Homeఅంతర్జాతీయంRupee Fall Impact On Indian Students: రూపాయి పతనం.. విదేశాల్లో భారతీయ విద్యార్థుల పరిస్థితి...

Rupee Fall Impact On Indian Students: రూపాయి పతనం.. విదేశాల్లో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఎంతకు దిగజారిందంటే?

Rupee Fall Impact On Indian Students: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత రూపాయి విలువ తీవ్రంగా పతనం అవుతోంది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇక రూపాయి పథనం విదేశాల్లో చదువుతున్న లక్షలాది భారతీయ విద్యార్థుల జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం ఒక డాలర్‌కు 95–96 రూపాయలుగా ఉంది. ఇది యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఫీజు, హాస్టల్, జీవన వ్యయాలను భారీగా పెంచేసింది. డిస్కౌంట్‌ ఆహారం కొనడం, దూరాలు […]

Rupee Fall Impact On Indian Students: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత రూపాయి విలువ తీవ్రంగా పతనం అవుతోంది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇక రూపాయి పథనం విదేశాల్లో చదువుతున్న లక్షలాది భారతీయ విద్యార్థుల జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం ఒక డాలర్‌కు 95–96 రూపాయలుగా ఉంది. ఇది యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఫీజు, హాస్టల్, జీవన వ్యయాలను భారీగా పెంచేసింది. డిస్కౌంట్‌ ఆహారం కొనడం, దూరాలు నడవడం, టాప్‌–అప్‌ లోన్లు తీసుకోవడం, కొందరు స్టేషన్లలో శుభ్రతా పనులు చేయడం వంటి చర్యలు సాధారణమవుతున్నాయి.

ఆర్థిక ఒత్తిడి..
2025లో సుమారు 12 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. అయినప్పటికీ, రూపాయి బలహీనత వల్ల ఖర్చులు 5–10 శాతం పెరగడంతో చాలా మంది తమ బడ్జెట్‌ను పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూఎస్‌లో 40 వేల డాలర్ల సెమిస్టర్‌ ఫీజు కొన్ని సంవత్సరాల క్రితం 30 లక్షలు రూపాయలు అయితే, ప్రస్తుతం దాదాపు 38 నుంచి 40 లక్షల రూపాయలకు చేరుతోంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఎత్తున ఒత్తిడి తెస్తోంది. చాలా మంది విద్యార్థులు ఎడ్యుకేషన్‌ లోన్లపై ఆధారపడి చదువుతున్నందున, రూపాయి పతనం రుణ మొత్తాన్ని పెంచుతోంది. సెమిస్టర్‌–వారీ ఫీజు చెల్లింపుల సమయానికి అసలు లోన్‌ సరిపోకపోవడంతో టాప్‌–అప్‌ లోన్లు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో వడ్డీ భారం కూడా పెరుగుతోంది. జీవన వ్యయాలు (ఆహారం, రవాణా, పుస్తకాలు) కూడా డాలర్‌/పౌండ్‌ ఆధారితమైనందున, నెలవారీ ఖర్చులు గణనీయంగా ఎగిస్తున్నాయి.

దైనందిన సంఘర్షణ..
విదేశాల్లో ఉన్న యువతలో చాలా మంది తమ ఖర్చులను తగ్గించుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఎక్స్‌పైరీ డేట్‌ దగ్గరలో ఉన్న ఆహారాన్ని డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయడం, యూనివర్సిటీ క్యాంపస్‌ నుంచి దూరంగా ఉంటూ కాలినడకన వెళ్లడం, పార్ట్‌–టైమ్‌ జాబ్స్‌ (కొన్ని సందర్భాల్లో శుభ్రతా పనులు కూడా) చేయడం సాధారణం అవుతోంది. ఇది వారి చదువు, ఆరోగ్యం, మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులను మరింత ఎక్కువగా బాధిస్తోంది. తల్లిదండ్రులు ఇంట్లో ఇతర ఖర్చుల మధ్య ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది.

రూపాయి పతనానికి కారణాలు..
రూపాయి పతనానికి అంతర్జాతీయ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, డాలర్‌ బలం, విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకం, వాణిజ్య లోటు వంటి అనేక కారణాలు ఉన్నాయి. దీని ప్రభావం విదేశీ విద్య మీద మాత్రమే కాక, దేశంలోని దిగుమతులు, ద్రవ్యోల్బణం, సాధారణ ప్రజల జీవన వ్యయం మీద కూడా పడుతోంది.విదేశీ విద్యపై ఆధారపడటం సవాళ్లను ఈ పరిస్థితి ఎత్తి చూపుతోంది. ఒకవైపు ప్రపంచ స్థాయి విద్య కోసం వెళ్తున్న యువత, మరోవైపు ఆర్థిక అస్థిరత వల్ల కలిగే కష్టాలు. ఇది దేశానికి పెద్ద సవాల్‌.

రూపాయి పతనం ఒక ఆర్థిక సూచిక మాత్రమే కాదు. ఇది వేలాది యువతల కలలు, కుటుంబాల త్యాగాలు, దేశ భవిష్యత్తుపై పడుతున్న ఒత్తిడి. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు కేవలం వ్యక్తులు కాదు వారు దేశ మేధా సంపద. వారి కష్టాలను తగ్గించడం, దేశీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, ఆర్థిక స్థిరత్వం కోసం సమగ్ర విధానాలు రూపొందించడం ద్వారా మాత్రమే ఈ సవాలును అవకాశంగా మార్చుకోవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper