Motorola Phones Huge Discounts: మోటోరోలా కంపెనీకి సంబంధించిన డివైజ్ లు భారతీయ వినియోగదారులను విపరీతంగా ఆకట్టకుంటన్నాయి. ఈ కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ అయిన moto g37 POWER, moto g37లతో పాట moto buds 2 పరికరాలను భారతదేశంలో విక్రయిస్తున్నారు. ఈ లేటెస్ట్ పరికరాలు ఇప్పుడు Flipkart, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే వినియోగదారులను ఆకర్షించేందుకు మోటోరోలా వీటిపై ప్రత్యేకమైన ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితె..
Motorola కంపెనీకి చెందిన Moto G37 (4GB+64GB వేరియంట్) ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 13,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే Moto G37 POWER వేరియంట్ రూ.15,999కి నుంచి విక్రయిస్తున్నారు. దీని హై-ఎండ్ వేరియంట్ (8GB+128GB) రూ.18,999కి అందుబాటులో ఉంది. వీటితో పాటు కొత్తగా పరిచయం చేసిన Moto Buds 2 ఇయర్‌బడ్స్ రూ. 2,999 ధరతో మార్కెట్లోకి వచ్చాయి.
కొనుగోలుదారుల కోసం మోటోరోలా అద్భుతమైన లాంచ్ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా ICICI,IDFC, SBI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి వీటిని కొనుగోలు చేస్తే రూ. 5,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా, IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 5,500 వరకు భారీ తగ్గింపు లభిస్తుంది. మొబిక్విక్ UPI ద్వారా చెల్లింపులు చేసేవారికి రూ. 1,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. మొదటిసారి మొబిక్విక్ ఉపయోగించే వారికి అదనంగా రూ. 300 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
వీటితో పాటు, రిలయన్స్ జియో (Reliance Jio) వినియోగదారుల కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లను కొనుగోలు చేసే అర్హులైన వినియోగదారులకు 18 నెలల పాటు 5000GB క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro)కు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ మరియు ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లతో వస్తున్న ఈ కొత్త మోటోరోలా పరికరాలు బడ్జెట్ సెగ్మెంట్‌లో వినియోగదారులకు మంచి ఎంపికగా నిలుస్తాయని చెప్పవచ్చు.
