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ప్రస్తుతం స్టార్ మా చానెల్ లోనే అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతుంది. వీటితో పాటు ఆయన పలు రియాలిటీ షోస్ కి కూడా జడ్జీ గా వ్యవహరించేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో అలీ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.