Homeఎంటర్టైన్మెంట్iBOMMA Relaunch: గ్రాండ్ గా రీ లాంచ్ అయిన iBOMMA.. కొత్త సినిమాల పైరసీ షురూ..

iBOMMA Relaunch: గ్రాండ్ గా రీ లాంచ్ అయిన iBOMMA.. కొత్త సినిమాల పైరసీ షురూ..

iBOMMA Relaunch: కొన్ని నెలల క్రితం నుండి నేషనల్ లెవెల్ లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయిన పేరు ఇమ్మడి రవి. iBomma అనే వెబ్ సైట్ ని రన్ చేస్తూ, అందులో కొత్త సినిమాలన్నీ అప్లోడ్ చేస్తూ సినీ నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన ఈ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనాత్మకంగా మారిన అంశం. ఇతను అరెస్ట్ అయ్యాకా అందరూ ఊపిరి పీల్చుకున్నారు , ఎందుకంటే ఇక నుండి పైరసీ జరగదు […]

iBOMMA Relaunch: కొన్ని నెలల క్రితం నుండి నేషనల్ లెవెల్ లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయిన పేరు ఇమ్మడి రవి. iBomma అనే వెబ్ సైట్ ని రన్ చేస్తూ, అందులో కొత్త సినిమాలన్నీ అప్లోడ్ చేస్తూ సినీ నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన ఈ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనాత్మకంగా మారిన అంశం. ఇతను అరెస్ట్ అయ్యాకా అందరూ ఊపిరి పీల్చుకున్నారు , ఎందుకంటే ఇక నుండి పైరసీ జరగదు అనే నమ్మకం సినీ నిర్మాతల్లో కలిగింది. కానీ ఇతను అరెస్ట్ అవ్వడం వల్ల సినీ ఇండస్ట్రీ కి ఎలాంటి మేలు జరగలేదు. పైరసీ సినిమాలు HD క్వాలిటీ తో ఇంటర్నెట్ లో ప్రత్యక్ష్యం అవుతూనే ఉన్నాయి. ఇక ఇతను బైలు మీద బయటకు వచ్చిన తర్వాత తన iBomma సైట్ ని రీ లాంచ్ చేశాడు . ఇదే ఇప్పుడు సంచలనాత్మకంగా మారిన అంశం.

ఇంటర్నెట్ లో bappam అనే లింక్ ని క్లిక్ చేస్తే నేరుగా iBomma సైట్ ఓపెన్ అవుతుంది. అందులో 2026 వ సంవత్సరం లో విడుదలైన కొత్త సినిమాలన్నీ దర్శనమిచ్చాయి. 10 రోజుల క్రితం విడుదలైన ‘గాయపడ్డ సింహం’, ‘జెట్ లీ’ ‘కర ‘ సినిమాలు ఇందులో ఉన్నాయి. దీని అర్థం రాబోయే రోజుల్లో కొత్త సినిమాలు విడుదలైన మొదటి రోజే హై క్వాలిటీ తో మా iBomma సైట్ లో అప్లోడ్ చేస్తామని చెప్పకనే చెప్తున్నట్టు లెక్క. పోలీస్ స్టేషన్ లో అన్ని నెలలు గడిపిన తర్వాత కూడా రవి ఇలాంటి చర్యకు పాల్పడ్డాడు అంటే , అతని ధైర్యం చూడండి ఎలా ఉందో అని కొందరు కామెంట్ చేస్తుంటే , మరికొందరు మాత్రం రవి ప్రమేయం లో లేకుండా వేరే వాళ్ళు క్రియేట్ చేసుంటారు , అనవసరం గా రవి ని ఇరికించారని అంటున్నారు, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper