Home Blog Page 233

విశ్వంభర ఇప్పుడు రిలీజ్ అవ్వకపోతే భారీ నష్టాలు వస్తాయా..?

Vishwambhara Release Updates
Vishwambhara Release Updates

Vishwambhara Release Updates: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్లో తెరకెక్కిన విశ్వంభర సినిమా గత సంవత్సరం సమ్మర్ కానుక గా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకైతే రాలేకపోయింది…కారణం ఏంటి అంటే సినిమాలో సీజీ వర్క్ అంత పెద్దగా సెట్ అవ్వలేదనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. ఇక మరో సిజి కంపెనీతో వర్క్ చేయించిన కూడా అది అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం లేదట.

దాంతో చిరంజీవి సైతం ఈ సినిమా మీద ఆశలు వదిలేసుకున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికైనా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటుంది. అలా కాకుండా ఇంకా ఈ సినిమా మీద బడ్జెట్ ని పెంచుకుంటూ పోతే అది లాస్ ను మిగిల్చే ప్రమాదం కూడా ఉందని ఈ సినిమా మీద బజ్ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని చాలామంది చెబుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాను లేట్ చేయకుండా రిలీజ్ చేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం భారీ నష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు. చిరంజీవి ఈ సంవత్సరం ఇప్పటికే మనిషికి మన శంకర్ వరప్రసాద్ సినిమాలో సూపర్ సక్సెస్ ని సాధించాడు. కాబట్టి ఆ ఊపులోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేస్తే బాగుండేది. ఇక ఈ సమ్మర్ కూడా అయిపోయింది. కాబట్టి ఈ సినిమా సమ్మర్ కి వస్తుంది అనుకున్నప్పటికి అది నిరాశగానే మిగిలింది. మరి ఈ సినిమా మరో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారా?

సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ప్రేక్షకులకు ఒక కిక్కిచ్చే న్యూస్ చిరంజీవి చెప్పబోతున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాను పక్కన పెడితే ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్ లో చేయబోయే సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు…ఈ మూవీతో సూపర్ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది…

పుంజుకున్న Suzuki Access అమ్మకాలు.. దీనికి ఎందుకంత డిమాండ్..

Suzuki Access Sales Growth
Suzuki Access Sales Growth

Suzuki Access Sales Growth: ప్రస్తుత కాలంలో బైక్ ల కంటే స్కూటర్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో వీటి అమ్మకాలు పుంజుకుంటున్నాయి. ఇందులో భాగంగా Suzuki Access స్కూటర్ 125 సీసీ విభాగంలో మరోసారి స్టార్ గా నిలిచింది. ఏప్రిల్ 2026 నెలలో సుజుకి మొత్తం బైక్స్, స్కూటర్ల మిక్స్‌లో అత్యధికంగా అమ్ముడైన బైక్‌గా యాక్సెస్ నిలిచింది. దీనికి ఉన్న స్టైలిష్ డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో పాటు అందుబాటులో ధర ఉండడంతో దీని కొనుగోళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

Suzuki Access స్కూటర్ 125 ఏప్రిల్ ఒక్క నెలలోనే మొత్తం 70,339 యూనిట్లు అమ్ముడు పోయాయి, ఇదే స్థాయి సేల్స్ ఇంకొక స్కూటర్‌కు కూడా లేదు. గత ఏడాది ఏప్రిల్ లో యాక్సెస్ 65,107 యూనిట్లు అమ్ముడయితే, ఈసారి 8 శాతం వృద్ధి సాధించింది. 125 సీసీ సెగ్మెంట్‌లో హోండా షైన్ 125, యమహా Ray‑ZR, TVS Jupiter వంటి ప్రత్యర్థులు ఉన్నా, వాటి కంపేరిడ్ సేల్స్‌లో సుజుకి యాక్సెస్ గణనీయంగా అమ్మకాల సాగించింది. యాక్సెస్ తీసుకురావడం వల్ల కంపెనీ మొత్తం స్కూటర్ పోర్ట్‌ఫోలియోలో ప్రధాన రెవెన్యూ జన‌రేటర్‌గా మారింది.

ఇంతటి క్రేజ్‌కు కారణాలు ఇందులో ఉండే ఫీచర్లు, పెర్ఫామెన్స్ అని చెప్పవచ్చు. సుజుకి యాక్సెస్ 125 లో 124 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఫ్యూయెల్‑ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 8.3 bhp పవర్, 10.2 Nm టార్క్ ను రిలీజ్ చేస్తుంది. అలాగే దీనికి CVTతో స్మూత్ రైడ్ ఫీల్ ఇస్తుంది. లీటర్ ఇంధనానికి సుమారు 47 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

అలాగే స్టైలిష్ డిజైన్, అప్పటికీ ప్రాక్టికల్ బాడీ‌లైన్స్ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. సొగసైన రైడ్ కమ్ఫర్ట్, బ్రాండ్ వ్యాల్యూను ఒకే ప్యాకేజ్‌లో ఇచ్చే విధంగా యాక్సెస్ ఉంటుంది. సుజుకి యాక్సెస్ కేవలం సేల్స్ గ్రాఫ్ మాత్రమే కాకుండా డెలివరీల్లో వెయిటింగ్ పీరియడ్ రెండు నెలలుగా ఉంది. చిన్న నగరాలు, సబర్బన్ ఎరీస్‌లో కూడా యాక్సెస్ డిమాండ్ పెరగడం భవిష్యత్తులో ఈ స్కూటర్ సేల్స్ మరింత పెరగబోతోందని సూచిస్తోంది.

సుజుకి యాక్సెస్ స్కూటర్ ఏప్రిల్ 2026లో మొత్తం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలవడం, గత ఏడాదితో పోలిస్తే 8 శాతం లెక్కన వార్షిక వృద్ధి సాధించడం వంటి విజయాలు చూస్తే, 125 సీసీ సెగ్మెంట్‌లో సుజుకి ప్రభుత్వం తరహా రేస్ నడుపుతోందని చెప్పొచ్చు.

స్టార్ హీరోల బాటలో కాకుండా కొత్త బాటలో వెళ్తున్న కుర్ర హీరోలు..

Young Tollywood Heroes New Trend
Young Tollywood Heroes New Trend

Young Tollywood Heroes New Trend: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలతో పాటు కుర్ర హీరోలు కూడా కొత్త కాన్సెప్ట్ తో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. నిజానికి స్టార్ హీరోలు కమర్షియల్ సక్సెస్ లను సాధిస్తుంటే కుర్ర హీరోలు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుండడం విశేషం… సినిమా ఇండస్ట్రీకి పరిమితం అవుతున్నామనే ఒక చిన్న డైలమాలో ఉన్నారు. అందుకే పాన్ ఇండియా బాట పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి హీరో కూడా మాస్ సినిమాలనే చేయాలని కమర్షియల్ గా సక్సెస్ ని సాధిస్తే వాళ్ళకి మార్కెట్ పెరుగుతుందని ఆలోచిస్తున్నారు. కానీ అలా కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు కూడా పాన్ ఇండియాలో చాలా మంచి గుర్తింపు వస్తుందనే విషయాన్ని మర్చిపోతున్నారు.

ఎప్పుడైతే కమర్షియల్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తారో ఒక సక్సెస్ వస్తే వాళ్ళ క్రేజ్ పెరుగుతుంది. కానీ మరో సినిమాతో సక్సెస్ ని సాధించకపోతే మాత్రం అమాంతం వాళ్ళు పాతాళానికి పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఒకవేళ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తే ఆ సినిమాలు ఎలాగైనా సరే మినిమం గ్యారెంటి మూవీస్ అవుతుంటాయి.

కాబట్టి వాటితో కొంతవరకు సేఫ్ జోన్ లో ఉండొచ్చు. నింగి విడిచి సాము చేయడం కంటే వాళ్ళకు సెట్ అయ్యే కథలతోనే సినిమాలను చేసి సక్సెస్ లను సాధిస్తే ఉత్తమం అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు..ఇక ఏది ఏమైనా కూడా మన హీరోలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. అయినప్పటికి కథల విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

అటు స్టార్ హీరోలు ఇండస్ట్రీ హిట్స్ కొడుతుంటే ఇటు కుర్ర హీరోలు సైతం డిఫరెంట్ మూవీస్ చేస్తేనే బాగుంటుంది… మొత్తానికైతే రాబోయే 10 సంవత్సరాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ వరల్డ్ సినిమా ఇండస్ట్రీ కి సైతం పోటీని ఇస్తుందనేది వాస్తవం…ఇక మన మేకర్స్ కూడా ఆ దిశ గానే ముందుకు సాగుతున్నారు…

భారత్ కు ఉగ్ర ముప్పు.. పాక్ నుంచి ప్రమాదం!

Pakistan Threat To India
Pakistan Threat To India

Pakistan Threat To India: అమెరికా విదేశాంగ మంత్రిగా భారత్ సందర్శనకు వచ్చిన మార్కో రూబియో పాకిస్తాన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ కు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని, పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలే ఎందుకు కారణమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు దక్షిణాసియా భద్రతా దృక్పథానికి మరోసారి ఆలోచనాత్మకమైన సందేశం ఇస్తున్నాయి. పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద గ్రూపులు భారత్‌ను నిరంతరం లక్ష్యం చేసుకుంటున్నాయని భారత్ ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉందని రూబియో స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిందా అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన “వారి సమస్య వేరు” అని చెప్పడం గమనార్హం.

భారత్ ఆందోళన నేపథ్యం..
భారత్ దృష్టిలో పాకిస్తాన్ సమస్య కేవలం సరిహద్దు వివాదం కాదు. అది ఉగ్రవాదం ద్వారా జరుగుతున్న స్థిరమైన హైబ్రిడ్ యుద్ధం. 26/11 ముంబై దాడులు, పుల్వామా, ఉరి, పాహల్గామ్ వంటి ఘటనలు ఇప్పటికీ తాజా గాయాలుగా మిగిలి ఉన్నాయి. పాకిస్తాన్ భూమి నుంచి ఆపరేట్ అవుతున్న గ్రూపులు (లష్కర్-ఎ-తయ్యబా, జైష్-ఎ-మహమ్మద్ వంటివి) భారత్ సార్వభౌమత్వానికి, పౌరుల భద్రతకు నిరంతర ముప్పుగా ఉన్నాయని భారత్ ఆందోళన వ్యక్తం
చేస్తోంది. ఇటీవలి అమెరికా రిపోర్టులు కూడా పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగినట్లు (35% వృద్ధి) సూచిస్తున్నాయి. రూబియో వ్యాఖ్యలు ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నాయి. ఇది భారత్‌కు ఒక రకమైన ధైర్యం ఇచ్చే సంకేతం.

అసలు సవాల్ ఇక్కడే ఉంది..
అమెరికా తన జాతీయ ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో ఉద్రిక్తతలు, చైనా ప్రభావం, ఆఫ్ఘానిస్తాన్ స్థితి — ఇవన్నీ చూసి అమెరికా పాకిస్తాన్‌ను పక్కకు నెట్టేసే అవకాశం లేకుండా చేస్తాయి. కానీ ఇది భారత్ కోసం ఒక ముఖ్యమైన హెచ్చరిక. భారత్ ఎప్పుడూ చెప్పేదేమంటే.. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే దేశాన్ని ప్రపంచ వేదికపై మధ్యవర్తిగా ఎత్తి చూపడం ద్వంద్వ ప్రమాణాలకు దారి తీస్తుంది. ఒకవైపు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూ, మరోవైపు అదే ఉగ్రవాద మద్దతుదారు దేశం అంతర్జాతీయ గౌరవం పొందడం భారత్‌కు ఆమోదయోగ్యం కాదు. ఇది ప్రాంతీయ స్థిరత్వానికి కూడా ముప్పు. అయినప్పటికీ, రూబియో సందేశం ఒక సానుకూల అంశాన్ని కలిగి ఉంది. అమెరికా భారత్‌తో తన స్ట్రాటజిక్ భాగస్వామ్యాన్ని పాక్ సంబంధాల కోసం రాజీ పడదు. ఇటీవలి అమెరికా-ఇండియా కౌంటర్ టెర్రరిజం సహకారం, వాణిజ్య చర్చలు, రక్షణ భాగస్వామ్యం ఈ దిశగా ముందుకు వెళ్తున్నాయి.

భారత్ తన ఆందోళనను నిరంతరం హైలైట్ చేయాలి. ఏకపక్ష చర్యలు తన భద్రతను కాపాడుకోవడంలో కీలకం అయినప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారం కోసం బలమైన గ్లోబల్ నెరేటివ్‌ను రూపొందించాలి. రూబియో వ్యాఖ్యలు ఒక వాస్తవాన్ని గుర్తు చేస్తున్నాయి. ఉగ్రవాదం ఏ దేశం నుంచి వచ్చినా దాన్ని సమూలంగా నిర్మూలించాలి. ఈ సూత్రాన్ని అమెరికా పాకిస్తాన్ విషయంలో కూడా కచ్చితంగా అమలు చేస్తేనే దక్షిణాసియాలో శాంతి సాధ్యం. కానీ అంతర్జాతీయ భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసుకోవాలి.

త్వరపడండి.. Motorola ఈ ఫోన్లు, బడ్స్ పై భారీ డిస్కౌంట్లు..

Motorola Phones Huge Discounts
Motorola Phones Huge Discounts

Motorola Phones Huge Discounts: మోటోరోలా కంపెనీకి సంబంధించిన డివైజ్ లు భారతీయ వినియోగదారులను విపరీతంగా ఆకట్టకుంటన్నాయి. ఈ కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ అయిన moto g37 POWER, moto g37లతో పాట moto buds 2 పరికరాలను భారతదేశంలో విక్రయిస్తున్నారు. ఈ లేటెస్ట్ పరికరాలు ఇప్పుడు Flipkart, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే వినియోగదారులను ఆకర్షించేందుకు మోటోరోలా వీటిపై ప్రత్యేకమైన ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితె..

Motorola కంపెనీకి చెందిన Moto G37 (4GB+64GB వేరియంట్) ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 13,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే Moto G37 POWER వేరియంట్ రూ.15,999కి నుంచి విక్రయిస్తున్నారు. దీని హై-ఎండ్ వేరియంట్ (8GB+128GB) రూ.18,999కి అందుబాటులో ఉంది. వీటితో పాటు కొత్తగా పరిచయం చేసిన Moto Buds 2 ఇయర్‌బడ్స్ రూ. 2,999 ధరతో మార్కెట్లోకి వచ్చాయి.

కొనుగోలుదారుల కోసం మోటోరోలా అద్భుతమైన లాంచ్ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా ICICI,IDFC, SBI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి వీటిని కొనుగోలు చేస్తే రూ. 5,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా, IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 5,500 వరకు భారీ తగ్గింపు లభిస్తుంది. మొబిక్విక్ UPI ద్వారా చెల్లింపులు చేసేవారికి రూ. 1,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. మొదటిసారి మొబిక్విక్ ఉపయోగించే వారికి అదనంగా రూ. 300 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

వీటితో పాటు, రిలయన్స్ జియో (Reliance Jio) వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లను కొనుగోలు చేసే అర్హులైన వినియోగదారులకు 18 నెలల పాటు 5000GB క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro)కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ మరియు ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లతో వస్తున్న ఈ కొత్త మోటోరోలా పరికరాలు బడ్జెట్ సెగ్మెంట్‌లో వినియోగదారులకు మంచి ఎంపికగా నిలుస్తాయని చెప్పవచ్చు.

Honda City 2026 facelift.. Hyundai Verna 2026..వీటిలో ఏది బెస్ట్..

Honda City Vs Hyundai Verna
Honda City Vs Hyundai Verna

Honda City Vs Hyundai Verna: మిడ్ సైజ్ సెడాన్ కార్లు కొనాలని కొందరు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా మోడల్స్ ను తీర్చిదిద్ది మార్కెట్లోకి తీసుకువచ్చాయి. వీటిలో Honda City 2026 facelift, Hyundai Verna 2026 ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ రెండూ భారత మిడ్ సైజ్ సెడాన్ మార్కెట్‌లో హిట్టయిన మోడల్స్‌గా కొనసాగుతున్నాయి. ఈ రెండు కార్లు అద్భుతమైన డిజైన్ తో పాటు డ్రైవర్, ప్రయాణికులకు కావాల్సిన సౌకర్యాలను అందిస్తున్నాయి. అంతేకాకుండా వీటిలో అప్డేట్ ఫీచర్లు ఉన్నాయి. అయినా కూడా వీటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడాలేవో చూద్దాం..

హోండా సిటీ 2026 facelift లో రెండు పవర్‌ట్రైన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో ఒకటి 1.5 లీటర్ నాచురల్‌ ఆస్పిరేటెడ్ పెట్రోల్, మరొకటి e:HEV స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ కనిపిస్తుంది. పెట్రోల్ వెర్షన్ 121 PS పవర్, 145 Nm టార్క్ ను ఉత్పత్తి చేయగా.. ఎలక్ట్రిక్ వెర్షన్ 126 PS పవర్ 253 Nm టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ హైబ్రిడ్ వెర్షన్ లీటర్ ఇంధనానికి 27.26 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీంతో నగరాల్లో ప్రయాణం చేసేవారితో పాటు హైవేలో వెళ్లేవారికి అనుగుణంగా ఉంటుంది.

Hyundai Verna 2026 లోనూ రెండు ఇంజిన్ ఆప్షన్లు కనిపిస్తాయి. 1.5 లీటర్ NA పెట్రోల్ ( 113 PS పవర్ , 114 Nm టార్క్) 1.5 లీటర్ టర్బో‑పెట్రోల్ ( 157–160 PS పవర్ , 253 Nm టార్క్) ఉంటాయి. విహార యాత్రలకు వెళ్లేవారితో పాటు హైవే స్పీడ్ ఇష్టపడే వాళ్లకి ఇది బాగా సూట్ అవుతుంది; అయితే ఈ కారు మైలేజ్ మాత్రం లీటర్ ఇంధనానికి 20 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుందని చెబుతున్నారు. అంటే ఫ్యూయెల్ ఎఫిషియెన్సీని ప్రయోరిటీ గా తీసుకుంటే Honda City e:HEV మెరుగ్గా ఉంటుంది. అయితే లాంగ్ డ్రైవ్ చేయాలని అనకుంటే Verna టర్బో బెటర్.

Hyundai Verna 2026 కొత్త ఫేస్‌లిఫ్ట్‌తో ఇంటీరియర్‌లో మెరుగైన క్వాలిటీ మెటీరియల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ కన్నెక్టివిటీ, వైర్‌లెస్ కార్‌ప్లే , కన్సోల్ స్పేస్ వంటివి అప్‌గ్రేడ్ చేశారు. అలాగే అధునాతన ADAS ఫీచర్లు .. రడార్‑బేస్డ్ లేన్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటివి ఉన్నాయి.

హోండా సిటీ కూడా న్యూ facelift తో కెమెరా‑బేస్డ్ ADAS ఫీచర్లు , 360 డిగ్రీ కెమెరా, మెరుగైన ఇన్ఫోటైన్మెంట్, కన్సిస్ట్ ఎయిర్ కండీషనింగ్, చక్కని సౌండ్ సిస్టమ్‌లు కనిపిస్తాయి. కానీ city ఆధారంగా చూస్తే హోండా స్థిరత్వం, సేఫ్టీని అందిస్తుంది. అయితే హ్యుందాయ్ వెర్నా టాప్ వేరియంట్‌లో టెక్‑నింపిన క్యాబిన్, స్పోర్టియర్ ఫీల్ ఎక్కువగా ఉంటుంది.

ఇండియన్ మార్కెట్‌లో హ్యుందాయ్ వెర్నా 2026 ప్రారంభంలో దాదాపు రూ.10.98 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ వేరియంట్ సుమారు రూ.18.40 లక్షలతో విక్రయిస్తున్నార. హోండా సిటీ 2026 facelift ప్రారంభం సుమారు రూ.12 లక్షల నుంచి దాదాపు రూ.21 లక్షల వరకు ఉండనంది.

ఎన్టీఆర్ ఆ హీరోల సినిమాలను చూసి అలాంటి మూవీస్ చేశాడా..?

Jr NTR
Jr NTR

Jr NTR Movie Inspiration: నందమూరి మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్…ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. పాన్ ఇండియాలో తన తోటి హీరోలందరు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఆయన మాత్రం కొంతవరకు వెనుకబడిపోతున్నాడనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా హీరో ఒక సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే తను కూడా సేమ్ అలాంటి జానర్ లోనే సినిమా చేస్తూ వచ్చాడు. పోకిరి సినిమా సూపర్ సక్సెస్ అయిందని కంత్రి చేశాడు. మగధీర సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని శక్తి చేశాడు. ఇక మహేష్ బాబు చేసిన దూకుడు సినిమా భారీ విజయం సాధించడంతో బాద్షా అంటూ సేమ్ అదే పాటర్న్ లో కామెడీగా ఉండే సినిమా చేశాడు.

పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో మహేష్ బాబు బిజినెస్ మెన్ సినిమా తో సక్సెస్ కొడితే ఎన్టీఆర్ వెంటనే పూరి తో టెంపర్ అంటూ ఒక సినిమాని చేశాడు… ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఇతర హీరోలతో సినిమాలను చేసి సక్సెస్ లను సాధిస్తే అలాంటి సినిమాలతోనే తను కూడా భారీ విజయాన్ని సాధించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. నిజానికి ఒక క్యారెక్టర్ కొంతమంది హీరోలకే సెట్ అవ్వచ్చు.

మరి కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఒక హీరోకి వచ్చిన సక్సెస్ మరొక హీరోకి రాకపోవచ్చు. ఒక హీరో ఆ కథతో సినిమా చేశాడని మనం చేసే కంటే మనకి ఏది సెట్ అవుతుందో అది తెలుసుకొని అలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని మరి కొంత మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు..

ఇక ఇప్పుడు కూడా ప్రభాస్ సలార్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. అందుకని ప్రశాంత్ నీల్ తోనే డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తే పర్లేదు కానీ ఫ్లాప్ ని మూట గట్టుకుంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది..

ముంబై ఇండియన్స్ మీద కుర్రాడి పంచులు.. పొట్ట చెక్కలయ్యేలా నవ్విన నీతా అంబానీ.. వైరల్ వీడియో

Nita Ambani Laughing Video
Nita Ambani Laughing Video

Nita Ambani Laughing Video: ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్.. రోహిత్ నాయకత్వంలో ముంబై జట్టు ఐపిఎల్ చరిత్రలోనే ఐదుసార్లు ట్రోఫీలు అందుకొని రికార్డ్ సృష్టించింది.. అటువంటి ముంబై జట్టు ప్రస్తుతం దారుణమైన ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నది. గత సీజన్లో నాలుగో స్థానంలో ముంబై జట్టు.. ఈసారి మాత్రం గ్రూప్ దశ నుంచే ఇంటికి వెళ్లిపోయింది.. హార్దిక్ పాండ్యా నుంచి మొదలు పెడితే సూర్యకుమార్ యాదవ్ వరకు గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టు అంతగా విజయాలు నమోదు చేయలేకపోయింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్ల మీద విమర్శలు పెరిగిపోయాయి. రోహిత్ ని పక్కన పెట్టి హార్థిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పటికీ ముంబై జట్టుకు ఉపయోగం లేకుండా పోయింది.

తాజాగా ముంబైలోని అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుక జరిగింది.. ఈ వేడుకకు చైర్ పర్సన్ హోదాలో నీతా అంబానీ హాజరయ్యారు. ఈ క్రమంలో అక్కడి విద్యార్థి చేసిన ఒక ప్రసంగం ఆమెను నవ్వుల్లో ముంచెత్తింది. “మనకు ముంబై ఇండియన్స్ జట్టు అంటే చాలా ఇష్టం. ఆ చెట్టు ఇప్పుడు కఠినమైన సీజన్లను ఎదుర్కొంటున్నది. మన లైఫ్ లో కూడా అటువంటివే ఉంటాయని” అని ఆ స్టూడెంట్ వ్యాఖ్యానించాడు. దీంతో ఆ వేదిక మీద ఉన్న నీతా అంబానీ ఒక్కసారిగా పొట్ట చెక్కలయ్యే విధంగా నవ్వింది. ఆమె నవ్వుతుంటే మిగతావారు కూడా నవ్వడం మొదలుపెట్టారు.

ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తోంది.. అయితే ఆ విద్యార్థి మాట్లాడిన మాటలను కొంతమంది సానుకూలంగా తీసుకుంటుండగా.. మరికొంతమంది వ్యతిరేకంగా తీసుకుంటున్నారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమిస్తే ముంబై జట్టుకు ఈ పరిస్థితి వచ్చిందని.. చివరికి ముంబై ఇండియన్స్ జట్టు ఒక విద్యార్థి మాట్లాడిన మాటలతో నవ్వులపాలైందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.. చాలామంది దీనిని ఒక హాస్య స్పూరకమైన సన్నివేశం లాగా తీసుకోవద్దని.. ఆ విద్యార్థి మాట్లాడిన మాటలు ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి గుణపాఠం లాంటివని.. ఇప్పటికైనా జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని.. ముంబై ఇండియన్స్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.

ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్లో దారుణంగా ఆడింది.. అంతగా విజయాలు నమోదు చేయలేకపోయింది. జట్టులో ఐకమత్యం లోపించింది. కొంతమంది ఆటగాళ్లు వ్యక్తిగత ఈగోలకు పోయి సరిగ్గా ఆడలేదని ముంబై ఇండియన్స్ అభిమానులు పేర్కొంటున్నారు. అందువల్లే ఇలాంటి ఓటములు ఎదురయ్యాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ విద్యార్థి మాట్లాడిన మాటలను లెక్కలోకి తీసుకొని ఎం ఐ యాజమాన్యం మారాల్సిన అవసరం ఉందని వారు హితవు పలుకుతున్నారు.

కోహ్లీతో గొడవ.. హెడ్ భార్యపై దారుణం.. చెలరేగిపోతున్నారు..

Kohli And Travis Head Controversy
Kohli And Travis Head Controversy

Kohli And Travis Head Controversy: ఇటీవల హైదరాబాద్, బెంగళూరు జట్లు ఐపీఎల్ మ్యాచ్లో భాగంగా హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. అయితే ఈ విజయం హైదరాబాద్ జట్టుకు అంతగా ప్రయోజనం కలిగించలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచినప్పటికీ హైదరాబాద్ జట్టు గుజరాత్ స్థానాన్ని ఆక్రమించలేకపోయింది. ఈ విజయం కాస్త ఓదార్పు మాత్రమే ఇచ్చేసింది. ఈ ఐపిఎల్ సీజన్లో ప్రారంభ మ్యాచ్లో బెంగళూరు హైదరాబాద్ మీద గెలిచింది. ఇక చివరి మ్యాచ్లో బెంగళూరు మీద హైదరాబాద్ గెలిచి రివేంజ్ తీర్చుకుంది.

ఇటీవల మ్యాచ్ లో హెడ్, విరాట్ కోహ్లీ మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో తనకు బౌలింగ్ వేయాలని విరాట్ హెడ్ కు తీవ్రమైన సైగలు చేశాడు. అయితే అప్పటికే విరాట్ అవుట్ అయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ తో హెడ్ కరచాలనం తీసుకునేందుకు చేయి చాచాడు. దానికి విరాట్ కోహ్లీ నిరాకరించాడు. ఇద్దరి మధ్య వివాదం మరో స్థాయికి వెళ్లిందని.. అందువల్లే విరాట్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.

అయితే ఈ వాదం ఇక్కడితోనే ఆగిపోలేదు. ఏకంగా వ్యక్తిగత అంశాల దాకా వెళ్ళిపోయింది. విరాట్ కోహ్లీ అభిమానులు హెడ్ భార్యను ఆన్లైన్లో వేధింపులకు గురి చేస్తున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు హెడ్ భార్య జెస్సికా తనకు ఎదురైన అనుభవాలను ఆస్ట్రేలియా మీడియాతో పంచుకుంది..

“మూడేళ్ల క్రితం అప్పుడు భారత అభిమానులు నన్ను వేధించారు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఆ సోషల్ మీడియా ఖాతాలలో కామెంట్లు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఉదయం లేవగానే నాకు ఒక రకమైన ఒత్తిడి ఉంటున్నదని” హెడ్ భార్య ఆస్ట్రేలియా మీడియాతో వ్యాఖ్యానించింది. మరోవైపు ఇదే విషయాన్ని హెడ్ కూడా బయటపెట్టాడు.. ఇటీవల టీమిండియా మీద ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత కూడా ఆన్లైన్ వేధింపులు పెరిగిపోయాయని హెడ్ వ్యాఖ్యానించాడు. 2023 వన్డే ప్రపంచ కప్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్.. 2024 బాక్సింగ్ టెస్ట్ లో టీం మీడియా ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత వేధింపులు పెరిగిపోయాయని హెడ్ వాపోయాడు. చివరికి తమ చిన్న కుమార్తెను కూడా వదిలిపెట్టకుండా ఆందోళన కలిగించే కామెంట్లు చేశారని.. బెదిరింపులకు కూడా పాల్పడ్డారని హెడ్ వాపోయాడు..

ఈ విషయాల పట్ల హెడ్ భార్య స్పందించారు.”అన్ని క్రీడలలో మానసిక ఆరోగ్యం ఉంటుంది. శారీరక దృఢత్వం కూడా ఉంటుంది. ఇవి మనం ఎలా ఉండాలో చెబుతాయి. క్రీడలలో భావోద్వేగాలు కచ్చితంగా ఉంటాయి.. కానీ అవి ఒక భాగం మాత్రమే. ఒకరి మీద ఒకరు దయను కలిగి ఉండాలి. జారిని కలిగి ఉండాలి. క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని” జెస్సికా ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

చేప పొలుసులతో.. ఎముకలు, దంతాలు.. ఈ మహిళ చేసిన ప్రయోగం ఎలాంటిదంటే..

Doctor Bincy Fish Scale Experiment
Doctor Bincy Fish Scale Experiment

Doctor Bincy Fish Scale Experiment: మార్కెట్లో మనం చేపల కొంటాం. ఇంటికి తీసుకొచ్చి పొలుసులను శుభ్రం చేస్తాం. ఆ తర్వాత కడిగి పండుకుంటాం. నచ్చినట్టు చింతపులుసు పోసుకొని.. కారం ఉప్పు దండిగా వేసుకొని హాయిగా తింటాం. కానీ ఎప్పుడు కూడా చేప పొలుసుల గురించి మనం ఆలోచించం.

మనలో చాలామందికి పొలుసులంటే వ్యర్థ పదార్థమని ఒక బలమైన నమ్మకం. పైగా వాటితో కూర కూడా వండుకోవడం సాధ్యం కాదు. అందువల్లే వాటిని వృధాగా పడేస్తూ ఉంటాం. అయితే వీటి మీద ఓ మహిళ ప్రయోగాలు చేసింది. దుర్వాసన వచ్చినా సరే వెనకడుగు వేయలేదు. ఆమె ప్రయోగం ఫలించింది. చివరికి వైద్య రంగానికి కీలకమైన పదార్థాలను అందించే దిశగా ఆమె అడుగులు వేసింది. ఇది కాస్త శాస్త్ర సాంకేతిక రంగంలో సరికొత్త మార్పుగా అవతరించింది.

ఆమె పేరు డాక్టర్ బిన్సీ. హైదరాబాద్ నగరంలో ఉన్న సిఐఎఫ్టీ (Central institute of fisheries technology) విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈమెకు మొదటి నుంచి కూడా విభిన్నమైన ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం.. పైగా మనుషులను వేధిస్తున్న ఎముకల రుగ్మత.. దంతాల రుగ్మత ఆమెను నిత్యం ఆలోచనలో పడేసేవి. అందువల్ల చేప పొలుసుల మీద ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది.

పొలుసుల ద్వారా ఎముకలు, దంతాల రుగ్మతులను తగ్గించే నానో ఫైబర్ ఆధారిత గ్రాఫ్ట్ పదార్థాన్ని బిన్సి తయారుచేసింది. చేపలు, ఇతర జలచరాల వ్యర్ధాల నుంచి హైడ్రాక్సి అపటైట్, కొలాజన్ వంటి విలువైన పదార్థాలను కూడా అభివృద్ధి చేసింది. ఈ విధానాలు భారతదేశానికి ఫిషరీస్ విభాగం లో సరికొత్త ఆదాయాన్ని తెచ్చే విధంగా మారతాయని బిన్సీ చెబుతున్నారు.

చేపల పొలుసులను ఎలక్ట్రో స్పిన్నింగ్ ప్రక్రియ ద్వారా వైద్య ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.. ఈ విధానంలో చేప పొలుసులను ముందుగా సన్నటి ఫైబర్లుగా మార్చేస్తుంటారు. ఆ తర్వాత ఒక సీట్ మీదకి తెస్తారు. అనంతరం వాటిని నానో ఫైబర్ గ్రాఫ్ట్ పదార్థాలుగా మార్చుతారు. వీటివల్ల గాయాలు నయమవుతాయి. ముఖ్యంగా వెరీ నా ఎముకలను అతికించడానికి తోడ్పడతాయి.

రొయ్యలు, పీతలు వంటి వాటి మీద పెంకుల్లో కైటిన్ అనే పదార్థం ఉంటుంది. వాటి నుంచి బయోడిగ్రేబుల్ కైతోసాన్ అనే పదార్థాన్ని తయారుచేస్తారు. ఇది యాంటీ మైక్రోబియన్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల బయో మెడికల్.. ఫుడ్ ప్యాకేజింగ్ లో ఉపయోగించవచ్చు. అంతేకాదు మెరైన్ విభాగంలో నుంచి వచ్చే వ్యర్ధాల ద్వారా క్వాలిటీ ఉన్న కైటోసాన్ ను సిఐఎఫ్టీలో ఉత్పత్తి చేస్తున్నారు.. ఇవి మాత్రమే కాకుండా మంచానికే పరిమితమైన వయోధికుల శరీరం మీద అయినా పుండ్లను.. ఇతర గాయాలను మాన్పించడానికి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఫిషరీస్ విభాగంలో విపరీతంగా కోలాజెన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది వైద్య అవసరాలకు విపరీతంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు గాయాలను మాన్పడానికి సహకరిస్తుంది. కొన్ని సందర్భాలలో చేప చర్మాన్ని ప్రాసెస్ చేసి.. సరికొత్త టెక్నాలజీతో గాయాలను మాన్పించే ఉత్పత్తులను తయారు చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు స్క్విడ్ అనే సముద్ర జీ మీద ఇటీవల ప్రయోగాలు చేశారు. దీని ఇంక్ భాగంలో అత్యధికంగా మెలనిన్ ఉంటుంది. దీన్ని ప్రాసెస్ చేసి మనుషుల్లో తలెత్తే అనేక రకాల రుగ్మతలకు మందుగా వాడేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.

రూపాయి పతనం.. విదేశాల్లో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఎంతకు దిగజారిందంటే?

Rupee Fall Impact On Indian Students
Rupee Fall Impact On Indian Students

Rupee Fall Impact On Indian Students: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత రూపాయి విలువ తీవ్రంగా పతనం అవుతోంది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇక రూపాయి పథనం విదేశాల్లో చదువుతున్న లక్షలాది భారతీయ విద్యార్థుల జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం ఒక డాలర్‌కు 95–96 రూపాయలుగా ఉంది. ఇది యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఫీజు, హాస్టల్, జీవన వ్యయాలను భారీగా పెంచేసింది. డిస్కౌంట్‌ ఆహారం కొనడం, దూరాలు నడవడం, టాప్‌–అప్‌ లోన్లు తీసుకోవడం, కొందరు స్టేషన్లలో శుభ్రతా పనులు చేయడం వంటి చర్యలు సాధారణమవుతున్నాయి.

ఆర్థిక ఒత్తిడి..
2025లో సుమారు 12 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. అయినప్పటికీ, రూపాయి బలహీనత వల్ల ఖర్చులు 5–10 శాతం పెరగడంతో చాలా మంది తమ బడ్జెట్‌ను పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూఎస్‌లో 40 వేల డాలర్ల సెమిస్టర్‌ ఫీజు కొన్ని సంవత్సరాల క్రితం 30 లక్షలు రూపాయలు అయితే, ప్రస్తుతం దాదాపు 38 నుంచి 40 లక్షల రూపాయలకు చేరుతోంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఎత్తున ఒత్తిడి తెస్తోంది. చాలా మంది విద్యార్థులు ఎడ్యుకేషన్‌ లోన్లపై ఆధారపడి చదువుతున్నందున, రూపాయి పతనం రుణ మొత్తాన్ని పెంచుతోంది. సెమిస్టర్‌–వారీ ఫీజు చెల్లింపుల సమయానికి అసలు లోన్‌ సరిపోకపోవడంతో టాప్‌–అప్‌ లోన్లు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో వడ్డీ భారం కూడా పెరుగుతోంది. జీవన వ్యయాలు (ఆహారం, రవాణా, పుస్తకాలు) కూడా డాలర్‌/పౌండ్‌ ఆధారితమైనందున, నెలవారీ ఖర్చులు గణనీయంగా ఎగిస్తున్నాయి.

దైనందిన సంఘర్షణ..
విదేశాల్లో ఉన్న యువతలో చాలా మంది తమ ఖర్చులను తగ్గించుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఎక్స్‌పైరీ డేట్‌ దగ్గరలో ఉన్న ఆహారాన్ని డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయడం, యూనివర్సిటీ క్యాంపస్‌ నుంచి దూరంగా ఉంటూ కాలినడకన వెళ్లడం, పార్ట్‌–టైమ్‌ జాబ్స్‌ (కొన్ని సందర్భాల్లో శుభ్రతా పనులు కూడా) చేయడం సాధారణం అవుతోంది. ఇది వారి చదువు, ఆరోగ్యం, మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులను మరింత ఎక్కువగా బాధిస్తోంది. తల్లిదండ్రులు ఇంట్లో ఇతర ఖర్చుల మధ్య ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది.

రూపాయి పతనానికి కారణాలు..
రూపాయి పతనానికి అంతర్జాతీయ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, డాలర్‌ బలం, విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకం, వాణిజ్య లోటు వంటి అనేక కారణాలు ఉన్నాయి. దీని ప్రభావం విదేశీ విద్య మీద మాత్రమే కాక, దేశంలోని దిగుమతులు, ద్రవ్యోల్బణం, సాధారణ ప్రజల జీవన వ్యయం మీద కూడా పడుతోంది.విదేశీ విద్యపై ఆధారపడటం సవాళ్లను ఈ పరిస్థితి ఎత్తి చూపుతోంది. ఒకవైపు ప్రపంచ స్థాయి విద్య కోసం వెళ్తున్న యువత, మరోవైపు ఆర్థిక అస్థిరత వల్ల కలిగే కష్టాలు. ఇది దేశానికి పెద్ద సవాల్‌.

రూపాయి పతనం ఒక ఆర్థిక సూచిక మాత్రమే కాదు. ఇది వేలాది యువతల కలలు, కుటుంబాల త్యాగాలు, దేశ భవిష్యత్తుపై పడుతున్న ఒత్తిడి. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు కేవలం వ్యక్తులు కాదు వారు దేశ మేధా సంపద. వారి కష్టాలను తగ్గించడం, దేశీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, ఆర్థిక స్థిరత్వం కోసం సమగ్ర విధానాలు రూపొందించడం ద్వారా మాత్రమే ఈ సవాలును అవకాశంగా మార్చుకోవచ్చు.

నాని మార్కెట్ ను పెంచుకోకపోవడానికి కారణం అదేనా.. ఇప్పుడైనా సెట్ అవుతుందా..?

Nani Market Growth Analysis
Nani Market Growth Analysis

Nani Market Growth Analysis: న్యాచురల్ స్టార్ నాని హీరోగా చేసిన ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ మూవీగా ఆడుతుంది. కెరియర్ స్టార్టింగ్ లో ఆయన లవ్ స్టోరీస్, కామెడీ ఎంటర్ టైనర్స్ ను ఎక్కువగా చేసినప్పటికి ఆయన మార్కెట్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం ఆయన మార్కెట్ ని పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి మాస్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. ఇంతకుముందు దసర సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం మరోసారి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తన మార్కెట్ ను పెంచుకోవడానికి అంతలా ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు అంటే మార్కెట్ ఒకసారి పెరిగితే టైర్ వన్ హీరోగా మారిపోవచ్చు అనే ప్రయత్నంలో ఉన్నాడు. నిజానికి నాని సినిమాలు ఎంత పెద్ద విజయాలను సాధించిన కూడా కలెక్షన్స్ ను సాధించే విషయంలో మాత్రం చాలా వరకు వెనుకబడిపోతున్నాడు.

ఎందుకని ఆయన భారీ కలెక్షన్స్ ని సాధించలేకపోతున్నాడు అంటే అతని సినిమాలను చాలామంది థియేటర్లో చూడడానికి పెద్దగా ఇష్టపడడం లేదు… ఒకప్పుడు నాని అంటే ఫ్యామిలీ అభిమానులు సైతం థియేటర్ కి వచ్చి మూవీ చూసేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఎందుకో వాళ్ళు కూడా అతని సినిమాలను చూడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

ఇకమీదటైనా ఆయన చేయబోయే సినిమాలతో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్ కి రప్పించగలిగితే మంచిదని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ప్యారడైజ్ సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతుంది.

కాబట్టి ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ చాలావరకు వచ్చే అవకాశాలైతే లేవు. కాబట్టి యూత్ ను టార్గెట్ చేసుకొని చేస్తున్న ఈ సినిమా యూత్ లో ఎంతటి క్రేజ్ ను క్రియేట్ చేస్తుంది. తద్వారా యూత్ ఆడియన్స్ ఈ సినిమాను చూసి భారీ విజయాన్ని కట్టబెడతారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది..

నేను ఆయనకు పెద్ద ఫ్యాన్‌.. మోదీని ఆకాశానికి ఎత్తిన ట్రంప్‌.. ఆయిల్‌ కొంటే అంతే మరి!

Trump Praises Modi
Trump Praises Modi

Trump Praises Modi: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పుడు ఎలా ఉంటారో.. ఎలా మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. తనకు అనుకూలంగా ఉంటే పొగడ్తలతో ముంచెత్తుతారు. లేదంటే యుద్ధానికి సైతం వెనుకాడరు. ఇరాన్, వెనెజువెలా విషయంలో అదే జరిగింది. ఒకప్పుడు మోదీని, భారత్‌ను తీవ్రంగా విమర్శించారు. టారిఫ్‌లు విధించారు. అయితే తాజాగా ట్రంప్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తేశారు. నేను పీఎం మోదీకి పెద్ద ఫ్యాన్‌ని అని స్పష్టంగా చెప్పడం ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు వ్యక్తిగత స్థాయిలోనూ బలంగా ఉన్నాయని తెలియజేశారు.

250వ స్వాతంత్య్ర వార్షికోత్సవం..
ఢిల్లీలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవ కార్యక్రమంలో మార్కో రూబియో, యూఎస్‌ రాయబారి సెర్గియోలు పాల్గొన్న సందర్భంగా ట్రంప్‌ ఫోన్‌ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో భారత్‌–అమెరికా మైత్రి యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఆయన హైలైట్‌ చేశారు. ‘మనం ఇండియాతో చాలా క్లోజ్‌గా ఉన్నాం. వాళ్లు నాపై 100 శాతం ఆధారపడొచ్చు. భారత్‌కు ఏమైనా కావాలంటే అందుతుంది’ అని ట్రంప్‌ అన్న మాటలు రాజకీయంగా ముఖ్యమైనవి. ఇది కేవలం సాంప్రదాయిక మాటలు కాకుండా, రెండు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఇండో–పసిఫిక్‌ వ్యూహం వంటి రంగాల్లో లోతైన సహకారానికి సంకేతం. ట్రంప్‌ తన మొదటి అధ్యక్షత్వ కాలంలోనే మోదీతో వ్యక్తిగత స్నేహాన్ని పెంపొందించుకున్నారు.

గతంలో హౌడీ మోదీ.. నమస్తే ట్రంప్‌..
ట్రంప్‌ మొదటిసారి అధ్యక్షుడు అయిన సమయంలో నిర్వహించిన ‘‘హౌడీ మోదీ’’, ‘‘నమస్తే ట్రంప్‌’’ కార్యక్రమాలు ఆ స్నేహానికి ప్రతీకలు. ఇప్పుడు మళ్లీ అదే సందేశానిన వ్యక్తం చేయడం రాబోయే కాలంలో భారత్‌కు అనుకూలమైన వాతావరణం ఏర్పడవచ్చని సూచిస్తోంది. వ్యూహాత్మక ప్రాముఖ్యతచైనా పెరుగుతున్న ప్రభావం, ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో సమతుల్యం కావాల్సిన అవసరం నేపథ్యంలో భారత్‌–అమెరికా సంబంధాలు రక్షణ భాగస్వామ్యం నుంచి ఆర్థిక–సాంకేతిక భాగస్వామ్యం వరకు విస్తరిస్తున్నాయి.

అమెరికా ఫస్ట్‌ విధానంతో..
ట్రంప్‌ పాలనలో ‘అమెరికా ఫస్ట్‌’ విధానం ఉన్నప్పటికీ, భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా చూడడం ఆయన విధానంలో స్పష్టంగా కనిపించింది. ఈ సంభాషణలో ‘‘సాయం కోసం ఎవరికి ఫోన్‌ చేయాలో వారికి తెలుసు’’ అన్న మాటలు రెండు దేశాల మధ్య నమ్మకం, సులభమైన సంప్రదింపులను సూచిస్తున్నాయి. ఇది రక్షణ ఒప్పందాలు, సాంకేతిక బదలాయింపు, వాణిజ్య మాటలు వేగంగా ముందుకు సాగడానికి దోహదపడుతుంది. అయితే, వ్యక్తిగత స్నేహం ఒక్కటే సరిపోదు. భారత్‌ తన జాతీయ ఆసక్తులు – రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు, ఇరాన్‌తో శక్తి సహకారం, స్వయం సమృద్ధి విధానాలను కాపాడుకుంటూ అమెరికాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. వాణిజ్య ఉద్రిక్తతలు, హెచ్‌–1బి వీసా విధానాలు వంటి అంశాలు భారత్‌కు సవాల్‌గా మారవచ్చు.

ట్రంప్‌ ‘‘మోదీకి పెద్ద ఫ్యాన్‌’’ అని చెప్పడం రాజకీయ సౌజన్యం మాత్రమే కాదు. ఇది భారత్‌ను అమెరికా యొక్క ముఖ్యమైన భాగస్వామిగా గుర్తించడానికి సంకేతం. సరైన వ్యూహాలతో భారత్‌ ఈ సానుకూలతను జాతీయ హితం కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే, రాబోయే సంవత్సరాల్లో భారత్‌–అమెరికా సంబంధాలు కొత్త ఎత్తులు అందుకోవడం ఖాయం.

జగన్ అడ్డాలో వైసీపీ నేతల సెలైన్స్ వెనుక కథేంటి..

Andhra Pradesh Politics
Andhra Pradesh Politics

YSRCP Leaders Silence: గత కొద్ది రోజులుగా ఒక పరిణామం చోటు చేసుకుంది రాష్ట్రంలో. తన తాతను చంపిన వారిని విడిచిపెట్టిన ఘనత తనది అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అది మొదలు వైయస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ల పై సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గురు నరరూప రాక్షసులు అంటూ చాలామంది నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా పులివెందులకు చెందిన టిడిపి నాయకుడు పేర్ల పార్థసారధి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు మంత్రి పయ్యావుల కేశవ్ సైతం రాజారెడ్డి తో పాటు రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లపై తీవ్ర ఆరోపణలు చేశారు. వారిది రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించారు.ఇంత జరుగుతున్నా కడప జిల్లా వైసీపీ నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం విశేషం.

జగన్ ప్రెస్ మీట్ లో..
ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో తెలుగుదేశం ఆరోపణలను ఖండించారు. ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ ప్రశ్నించారు. గొడ్డలితోపాటు గన్ కల్చర్ టిడిపి హయాంలోనేనని ఆరోపించారు. అయితే అప్పటి నుంచి వైయస్ కుటుంబం చుట్టూ సోషల్ మీడియాలో విస్తృత దాడి జరుగుతోంది. ఒక గ్రామస్థాయి నాయకుడిగా ఉన్న పేర్ల పార్థసారధి రెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో పార్థసారథి చేసిన కామెంట్స్ విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. వైయస్ కుటుంబంలోని ముగ్గురు నేతలపై తీవ్ర ఆరోపణలు టిడిపి నుంచి వస్తున్నాయి. కానీ కడప జిల్లా వైసీపీ నేతలు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు . దీంతో ప్రజల్లోకి ఇది తప్పుడు సంకేతం గా వెళ్తోంది. తమ అధినేత కుటుంబం పై ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే కనీసం స్పందించాలన్న రీతిలో కూడా వైసీపీ నేతలు ఇవ్వకపోవడం ఆశ్చర్యం వేస్తోంది.

సొంత వారు ఉన్నా..
కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. కడప జిల్లా అధ్యక్షుడిగా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పుడు ఇంతలా టిడిపి టార్గెట్ చేసుకుంటే అవినాష్ రెడ్డి కానీ.. రవీంద్రనాథ్ రెడ్డి కానీ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయనకు ఎదురుగా నిలిచారు బీటెక్ రవి. టిడిపి శ్రేణులు కూడా ధైర్యంగా నిలబడ్డాయి. అటువంటి ధైర్యం ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇలాంటి సమయంలో కూడా వైసీపీ నేతలు, అందులో దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు నోరు తెరవకపోవడం చూస్తుంటే.. ఇక రాజకీయం చేయడం ఎందుకని కడప జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.

ఉదయం లేవగానే... ఇంత ఫాస్ట్ ఏంటి పవన్..

Pawan Kalyan Godavari Pushkaralu Visit
Pawan Kalyan Godavari Pushkaralu Visit

Pawan Kalyan Godavari Pushkaralu Visit: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా కమిట్మెంట్ తో చేస్తారు. మనసుకు నచ్చిన పని అయితే ఇట్టే పూర్తి చేస్తారు. ఆయన గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించాలని నిర్ణయించారు. అలా అనుకున్నదే తడువు రంగంలోకి దిగిపోయారు. సోమవారం తన పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రికి రాజమండ్రి చేరుకున్నారు. సోమవారం ఉదయం 7:00 దాటకముందే రంగంలోకి దిగారు. రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్ల పరిశీలన కోసం ఆయన సోమవారం నగరంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రానికి ఆయన రాజమండ్రి నగరానికి చేరుకోవడం విశేషం.

ఉదయం 7 గంటలకే..
సాధారణంగా మంత్రుల పర్యటనలు ఉదయం తొమ్మిది గంటల తరువాత ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఉదయం ఏడు గంటలకు ముందే రంగంలోకి దిగిపోయారు. రాజమండ్రిలో రాత్రి బస చేసిన ఆయన.. ఉదయం నుంచి పర్యటనలను ప్రారంభించారు. రాజమండ్రి పరిధిలోని గోదావరి పుష్కర ఘాట్ల పనుల పరిశీలన మొదలుపెట్టారు. ఈ పనుల కారణంగా గోదావరి జలాలు కాలుష్యం బారిన పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తగా కూడా పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. నదిలో పేరుకుపోతున్న కాలుష్య కారకాలను పరిశీలించారు. వాటిని తొలగించే చర్యలపై అధికారులతో చర్చించారు. గోదావరి తీరాన్ని కాలుష్య రహితంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు, వాటి అమలు తీరుపై నా పవన్ దృష్టిపెట్టారు. పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో కాలుష్యరహితంగా ఆయా ప్రాంతాలను తీర్చిదిద్దాలన్న దిశగా పవన్ సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మమేకమై పనిచేస్తున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో రాజమండ్రిలో ప్రస్తుతం కోలాహలం నెలకొంది.

ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు..
అయితే పవన్ కళ్యాణ్ కు ఒక అరుదైన అవకాశం దక్కింది గోదావరి పుష్కరాల రూపంలో. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లాకు మంత్రిగా ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కూడా కాకినాడ జిల్లాలోనే ఉంది. సహజంగానే గోదావరి జిల్లాలు అంటే పవన్ కళ్యాణ్ మానియా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పర్యవేక్షణకు గాను పవన్ కళ్యాణ్ రావడంతో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. పెద్ద ఎత్తున యువత గోదావరి నది పరివాహక ప్రాంతాలను చుట్టుముట్టేశారు. తమ అభిమాన నేతను సెల్ఫోన్లతో వీడియోలు, ఫోటోలు గా తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజమండ్రిలో పవన్ పర్యటన అనేది వైరల్ గా మారుతుంది.

మద్యం కుంభకోణం కేసులో టిడిపి ఎంపీ భార్యకు నోటీసులు!

AP Liquor Scam Case
AP Liquor Scam Case

AP Liquor Scam Case: ఏపీలో కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ లో అధికార టిడిపి ఎంపీ భార్యకు ఈడి నోటీసులు జారీ చేసింది. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని భార్య జానకి లక్ష్మి కి ఈడీ సమన్లు జారీ అయ్యాయి. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఫ్రైడ్ ఇన్ఫ్రా కాన్ LLP కంపెనీతో మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డికి ఉన్న లింకులపై ఈడి ఆర్ఆర్బీస్తోంది. ఈ కంపెనీకి మద్యం కుంభకోణంలో లాభాల్లో షేర్ ఉన్నట్లు ఈడి అనుమానిస్తోంది. గతంలో కూడా జానకి లక్ష్మి కి ఈడి సమన్లు జారీ అయ్యాయి. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది ఈడీ. ఓ అధికార పార్టీ ఎంపీకి ఈ తరహా నోటీసులు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

మాజీ ఎంపీ సంచలన ఆరోపణలు..
తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారు కేసినేని నాని. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తమ్ముడు కేసినేని చిన్ని పై ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. అయితే కేశినేని చిన్ని పై మాత్రం నిత్యం సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు నాని. ఈ క్రమంలోనే మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి తో.. ఎంపీ కేసినేని చిన్నికి సంబంధాలు ఉన్నాయి అంటూ ఆయన సోదరుడు నాని సంచలన ఆరోపణలు చేశారు. చిన్ని దంపతులు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి వ్యాపార సంస్థలు భాగస్వామ్యులని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు సైతం ఫిర్యాదు చేశారు. చిన్ని దంపతులు రాజ్ కసిరెడ్డి కి చెందిన ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLP లో భాగస్తులు అని అప్పట్లో ఆరోపించారు. కేశినేని చిన్ని తన కంపెనీల ద్వారా భారీగా నిధులను అక్రమంగా విదేశాలకు తరలించి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు గుర్తించారు.

ఇదివరకే ఒకసారి నోటీసులు..
అయితే తనపై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చు అంటూ కేశినేని చిన్ని సవాల్ చేశారు. తన వల్ల పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదని.. కేసినేని నాని ఆరోపిస్తున్నట్టు తాను రాజ్ కసిరెడ్డి సంస్థలు వ్యాపార భాగస్వామి కాదని తేల్చి చెప్పారు. ఈడి దర్యాప్తుతో పాటు కేసు విచారణకు సహకరిస్తానని కూడా చెప్పారు. అయితే గతంలోనే కేసినేని చిన్ని భార్య జానకి లక్ష్మి కి నోటీసులు అందాయి. ఇప్పుడు మరోసారి విచారణకు పిలవడంతో సంచలనంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి మద్యం కుంభకోణం కేసు పై పడింది. ఈనెల 27న జానకి లక్ష్మి ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.