Homeక్రీడలుక్రికెట్‌Kohli And Travis Head Controversy: కోహ్లీతో గొడవ.. హెడ్ భార్యపై దారుణం.. చెలరేగిపోతున్నారు..

Kohli And Travis Head Controversy: కోహ్లీతో గొడవ.. హెడ్ భార్యపై దారుణం.. చెలరేగిపోతున్నారు..

Kohli And Travis Head Controversy: ఇటీవల హైదరాబాద్, బెంగళూరు జట్లు ఐపీఎల్ మ్యాచ్లో భాగంగా హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. అయితే ఈ విజయం హైదరాబాద్ జట్టుకు అంతగా ప్రయోజనం కలిగించలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచినప్పటికీ హైదరాబాద్ జట్టు గుజరాత్ స్థానాన్ని ఆక్రమించలేకపోయింది. ఈ విజయం కాస్త ఓదార్పు మాత్రమే ఇచ్చేసింది. ఈ ఐపిఎల్ సీజన్లో ప్రారంభ మ్యాచ్లో బెంగళూరు హైదరాబాద్ మీద గెలిచింది. ఇక […]

Kohli And Travis Head Controversy: ఇటీవల హైదరాబాద్, బెంగళూరు జట్లు ఐపీఎల్ మ్యాచ్లో భాగంగా హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. అయితే ఈ విజయం హైదరాబాద్ జట్టుకు అంతగా ప్రయోజనం కలిగించలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచినప్పటికీ హైదరాబాద్ జట్టు గుజరాత్ స్థానాన్ని ఆక్రమించలేకపోయింది. ఈ విజయం కాస్త ఓదార్పు మాత్రమే ఇచ్చేసింది. ఈ ఐపిఎల్ సీజన్లో ప్రారంభ మ్యాచ్లో బెంగళూరు హైదరాబాద్ మీద గెలిచింది. ఇక చివరి మ్యాచ్లో బెంగళూరు మీద హైదరాబాద్ గెలిచి రివేంజ్ తీర్చుకుంది.

ఇటీవల మ్యాచ్ లో హెడ్, విరాట్ కోహ్లీ మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో తనకు బౌలింగ్ వేయాలని విరాట్ హెడ్ కు తీవ్రమైన సైగలు చేశాడు. అయితే అప్పటికే విరాట్ అవుట్ అయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ తో హెడ్ కరచాలనం తీసుకునేందుకు చేయి చాచాడు. దానికి విరాట్ కోహ్లీ నిరాకరించాడు. ఇద్దరి మధ్య వివాదం మరో స్థాయికి వెళ్లిందని.. అందువల్లే విరాట్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.

అయితే ఈ వాదం ఇక్కడితోనే ఆగిపోలేదు. ఏకంగా వ్యక్తిగత అంశాల దాకా వెళ్ళిపోయింది. విరాట్ కోహ్లీ అభిమానులు హెడ్ భార్యను ఆన్లైన్లో వేధింపులకు గురి చేస్తున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు హెడ్ భార్య జెస్సికా తనకు ఎదురైన అనుభవాలను ఆస్ట్రేలియా మీడియాతో పంచుకుంది..

“మూడేళ్ల క్రితం అప్పుడు భారత అభిమానులు నన్ను వేధించారు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఆ సోషల్ మీడియా ఖాతాలలో కామెంట్లు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఉదయం లేవగానే నాకు ఒక రకమైన ఒత్తిడి ఉంటున్నదని” హెడ్ భార్య ఆస్ట్రేలియా మీడియాతో వ్యాఖ్యానించింది. మరోవైపు ఇదే విషయాన్ని హెడ్ కూడా బయటపెట్టాడు.. ఇటీవల టీమిండియా మీద ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత కూడా ఆన్లైన్ వేధింపులు పెరిగిపోయాయని హెడ్ వ్యాఖ్యానించాడు. 2023 వన్డే ప్రపంచ కప్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్.. 2024 బాక్సింగ్ టెస్ట్ లో టీం మీడియా ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత వేధింపులు పెరిగిపోయాయని హెడ్ వాపోయాడు. చివరికి తమ చిన్న కుమార్తెను కూడా వదిలిపెట్టకుండా ఆందోళన కలిగించే కామెంట్లు చేశారని.. బెదిరింపులకు కూడా పాల్పడ్డారని హెడ్ వాపోయాడు..

ఈ విషయాల పట్ల హెడ్ భార్య స్పందించారు.”అన్ని క్రీడలలో మానసిక ఆరోగ్యం ఉంటుంది. శారీరక దృఢత్వం కూడా ఉంటుంది. ఇవి మనం ఎలా ఉండాలో చెబుతాయి. క్రీడలలో భావోద్వేగాలు కచ్చితంగా ఉంటాయి.. కానీ అవి ఒక భాగం మాత్రమే. ఒకరి మీద ఒకరు దయను కలిగి ఉండాలి. జారిని కలిగి ఉండాలి. క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని” జెస్సికా ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టు ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper