Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Panchayat Raj awards: 23 నెలల్లో 19 జాతీయ అవార్డులు.. పంచాయతీరాజ్ శాఖలో...

Pawan Kalyan Panchayat Raj awards: 23 నెలల్లో 19 జాతీయ అవార్డులు.. పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ అద్భుతాలు..

Pawan Kalyan Panchayat Raj awards: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పాలన పరంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఆయన ఆద్వర్యం లో నడుస్తున్న పంచాయితీ రాజ్ శాఖ లో అద్భుతాలు జరుగుతున్నాయి. 2024 వ సంవత్సరం లో దేశం లోనే 24 వ స్థానంలో ఉన్నటువంటి పంచాయితీ రాజ్ శాఖ, పవన్ కళ్యాణ్ చేపట్టిన అద్భుతమైన సంస్కరణల కారణంగా మొదటి స్థానానికి చేరుకొని సంచలనం […]

Pawan Kalyan Panchayat Raj awards: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పాలన పరంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఆయన ఆద్వర్యం లో నడుస్తున్న పంచాయితీ రాజ్ శాఖ లో అద్భుతాలు జరుగుతున్నాయి. 2024 వ సంవత్సరం లో దేశం లోనే 24 వ స్థానంలో ఉన్నటువంటి పంచాయితీ రాజ్ శాఖ, పవన్ కళ్యాణ్ చేపట్టిన అద్భుతమైన సంస్కరణల కారణంగా మొదటి స్థానానికి చేరుకొని సంచలనం సృష్టించింది. గడిచిన 23 నెలల్లో ఈ శాఖకు 19 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఇది సాధారణమైన విషయం కాదు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటివి జరగలేదు. నిజాయితీ తో పని చేసే నాయకుడు సాధించే ఫలితాలు ఎంతటి అద్భుతంగా ఉంటాయో చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు. ప్రతీ నెల ఈ శాఖకు ఎదో ఒక అవార్డు వస్తూనే ఉంది. అయితే ఇప్పటి వరకు వచినటువంటి ఆ 19 అవార్డులు ఏంటో ఒకసారి చూద్దాం పదండి:

సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజగవర్గాన్ని దేశం లోనే టాప్ 3 పంచాయితీగా గుర్తించారు. అందుకు గుర్తుగా నానాజీ దేశముఖ్ పురస్కార్ అనే అవార్డుని అందించారు. అదే విధంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన శృంగవరం అనే పంచాయితీ కి దేశం లోనే మొదటి స్థానం దక్కింది. ‘పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్’ జాబితాలో ఈ అవార్డు ని కేటాయించారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలోని కందులపల్లి గ్రామా పంచాయితీ కి ‘క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయత్’ క్యాటగిరీ లో మొదటి స్థానం దక్కింది. చిత్తూరు జిల్లాలో ఇలాంటి పంచాయితీలు ఎన్నో అభివృద్ధి చెందడం వల్ల ‘పంచాయత్ క్షమత నిర్మాణ్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కార్’ అనే మరో జాతీయ అవార్డు దక్కింది. ఇకపోతే కేవలం ఈ ఒక్క నెలలోనే మరో మూడు జాతీయ పురస్కారాలు దక్కాయి.

ఆత్మా నిర్భర్ పంచాయత్ స్పెషల్ అవార్డు క్యాటగిరీ లో చిత్తూరు జిల్లాకు చెందిన కానీపాకం కి 2 వ స్థానం లో నేషనల్ అవార్డు దక్కింది. కానీపాకం లో ఈ స్థాయి అభివృద్ధి గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఇలా వివిధ శాఖల్లో పంచాయత్ రాజ్ కి జాతీయ అవార్డుల వెల్లువ కురుస్తూనే ఉంది. దేశం లోనే ప్రస్తుతం ప్రతీ ఒక్కరు పంచాయత్ రాజ్ శాఖ ని ఒక రోల్ మోడల్ గా తీసుకొని అభివృద్ధి చేసే పరిస్థితి కి ఈ శాఖ ని తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ శాఖలో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ పంచాయత్ రాజ్ శాఖని వృద్ధి చేస్తున్న విధానం పై ప్రశంసల వర్షం కురిపిస్తూ పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలియజేసారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper