Home Blog Page 232

గోదావరి పుష్కరాల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్.. వైరల్ అవుతున్న వీడియో..

Pawan Kalyan Godavari Pushkaralu Plan
Pawan Kalyan Godavari Pushkaralu Plan

Pawan Kalyan Godavari Pushkaralu Plan: ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మన గోదావరి పుష్కరాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాజమండ్రి లో జరిగే ఈ పుష్కరాలకు దేశం నలుమూలల నుండి మాత్రమే కాదు, ఇతర దేశాల నుండి కూడా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆర్చరించి వెళ్తుంటారు. ఇక్కడ స్నానం ఆచరిస్తే , ఎన్నో ఏళ్ళ నుండి మూటగట్టుకున్న పాపపు కర్మలన్నీ తొలగిపోతాయని, బలమైన విశ్వాసం భక్తుల్లో ఉంటుంది. ప్రతీ 12 ఏళ్లకు అత్యంత వైభోగంగా జరిగే ఈ పుష్కరాలు వచ్చే ఏడాది గ్రాండ్ గా జరగబోతున్నాయి. కూటమి ప్రభుత్వానికి ఈ పుష్కరాలను సమర్థవతంగా నిర్వహించడం ఇప్పుడు పెద్ద సవాల్. అయితే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏడాది లో జరగబోయే పుష్కరాలకు , ఇప్పటి నుండే పటిష్టమైన ఏర్పాట్లు చేయడానికి సిద్దమయ్యాడు, అందుకోసం నేడు ఆయన రాజమండ్రి లో పర్యటించడం, అక్కడి పరిస్థితులను సమీక్షించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా గోదావరి నదులు కలుషితం అవ్వడం పై పవన్ కళ్యాణ్ చాలా కఠినమైన జాగ్రత్తలు రాబోయే రోజుల్లో తీసుకోబోతున్నాడు. అందుకోసం రాబోయే రోజుల్లో కాలుష్య నివారణ శుద్ధి ప్లాంట్లను నిర్వహించాలని అధికారులను ఆదేశించాడు పవన్ కళ్యాణ్. మూడు నెలలకు ఒకసారి కాలుష్య నియంత్రణ మండలి ఆడిట్ ని నిర్వహిస్తుందని, పుష్కరాల నిర్వహణలో పారిశ్రామికవేత్తలు సామజిక బాధ్యత తో వ్యవహరించి చొరవ తీసుకోవాలని, వాళ్ళను మా ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు కాబట్టి , వాళ్ళు సంపూర్ణంగా మాకు సహకరించాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా, అధికారులతో నీటిని టెస్ట్ కూడా చేయించాడు. గోదావరి పుష్కరాలు కేవలం ఒక్క రాజమండ్రి కి మాత్రమే పరిమితం కాకూడదని, ప్రతీ గోదావరి గట్టు ని ఉపయోగించుకోవాలని , అందుకు తగ్గ ప్రణాళికని రూపొందించి, ఒక బ్లూ ప్రింట్ ని కేంద్రానికి పంపిస్తే నిధులు మంజూరు చేస్తారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.

పుష్కరాలు విజయవంతం అవ్వడానికి ప్రతీ ఒక్కరు కలిసి రావాలని , వచ్చే ఏడాది జరగబోయే ఈ పుష్కరాలు దేశ ప్రజలు జీవితాంతం గుర్తించుకునేలా నిర్వహించాలని, కేవలం ప్రణాళికలు పేపర్ కి మాత్రమే పరిమితం కాకూడదని , ప్రతీ నెల స్వయంగా నేనే నెలకు మూడు సార్లు విచ్చేసి ఏర్పాట్లను పరిశీలిస్తానని , 6 నెలల్లో నా కళ్ళ ముందు మార్పులు కనపడాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ రాజముండ్రి పర్యటనకు సంబంధించిన ఫోటోలు , వీడియోలే కనిపిస్తున్నాయి.

రైతు బతుకు ఎంత దుర్భరం.. 'అనంత'మైన కన్నీటి సుడులు ఇవీ

Pomegranate Crop Diseases
Pomegranate Crop Diseases

Pomegranate Crop Diseases: రక్తహీనతను నివారించడానికి వైద్యులు మందుల కంటే ఎక్కువగా దానిమ్మకాయలు తినాలని చెబుతుంటారు. ఎందుకంటే అందులో ఐరన్ నుంచి మొదలు పెడితే మెగ్నీషియం వరకు లోహాలు ఉంటాయి. వీటివల్ల రక్తహీనత అనేది తగ్గిపోతూ ఉంటుందని వైద్యులు అంటున్నారు. అంతటి గొప్ప పంటను పండిస్తున్న రైతులకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి.. పంటను సాగు చేసి.. తీరా ఉత్పత్తి వస్తుందనుకుంటుండగా అన్నదాతలను తెగుళ్లు నట్టేట ముంచుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో దానిమ్మ పంటలు ఏపీలోని అనంతపురం పెట్టింది పేరు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక ప్రాంతాలలో దానిమ్మ పంట విస్తారంగా పండుతూ ఉంటుంది. దానిమ్మ సాగు ద్వారా రైతులకు భారీగానే లాభాలను సంపాదిస్తూ ఉంటారు. అయితే ఇది ఒకప్పటి మాట. ఎందుకంటే దానిమ్మ ఇప్పుడు రైతులకు పంటి కింద రాయి లాగా మారింది. దానిమ్మ తీరా కోతకు వచ్చే క్రమంలో తెగుళ్లు దాడి చేయడంతో రైతులు నిండా మునుగుతున్నారు. ఏం చేయాలో తెలియక కోసిన దానిమ్మకాయలను రోడ్డుమీద పడేస్తున్నారు.

అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం లో దాదాపు 2442 ఎకరాలలో దానిమ్మ సాగవుతోంది. ఎకరానికి రైతులు లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. తీరా కాయలు కాచి.. కోతకు వచ్చే క్రమంలో బ్లైట్ తెగులు ఆశించడంతో దానిమ్మ పంట నాశనం అవుతుంది. కాయలు నల్లగా మారి పగిలిపోతున్నాయి. ఎన్ని రకాలుగా మందులు స్ప్రే చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. దీంతో రైతులు ఆ కాయలను తెంపి బయటపడేస్తున్నారు. చివరికి కోత కూలి కూడా రాకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్రస్థాయిలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.

ఈసారి దానిమ్మ దిగుబడి బ్రహ్మాండంగా ఉంది. కిలో వచ్చేసి దాదాపు 200 దాకా పలుకుతోంది. అయితే లాభాలు వస్తాయని రైతులు ఆశించినప్పటికీ ఊహించని విధంగా తెగులు సోకి రైతులకు తీవ్ర నష్టాలు మిగులుతున్నాయి.

దానిమ్మలో బ్లైట్ తెగులు అత్యంత ప్రమాదకరమైనది. దీనిని నూనె మచ్చల తెగులు అని కూడా పిలుస్తుంటారు. బ్యాక్టీరియా వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఇది సోకిన తర్వాత ఆకులు.. కాండం.. పండ్లు మొత్తం నూనెతో తడిపినట్టు ఉంటాయి. సకాలంలో గుర్తించకపోతే తోట మొత్తం నాశనం అవుతుంది. ఆకులపై ముందుగా చిన్న పసుపు మచ్చలు ఏర్పడతాయి. అవిక్రమంగా నల్లగా మారి.. ఆకులు రాలిపోతాయి. కొమ్మలు కూడా నల్లబడి ఎండిపోతుంటాయి.. పండ్ల మీద నల్లటి మచ్చలు ఏర్పడి అవి గాయాలుగా మారుతుంటాయి. చివరికి పండ్లు మొత్తం పగిలిపోయి.. కుళ్ళిపోతుంటాయి. తోటల్లో ఎప్పటికప్పుడు శుభ్రతను పాటించాలి.

తమిళ్ విక్రమ్ చేయాల్సిన సినిమాను చేసి సక్సెస్ కొట్టిన సూర్య..

Suriya And Vikram Movie Updates
Suriya And Vikram Movie Updates

Suriya And Vikram Movie Updates: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిద్య భరితమైన నటుడిగా పేరును సంపాదించుకున్న వాళ్ళలో విక్రమ్ మొదటి స్థానంలో ఉంటాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే అపరిచితుడు లాంటి డిఫరెంట్ సినిమాలో ప్రయోగాత్మకమైన క్యారెక్టర్ ను పోషించి తనకు నటనలో ఎవరు పోటీకి రారు అనేంతలా పేరు సంపాదించుకున్నాడు. ఇక అలాంటి విక్రమ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ వరుస డిజాస్టర్లుగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో మాత్రం చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుండడం విశేషం…ఇక పా రంజిత్ దర్శకత్వం లో చేసిన ‘తంగలాన్’ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని అనుకున్నారు. కానీ కానీ ఈ సినిమా సక్సెస్ అయినప్పటికి భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టలేకపోయింది…

ఇక విక్రమ్ తన కెరియర్ స్టార్టింగ్ లోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరియర్ ని మొదలుపెట్టాడు. అయితే విక్రమ్ చేయాల్సిన ఒక సూపర్ హిట్ సినిమాను మరొక స్టార్ హీరో అయిన సూర్య చేసి సక్సెస్ ను సాధించాడనే విషయంలో మనలో చాలా మందికి తెలియదు… డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా వచ్చిన ’24’ సినిమాని మొదట విక్రమ్ తో చేయాలనుకున్నారట…

కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సూర్య దగ్గరికి వెళ్లడంతో విక్రమ్ కే కుమార్ సూర్యని హీరోగా పెట్టీ ఈ సినిమాని చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా డిఫరెంట్ ప్రయత్నంగా నిలవడమే కాకుండా సూర్య కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.

ఇక విక్రమ్ కనుక ఆ క్యారెక్టర్ లో నటించి ఉంటే అతను కూడా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ సినిమాలను ముందుకు తీసుకెళ్లేవాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నాడు… విక్రమ్ తో పోలిస్తే సూర్యకి కొంతవరకు మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సూర్యని తీసుకున్నారని కొంతమంది అంటుంటే విక్రమ్ కథ విషయంలో పూర్తి కాన్ఫిడెంట్ గా లేకపోవడం వల్లే విక్రమ్ నుంచి ఆ స్టోరీ సూర్య వరకు వచ్చిందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా 24 సినిమా అనేది ఒక డిఫరెంట్ ప్రయత్నంగా మిగిలిపోయింది…

'దృశ్యం 3' 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఫ్లాప్ టాక్ తో ఈ రేంజ్ గ్రాస్ అసలు ఊహించలేదు..

Drishyam 3 OTT Release
Drishyam 3 OTT Release

Drishyam 3 Worldwide Collections: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఒక సెన్సేషన్ ‘దృశ్యం’. మలయాళం లో మోహన్ లాల్ హీరో గా తెరకెక్కిన ఈ సినిమా , అందుకు సంబంధించిన సీక్వెల్ ని ప్రతీ భాషలోనూ రీమేక్ చేశారు. మొదటి రెండు భాగాలకు సెన్సేషనల్ రెస్పాన్స్ రావడంతో , మూడవ భాగాన్ని కూడా రీసెంట్ గానే తెరకెక్కించి విడుదల చేశారు. కానీ ‘దృశ్యం 3’ కి ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. మొదటి రెండు భాగాల్లో ఉన్న ట్విస్టులు , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ‘దృశ్యం 3’ లో బాగా మిస్ అయ్యాయి అని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. ఆ కారణం చేత ఈ చిత్రానికి అనుకున్నంత స్థాయి ఓపెనింగ్ రాలేదు , కానీ వీకెండ్ మాత్రం చాలా డీసెంట్ రేంజ్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఊహించిన దానికంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రాన్ని విడుదలకు ముందు 3 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేశారు మేకర్స్. మొదటి నాలుగు రోజులకు కలిపి 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 5 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక కేవలం కోటి రూపాయిల షేర్ వసూళ్లు వస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది. అది పెద్ద కష్టమేమి కాదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే , కేరళ నుండి 39 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తమిళనాడు నుండి 5 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 13 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి 77 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా మొదటి 4 రోజులకు కలిపి ఈ చిత్రానికి 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 63 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని చాలా తక్కువకు చేయడం బాగా ప్లస్ అయ్యింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 30 కోట్ల రూపాయలకు జరగ్గా , లాభాలు 33 కోట్ల రూపాయిల వరకు వచ్చాయి. డివైడ్ టాక్ వచ్చిన ఒక సినిమాకు ఈ రేంజ్ లాభాలు రావడం చరిత్రలో ఇదే తొలిసారి , రాబోయే రోజుల్లో ఇంకా ఎంత లాభాలు వస్తాయో చూడాలి.

ఇండస్ట్రీ లో ఉన్న ఆ స్టార్ హీరోలిద్దరు మహేష్ బాబు అభిమానులేనా..?

Star Heroes Fans Of Mahesh Babu
Star Heroes Fans Of Mahesh Babu

Star Heroes Fans Of Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైన మహేష్ బాబు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తుండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి రాజమౌళి ఉన్నాడనే ఒకే ఒక కారణంతో మహేష్ బాబు సినిమా పాన్ వరల్డ్ లో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. లేకపోతే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం దాదాపు 1500 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో ఉన్నారు. కాబట్టి రాజమౌళి దానిని దృష్టిలో పెట్టుకొని ఆయన చాలా సేఫ్ గేమ్ ఆడాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ పిక్స్ ను కూడా బయటికి రానివ్వడం లేదు. కారణం ఏంటంటే మేకింగ్ వీడియోలను సైతం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

దాని వల్ల కూడా బిజినెస్ జరుగుతుందని ఆలోచిస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు నుంచి వచ్చే సినిమా ది బెస్ట్ అవుట్ పుట్ తో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రాజమౌళిని ఆదర్శంగా తీసుకొని ఆయన లాగా సినిమాలు చేయాలని చూస్తున్నారు…

ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలామంది ఇండస్ట్రీకి వచ్చారు. ఇక ఇప్పుడున్న హీరోల్లో కొంతమంది మహేష్ బాబు అభిమానులమని చెబుతున్నారు. విజయ్ దేవరకొండ, సిద్దు జొన్నలగడ్డ ఇద్దరు మహేష్ బాబుకు వీరాభిమానులమని గతంలో పలు సందర్భాల్లో తెలియజేశారు.

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ కి రావాలనే ఇంట్రెస్ట్ కలిగిన తర్వాత ఇండస్ట్రీకి రావాలా వద్దా అని అనుకున్న టైంలో మహేష్ బాబు సినిమాలు చూడడం అతని నటనకు ఇంప్రెస్ అయిన వాళ్లు ఎలాగైనా సరే మనం కూడా ఇండస్ట్రీలో రాణించాలి అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి ప్రస్తుతం స్టార్ హీరోలుగా వాళ్ళ మనుగడ ను కొనసాగిస్తున్నారు…

దిల్ రాజు పెద్ది మూవీ ని టార్గెట్ చేశాడా..?

Dil Raju Targeting Peddi Movie
Dil Raju Targeting Peddi Movie

Dil Raju Targeting Peddi Movie: సినిమా ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోటీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఒక సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరో సినిమా కూడా దానిని మించిన సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఉంటారు. ఎలాగైతే హీరోల మధ్య పోటీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. కానీ ప్రొడ్యూసర్ల మధ్య కూడా విపరీతమైన పోటీ అయితే ఉంది. ఇక్కడ దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ సైతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటే మైత్రి మూవీ మేకర్స్ సైతం వరుస సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే వాళ్లు వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ హీరోలందరితో మంచి విజయాలను సాధిస్తున్నారు. పెద్ది సినిమాను జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ వివాదం మరోసారి తెరమీదకి వచ్చింది. ఇక దిల్ రాజు కావాలనే ఈ వివాదాన్ని ముందు ఉండి నడిపిస్తున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి దిల్ రాజుకి మైత్రి వాళ్లకి మధ్య చాలా రోజుల నుంచి కొన్ని గొడవలైతే ఉన్నాయి. ఈ సినిమాలకు సంబంధించిన విషయాల్లోనే వాళ్ళు ఎప్పటికప్పుడు విభేదించుకుంటూ రావడం వల్ల వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వారైతే నడుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ క్రమంలోనే దిల్ రాజు కావాలనే పెద్ది సినిమాను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మైత్రి వాళ్లు పెద్ది సినిమాతో భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ కి ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ రావడం లేదు. కాబట్టి వాళ్ళు చాలా వరకు డీలా పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

ఇక ఇలాంటి క్రమంలోనే సింగిల్ స్క్రీన్స్ వివాదాన్ని ముగిస్తారా? లేదంటే సినిమాకి సరైన థియేటర్లు లేక ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకొస్తారా? అనేది తెలియాల్సి ఉంది… ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించినా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న హీరోలైతే ఎవరు లేరు. మరి వాళ్ళు చేయాల్సిన సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది…

పదేళ్ల బాలికపై అఘాయిత్యాన్ని మర్చిపోకముందే.. కోయంబత్తూర్ లో మరో దారుణం

Coimbatore Crime News
Coimbatore Crime News

Coimbatore Crime News: తమిళనాడులో కోయంబత్తూర్ లోని ఇటీవల ఓ 10 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని కలిగించింది. దీనిని మర్చిపోకముందే ఇప్పుడు అక్కడ మరో దారుణం చోటుచేసుకుంది.. దీంతో జాతీయ మీడియాలో కోయంబత్తూరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

కోయంబత్తూర్ లో తొండ ముత్తూరు ప్రాంతంలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రేమను తిరస్కరించిందని పోస్ట్ గ్రాడ్యుయేట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నివాసం మీద పెట్రోల్ బాంబు విసిరేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. అవి కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. సుదీర్ఘ నేరచరిత్ర కలిగిన అతడిని పట్టుకునేందుకు తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. బృందాలుగా విడిపోయి అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

చెన్నై నగరానికి చెందిన కార్తీక్ అలియాస్ మరియు అనే యువకుడు ఈ దాడికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక ప్రైవేట్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని అతడు ప్రేమించమని కొంతకాలంగా వేధిస్తున్నాడు. అయితే ఆమె అతని ప్రేమను ఒప్పుకోవడం లేదు. ఇటీవల ఆమెను అనుసరించి ఇబ్బంది పెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి మీద ఆగ్రహాన్ని పెంచుకున్న కార్తీక్.. తన స్నేహితుడు సహాయంతో బైక్ మీద ప్రయాణిస్తూ.. ఆ అమ్మాయి ఇంటి మీద పెట్రోల్ బాంబు విసిరేశాడు.. అంతకుముందు ఆ యువతి ఇంటి మీదకి వచ్చాడు. ఆమె తండ్రిని రాయడానికి వీళ్లేని భాషలో దూషించాడు. అంతేకాదు చంపుతానని బెదిరించాడు. పెట్రోల్ బాంబు విసిరేయడంతో ఆ ప్రాంతంలో మంటలు ఏర్పడ్డాయి. అదృష్టవశాత్తు అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కార్తీక్ మీద తమిళనాడు వ్యాప్తంగా 31కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. అతడు అనేక సందర్భాలలో జైలుకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. తాజాగా ఆ యువతి ఇంటి మీద పెట్రోల్ బాంబు వేసిన నేపథ్యంలో పోలీసులు అతని మీద కేసు నమోదు చేశారు. మరోవైపు మహిళల భద్రతకు తాను ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన నేపథ్యంలో.. కార్తీక్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉందని తమిళనాడులో చర్చ జరుగుతుంది.

బస్సులో ప్రయాణిస్తున్నారా.. జాగ్రత్త..

Bus Travel Safety Tips
Bus Travel Safety Tips

Bus Travel Safety Tips: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటూ ‘బస్సులో భరోసా’ అనే వినూత్న భద్రతా వ్యవస్థను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ వ్యవస్థ, ప్రజా రవాణాలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బస్సులో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఒకవేళ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే తెలిసిపోతుందని చెబుతున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే?

బస్సులో ప్రయాణించే వారి భద్రత దృష్ట్యా.. ముఖ్యంగా మహిళలను వేధింపుల నుంచి రక్షించేందుకు తెలంగాణ ఆర్టీసీ కొత్త భద్రతా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ప్రతి బస్సులో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చాలని నిర్ణయించారు. ఇవి బస్సులోని ప్రతి అంగుళాన్ని స్పష్టంగా రికార్డ్ చేస్తాయి. బస్సులోకి ప్రవేశించే ఫుట్ బోర్డు దగ్గర నుంచి చివరి సీటు వరకు, కెమెరాల నిఘాలో ఉంటుంది. దీనివల్ల ప్రయాణికుల కదలికలు నిరంతరం కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించబడతాయి.

తొలి దశలో భాగంగా, ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని 175 బస్సుల్లో ఈ అధునాతన కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో సక్సెస్ రేటును బట్టి, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులకు ఈ వ్యవస్థను విస్తరించే అవకాశం ఉంది. ఈ ‘బస్సులో భరోసా’ కార్యక్రమం ద్వారా బస్సుల్లో జరిగే వేధింపులు, దొంగతనాలు మరియు అనుచిత ప్రవర్తనలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు భయం లేకుండా సురక్షితంగా ప్రయాణించే వాతావరణాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.

ఈ భద్రతా చర్యలు ప్రయాణికులకు మరింత భరోసానివ్వడమే కాకుండా, ఆర్టీసీ బస్సులపై ప్రజల్లో నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల నేరస్థులు నేరాలకు పాల్పడటానికి వెనకడుగు వేసే అవకాశం ఉందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

నెయిల్ పాలిష్ వేసుకునేవారికి WHO హెచ్చరిక..

WHO Warning On Nail Polish
WHO Warning On Nail Polish

WHO Warning On Nail Polish: అందంగా కనిపించేందుకు మహిళలు తరచూ నెయిల్ పాలిష్ వాడటం ఇప్పుడు సాధారణమైపోయింది. ఫ్యాషన్‌లో భాగంగా వివిధ రంగుల నెయిల్ పాలిష్‌లను ఉపయోగిస్తున్నప్పటికీ, వాటిలో ఉండే కొన్ని రసాయనాలు ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోజూ లేదా తరచూ నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం World Health Organization (WHO) హెచ్చరించింది. ఇంతకీ నెయిల్ పాలిష్ తో ఎలాంటి సమస్యలు ఉంటాయంటే?

నెయిల్ పాలిష్‌లలో ఫార్మాల్డిహైడ్ , టోలుయెన్ , డీబీపీ వంటి ప్రమాదకర కెమికల్స్ ఉంటాయి. వీటిని ‘టాక్సిక్ ట్రియో’ అని కూడా పిలుస్తారు. ఈ రసాయనాలు గోళ్ల అందాన్ని పెంచినా, శరీరానికి మెల్లగా హాని చేసే అవకాశముందని వైద్యులు వివరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ World Health Organization ఫార్మాల్డిహైడ్‌ను గ్రూప్-1 క్యాన్సర్ కారక పదార్థంగా వర్గీకరించింది. అంటే ఇది మనుషుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశాలు ఉన్న రసాయనంగా గుర్తించబడింది. దీర్ఘకాలంగా ఈ కెమికల్‌కు గురైతే శ్వాసకోశ సమస్యలు, కళ్లలో మంట, చర్మ అలర్జీలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

టోలుయెన్ అనే కెమికల్ ఎక్కువగా వాసన రూపంలో శరీరంలోకి వెళ్తుంది. దీని వల్ల తలనొప్పి, తల తిరగడం, అలసట, వికారం వంటి సమస్యలు రావచ్చు. అలాగే ఎక్కువ కాలం దీని ప్రభావానికి లోనైతే నాడీ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

డీబీపీ అనే రసాయనం గోళ్లపై పాలిష్ ఎక్కువకాలం నిలవడానికి ఉపయోగిస్తారు. అయితే ఇది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా గర్భిణులు మరియు చిన్నపిల్లలు ఈ కెమికల్స్‌కు ఎక్కువగా గురికాకుండా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే ప్రత్యేక సందర్భాలు, ఫంక్షన్లు లేదా వేడుకల కోసం అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేసుకొని వెంటనే తొలగించుకుంటే పెద్ద ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ నిరంతరం గోళ్లపై పాలిష్ ఉంచడం వల్ల గోళ్లు బలహీనపడటం, పసుపు రంగులోకి మారటం, పొడిబారటం వంటి సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు.

‘నాణ్యతకు తిలోదకాలు’.. ఈ పదాన్ని ఎందుకు వాడుతారు.. దీని అర్థం ఏంటీ..

Nanyataku Tilodakalu Meaning
Nanyataku Tilodakalu Meaning

Nanyataku Tilodakalu Meaning: తెలుగు భాషలో అనేక నానుడులు, జాతీయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయి. అలాంటి వాటిలో ‘నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు’ అనే పదప్రయోగం కూడా ఒకటి. సాధారణంగా ఏదైనా విషయం, బాధ్యత లేదా వ్యక్తిని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేశారని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. కాలక్రమేణా ఇది సాధారణ సంభాషణల్లోనూ విస్తృతంగా స్థిరపడిపోయింది. అసలు తిలోదకాలు అంటే ఏమిటీ? ఈ పదానికి అర్థం ఏంటీ?

‘తిలోదకాలు’ అనే పదానికి మూలం హిందూ సంప్రదాయాల్లో ఉంది. ఇందులో ‘తిల’ అంటే నువ్వులు, ‘ఉదకాలు’ అంటే నీరు. మరణించిన వ్యక్తులకు చేసే పితృకర్మల్లో భాగంగా నువ్వులు కలిపిన నీటిని సమర్పించే ఆచారాన్ని ‘తిలోదకాలు’ అంటారు. ఇది మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ చేసే ముఖ్యమైన క్రియగా భావిస్తారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం.. మరణించిన వారితో ఉన్న భౌతిక బంధాలు, రుణాలు పూర్తిగా ముగిశాయని సూచించే చిహ్నంగా తిలోదకాలు వదులుతారు. ఈ ప్రక్రియ అనంతరం ఆ వ్యక్తితో ఉన్న సంబంధం భౌతికంగా ముగిసిందనే భావన ఏర్పడుతుంది.

సామాన్య జీవితంలో ఈ పదాన్ని రూపకంగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక బాధ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేసినప్పుడు, లేదా ఏదైనా పని గురించి ఇక పట్టించుకోవడం మానేసినప్పుడు ‘దానికి తిలోదకాలు ఇచ్చేశాడు’ అని అంటారు. అంటే ఆ విషయాన్ని పూర్తిగా వదిలేశాడనే అర్థం వస్తుంది. తెలుగు భాషలో ఇలాంటి అనేక జాతీయాలు ప్రజల జీవన విధానాల నుంచి పుట్టుకొచ్చాయి. వాటి వెనుక ఉన్న ఆచారాలు, విశ్వాసాలు, సంస్కృతి గురించి తెలుసుకుంటే భాషపై మరింత ఆసక్తి పెరుగుతుంది. “తిలోదకాలు” అనే పదం కూడా ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం నుంచి పుట్టి, నేటి సాధారణ మాట్లాడే భాషలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

'కరుప్పు' 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. దెబ్బకి విజయ్ , రజినీకాంత్ రికార్డ్స్ అవుట్..

Karuppu 10 Days Collections
Karuppu 10 Days Collections

Karuppu 10 Days Collections: సౌత్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు సూర్య. అయితే గత 13 ఏళ్లుగా ఈయనకు సరైన సూపర్ హిట్ లేకపోవడం , ఓపెనింగ్ వసూళ్లు రాకపోవడం వల్ల, సూర్య పని ఇక అయిపోయింది , ఆయన సినిమాలను ఎవ్వరూ చూడరు అని ట్రేడ్ విశ్లేషకులు ఎన్నో వ్యాఖ్యలు చేసేవారు. కానీ రీసెంట్ గా విడుదలైన ‘కరుప్పు’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామీ ని చూసి, సూర్య రేంజ్ ఇదా అని అందరూ షాక్ కి గురయ్యారు. విడుదలై 10 రోజులు అయ్యింది , ఈ పది రోజుల్లో ఈ చిత్రం తమిళనాడు లో సీఎం విజయ్ , సూపర్ స్టార్ రజినీకాంత్ సాధించిన రికార్డ్స్ ని కూడా అనేక ప్రాంతాల్లో బద్దలు కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 10 రోజుల్లో ఈ చిత్రం ప్రాంతాల వారీగా రాబట్టిన వసూళ్లను ఒకసారి చూద్దాం.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో సూర్య కి ఒకప్పుడు ఇక్కడి స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ , క్రేజ్ ఉండేది. కానీ వరుస ఫ్లాప్స్ కారణంగా ఇక ఆయన కం బ్యాక్ ఇవ్వడం కష్టమని మన ఆడియన్సు కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ ‘కరుప్పు’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ‘వీరభద్రుడు’ అనే పేరుతో విడుదల చేసింది. కేవలం 7 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేయగా, బాక్స్ ఆఫీస్ వద్ద 10 రోజుల్లో 13 కోట్ల రూపాయిలు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 26 కోట్ల రూపాయిలు వచ్చాయి. ఓవరాల్ గా అప్పుడే 5 కోట్ల రూపాయిలకు పైగా లాభాలు వచ్చాయి. ఇది సాధారమైన విషయం కాదు. అదే విధంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన గ్రాస్ వసూళ్ల లెక్కలు కూడా ఒకసారి చూద్దాం.

తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి 10 రోజుల్లో 115 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సూర్య కి సొంత రాష్ట్రం నుండి ఇదే మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ సినిమా అనుకోవచ్చు. అదే విధంగా కర్ణాటక రాష్ట్రము నుండి 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, కేరళ నుండి 11 కోట్ల రూపాయిలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్ల రూపాయిలు , ఓవర్సీస్ నుండి 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి విడుదలకు ముందు 71 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ జరగ్గా, 238 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 114 కోట్ల రూపాయిల షార్ట్ వసూళ్లు వచ్చాయి. అంటే బయ్యర్స్ కి ఇప్పటి వరకు 42 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట.

బంగారం విషయంలో మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా..

Gold Buying Tips
Gold Buying Tips

Gold Quality Doubts: బంగారానికి భారతీయులకు విడదీయరాని సంబంధం ఉంటుంది. గోల్డ్ అనేది అత్యంత కాస్ట్లీ మెటల్. ఈ లోహాన్ని బయటకు తీసిన తర్వాత ఆభరణాల తయారీకి అనుకూలంగా మారుస్తారు. ఆ తర్వాత ఆభరణాలుగా మార్చేస్తారు. బంగారం నాణ్యతను బట్టి 24 క్యారెట్స్.. 22 క్యారెట్స్ లాగా వర్గీకరిస్తారు. ఆ తర్వాత దానిని విక్రయిస్తూ ఉంటారు.. బిస్కెట్లు.. ఇతర
రూపాలలో బంగారాన్ని మారుస్తూ ఉంటారు.

ఓ నివేదిక ప్రకారం బంగారం ఈ భూమ్మీద లభించే అత్యంత ఖరీదైన లోహాలలో ఒకటి. బంగారానికంటే ఖరీదైన ప్లాటినం.. వజ్రాల వంటి లోహాలు అనేకం ఉన్నప్పటికీ.. బంగారాన్ని మాత్రమే భారీగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అమెరికా నుంచి మొదలు పెడితే భారత్ వరకు బంగారానికి ఎప్పటికీ డిమాండ్ అధికంగానే ఉంటుంది. ఇక మన దేశంలో ఆడవాళ్లు బంగారాన్ని వివిధ రూపాలలో ధరించడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. అందువల్లే మన దేశంలో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది.

బంగారం ఎప్పుడు చూసినా సరే మెరుస్తూ ఉంటుంది. దాని నాణ్యత ఆధారంగా మెరుపులు ఆధారపడి ఉంటాయి. అయితే బంగారం ఎందుకు ఎప్పటికీ మెరుస్తూనే ఉంటుంది.. ఇనుము మాదిరిగా అది కూడా ఒక లోహమే కదా అనే అనుమానం అందరిలోనూ కలుగుతూ ఉంటుంది. గోల్డ్ ఎందుకు తుప్పు పట్టదు అనే కారణాన్ని తాజాగా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. బంగారం ఉపరితలం మీద పరమాణువులు ఉంటాయి. ఇవి సహజంగా రక్షణ కవచం లాగా మారతాయి. ఆక్సిజన్ తో కలిసి ఇది రసాయన చర్య జరగకుండా అడ్డుకుంటాయి. అందువల్లే బంగారానికి తుప్పు అనేది పట్టదు. రెండు రకాల పరమాణువులు తమను తాను ప్రత్యేకమైన పద్ధతిలో అమర్చుకుంటాయి. దీనివల్ల బంగారం రంగు మారదు. అందువల్లే అది మెరుస్తూ ఉంటుంది.

బంగారంలో స్వచ్ఛత అధికంగా ఉంటాయి అది ఎప్పటికీ మన్నుతూనే ఉంటుంది. ఒకవేళ అందులో రాగి ఎక్కువ శాతం కలిస్తే దాని నాణ్యతలో తేడా వస్తూ ఉంటుంది. అందువల్లే బంగారంలో సాధ్యమైనంతవరకు మాత్రమే రాగి కలుపుతూ ఉంటారు. రాగి ఎక్కువగా కలిసిన బంగారు ఆభరణాలను ఇట్టే మనం గుర్తుపట్టవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by OkTelugu (@okteluguofficial)

వీరికి EVలు చాలా అవసరం..

Electric Scooter Benefits
Electric Scooter Benefits

Electric Scooter Benefits: దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నాయ వాహనాల కోసం చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలతో తక్కువ ఖర్చతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉందని కొందరు ఇప్పటికే కొనుగోలు చేసిన వారు చెబుతున్నారు. ముఖ్యంగా వాహనాలపై ఎక్కువగా వ్యాపారం, ఉద్యోగం చేసేవారికి విద్యుత్ వాహనాలు తప్పనిసరి అని అంటున్నారు. అయితే వీరికి మరింత ఉపయోగకరమని ఎలక్ట్రిక్ వాహన విక్రయ సంస్థ ‘ ఓలా’ ఫౌండర్ భవిష్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇంతకీ ఈవీల అవసరం ఎవరికి ఉంది?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతుండటంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో, ద్విచక్ర వాహనాల ద్వారా జీవనోపాధి పొందే వారికి ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారాయని భవిష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఇంధన ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా తమ సంపాదనను పెంచుకోవడానికి ఈవీలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా డెలివరీ ఏజెంట్లు, రైడ్-షేరింగ్ డ్రైవర్లు వంటి ‘గిగ్ ఎకానమీ’ వర్కర్లకు ఈవీలు ఒక వరంలా మారాయని ఆయన వివరించారు. ఈ వర్కర్లు రోజువారీగా సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీనివల్ల వారికి ఇంధన ఖర్చులే అతిపెద్ద భారంగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీలు వారికి కేవలం వాహనాలు మాత్రమే కాదు, వారి ఆర్థిక భద్రతకు అవసరమైన సాధనాలుగా మారాయని ఆయన తెలిపారు.

ఈ రంగానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సామాన్య వర్కర్లకు మరియు గిగ్ వర్కర్లకు అందుబాటులో ఉండేలా ఓలా ఎలక్ట్రిక్ వంటి సంస్థలు తక్కువ ధరకే స్కూటర్లను రూపొందిస్తున్నాయని అగర్వాల్ పేర్కొన్నారు. నాణ్యతతో కూడిన ఈవీలను తక్కువ ధరకే అందించడం ద్వారా, గిగ్ వర్కర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మరియు వారికి స్థిరమైన ఉపాధిని కల్పించడం తమ లక్ష్యమని ఆయన వివరించారు.

భారతదేశంలో గిగ్ ఎకానమీ వేగంగా విస్తరిస్తోందని, రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ రంగంలో లక్షలాది మంది ఉపాధి పొందుతారని అగర్వాల్ అంచనా వేశారు. ఈ పెరుగుదలతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు, ఆర్థికంగా కూడా లాభదాయకమైన ఈవీలు రానున్న కాలంలో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి డిజాస్టర్ మూవీ రీ రిలీజ్.. వర్కౌట్ అవుతుందా?

Panjaa Re Release
Panjaa Re Release

Panjaa Movie Re Release: ప్రతీ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఏ రేంజ్ లో చేస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద పండుగ వాతావరణం వచ్చింది అనే రేంజ్ ని తలపిస్తారు పవన్ వీరాభిమానులు. దానికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఎవా కార్యక్రమాలు , రక్త దానాలు వంటివి కూడా గట్టిగానే చేస్తారు. కాలేజీలలో సెలెబ్రేషన్స్ అయితే వేరే లెవెల్ లో ఉంటాయి. అయితే గత నాలుగేళ్ల నుండి మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఈ ట్రెండ్ లో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు పాత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేశాయి. ప్రస్తుతానికి మొదటి రోజు రికార్డు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖాతాలోనే ఉంది. ఆయన హీరో గా నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ ని 2024 సెప్టెంబర్ 2న విడుదల అవ్వగా, మొదటి రోజు 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇప్పటి వరకు ఈ రికార్డు ని ఎవ్వరూ ముట్టుకోలేకపోయారు.ఈ రికార్డు ని మళ్లీ మేమే బద్దలు కొడుతాం , ఈ ఏడాది అని పవన్ కళ్యాణ్ అభిమానులు సవాలు చేశారు. ఎందుకంటే ఈ పుట్టినరోజు కి పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ‘బద్రి’ ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ కోర్టు లో ఆ సినిమాకు కొన్ని సమస్యలు ఉండడం వల్ల , ఆ చిత్రానికి బదులుగా ‘పంజా’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. పంజా సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఓపెనింగ్స్ అయితే అప్పట్లో బాగానే వచ్చాయి కానీ , అత్యధిక శాతం మంది జనాలు ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘బాలు’ తో పోలి ఉండడం చూసి నెగెటివ్ టాక్ చెప్పుకొచ్చారు.

పైగా ఫస్ట్ హాఫ్ రేంజ్ లో సెకండ్ హాఫ్ లేకపోవడం కూడా అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. అందుకే అప్పట్లో ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది. కానీ కాలక్రమేణా ఈ చిత్రానికి జెన్ జీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అల్ట్రా స్టైలిష్ లుక్స్ , యాక్టింగ్ , ఫైట్ సన్నివేశాలు , ఇవన్నీ కూడా నేటి తరం ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చి పెట్టేలా చేశాయి. ‘ఓజీ’ చిత్రం కంటే , ‘పంజా’ సినిమానే బాగుందని, ఈ చిత్రాన్ని థియేటర్స్ లో మిస్ అయ్యినందుకు చాలా బాధపడుతున్నామని , ఇప్పుడు విడుదల చేస్తే రికార్డ్స్ మొత్తం బద్దలు అవుతాయని అంటున్నారు ఫ్యాన్స్. అందుకే ఈ చిత్రాన్ని రీ ఎడిట్ చేసి , ఈ ఏడాది సెప్టెంబర్ 2 న గ్రాండ్ గా విడుదల చెయ్యాలని చూస్తున్నారు, మరి అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

విశ్వంభర ఇప్పుడు రిలీజ్ అవ్వకపోతే భారీ నష్టాలు వస్తాయా..?

Vishwambhara Release Updates
Vishwambhara Release Updates

Vishwambhara Release Updates: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట డైరెక్షన్లో తెరకెక్కిన విశ్వంభర సినిమా గత సంవత్సరం సమ్మర్ కానుక గా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకైతే రాలేకపోయింది…కారణం ఏంటి అంటే సినిమాలో సీజీ వర్క్ అంత పెద్దగా సెట్ అవ్వలేదనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. ఇక మరో సిజి కంపెనీతో వర్క్ చేయించిన కూడా అది అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం లేదట.

దాంతో చిరంజీవి సైతం ఈ సినిమా మీద ఆశలు వదిలేసుకున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికైనా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే బాగుంటుంది. అలా కాకుండా ఇంకా ఈ సినిమా మీద బడ్జెట్ ని పెంచుకుంటూ పోతే అది లాస్ ను మిగిల్చే ప్రమాదం కూడా ఉందని ఈ సినిమా మీద బజ్ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని చాలామంది చెబుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాను లేట్ చేయకుండా రిలీజ్ చేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం భారీ నష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు. చిరంజీవి ఈ సంవత్సరం ఇప్పటికే మనిషికి మన శంకర్ వరప్రసాద్ సినిమాలో సూపర్ సక్సెస్ ని సాధించాడు. కాబట్టి ఆ ఊపులోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేస్తే బాగుండేది. ఇక ఈ సమ్మర్ కూడా అయిపోయింది. కాబట్టి ఈ సినిమా సమ్మర్ కి వస్తుంది అనుకున్నప్పటికి అది నిరాశగానే మిగిలింది. మరి ఈ సినిమా మరో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారా?

సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ప్రేక్షకులకు ఒక కిక్కిచ్చే న్యూస్ చిరంజీవి చెప్పబోతున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాను పక్కన పెడితే ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్ లో చేయబోయే సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు…ఈ మూవీతో సూపర్ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది…