Homeఎంటర్టైన్మెంట్Jr NTR Movie Inspiration: ఎన్టీఆర్ ఆ హీరోల సినిమాలను చూసి అలాంటి మూవీస్ చేశాడా..?

Jr NTR Movie Inspiration: ఎన్టీఆర్ ఆ హీరోల సినిమాలను చూసి అలాంటి మూవీస్ చేశాడా..?

Jr NTR Movie Inspiration: నందమూరి మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్…ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. పాన్ ఇండియాలో తన తోటి హీరోలందరు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఆయన మాత్రం కొంతవరకు వెనుకబడిపోతున్నాడనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా […]

Jr NTR Movie Inspiration: నందమూరి మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్…ఆయన చేసిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. పాన్ ఇండియాలో తన తోటి హీరోలందరు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఆయన మాత్రం కొంతవరకు వెనుకబడిపోతున్నాడనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా హీరో ఒక సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే తను కూడా సేమ్ అలాంటి జానర్ లోనే సినిమా చేస్తూ వచ్చాడు. పోకిరి సినిమా సూపర్ సక్సెస్ అయిందని కంత్రి చేశాడు. మగధీర సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని శక్తి చేశాడు. ఇక మహేష్ బాబు చేసిన దూకుడు సినిమా భారీ విజయం సాధించడంతో బాద్షా అంటూ సేమ్ అదే పాటర్న్ లో కామెడీగా ఉండే సినిమా చేశాడు.

పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో మహేష్ బాబు బిజినెస్ మెన్ సినిమా తో సక్సెస్ కొడితే ఎన్టీఆర్ వెంటనే పూరి తో టెంపర్ అంటూ ఒక సినిమాని చేశాడు… ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఇతర హీరోలతో సినిమాలను చేసి సక్సెస్ లను సాధిస్తే అలాంటి సినిమాలతోనే తను కూడా భారీ విజయాన్ని సాధించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. నిజానికి ఒక క్యారెక్టర్ కొంతమంది హీరోలకే సెట్ అవ్వచ్చు.

మరి కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఒక హీరోకి వచ్చిన సక్సెస్ మరొక హీరోకి రాకపోవచ్చు. ఒక హీరో ఆ కథతో సినిమా చేశాడని మనం చేసే కంటే మనకి ఏది సెట్ అవుతుందో అది తెలుసుకొని అలాంటి సినిమాలు చేస్తే బాగుంటుందని మరి కొంత మంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు..

ఇక ఇప్పుడు కూడా ప్రభాస్ సలార్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. అందుకని ప్రశాంత్ నీల్ తోనే డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తే పర్లేదు కానీ ఫ్లాప్ ని మూట గట్టుకుంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది..

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper