Home Blog Page 283

మోదీ చెప్పిందొకటి.. విపక్షాలు చేస్తున్న ప్రచారం మరొకటి!

Narendra Modi
Narendra Modi

Narendra Modi: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. తమిళనాడులో చావుతప్పి కన్ను చొట్టబోయిన విపక్షాలకు ఇప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఒక అంశం దొరికింది. బంగారం ఏడాది పాటు కొనవద్దని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిపై ఇష్టానుసారంగా దీనిపై విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి.

మోదీ విజ్ఞప్తి..
బంగారం ఏడాది పాటు కొనవద్దని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తి. ఇష్టానుసారంగా దీనిపై విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఇంధనం పొదుపు చేయాలని, ఎరువుల వాడకం తగ్గించాలని, స్వదేశీ వస్తువులు వాడాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని, విదేశాలకు అనవసరంగా వెళ్లొద్దని సూచించారు. ఇందులో బంగారం ఒక అంశం. ఏడాదిపాటే కొనవద్దని కోరారు. విపక్షాలు మాత్రం జీవితాంతం బంగారం కొనవద్దన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. డెస్టినేషన్‌ కోసం విదేశాలకు వెళ్లే బదులు మన దేశంలోని డెస్టినేషన్‌ స్థలాలకు వెళ్లాలని తెలిపారు. స్వదేశీ వస్తువలను చాలాకాలంగా మోదీ ప్రచారం చేస్తున్నారు. వర్క్‌ ఫ్రం హోం కోవిడ్‌ సమయంలో అమలైంది. ఇంధన పొదుపు కోసం తాజాగా ఇంధనం పొదుపు చేయాలని కోరారు. ఇప్పటికీ చాలా మంది వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు. చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అయితే ఇవేవీ అధికారిక ఆదేశాలు కావు. అభ్యర్థన మాత్రమే.

విపక్షాల తప్పుడు ప్రచారం..
మోదీ అభ్యర్థన, కానీ విపక్షాలు చట్టం అని ప్రచారం చేస్తున్నాయి. ఆదేశాలు జారీ చేయాలంటే చాలా కసరత్తు చేయాలి. ఈ లోగా గల్ఫ్‌ యుద్ధం ఆగిపోతే సమస్య ఉండదు. రెండు నెలలు సమస్యలు రాకుండా ప్రభుత్వమే నష్టాలను భరించింది. గ్యాస్‌ మినహా ఏ ఇబ్బంది ఇప్పటి వరకు రాలేదు. కానీ భవిష్యత్‌ దృష్టా మోదీ ఈ అభ్యర్థలను చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. మన దేశంలో పెంచలేదు. యూరోపియన్‌ దేశాల్లోనూ నిబంధనలు వచ్చాయి. ఆగ్నేయాసియా దేశాలు కూడా నిబంధనలు తెచ్చాయి. భారత్‌లో నిబంధనలు లేవు. అభ్యర్థన మాత్రమే.

కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డు..
బంగారంపై హడావుడి చేస్తున్న కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డు చరిత్రలో ఉంది:
మొరార్జీ దేశాయి ఆర్థిక మంత్రిగా, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో గోల్డ్‌ కొనుగోలుపై నిషేధ చట్టం చేశారు విశ్వ బ్రాహ్మణులు లైసెన్స్‌ తీసుకోవలని నిబంధనలు పెట్టారు. బార్లు, బిస్కెట్ల రూపంలో బంగారం కొనొద్దని, 14 క్యారెట్లకన్నా ఎక్కువ ఉన్న బంగారం కొనొద్దని ఆదేశించారు. దుకాణాల్లో 2 కిలోలు, విశ్వబ్రాహ్మణుల వద్ద 100 గ్రాములకు మించి బంగారం ఉండొద్దని ఆదేశించారు. ఇందిరాగాంధీ చట్టం చేయడంతో నష్టం జరిగింది.

మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం
మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ నిల్వలు పెంచేందుకు బంగారంపై నిషేధం విధించారు. దిగుమతి సుంకం పెంచారు. 20 శాతం బంగారం ఎగుమతి చేస్తేనే 80 శాతం దిగుమతి చేసుకోవచ్చని చట్టం చేసింది. కాంగ్రెస్‌ భయాన్ని చూపిస్తోందో అది కాంగ్రెస్‌ గతంలోనే చేసింది.

మోదీ విజ్ఞప్తి వెనుక దేశ ప్రయోజనం..
ఇప్పుడు మోదీ కూడా విదేశీ మారక నిల్వల కోసమే ఈ విజ్ఞప్తి చేశారు. కానీ ఇది అభ్యర్థన మాత్రమే. ఆదేశం కాదు. గల్ఫ్‌ యుద్ధం ఆగిపోతే సమస్య ఉండదు. రెండు నెలలు సమస్యలు రాకుండా ప్రభుత్వమే నష్టాలను భరించింది. గ్యాస్‌ మినహా ఏ ఇబ్బంది ఇప్పటి వరకు రాలేదు. కానీ భవిష్యత్‌ దృష్ట్యా మోదీ ఈ అభ్యర్థన చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. మన దేశంలో పెంచలేదు. యూరోపియన్‌ దేశాల్లోనూ నిబంధనలు వచ్చాయి. ఆగ్నేయాసియా దేశాలు కూడా నిబంధనలు తెచ్చాయి. భారత్‌లో నిబంధనలు లేవు,

విపక్షాల తప్పుడు ప్రచారం
మోదీ విజ్ఞప్తిపై విపక్షాలు చేస్తున్న హడావుడి విచిత్రంగా అనిపిస్తోంది. తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వర్క్‌ ఫ్రం హోం కోవిడ్‌ సమయంలో అమలైంది. ఇప్పటికీ చాలా మంది వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు. చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అయితే ఇవేవీ అధికారిక ఆదేశాలు కావు. అభ్యర్థన మాత్రమే.

డెస్టినేషన్‌ విషయం
డెస్టినేషన్‌ కోసం విదేశాలకు వెళ్లే బదులు మన దేశంలోని డెస్టినేషన్‌ స్థలాలకు వెళ్లాలని తెలిపారు. స్వదేశీ వస్తువలను చాలాకాలంగా మోదీ ప్రచారం చేస్తున్నారు. దీనిని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. మోదీ చేసింది దేశ ప్రయోజనాల కోసమే.

గతంలో బంగారం దానం..
1947కు ముందు బంగారం దానం చేయడానికి ముందుకు వచ్చారు. 1962, 1967 యుద్ధాల సమయంలో అనేకమంది తమ నగలను ఇచ్చారు. తాజాగా మహిళల్లో భయం నిర్మించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ మోదీ చేసింది అభ్యర్థన మాత్రమే. దేశంలో కష్టకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా చేశారు. ధర పెరగడంతో ఇప్పటికే కొనుగోళ్లు బాగా తగ్గాయి. అయితే పరిస్థితుల దృష్ట్యా మోదీ విజ్ఞప్తి చేశారని గుర్తుంచుకోవాలి.

మోదీ విజ్ఞప్తి దేశ ప్రయోజనాల కోసం, కాంగ్రెస్‌ ప్రచారంరాజకీయ లాభం కోసం. ప్రజలు ఈ తేడాను గుర్తించాలి. మోదీ అభ్యర్థన మాత్రమే చేశారు, ఆదేశాలు జారీ చేయలేదు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.

అమెరికా 51వ రాష్ట్రంగా వెనిజులా.. మ్యాప్ విడుదల చేసిన ట్రంప్.. అవాక్కైన ప్రపంచం

Venezuela 51st State
Venezuela 51st State

Venezuela 51st State: ఈ ఏడాది జనవరిలో వెనజువెలా వై సైనిక చర్య చేపట్టిన అమెరికా ఆదేశం అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బందీలుగా పట్టుకున్నారు. న్యూయార్క్ కోర్టులో దోషులుగా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వెనజువెలలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. ఇది అమెరికాకు అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాను అమెరికాలోని 51వ రాష్ట్రంగా పేర్కొంటూ సోషల్ మీడియాలో మ్యాప్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వెనిజులా స్వతంత్ర ప్రకటనతో..
తమ దేశం ఎన్నటికీ అమెరికాలో భాగం కాదంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు రోడ్రిగ్స్ ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ పోస్ట్ పెట్టారు. వెనిజులా ఎన్నటికీ అమెరికా భాగం కాదని స్పష్టం చేశారు. ట్రంప్ పోస్ట్ వెనుక ఉద్దేశ్యం ఏమిటి? స్వతంత్ర దేశాన్ని అమెరికా భాగంగా చూపించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అన్న చర్చ జరుగుతోంది.

జనవరిలో మదురో నిర్బంధం..
ఈ ఏడాది జనవరిలో వెనజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా నిర్బంధించింది. అప్పటి నుంచి వెనిజులాను తమ అధీనంలోకి తీసుకుంటామంటూ ట్రంప్ పదేపదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. ట్రంప్ వెనిజులా పై తీసుకున్న చర్యలు అమెరికా విదేశాంగ నీతిలో మార్పును చూపిస్తున్నాయి. తాజాగా 51వ రాష్ట్రంగా మ్యాప్ ద్వారా వెనిజులాను అమెరికా భాగంగా చూపించడం ఇందుకు నిదర్శనం. చట్టపరంగా సాధ్యం కాదు. ఇది ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ మాత్రమే.

చట్టపరమైన నిబంధనలు..
అమెరికా సంవిధానం ప్రకారం కొత్త రాష్ట్రం చేర్చాలంటే కాంగ్రెస్ అనుమతి అవసరం. వెనిజులా స్వతంత్ర దేశం, అమెరికా భాగం కాదు. ఐక్యరాజ్యసమితిలో వెనిజులా స్వతంత్ర సభ్యుడు

వెనిజులా స్థితిగతులు
వెనిజులా ఒక స్వతంత్ర దేశం. ఐక్యరాజ్యసమితి సభ్యత్వం పొందిన దేశం. ఉత్తర అమెరికాలో స్వతంత్ర రాజ్యం. అమెరికా సహాయం లేకుండా నిలబడగలదు. స్వతంత్ర దేశాల హక్కులు గౌరవించబడాలని వెనిజువెలా ప్రపంచాన్ని కోరుతోంది.

ప్రపంచ దేశాల స్పందన..
ట్రంప్ మ్యాప్ షేర్ చేయడంపై ప్రపంచదేశాలు విమర్శలు గుప్పించాయి. దక్షిణ అమెరికా దేశాలు
వెనిజులా స్వతంత్రానికి మద్దతు తెలిపాయి. ఐక్యరాజ్యసమితి స్వతంత్ర దేశాల హక్కులకు పరిరక్షణ కల్పించాలి. అమెరికా చర్యను చైనా, రష్యా వ్యతిరేకించాయి. స్వతంత్ర దేశాల హక్కులు గౌరవించబడాలని సూచించాయి.

ట్రంప్ పోస్ట్ వెనుక ఉద్దేశ్యం ఏమిటి?
రాజకీయ లాభం. అమెరికా జాతీయవాదీలను ఆకర్షించడం. ఎన్నికల సమయంలో మద్దతు పెంచుకోవడం అనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రంప్ 51వ రాష్ట్రంగా వెనిజులా మ్యాప్ షేర్ చేశారు, కానీ ప్రాక్టికల్ రియాలిటీ భిన్నం. వెనిజులా స్వతంత్ర దేశం, అమెరికా భాగం కాదు. వెనిజులా స్వతంత్ర దేశంగా జీవితం కొనసాగుతోంది.

అందాల ఆర్తి బి*కి*నీలో సెగలు

Aarti Chikara poolside look
Aarti Chikara poolside look

అమెరికా బెదిరింపులకు భయపడని ఇరాన్.. ఈసారి జోలికొస్తే నేలమట్టమే..

Iran US War
Iran US War

Iran US War: ఇరాన్ భయపడటం లేదు. అమెరికా హెచ్చరికలను లెక్కచేయడం లేదు. ఇజ్రాయిల్ బెదిరిస్తున్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు. ఇదే తీరు కొనసాగిస్తే అమెరికాకు, ఇజ్రాయిల్ కు తిరుగులేని స్థాయిలో బదులు ఇస్తామని హెచ్చరిస్తోంది.. ఇరాన్ ఈ స్థాయిలో తెగింపుకు దిగడానికి ఒక కారణం ఉంది. ఒకవేళ ఇరాన్ కనుక ఆ పని చేస్తే అమెరికా, ఇజ్రాయిల్ తీవ్రంగా ఇబ్బంది పడడం ఖాయం. ఇరాన్ మరింత స్థాయిలో తిరుగుబాటుకు దిగితే ఆ రెండు దేశాలు నేలమట్టం కావడం తథ్యం.

ఇప్పటికే అమెరికాకు సరైన స్థాయిలో బదులు ఇస్తోంది ఇరాన్. ఇజ్రాయిల్ దేశానికి కూడా అదే స్థాయిలో హెచ్చరికలు పంపిస్తోంది. ఇరాన్ ఈ స్థాయిలో హెచ్చరిక ఒక కారణం ఉంది. ఇరాన్ వద్ద యురేనియం నిల్వలు ఉన్నాయి. వాటిని న్యూక్లియర్ వెపన్స్ తయారీ కోసం, అవసరమైన 90 శాతం స్థాయికి శుద్ధి చేసే ప్రక్రియను చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇదే గనుక జరిగితే అమెరికాకు ఇబ్బంది తప్పదు. ఎందుకంటే తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇరాన్ గనుక న్యూక్లియర్ వెపన్స్ తో ఆ పని చేస్తే ప్రమాదకరమైన పరిణామాలు తప్పవు.

ఇప్పటికే ఇరాన్ పార్లమెంటరీ కమిషన్ ప్రతినిధి ఇబ్రహీం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.. ” మా దేశం న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకూడదని ట్రంప్ అనేకసార్లు చెప్పారు.. కానీ అమెరికా మాత్రం మా మీద దాడులు చేస్తోంది. మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. ఇలాంటప్పుడు మేము చూస్తూ ఎందుకు ఊరుకోవాలని” ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్ దేశం గడచిన ఎన్ని సంవత్సరాలు కాలంలో 11వేల కిలోల అధిక స్థాయి యురేనియాన్ని సమకూర్చుకుంది. 2006లో యురేనియాన్ని సమకూర్చుకునే ప్రక్రియను ఇరాన్ అధికారికంగా ప్రారంభించింది. తనకు చుట్టూ శత్రు దేశాలు ఉండడంతో ఇరాన్ ప్రతి ఏడాది యురేనియం నిల్వలను పెంచుకుంటూ పోయింది. అమెరికా ఇప్పటివరకు భీకరమైన దానం చేసినప్పటికీ.. ఆ నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలియ రాలేదు. అయితే ఈ నిల్వలను ఇస్ప హాన్ అనే న్యూ క్లియర్ సెంటర్లో దాచి పెట్టిందని తెలుస్తోంది. న్యూక్లియర్ వెపన్స్ అత్యంత ప్రమాదకరమైనవి. వీటి ద్వారా దాడులు చేస్తే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి.

ఊపిరి పీల్చుకున్న విజయ్.. గొప్ప ఊరట.. ఇక ఢోకా లేదు..

CM Vijay
CM Vijay

CM Vijay: ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు అనేక రకాలుగా ఇబ్బందులు పడిన టీవీకే అధినేత విజయ్.. ఆ తర్వాత వరుసగా ఎదురవుతున్న పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొంటున్నారు. అందులో అంచనాలకు అందని విధంగా విజయాలు సాధిస్తూ అదరగొడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఇటీవల తన తొలి స్పీచ్ లో దంచిగొట్టిన విజయ్.. స్పీకర్ విషయంలో, డిప్యూటీ స్పీకర్ విషయంలో తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన పార్టీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు ఆ పదవులు లభించే విధంగా చూసుకున్నారు. ఇప్పుడు విశ్వాస పరీక్షలోనూ అదరగొట్టారు విజయ్.

తమిళనాడులో బుధవారం టి వి కే విజయ్ ప్రభుత్వానికి బల పరీక్ష ఎదురైంది. ఆ పరీక్షలో విజయ్ విజయం సాధించారు. అసెంబ్లీలో బుధవారం విశ్వాస పరీక్ష నిర్వహిస్తే.. టీవీ కేకు ఏకంగా 144 ఓట్లు వచ్చాయి. విజయ్ పార్టీకి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే, అన్న డీఎంకేకు సంబంధించిన కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. అన్న డీఎంకేకు సంబంధించిన 22 మంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. డీఎంకే ఈ ఓటింగ్ లో పాల్గొనలేదు. పైగా వాక్ అవుట్ కూడా చేసింది.

విశ్వాస పరీక్షలో ఏకంగా 144 ఓట్లు సాధించి విజయ్ తన ప్రభుత్వానికి ఇబ్బందులులేకుండా చూసుకున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందుగానే విజయ్ అన్న డీఎంకే నేతలతో విజయ్ టచ్లోకి వెళ్లారు వారితో పొత్తు ప్రతిపాదన తెచ్చారు. దానికి అన్న డీఎంకే పార్టీలోని కొంతమంది వ్యక్తులు సమ్మతం తెలిపారు. అయితే పలని స్వామి మాత్రం ఒప్పుకోలేదు. దీంతో ఆ నేతలు అ ఇష్టంగానే బిజెపితో కలిసి సాగారు.

చివరికి ఎన్నికలు టీవీకే పార్టీకి అధికంగా సీట్లు రావడంతో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు తమ తిరుగుబాటును ప్రదర్శించారు. అంతేకాదు సొంత కార్యవర్గాన్ని నియమించుకుంటున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా విజయ్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి.. ప్రభుత్వాన్ని నిలబెట్టారు. తద్వారా బీజేపీ పెత్తనం తమ మీద వద్దని సంకేతాలు ఇచ్చారు. ఈ విజయంతో విజయ్ తన ప్రభుత్వానికి డోకా లేకుండా చూసుకున్నారు. అంతేకాదు ఐదేళ్లపాటు అద్భుతంగా పరిపాలిస్తామని సంకేతాలు కూడా ఇచ్చారు.

భారీగా ఉద్యోగాలున్నా.. కొలువులు మాత్రం ఇవ్వరట.. ఎలా బతకాలి సార్

Job Market Crisis India
Job Market Crisis India

Job Market Crisis India: అమెరికా నుంచి మొదలు పెడితే ఆఫ్రికా వరకు ప్రతి దేశంలోనూ ప్రైవేట్ కంపెనీల కార్యకలాపాలే ఎక్కువ. పేరుకు అన్ని దేశాలలో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ రంగ ఉద్యోగాల కంటే.. ప్రైవేట్ రంగమే అధికంగా కొలువులను ఇస్తున్నది. ఇందులో ఐటీ రంగం అత్యధికంగా వేతనాలు ఇస్తుంది. ఆ తర్వాత ఫార్మా.. రియాల్టీ.. పర్చేజ్.. వేర్హౌస్.. ఇలా చెప్పుకోవాలంటే చాలా విభాగాలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మన దేశంలో జాబ్ మార్కెట్ పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంది. దేశంలో 88% కంపెనీలు నియామకాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఇందులో కొత్త వాళ్లకు ఉద్యోగాలు లభించడం లేదు. ముఖ్యంగా పలు కాలేజీలలో రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతున్నప్పటికీ.. చాలామంది విద్యార్థులకు అవకాశాలు ఏమాత్రం లభించడం లేదు. దీంతో బీటెక్లో ప్రతి పదిమందిలో ఎన్ని మంది.. ఎంబీఏలో ప్రతి నలుగురిలో ముగ్గురు.. ఇలా మొత్తం 84 శాతం మంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగానే కనిపిస్తున్నారు. ఇదంతా కూడా అన్స్టాప్ టాలెంట్ రిపోర్టు 2026 నివేదికలో బయటపడింది. సాధారణంగా ఉద్యోగాలు లభించకపోతే ఆ దేశంలో కొలువుల వ్యవస్థ దారుణంగా ఉంటుంది అంటారు. కానీ మనదేశంలో జాబ్ మార్కెట్ మెరుగ్గా ఉన్నప్పటికీ ఉద్యోగాలు లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మొన్నటి వరకు కొన్ని విభాగాలలో ఉద్యోగాలు లభించలేదు. అసలు వాటిలో కొత్తవారిని తీసుకోలేదు. ఇప్పుడు అవకాశం ఉన్నప్పటికీ కూడా కంపెనీలో ఫ్రెషర్లకు ఏమాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు. అటు ఉద్యోగాలు లభించక.. ఇటు చదివిన చదువుకు సార్ధకత లేకపోవడంతో చాలామంది గ్రాడ్యుయేట్లు ఒత్తిడితో సతమతమవుతున్నారు. ప్రభుత్వాలు సక్రమంగా ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో ఏం చేయాలో తెలియక నిరుద్యోగులు నరకం చేస్తున్నారు. వాస్తవానికి ప్రెషర్లకు ఉద్యోగాలు కంపెనీలు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు.. ప్రతి కంపెనీ కూడా అనుభవజ్ఞులు కావాలి అని చెబుతుంటే.. ప్రెషర్లకు ఎక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయి.. ఉద్యోగాలు ఇస్తేనే కదా ఫ్రెషర్లకు అనుభవం వచ్చేది. ఆ అనుభవంతోనే కదా వారు మెరుగ్గా పనిచేసేది. అవకాశం ఇవ్వకుండా అనుభవంతో పని చేయాలంటే ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని గ్రాడ్యుయేట్లు కంపెనీల నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.

ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇప్పటికే చాలావరకు కంపెనీలు మాన్ పవర్ మొత్తం తగ్గించాయి. కేవలం కొన్ని విభాగాలలో మాత్రమే మనుషులు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ విభాగాలలో కూడా కంపెనీలు ప్రెషర్లకు అవకాశం ఇవ్వడం లేదు. దీనివల్ల గ్రాడ్యుయేట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధానాలను కంపెనీలు మార్చుకోవాలని.. ఉద్యోగుల విషయంలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బంతి పూలే కదా అని.. తేలిగ్గా తీసి పారేయకండి.. శాస్త్రవేత్తల ప్రయోగంలో తేలింది ఏంటంటే..

Marigold Flower Benefits
Marigold Flower Benefits

Marigold Flower Benefits: ఈ భూమ్మీద అనేకరకాల వస్తువులుంటాయి. అనేక రకాల పువ్వులు కూడా ఉంటాయి. పువ్వులు చూసేందుకు అందంగా ఆకర్షణగా ఉంటాయి. అందువల్లే అమ్మాయిలు వాటిని ధరించడానికి ఇష్టపడుతుంటారు. దేవాలయాలలో పూజలకు, అభిషేకాలకు పువ్వులను విరివిగా వాడుతూ ఉంటారు. అయితే కొన్ని పువ్వులు మాత్రం అత్యంత విలువైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కుంకుమపువ్వు ఇందుకు బలమైన ఉదాహరణ.

ఇప్పటివరకు కొన్ని రకాల పువ్వులు మాత్రమే ఔషధ గుణాలను కలిగి ఉంటాయని మనం తెలుసుకున్నాం. శాస్త్రవేత్తల ప్రయోగాలలో కూడా ఇదే తేలింది. కానీ తొలిసారి బంతిపూలలో సరికొత్త ప్రోటీన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో బయటపెట్టారు. బంతిపూలలో అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నట్టు.. పోషకాల నిల్వలు ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఏ సి ఎస్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా తాజాగా తెలిసిన నివేదిక ప్రకారం.. పెరుగుతున్న జనాభా.. వాతావరణ మార్పుల నేపథ్యంలో బంతిపూలను స్థిరమైన ప్లాంట్ ప్రోటీన్ ఫోర్స్ గా శాస్త్రవేత్తలు గుర్తించారు.

బంతిపూలలో 20 నుంచి 20 శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది. ఆమెను ఆమ్లాలు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పువ్వుల నుంచి సేకరించిన సారం ప్రోటీన్ కొరతని తీర్చగలుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. బంతి మొక్కలు సహజ సిద్ధంగా పెరుగుతుంటాయి. ఇటీవల కాలంలో బంతిముక్కలను ప్రత్యేకమైన పద్ధతుల్లో పెంచుతున్నారు. వాటి ద్వారా పూల ఉత్పత్తిని సాధిస్తున్నారు. ఆ పువ్వులను కేవలం అలంకరణ.. ఇతర వాటికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ పరిశోధనలో ప్రోటీన్ ఉన్నట్టు తేలిన నేపథ్యంలో.. భవిష్యత్తు కాలంలో బంతిపూలను ప్రోటీన్ల సేకరణ కోసం ఉపయోగిస్తారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

బంతిపూలతో ప్రోటీన్ సేకరణ మాత్రమే కాకుండా.. వివిధ రకాలైన ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేసేది కూడా ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే బంతిపూలు చూసేందుకు గాఢమైన పసుపు రంగులో ఉంటాయి. ఇవి కీటకాలను ఆకర్షిస్తుంటాయి. పంటచేలకు సోకే చీడపీడలను నివారిస్తాయి. ఈ పూలల్లో క్యాన్సర్ నిరోధకాలు కూడా ఉన్నట్టు ఇటీవలి పరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కాలంలో బంతిపూలను మందులు తయారీకి కూడా వాడతారని వార్తలు వినిపిస్తున్నాయి.

అందమైన అమ్మాయిల కోసం.. అబ్బాయిలకు అందాల పోటీలు.. ఈ వింత ఆచారం ఎక్కడంటే

Wodaabe tribe
Wodaabe tribe

Wodaabe Tribe: సాధారణంగా అందాల పోటీలు అమ్మాయిలకు మాత్రమే నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఈ భూమ్మీద అందాల పోటీలు అమ్మాయిలకు కాకుండా పురుషులకు నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ ఆఫ్రికా దేశంలో దీనికి విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. అక్కడ అందాల పోటీలు అమ్మాయిలకు కాకుండా.. అబ్బాయిలకు నిర్వహిస్తుంటారు. దీని వెనక చాలా పెద్ద కథ ఉంది. ఆ కథ వింటే ఆశ్చర్యం కాదు.. అంతకుమించిన అనుభూతి కలుగుతుంది.

చీకటి ఖండంగా పేరు పొందిన ఆఫ్రికాలో నైజర్ అనే దేశం ఉంది. ఈ దేశంలో అనేక రకాల తెగల ప్రజలు నివసిస్తూ ఉంటారు. కొందరు వేట.. ఇంకొందరు వ్యవసాయం.. మరికొందరు ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను అమ్ముతూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. వీరంతా కూడా అడవులకు దగ్గరగా ఉంటారు. అలా వీరు ఉండేందుకు ప్రధాన కారణం అడవులకు దగ్గరగా ఉంటే స్వేచ్ఛాయుత జీవితాన్ని ఆస్వాదించవచ్చని.. పైగా వీరి పూర్వీకులు సైతం స్వేచ్ఛాయుత జీవితాన్ని ఆస్వాదించేవారు కాబట్టి.. తరతరాలుగా వీరు అక్కడే ఉంటున్నారు.

నైజర్ దేశంలో వోడాబే అనే ఒక తెగ ఉంది. ఈ తెగలు అమ్మాయిలను ఆకర్షించాలంటే అబ్బాయిలు అందంగా ఉండాలి. అందుకోసం అబ్బాయిలు ఏకంగా అందాల పోటీలలో పాల్గొంటారు. ఆ పోటీలను గేరే వోల్ పండుగ అని పిలుస్తుంటారు. అబ్బాయిలు రంగురంగుల దుస్తులు ధరిస్తారు.. వింతైన హావభావాలతో డ్యాన్సులు చేస్తారు. ఈ పోటీలలో గెలిచిన వారిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు పోటీపడతారు. ఒకవేళ పెళ్లి ఇష్టం లేకపోతే శారీరకంగా గడపడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే కేవలం పెళ్లి కాని వారు మాత్రమే కాదు.. పెళ్లయిన వారు కూడా ఇందులో పాల్గొంటారు. పెళ్లైనవారు పాల్గొనడం వెనక కూడా ఒక బలమైన ఉద్దేశం ఉంది. భర్త సరిగ్గా చూసుకోకపోతే.. అతడిలో ప్రేమ సరిగా లభించకపోతే వివాహితలు ఈ పోటీలో పాల్గొనవచ్చు. వారికి పిల్లలు ఉన్నా సరే.. నచ్చినవాడిని పెళ్లి చేసుకోవచ్చు.

ఇంతవరకు పోటీలలో వివాహితలు గెలిచిన వారిని పెళ్లి చేసుకోలేదని నిర్వాహకులు చెబుతున్నారు. కాకపోతే శారీరక సుఖాన్ని మాత్రం అనుభవించారని అంటున్నారు. ఈ సాంప్రదాయం మిగతా వారికి విచిత్రంగా ఉన్నప్పటికీ.. తమకు మాత్రం ఎప్పటికీ గొప్పగానే ఉంటుందని ఈ తెగవారు చెబుతున్నారు. ఇలాంటి పండగల వల్ల తమ సాంస్కృతిక వైభవం గొప్పగా ఉంటుందని చెబుతున్నారు.

వారణాసిలో యోగి బుల్డోజర్.. ముసాఫిర్‌ఖానాపై యాక్షన్!

Varanasi Bulldozer Action
Varanasi Bulldozer Action

Varanasi Bulldozer Action: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జనసమర్థ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే దాల్‌మటి ఏరియాలో ఒక ముసాపిర్‌ఖానా అంటే ఒక లాడ్జి ఉంది. దీనిని వక్ఫ్‌బోర్డు నడిపిస్తోంది. దీనికి సంబంధించి కొంత వివాదం ఉంది.

కోర్టు అనుమతులతో ప్రభుత్వ చర్య
ఈ వివాదం నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని, కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని దీనిని తొలగించే పనిని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టింది. యోగి ఆదిత్యనాథ్‌ బుల్డోజర్లు దాల్‌మటి ప్రాంతంలోకి వెళ్లాయి. ఆ ముసాఫిర్‌ఖానాను పడగొట్టే పని మొదలు పెట్టారు.

వక్ఫ్‌బోార్డు నిర్వహణలో వివాదం
దీనిని వక్ఫ్‌బోర్డు నడిపిస్తోంది. వక్ఫ్‌బోర్డుకు సంబంధించి చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి. ఈ నిర్మాణం ఆ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలింది. ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. 300 మంది సక్యూరిటీ నిర్వహిస్తోంది. అక్రమ కట్టడం కావడంతో దానిని తొలగిస్తున్నారు.

యోగీ ప్రభుత్వం కఠిన నిర్ణయం
యోగి ఆదిత్యనాథ్‌ బుల్డోజర్లు దాల్‌మటి ప్రాంతంలోకి వెళ్లాయి. ఆ ముసాఫిర్‌ఖానాను పడగొట్టే పని మొదలు పెట్టారు. కోర్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అక్రమ కట్టడం కావడంతో తొలగించారు. యోగీ ప్రభుత్వం చట్టానికి కట్టుబడి ఉండటానికి నిదర్శనం.

అక్రమ కట్టడం కావడంతో దానిని తొలగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమ నిర్మాణాల పై కఠిన చర్యలు తీసుకుంటోంది. జాతి, మతం భేదం లేకుండా అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది.

"నీట్" గా రద్దు చేసి చేతులు దులుపుకున్నారు.. లక్షలాదిమంది పిల్లల భవిష్యత్తు ఏం కావాలి..

NEET Exam Controversy
NEET Exam Controversy

NEET Exam Controversy: పదేపదే అదే తప్పు. అదే నిర్లక్ష్యం.. తప్పులు జరుగుతున్నాయి. నిర్లక్ష్యం కూడా జరుగుతోంది. వ్యవస్థలో లోపాలు మాత్రం సవరించుకోవడం లేదు. సవరించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. వారిదేం పోయింది. తీరికగా ఏసీ గదుల్లో కూర్చుని ఒక ప్రకటన చేస్తారు. కానీ అంతిమంగా ఇబ్బంది పడాల్సింది విద్యార్థులు..

నీట్ పరీక్ష నిర్వహించే సమయంలో.. విద్యార్థులు కనీసం కుంకుమ బొట్టు పెట్టుకున్న సరే తొలగిస్తారు. పరీక్ష నిర్వహించే విధానంలో ఆ స్థాయిలో నిబద్ధత ఉన్నప్పుడు.. ప్రశ్న పత్రం బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోలేరా.. చివరికి చిన్న పిల్లాడికి వేసే డైపర్ కూడా లీక్ అవ్వడం లేదు కదా.. లక్షల కోట్ల వ్యవస్థ లో పనిచేస్తూ.. లక్షలకు పైగా జీతాలు తీసుకుంటూ.. పెద్ద పెద్ద చదువులు చదివినవారు కనీసం నీట్ పరీక్ష పత్రాన్ని లీక్ కాకుండా ఆపలేకపోయారంటే ఎంత నిర్లక్ష్యం ఉండాలి. ఎంత దారుణం ఉండాలి.

ఈనెల 3న దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహించారు. లక్షలాదిమంది విద్యార్థులు కోచింగ్ తీసుకొని.. డబ్బులు ఖర్చు పెట్టి పరీక్ష రాశారు. ఆ పరీక్షను పేపర్ లీక్ అయిందంటూ మంగళవారం రద్దు చేశారు. దీంతో పిల్లలు మళ్లీ చదవాలి. మళ్లీ పరీక్ష రాయాలి. ఈసారి పరీక్ష రాసిన తర్వాత పేపర్ లీక్ కాదు అనే గ్యారెంటీ లేదు. మళ్లీ పరీక్ష రాయాలి.. మళ్లీ ఇబ్బంది పడాలి.. అసలు వ్యవస్థ ఇంత దారుణంగా మారితే.. పరీక్షలు నిర్వహించడం ఎందుకు.. విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఎందుకు.. డబ్బున్న వాళ్ళు మాత్రమే ఎంబిబిఎస్ సీట్లు కొనుక్కోండి అంటూ ఒక ప్రకటన చేస్తే సరిపోతుంది కదా. పరీక్షలు నిర్వహించడంలో విఫలమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ని కేంద్రం కొనసాగించడంలో అర్థం ఎక్కడ ఉంది..

ఈసారి దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా నీట్ యూజీ పరీక్ష రాశారు. పరీక్ష రోజున దేశవ్యాప్తంగా విపరీతంగా హడావిడి జరిగింది. గేటు వద్ద విద్యార్థులకు అనేక రకాల శల్య పరీక్షలు నిర్వహించారు. చివరికి ఆడపిల్లల ముక్కుపుడకలు కూడా తొలగించారు. కనీసం ఒక నిమిషం ఆలస్యమైనా సరే పరీక్ష కేంద్రానికి పంపించలేదు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు..5 జి జామర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశారు.. కానీ పరీక్ష పత్రాన్ని బయటకు వెళ్లకుండా ఆపలేకపోయారు. పరీక్ష పత్రం వాట్సాప్ ద్వారా చక్కర్లు కొట్టినా సరే.. మన వ్యవస్థ కనిపెట్టలేదంటే.. లోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

వైద్య విద్యలో ప్రవేశాల కోసం గొప్పగా పరీక్ష నిర్వహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఇంతవరకు అవినీతి లేకుండా నిర్వహించుకోలేకపోవడం అత్యంత బాధాకరం.. అప్పట్లో నీట్ పరీక్షను అందుబాటులో తీసుకొచ్చినప్పుడు.. “దేశ వ్యాప్తంగా 400 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 40 రకాల వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆ పరీక్షలు రాసేందుకు దూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇది సమస్యత్మకమవుతోంది. అందువల్లే నీట్ ను తీసుకొచ్చామని” దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అంతేకాదు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెవెల్ లోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనిచేస్తుందని చెప్పారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం లీకులు, మోసాలు.. మాయలు..

ఈ పరీక్ష ప్రారంభానికి ముందు దాదాపు 410 ప్రశ్నలు రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో విపరీతంగా సర్కులేట్ అయ్యాయి. వీటిని ఊహాజనితమైన ప్రశ్నలు అని అన్నారు. కానీ అవే పరీక్షల్లో వచ్చాయి. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా.. ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉంటుందా.. మనదేశంలో విద్యారంగంలో కొన్ని మాఫియా శక్తులు ఏ స్థాయిలో తమ ప్రాబల్యాన్ని చూపిస్తున్నాయో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. లక్షల మంది జీవితాలతో ఆడుకునే ఆ ముఠాలను ప్రభుత్వాలు అరికట్ట లేవా.. వారిపై కఠిన చర్యలు తీసుకోలేవా.. చర్యలు తీసుకోనంతకాలం వాటి ఆటలు ఇలానే కొనసాగిపోతూనే ఉంటాయి.

ధోని ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. ఫ్యూజ్ లు ఎగిరిపోయే గుడ్ న్యూస్ ఇది

MS Dhoni
MS Dhoni

MS Dhoni: ఆడతాడని.. అందుబాటులో ఉన్నాడని.. మైదానంలో అడుగు పెడతాడని.. ఇదిగో ధోని రాక గురించి కొద్దిరోజులుగా మీడియాలో ఇలాంటి వార్తలు వస్తున్నాయి.. ఈ సీజన్ ప్రారంభం నుంచి ప్రతిరోజు ఏదో ఒక మాధ్యమంలో ధోని గురించి వార్త వస్తూనే ఉంది. ధోని వస్తాడని.. చెన్నై జట్టు తరఫున ఆడతాడని.. అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మిస్తాడని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇంతవరకు ధోని గురించి.. అతడు ఆడే ఆట గురించి ఇంతవరకు కీలకమైన అప్డేట్ రాలేదు.

కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ధోని అభిమానులకు చెన్నై మేనేజ్మెంట్ గుడ్ న్యూస్ చెప్పేసింది.. కాకపోతే ఇది అధికారికంగా కాదు. ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ చెన్నై జట్టులో ధోని అడుగుపెట్టే విషయంపై కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ధోని ఎల్లుండి లక్నో జట్టుతో జరిగే మ్యాచ్లో చెన్నై జట్టులో అడుగుపెడతాడని.. కచ్చితంగా ఆడతాడని క్లారిటీ ఇచ్చింది.

ఇది ధోని అభిమానులకు శుభవార్త అయినప్పటికీ.. ఇందులో ఒక చిన్న మెలిక ఉంది. ధోని సామర్థ్యాన్ని చాటుకుంటేనే ఆడే అవకాశం లభిస్తుందట. ఎందుకంటే ధోని గాయాల బారిన పడ్డారు. పైగా అతడి వయసు కూడా 40 దాటింది. ఇలాంటప్పుడు ప్రయోగాలు చేయడం సాధ్యం కాదని చెన్నై మేనేజ్మెంట్ ఒక క్లారిటీకి వచ్చేసింది. అందువల్లే అభిమానులకు ఈ వార్తను చెప్పేసింది.. ఒకవేళ ధోని గనుక పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని అంది పుచ్చుకుంటే.. కచ్చితంగా అతడు చెన్నై జట్టు తరఫున ఆడుతాడు. అంతేకాదు, అభిమానుల ముచ్చట తీర్చుతాడు.

అమరావతి ఆగిపోతుందా..

Amaravati Construction
Amaravati Construction

Amaravati Construction: పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో.. కొత్త నిర్మాణాలను నిలిపివేయాలంటూ నీతి ఆయోగ్ సూచించిందని.. దీంతో ఏపీలో అమరావతి నిర్మాణం ఆగిపోతుందంటూ కొత్త ప్రచారం మొదలైంది. నిర్మాణరంగంలో ఆంక్షల నేపథ్యంలో అమరావతికి బ్రేక్ పడనుందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. దీనిపై నీతి ఆయోగ్ స్పష్టతనిచ్చింది. తాము అటువంటి సూచనలు చేయలేదు అని చెప్పి ప్రత్యేక ప్రకటన చేసింది. దీంతో ఈ ప్రచారం చేస్తున్న వారికి షాక్ తగిలినట్లు అయింది. గత కొద్ది రోజులుగా ఈ ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుండగా.. అమరావతి వ్యతిరేకవర్గాలు ట్రోల్ చేయడం ప్రారంభించాయి.

* ఆగే ప్రసక్తే లేదు..
ఒకవేళ భవిష్యత్తులో దేశీయ నిర్మాణరంగంపై ఆంక్షలు విధించినా.. అమరావతి నిర్మాణ పనులు ఆగే ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రభుత్వ నిధులతో అమరావతి నిర్మాణం జరగడం లేదు. ప్రపంచ బ్యాంకు తోపాటు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల సహకారంతో నిర్మాణం జరుగుతోంది. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు ఆ రెండు బ్యాంకులు అమరావతి నిర్మాణానికి దాదాపు 15 వేల కోట్ల రూపాయలు సాయం ప్రకటించాయి. అదో నిరంతర ప్రక్రియగానే సాగనుంది. మధ్యలో రకరకాల కారణాలతో నిర్మాణాలు నిలిపి వేయడానికి.. అది మామూలు నిర్మాణం కాదన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రతీక అది. ఎట్టి పరిస్థితుల్లో నిలిపే ఛాన్స్ లేదు. పైగా గత అనుభవాల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పరిస్థితికి రానీయవు కూడా.

* సెల్ఫ్ ఫైనాన్స్ నగరం..
అమరావతి అంటే ఒకటి రెండు భవనాల నిర్మాణం కానే కాదు. అదో సెల్ఫ్ ఫైనాన్స్ నగరం కూడా. ల్యాండ్ ఫోలింగ్ ద్వారా సేకరించిన భూములు భవిష్యత్తులో ఆదాయం సమకూర్చినవి అవుతాయి. వాటిలో భవిష్యత్తులో వ్యాపారం కూడా చేసుకోవచ్చు. పరిశ్రమలు కూడా అమరావతి వైపు చూసేందుకు ఆ భూములు దోహదపడతాయి. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణ పనులతో అక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భవిష్యత్తులో లీజుతోపాటు అమ్మకాల ద్వారా గణనీయమైన అభివృద్ధి ఆదాయం పొందవచ్చు. సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా అమరావతి తనంతట తానుగా అభివృద్ధి చెందనుంది. అయితే అమరావతి పై వ్యతిరేక ప్రచారం చేయడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఇప్పుడు అమరావతి పనులు నిలిచిపోతాయి అని చెప్పడం వెనుక ఆ పార్టీ ఉందనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు.

బద్ధకం వద్దు బాస్..రోజూ నాలుగు అడుగులు వేసి చూడండి.. మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఇవే

15 Minute Walk Benefits
15 Minute Walk Benefits

Walking Benefits: కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి. ఇది పాత సామెత. కూర్చుని ఉంటే కొండలాగా దేహం పెరుగుతుంది ఇది కొత్త సామెత. ఎందుకంటే అదే పనిగా కూర్చుని ఉంటే శరీరంలో బద్ధకం మొదలవుతుంది. ఏ పని చేయాలన్నా సరే ఇబ్బందిగా ఉంటుంది. చివరికి అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా కష్టంగా ఉంటుంది. పరిస్థితి ఇంతకంటే విషమిస్తే అప్పుడు శరీరం లావెక్కి పోతుంది. ఒక్కసారి లావు ఎక్కిన శరీరం తగ్గాలి అంటే చాలా కష్టం.

శరీరం లావెక్కకూడదు.. బద్ధకం అసలు రాకూడదు. సైజ్ జీరో సినిమా లో అనుష్క లాగా అసలు ఉండకూడదు అనుకుంటే.. కచ్చితంగా నాలుగు అడుగులు వేయాలి. నాలుగు అంటే నాలుగు మాత్రమే కాదు అంతకుమించి అని అర్థం. ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో నడవడం అనేది తగ్గిపోయింది. ప్రతి దానికి వాహనాల మీద ప్రయాణం చేయడం పెరిగిపోయింది. దీనివల్ల శరీరానికి వ్యాయామం అనేది లేకుండా పోయింది. ఫలితంగా రకరకాల వ్యాధులు వస్తున్నాయి. శరీరం లావు కావడం.. కొవ్వు నిల్వలు పేరుకుపోవడం.. గుండె జబ్బులు వంటివి రావడం వల్ల చిన్న వయసులోనే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితికి చెక్ పెట్టాలంటే నడవాలని వైద్యులు సూచిస్తున్నారు.

రోజు నడక వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదట. తీపి తో పాటు షుగర్ కూడా అదుపులో ఉంటుందట. కీళ్లు దృఢంగా ఉంటాయట. క్యాలరీలు కరిగిపోతాయట. బరువు కూడా అదుపులో ఉంటుందట. ఒత్తిడి పూర్తిగా తగ్గి.. మానసిక ప్రశాంతత లభిస్తుందట. నాణ్యమైన నిద్ర కూడా వస్తుందట. సంపూర్ణ ఆరోగ్యానికి ప్రతిరోజు నడకను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

అయితే మోకాళ్ల నొప్పులు.. కీళ్లనొప్పులు.. ఇతర సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలతోనే నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. మోకాళ్ళ నొప్పులకు శస్త్ర చికిత్స చేయించుకున్న వారు సాధ్యమైనంత వరకు వైద్యుల సూచనతోనే నడక కొనసాగించాలని చెబుతున్నారు. అయితే నడక వాళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుందట. అంతేకాదు చర్మం కూడా తేజోమయంగా కనిపిస్తుందట. ఫలితంగా రక్త ప్రసరణ వ్యవస్థ సమర్థవంతంగా సాగిపోతూ ఉంటుందట. చర్మం మీద ముడతలు రావట. దీంతో వయసు పెరిగిన సరే.. ముఖంలో ఆ మార్పు కనిపించదట. అందువల్లే నడకను జీవనశైలిలో ఒక భాగంగా చేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

ముఖ్య గమనిక

ఈ సమాచారం వివిధ వేదికల వద్ద పాఠకుల కోసం సేకరించాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ కథనాన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే పాఠకుల కోసం అందించాం.

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ టెన్షన్.. కారణం అదే

BJP Southern States
BJP Southern States

BJP Southern States: భారతీయ జనతా పార్టీకి ఒక టెన్షన్ వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు ఉంటే.. 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. అందులో మెజారిటీ రాష్ట్రాలు బిజెపి చేతుల్లోనే ఉన్నాయి. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఆ పార్టీకి చోటు దక్కడం లేదు. దక్షిణ భారతదేశంలో ఐదు రాష్ట్రాలు ఉంటే.. అందులో నాలుగు చోట్ల కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. బిజెపి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న వర్కౌట్ కావడం లేదు. నిన్ననే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల లో భాగంగా.. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్.. తమిళనాడులో కాంగ్రెస్ సహకారంతో విజయ్ అధికారంలోకి వచ్చారు. ఈ రెండు చోట్ల బీజేపీ నామమాత్రంగానే మిగిలింది. ప్రస్తుతం బిజెపికి ఏకైక ఉపశమనం ఏపీ. ఆపై తెలంగాణలో సీట్లతో పాటు ఓట్ల పరంగా ముందంజలో ఉంది.

* మొన్నటి గెలుపులో తెలుగు రాష్ట్రాలు..
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలు ఆదుకున్నాయి ఎన్డీఏను. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు అండగా నిలిచాయి. తెలంగాణలో బిజెపి ఒంటరిగానే 8 ఎంపీ సీట్లను దక్కించుకుంది. ఏపీలో ఒంటరిగా మూడు పార్లమెంట్ సీట్లు దక్కించుకోగా ఎన్డీఏ కూటమిపరంగా 21 సీట్లతో.. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేందుకు దోహదపడ్డాయి తెలుగు రాష్ట్రాలు. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాల నుంచి 100 పార్లమెంట్ సీట్లపై గురి పెట్టింది భారతీయ జనతా పార్టీ. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకంటే నిన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కనీసం ఉనికి చాటుకోలేకపోయింది. కూటమిపరంగా కూడా సీట్లు తక్కువే వచ్చాయి. దీంతో బిజెపిలో ఒక రకమైన టెన్షన్ నడుస్తోంది.

* భారీ అంచనాలతో..
దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. అటు తరువాత బలం పెంచుకుంది తెలంగాణలో మాత్రమే. ఏపీలో టిడిపి తో పొత్తు ఉన్నప్పుడు మాత్రమే సీట్లు, ఓట్లు పరంగా మెరుగుపడుతూ వచ్చింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపికి దెబ్బ తగిలింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం సీట్లు తక్కువయ్యాయి. అందుకే అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు 2029 సార్వత్రిక ఎన్నికల్లో.. దక్షిణాది నుంచి పట్టు నిలుపుకోవాలని భావించింది బిజెపి. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే మాత్రం అందుకు అనుకూలంగా లేవు. ముమ్మాటికి దీనిపై బిజెపి చాలా ఆందోళనతో ఉంది. ముందుగా తెలుగు రాష్ట్రాలపైనే ఆశలు పెట్టుకుంది.

ధారం ఉండదు.. ఈ విగ్రహం గాల్లో తేలుతూ ఉంటుంది.. మనదేశంలో ఇది ఎక్కడ ఉందంటే

Konark Sun Temple
Konark Sun Temple

Konark Sun Temple: మన దేశం పురాతన సంస్కృతికి పెట్టింది పేరు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. అవి భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని బయటపెడుతూనే ఉంటాయి. అయితే నేటికీ ఆ నైపుణ్యాలు అంతు చిక్కవు. అటువంటి ఆలయాలు.. నిర్మాణాలు.. కట్టడాలు మనదేశంలో చాలా ఉన్నాయి. ఆలయాల శిల్పకళ గురించి.. కట్టడాల వెనుక ఉన్న అద్భుతం గురించి ఇప్పటివరకు మనం ఏదో ఒక రూపంలో తెలుసుకున్నాం. కానీ ఒక ఆలయం లో ఉన్న విగ్రహం ఎటువంటి ఆధారం లేకుండానే గాలిలో తేలిపోతూ ఉంటుంది. ఇది భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చు తులకలాగా నిలుస్తోంది.

విభిన్న సంస్కృతికి పెట్టింది పేరైన ఒడిశా రాష్ట్రంలో కోణార్క్ సూర్య దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతుంటారు. కోణార్క్ పేరు చెప్పగానే మనకు సూర్య దేవాలయం గుర్తొస్తుంది. ఈ ఆలయంలో సూర్యుడి విగ్రహం ఎటువంటి ఆధారం లేకుండానే గాలిలో తేలిపోతూ ఉంటుంది. ఇది ఒకప్పుడు మిస్టరీగానే ఉండేది. ఆలయ శిఖరంలోని 52 టన్నుల భారీ అయస్కాంతం.. పునాదిలోని మ్యాగ్నెటిక్ మధ్య ఏర్పడే అయస్కాంత క్షేత్రం వల్ల విగ్రహం గాలిలో నిలబడి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు.. దీనివల్ల భక్తులకు స్వామివారిని దర్శించుకునే క్రమంలో సరికొత్త అనుభూతి కలుగుతుందని చరిత్రకారులు వివరిస్తున్నారు..

కోణార్క్ ఆలయంలో సూర్య దేవుని విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. మనదేశంలో ఒడిశా ప్రాంతంలోనే కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరసవిల్లిలో సూర్యుడికి ఆలయం ఉంటుంది.. కోణార్క్ సూర్యదేవాలయంలో, అరసవిల్లి సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ప్రతి ఏడాది ఘనంగా జరుగుతుంటాయి. రథసప్తమి రోజు సూర్యదేవుడికి రకరకాల అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.. పూజలు జరుపుతుంటారు. అరసవిల్లిలో సూర్యకిరణాలు స్వామివారిని నేరుగా తాకుతుంటాయి. కోణార్క్ సూర్యదేవాలయంలో కూడా ఇదేవిధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ విగ్రహం నిత్యం గాలిలో తేలే అనుభూతి కలిగిస్తుంది కాబట్టి.. సూర్యకిరణాలు ఎక్కడ స్వామివారి మీద ఏటవాలుగా పడిపోతూ ఉంటాయి..

సూర్య దేవాలయాన్ని సందర్శించడానికి ప్రతిఏటా లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ప్రతి నిర్మాణం సంస్కృతికి నిలువుటద్దంగా నిలుస్తూ ఉంటుంది. అందువల్లే ఈ ఆలయం లో ప్రతి శిల్పం ఒక చరిత్రను చెబుతుందని.. ప్రతి నిర్మాణం సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని చరిత్ర అధ్యయనకారులు వివరిస్తుంటారు.

పూరీలు, మైసూర్ బజ్జీలు కాదు.. హెల్తీ బ్రేక్ ఫాస్ట్ అంటే ఇదే.. ఓసారి ట్రై చేయండి

Healthy Breakfast
Healthy Breakfast

Healthy Breakfast: ఒకప్పటి మాదిరిగా శారీరక శ్రమ లేదు. కనీసం నాలుగు అడుగులు వేయకుండానే అన్ని కాళ్ల ముందుకు.. కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి. క్లిక్ దూరంలోనే అన్ని ఉంటున్నాయి. జేబులో నుంచి డబ్బులు తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు.. ఎటువంటి కష్టం దరిచేరకుండానే
… చెమట చుక్కలు చిందించకుండానే పనులు జరిగిపోతున్నాయి. కనీసం ఇలాంటప్పుడైనా సరే శరీరానికి మంచి చేసే పని ఒక్కటైనా చేయాలి.

శారీరక శ్రమ లేకపోతే శరీరంలో కొవ్వులు పేరుకుపోతూ ఉంటాయి. వాటి వల్ల రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. అందువల్లే హెల్దీ ఫుడ్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. కొంతమంది బ్రేక్ఫాస్ట్లో పూరి తినేస్తుంటారు. అదికూడా ప్లేట్లకు ప్లేట్లు తింటూ ఉంటారు. మరికొందరేమో మైసూర్ బజ్జీలను అదేపనిగా తింటుంటారు. వడ, ఇంకా రకరకాల నూనె పదార్థాలను దర్జాగా తింటుంటారు. తింటున్నప్పుడు నోటికి రుచి తగులుతూ ఉంటుంది. ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది. కానీ అదే పనిగా తింటే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటుంది.

నేటి కాలంలో జీవన శైలి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో.. బ్రేక్ఫాస్ట్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని పోషకాహార నిపుణులు… వైద్యులు సూచిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ వల్ల రోజంతా ఉత్సాహం లభిస్తుంది. మనసుకు హాయి కలుగుతుంది. అంతేకాదు శరీరానికి సరికొత్త శక్తి వస్తుంది. బోండాలు, వడలు, పూరి వంటి ఆయిల్ ఫుడ్ కాకుండా.. పోషకాలు నిండి ఉన్న ఆహారం మీద దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట నానబెట్టిన మొలకలు.. గింజలు.. ఉడికించిన కోడిగుడ్లు.. గ్రీకు యోగర్ట్ వంటి వాటిని తీసుకోవాలని చెప్తున్నారు. అల్పాహారంలో వీటిని భాగంగా చేసుకుంటే శరీరానికి మంచి జరుగుతుందని చెబుతున్నారు.

కొంతమంది బ్రేక్ ఫాస్ట్ లో మైదాను ఎక్కువగా వాడుతుంటారు. చక్కెరను కూడా అదే పనిగా తీసుకుంటారు. దీనివల్ల శరీరంలో చక్కెర నిల్వలు పేరుకుపోతుంటాయి. అవి రకరకాల వ్యాధులకు దారితీస్తుంటాయి. అందువల్ల బ్రేక్ఫాస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా నూనె పదార్థాలకు అత్యంత దూరంగా ఉండాలని పోషకాహార నిపుణులు.. వైద్యులు సూచిస్తున్నారు.

ఈ కథనం పాఠకులకు సమగ్రమైన సమాచారం అందించేందుకు రూపొందించాం. ఈ స్టోరీ వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. దీనిని పాఠకులు గమనించాలని కోరుతున్నాం.

కిలో ఉల్లిపాయలకు దక్కింది రూపాయి.. ఇదీ మనదేశంలో కర్షకుల శ్రమకు లభిస్తున్న గౌరవం..

Onion Price Crisis
Onion Price Crisis

Onion Price Crisis: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. కానీ ఈ రైతుకు మేలు కాదు కదా.. దారుణమైన నష్టాన్ని మిగిల్చింది. కానీ విని ఎరుగని స్థాయిలో కన్నీటిని జ్ఞాపకం గా ఇచ్చింది. దీంతో ఆ రైతు పడుతున్న వేదన మామూలుగా లేదు. కుమిలి కుమిలి ఏడుస్తున్న అతడి కన్నీరు మన దేశ పాలకులకు.. రైతుల శ్రమ దోచుకుంటున్న వ్యాపారులకు చెంప పెట్టు లాంటిది.

మనదేశంలో ఉల్లిపాయలకు ప్రభుత్వాలను మార్చిన ఘనత ఉంది. ఎందుకంటే ఉల్లి ధరలు పెరిగితే మధ్య తరగతి, పేదల బడ్జెట్ లెక్కలు పూర్తిగా మారిపోతాయి. ఎందుకంటే ఉల్లిగడ్డలు లేకుండా ఏ వంట కూడా సాగదు. ముఖ్యంగా ఉల్లిపాయల ధరలు పెరిగితే సగటు ఆడవాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వంట ఇంటి కష్టాలు వాళ్లకు మాత్రమే తెలుసు. ఉల్లి ధరలు ఒక నిర్ణీత స్థాయిలో ఉంటేనే బాగుంటుంది. అవి అమాంతం పెరిగితే పేదలు, మధ్యతరగతివారు తీవ్రంగా ఇబ్బంది పడతారు.

అలాగని పెరిగిన ధరలు రైతులకు అంతగా ప్రయోజనాన్ని కలిగించవు. ఎందుకంటే రైతుల నుంచి కొనుగోలు చేసిన మధ్యవర్తులు మాత్రమే భారీగా లాభాలు సంపాదిస్తూ ఉంటారు. ఉల్లి ధరలు పెరిగితే మధ్యవర్తులు లాభపడతారు. ధరలు తగ్గితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. మనదేశంలో ఉల్లి పంటకు పెట్టింది పేరైన మహారాష్ట్రలో.. జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా రైతుల దయనీయస్థితికి అద్దం పడుతుంది.

మహారాష్ట్రలోని చత్రపతి శంభాజీ నగర్ మార్కెట్ ఏరియాలో ఓ రైతు 1,262 కిలోల ఉల్లిపాయలను విక్రయించాడు. దీనికి అతడికి కేవలం 1,262 మాత్రమే దక్కాయి. అంటే ఈ లెక్కన కేజీకి ₹1 మాత్రమే అతనికి లభించింది. ఉల్లిపాయలను అమ్మడానికి అతడు లోడింగ్, తూకం, రవాణా కోసం ఏకంగా 1,263 రూపాయలను ఖర్చు చేశాడు. అంటే అతడికి కష్టానికి ప్రతిఫలం దక్కలేదు. పైగా జేబు నుంచి అదనంగా రూపాయి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిలో రైతులు వ్యవసాయం ఎలా చేస్తారు.. కనీసం గిట్టుబాటు కాదు కదా.. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే ఎలా బతుకుతారు.. రైతు అనుకూల విధానాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తుంటే ఇక రైతులు ఎలా బతుకుతారు…ఎలా బాగుపడతారు.. పండించిన పంటను గిట్టుబాటు ధరకు కూడా అమ్ముకో లేకపోతే అంతకుమించిన దరిద్రం ఇంకేముంటుంది.