Home Blog Page 217

అల్లు అర్జున్ లోకేష్ తరువాత ఆ కన్నడ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా..?

Allu Arjun Lokesh Kanagaraj Movie
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Film: తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కిస్తున్న వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు సినిమాతో ఫ్యాన్ ఇండియాలో పోయిన సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు… ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్ లో రాకా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన కన్నడ దర్శకుడు ఆయన రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమాని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. కాబట్టి ఇక మీదట కూడా ఆచితూచి మరి ముందుకు అడుగులు వేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి రీసెంట్ గా ‘కాంతార చాప్టర్ వన్’ సినిమాతో 800 కోట్ల కలెక్షన్స్ కొల్ల గొట్టాడు. కాబట్టి ఇప్పుడు చేయబోతున్న సినిమా విషయంలో కూడా ఆయన చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రిషబ్ శెట్టి సైతం తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

ఇంతకుముందు ఎన్టీఆర్ కి కథను వినిపించాడనే వార్తలైతే వచ్చాయి. అయితే ఎన్టీఆర్ తో సెట్ అవ్వకపోవడంతో ఆయన అల్లు అర్జున్ కి కథ వినిపించినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రిషబ్ శెట్టి మాత్రం అటు హీరోగా పెను సంచాన్లను క్రియేట్ చేస్తూనే దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

పాన్ ఇండియా నటుడిగా దర్శకుడిగా పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఫ్యూచర్లో ఇంకెన్ని సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

భూమి అమ్మి భార్యను చదివించాడు.. ప్రభుత్వ ఉద్యోగం రాగానే భార్య చేసిన దారుణం ఇదీ

Husband Sold Land For Wife Education
Husband Sold Land For Wife Education

Husband Sold Land For Wife Education: సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. మంచితనానికి నేటి కాలంలో రోజులు లేవు. పైగా మంచి చేసిన వారి మీదనే నిందలు పడుతున్నాయి. ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి.. దీంతో మంచితనానికి.. మంచి మనుషులకు సమాజంలో గౌరవమే లేకుండా పోతుంది.

అది బీహార్ రాష్ట్రం.. ఆ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ టీచర్ గా ఎంపికైన ఆమె ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఆ సమయంలో తన కాలేజీ ఫ్రెండ్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. అంతేకాదు అతనితో వెళ్లిపోయింది. భర్తను వదిలేసింది. కొడుకుని కూడా పట్టించుకోవడం మానేసింది. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలో ని హాజీపూర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.

హాజీపూర్ ప్రాంతానికి చెందిన అమన్ అనే వ్యక్తికి ఒక మహిళతో పెళ్లయింది. ఆమె ఇంటర్ వరకు చదువుకుంది. భార్యను పై చదువులు చదివించి.. ప్రభుత్వ ఉద్యోగస్తురాలిని చేయాలని ఆ భర్త సంకల్పించాడు. ఈ క్రమంలో ఆమెను ఉన్నత చదువులు చదివించేందుకు తన భూమిని కూడా అమ్మాడు. ఉన్నత చదువులు చదివిన ఆమె.. భర్త ఆశయాలకు తగ్గట్టుగానే ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించింది. భార్య ఉద్యోగం చేస్తోంది కాబట్టి.. తమ జీవితం బాగుపడుతుందని.. గొప్పగా తమ సంసారం వెలిగిపోతుందని అమన్ భావించాడు. కానీ అతని అంచనాలను భార్య తలకిందులు చేసింది.

ప్రభుత్వ టీచర్ ఉద్యోగం రాగానే ఆమె వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. వేరొక వ్యక్తితో రిలేషన్ పెట్టుకుంది. అంతేకాదు అతనితో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తితో కాపురం చేస్తోంది. భర్తను వదిలేసింది. కుమారుడిని కూడా పట్టించుకోవడం మానివేసింది. అదే కాదు భర్త మీద తప్పుడు కేసులు పెట్టింది. దీనిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కాగా, అమన్ కుమారుడు తన తల్లి నిర్వాకాన్ని పోలీసులతో చెప్పాడు. అతడు చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు అనేక ఆధారాలు సేకరించారు. అయితే తన ఇష్టపూర్తిగానే బయటికి వెళ్లిపోయానని.. తన భర్త ఇబ్బందులు పెడుతున్నాడని.. వరకట్నం కోసం వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇక్కడ విశేషం.

సూర్యవంశీని మొదట్లోనే పంపించాలి.. లేకుంటే సన్ రైజర్స్ గతే గుజరాత్ కు..

Gujarat Vs Rajasthan
Gujarat Vs Rajasthan

Gujarat Vs Rajasthan: ఐపీఎల్ లో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. గుజరాత్ జట్టు ఇటీవల బెంగళూరు చేతిలో ఓడిపోయి ఒత్తిడిలో ఉండగా.. హైదరాబాద్ జట్టు మీద గెలిచి రాజస్థాన్ విపరీతమైన ఉత్సాహంతో ఉంది. రాజస్థాన్ జట్టు ఆ స్థాయిలో ఉత్సాహంతో ఉండడానికి ప్రధాన కారణం 15 సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ. ఈ చిచ్చర పిడుగు ఐపీఎల్లో సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నాడు. వేరే లెవెల్ బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు.

సూర్య వంశీ ఇప్పటివరకు 15 మ్యాచ్లలో 15 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేశాడు సూర్య వంశీ. ఏకంగా 680 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. మొన్నటివరకు సాయి సుదర్శన్ 652 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉండగా.. అతడిని బీట్ చేశాడు సూర్య వంశీ. ఇతడు యావరేజ్ 45.33, స్ట్రైక్ రేటు 242.86, ఇతడి ఖాతాలో 55 బౌండరీలు, 65 సిక్సర్లు ఉన్నాయి. దీనినిబట్టి అతని బ్యాటింగ్ విధ్వంసం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. సూర్య వంశీ ఖాతాలో ఇప్పటివరకు ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్య వంశీ 97 పరుగులు చేశాడు. అది కూడా అత్యంత తక్కువ బంతుల్లో.. మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయడంతో రాజస్థాన్ జట్టు స్కోర్ రాకెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. తద్వారా కొండంత లక్ష్యం హైదరాబాద్ జట్టు ముందు నిర్దేశితమైంది. దీనిని చేదించే క్రమంలో హైదరాబాద్ జట్టు ఒత్తిడికి గురై.. చేతులెత్తేసింది. అయితే సూర్య వంశీని అవుట్ చేయడానికి హైదరాబాద్ జట్టు కెప్టెన్ అనేక రకాలుగా ప్రణాళికలు రూపొందించామని మ్యాచ్ కు ముందు చెప్పాడు. కానీ అతడే దారాళంగా పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్లో సూర్య వంశీ వేటాడి పరుగులు తీశాడు. తనకు బౌలింగ్ వేయాలంటేనే చుచ్చు పోసుకునేలా చేశాడు.

ఇప్పుడు గుజరాత్ జట్టు కూడా అదే పరిస్థితి వస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సూర్య వంశీ రాజస్థాన్ జట్టుకు బలమైన ఆయుధం. అతడిని ప్రారంభంలోనే వెనక్కి పంపించాలి. లేకపోతే మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకోవాలి. రబాడ, సిరాజ్, ప్రసిద్ లాంటివారు ఉన్నప్పటికీ.. సూర్యవంశీ ఒక్కసారి నిలబడితే వారి బౌలింగ్ విన్యాసాలు సాగవు. పైగా అతడు బంతిని అత్యంత బలంగా కొడతాడు కాబట్టి పరుగులు వచ్చేస్తూనే ఉంటాయి. గత సీజన్లో గుజరాత్ జట్టు మీదనే సూర్య వంశీ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో సూర్యవంశీని అడ్డుకోవడానికి గుజరాత్ బౌలర్లు ఎలాంటి విన్యాసాలు చేస్తారో చూడాల్సి ఉంది.

అక్రమ వలస దారులపై ఉక్కుపాదంతో విరుచుకు పడబోతున్న మోడీ ప్రభుత్వం

Modi government illegal immigrants

Modi government illegal immigrants : జనాభా స్వరూపం మారుతోందట.. డెమోగ్రఫీ అంటారు. 15 ఆగస్టు 2025న మోడీ ఎర్రకోట నుంచి దీని మీద దర్యాప్తు, సెప్టెంబర్ లో కేబినెట్ లో ఆమోదం.. తర్వాత అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశారు. ఇది బీజేపీ తీసుకున్న స్టాండ్ కాదు.. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, మమతా బెనర్జీలు మాట్లాడారు. జ్యోతిబసు సీఎంగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నుంచి వలసలు వస్తే ‘దీవి‘లో బంధిస్తే చనిపోయారు.

తూర్పు సరిహద్దుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. పశ్చిమ సరిహద్దుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.ఈశాన్య రాష్ట్రాల్లోకి బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నాయి. అక్రమ వలసలు బంగ్లాదేశ్ నుంచి పెరుగుతూనే ఉన్నాయి.

బంగ్లాదేశ్ నుంచి హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్దులు లాంటి మైనార్టీలు ఇండియాకు వస్తే పౌరసత్వం ఇస్తామని కేంద్రప్రభుత్వం చెప్పింది. అదే ముస్లింలు వస్తే ఒప్పుకోమని చెప్పింది.

అక్రమ వలస దారులపై ఉక్కుపాదంతో విరుచుకు పడబోతున్న మోడీ ప్రభుత్వం.. దీనిపై ’రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

గోయెంకా ధాటికి రెండో కెప్టెన్ బలి.. లక్నోకు 27 కోట్ల పంత్ గుడ్ బై.. చివరికి ఇలా ముగిసింది

Rishabh Pant Captaincy Exit
Rishabh Pant Captaincy Exit

Rishabh Pant Captaincy Exit: ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కార్పొరేట్ కంపెనీలు ఆడే క్రీడ. కార్పొరేట్ కంపెనీలు ఐపీఎల్లో భారీగా పెట్టుబడులు పెడుతుంటాయి. పెట్టిన పెట్టుబడికి ఎలాగూ రాబట్టుకుంటాయి. కానీ కార్పొరేట్ కంపెనీలు ఆలోచించే విధానం వేరే విధంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి రాబడి తో పాటు లాభాలు కూడా ఆశిస్తాయి. మార్కెట్ వ్యాల్యూ పెంచుకోవడానికి తాపత్రయపడుతుంటాయి. అందువల్లే కదా ఆటగాళ్ల మీద కార్పొరేట్ కంపెనీలు కోట్లు కుమ్మరిస్తుంటాయి. పది కోట్లు , 20 కోట్లు ఆటగాళ్లకు కంపెనీలు ఎందుకు చెల్లిస్తున్నాయంటే ఇదిగో ఇందుకే.

ఆటగాళ్లు యాజమాన్యాల అంచనాలను మించి రాణించలేక పోతే.. కోట్లు పొంది సరిగా ఆడ లేకపోతే ఆటగాళ్ల మీద ఒక రకమైన నెగిటివ్ ప్రచారం మొదలవుతుంది. యాజమాన్యాలు పదేపదే ఆ ప్లేయర్లపై ఏదో ఒక విధంగా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఆటగాళ్లు తమ ఆట తీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మార్చుకోకపోతే పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా పక్కకు తప్పుకొని సంచలనంగా మారాడు లక్నో జట్టు సారథి రిషబ్ పంత్.

2024 మెగా వేలంలో లక్నో జట్టు యాజమాన్యం రిషబ్ పంత్ ను 27 కోట్లకు సొంతం చేసుకుంది. నాటి నుంచి లక్నో జట్టుకు అతడు సారధిగా ఉంటున్నాడు. అయితే అతని నాయకత్వంలో లక్నో జట్టు రెండు సీజన్లలో కలిపి కేవలం 10 మ్యాచ్లలో మాత్రమే గెలిచింది. గత సీజన్లో ఆరు విజయాలు సాధించినప్పటికీ ప్లే ఆఫ్ దాకా వెళ్లలేకపోయింది. బ్యాటింగ్ పరంగా కూడా రిషబ్ పంత్ దారుణమైన ఆట తీరు కొనసాగించాడు. ఈ సీజన్లో అయితే అతడు 14 మ్యాచ్లు ఆడి కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాది మొత్తంగా అతడు కేవలం 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఈ సీజన్లో రిషబ్ పంత్ నాయకత్వంలో లక్నో జట్టు 14 మ్యాచ్లు ఆడింది. కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో రిషబ్ పంత్ మీద విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. మేనేజ్మెంట్ అతని మీద ఒత్తిడి తీసుకొచ్చిందా.. పంత్ కావాలని తప్పుకున్నాడా అనే విషయాల మీద క్లారిటీ లేకపోయినప్పటికీ.. తన కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పించాలని కోరినట్టు లక్నో యాజమాన్యం ట్విట్టర్ వేదికగా పేర్కొంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని పంత్ కోరాడని.. దానికి మేనేజ్మెంట్ ఒప్పుకుందని.. అదే కాదు ఈ మార్పు వెంటనే అమలులోకి వస్తుందని లక్నో యాజమాన్యం ప్రకటించింది. సారధిగా లక్నో జట్టుకు పంత్ అద్భుతమైన సేవలు అందించాలని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టును గొప్పగా నిర్మించడం మీద దృష్టి పెట్టామని లక్నో యాజమాన్యం ప్రకటించింది.

27 కోట్లతో పంత్ ను కొనుగోలు చేసిన తర్వాత లక్నో యాజమాన్యం అతని మీద భారీ అంచనాల పెట్టుకుంది. అయితే వాటిని అందుకోవడంలో అతడు ప్రతిసారి విఫలమవుతూనే ఉన్నాడు. ఈ సీజన్లో కూడా అతడు విఫలం కావడంతో లక్నో యాజమాన్యం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో అతడిని తప్పిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. చివరికి అవే నిజమయ్యాయి. ఇప్పుడు అతడి స్థానంలో ఎవరు నాయకుడు అవుతాడు.. ఎవరు గోయంకా జట్టును ముందుండి నడిపిస్తారు అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

కేరళలో మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో సోదాలు.. అధికారులపై దాడి

Kerala former CM raids

Kerala former CM raids : కమ్యూనిస్టు పార్టీలు తరచూ తమను తాము అవినీతి రహిత రాజకీయాలకు ప్రతీకలుగా ప్రదర్శించుకుంటాయి. అయితే కేరళలో జరిగిన తాజా పరిణామాలు ఈ వాదనలపై మరోసారి చర్చకు దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులపై విచారణ జరిపేందుకు అధికారులు వెళ్లిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సోదాల కోసం వచ్చిన అధికారులను సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అధికారులపై దాడి చేయడంతో పాటు అక్కడ పార్క్ చేసిన కొన్ని వాహనాలను ధ్వంసం చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. చట్టపరమైన ప్రక్రియను అడ్డుకోవడం, ప్రభుత్వ అధికారులపై దాడికి దిగడం వంటి అంశాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

“కమ్యూనిస్టులు అవినీతి చేయరు.. వారి కుటుంబాలపై దర్యాప్తు చేయడానికి ఎవరికీ హక్కు లేదు” అన్నట్టుగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆరోపణలు ఎదురైనప్పుడు చట్టపరమైన విచారణకు సహకరించాల్సింది పోయి, దర్యాప్తు బృందాలపై దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొంటున్నారు.

ఈ ఘటన కేరళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. అవినీతి ఆరోపణలు ఎవరి మీద వచ్చినా చట్టం తన పని తాను చేసుకోవాల్సిందేనని, రాజకీయ పార్టీలు లేదా నాయకులు చట్టానికి అతీతులు కాదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

కేరళలో మాజీ ముఖ్యమంత్రి ఇంటి సోదాలు, అధికారులపై దాడి ఘటనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో వీక్షించవచ్చు.

సన్ రైజర్స్ ఓటమి.. కావ్య మారన్ తండ్రి, ఇషాన్ కిషన్ మధ్య పెద్ద వాగ్వాదం.. బ్యాన్ తప్పదా

Kavya Maran father and Ishan Kishan argument
Kavya Maran father and Ishan Kishan argument

Kavya Maran father and Ishan Kishan argument: ప్లే ఆఫ్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టుతో హైదరాబాద్ తలపడుతున్నప్పుడు.. 240 మించిన పరుగులను ఛేదించాల్సి వచ్చినప్పుడు.. అభిషేక్ శర్మ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ సమయంలో హైదరాబాద్ అభిమానులకు పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే క్రీజులో ఇషాన్ కిషన్ ఉన్నాడు కాబట్టి చాలామందికి జట్టు గెలుస్తుందని నమ్మకం ఉంది. పైగా కిషన్ కూడా జోప్రా ఆర్చర్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత ఒక ఫోర్ కూడా కొట్టాడు. ఆ తదుపరి బంతికి క్యాచ్ అవుట్ అయ్యాడు.

కిషన్ అలా అవుట్ కావడంతో మైదానంలో ఉన్న అభిమానులు మొత్తం ఆవేదనకు గురయ్యారు. హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ అయితే దాదాపు ఏడ్చినంత పనిచేసింది. ఎందుకంటే కిషన్ అవుట్ కావడంతో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా రాజస్థాన్ జట్టుకు మించి స్కోర్ చేసిన హైదరాబాద్.. ఆ తర్వాత ఒత్తిడిలో కూరుకుపోవడం మొదలైంది. కిషన్ అవుట్ అయిన తర్వాత హెడ్ కూడా పెవిలియన్ దారిపట్టాడు. క్లాసెన్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది.

హైదరాబాద్ జట్టు ఓటమి పాలు కావడానికి అభిమానులు మాత్రమే కాదు.. జట్టు ఓనర్ కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. మైదానంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు తీవ్ర ఆవేదనలో కనిపించిన అతడు.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆవేశంలో మైదానంలోకి వచ్చాడు. ఇషాన్ కిషన్ తో మ్యాచ్ గురించి చర్చించాడు..

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. కిషన్ ఆట తీరు పట్ల కళానిధి మారన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కిషన్ అవుట్ కావడం వల్ల మ్యాచ్ స్వరూపం మారిపోయిందని.. హైదరాబాద్ జట్టు గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిందని కళానిధి మారన్ ఆవేదన వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు అధికారికంగా కిషన్ స్పందించలేదు. సన్రైజర్స్ యాజమాన్యం కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇది ఏదైనా దుష్ప్రచారమా.. మరొకటా అనేది తేలాల్సి ఉంది. ఏఐ ఫోటోలు ద్వారా కూడా ఇటువంటి ప్రచారం ఇటువంటి ఇటీవలి కాలంలో పెరిగిపోయిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అలాంటప్పుడు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని చెబుతున్నారు.

ఈ విషయం బీసీసీఐ కి తెలిసినట్టు సమాచారం. దీంతో సన్రైజర్స్ యాజమాన్యానికి జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు కిషన్ ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలుస్తాయి.

యోగ నరసింహుడికి నారా లోకేష్ పూజలు.. ఈ ఆలయానికి ఎంతటి చరిత్ర ఉందో తెలుసా..

Lokesh Yoga Narasimha Swamy temple visit
Lokesh Yoga Narasimha Swamy temple visit

Lokesh Yoga Narasimha Swamy temple visit: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం తమిళనాడు రాష్ట్రంలోని షోలింగూర్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన యోగ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతలను నారా లోకేష్ తెలుసుకున్నారు. అనంతరం రోప్ వే లో ప్రయాణించి.. ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను నారా లోకేష్ పరిశీలించారు

యోగ నరసింహస్వామి ఆలయానికి విశేషమైన చరిత్ర ఉంది. ఇది తమిళనాడు రాష్ట్రంలోని షోలింగూర్ బస్ స్టేషన్ నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది శ్రీ వైష్ణవుల 108 దివ్య క్షేత్రాలలో ఒకటి. స్వామివారి ఆలయం పెరియమలై అనే కొండ మీద ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి వారు యోగ భంగిమలో ఉంటారు. ఈ కొండ వెయ్యి అడుగుల ఎత్తులో ఉంటుంది. స్వామివారి ఆలయాన్ని చేరుకోవాలంటే దాదాపు 1305 మెట్లు ఎక్కాలి.

ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని అమృతవల్లి తాయారు అని పిలుస్తుంటారు. ఈ ఆలయంలో స్వామివారు యోగాసనంలో కనిపిస్తూనే సాలగ్రామ హార, చతుర్భుజ ఆకారంలో కూర్చొని ఉంటారు. స్వామివారి చేతుల్లో శంఖం.. చక్రాలు ఉంటాయి. మిగతా రెండు చేతులు ధ్యాన భంగిమను ప్రదర్శిస్తాయి.

చారిత్రాత్మకమైన ఆధారాల ప్రకారం నరసింహస్వామి విష్ణుమూర్తి నాలుగవ అవతారం. హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుడిని సంహరించిన తర్వాత.. ఈ కొండ మీదికి చేరుకుంటాడు. అక్కడ ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తర్వాత యోగ భంగిమలో ఇక్కడ కొలువై ఉన్నాడు.. ఈ ఆలయంలో స్వామివారిని పూజిస్తే భక్తుల కోరిన కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకం ఉంటుంది. మానసిక వ్యాధులు.. అనారోగ్య సమస్యల నుంచి బాధపడేవారు ఈ స్వామివారిని దర్శించుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇన్ని మెట్లు ఎక్కలేని వారికి డోలి సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ఇక్కడ ఉన్న ఒక చిన్న కొండ మీద శ్రీ యోగాంజనేయుడు కొలువై ఉంటాడు. ఇది కూడా 350 అడుగుల ఎత్తులో ఉంటుంది. 400 మెట్లు ఎక్కితే స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నరసింహ జయంతి.. చైత్ర బ్రహ్మోత్సవం.. పంగుని తిరుకల్యాణం ఘనంగా జరుపుతుంటారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. నారా లోకేష్ స్వామివారిని దర్శించుకున్న నేపథ్యంలో.. ఈ క్షేత్రాన్ని సందర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రభుత్వ టీచర్లకు గడ్డి సేకరించాలి.. యూపీ విద్యాశాఖ వింత ఆదేశాలు!

UP education department strange orders
UP education department strange orders

UP education department strange orders: ప్రభుత్వ టీచర్‌ అంటేనే ప్రస్తుతం ఓ చులకన భావన ఉంది. చదువు సరిగా చెప్పరనే అపవాదు ఉంది. ఉత్తరప్రదేశ్, బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో అయితే టీచర్ల చదువులపై సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఇక కాపీలు కొట్టి కొలువులు తెచ్చుకున్నారన్న అప్పవాదులు ఉన్నాయి. ఇలాంటి వ్యతిరేక భావన ఉన్న నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బరేలియా ప్రభుత్వ టీచర్లకు విద్యాశాఖ జారీ చేసిన విచిత్రమైన ఆదేశాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వీధి పశువులు (ఆవులు) కోసం ప్రతీ బ్లాక్‌ నుంచి కనీసం 100 క్వింటాళ్ల పశుగ్రాసం సేకరించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించడం టీచర్లను తీవ్రంగా కలచివేసింది. తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వచ్చిన తర్వాత అధికారులు ‘‘ఇది తప్పనిసరి కాదు’’ అంటూ వెనక్కి తగ్గారు. అయినా ఈ ఘటన రాజకీయాలు, పాలన, విద్యారంగంపై చాలా ప్రశ్నలు లేవనెత్తింది.

ఏమిటి ఆ ఆదేశం?
బరేలీ జిల్లా ప్రాథమిక విద్యా శాఖ (బేసిక్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌) ద్వారా జారీ చేయబడిన ఉత్తర్వుల ప్రకారం ప్రతీ ప్రాథమిక పాఠశాల నుంచి సుమారు 46 కిలోల గడ్డి సేకరించాలి. ప్రతి బ్లాక్‌ నుంచి కనీసం 100 క్వింటాళ్లు (మొత్తం జిల్లాలో సుమారు 1,500 క్వింటాళ్లు) సేకరించి గోశాలలకు అందించాలి. జనగణన డ్యూటీతో పాటు ఈ బాధ్యత కూడా నిర్వర్తించాలి అని, ఆదేశాలు పాటించకపోతే చర్యలు ఉంటాయని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.

సోషల్‌ మీడియాలో వైరల్‌..
ఈ ఆదేశం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో టీచర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ‘‘ఇక మరి గోబర్‌ కూడా పని చేయాలా?’’ అని ప్రశ్నించారు. తీవ్ర విమర్శలు, మీడియా దృష్టి పడడంతో అధికారులు త్వరగా వెనక్కి తగ్గారు. ‘‘ఇది స్వచ్ఛంద దానం మాత్రమే, తప్పనిసరి కాదు’’ అని స్పష్టం చేశారు. అయితే, మొదట ఆదేశంలో ‘‘చర్యలు తప్పవు’’ అని హెచ్చరించడం ఎందుకు అనే ప్రశ్న తెలెత్తుతోంది.

సమస్య ఎక్కడ ఉంది?
ప్రభుత్వ టీచర్లు ఇప్పటికే ఎన్నికల డ్యూటీ, జనగణన, సర్వేలు, వ్యాక్సినేషన్, రేషన్‌ కార్డు పనులు వంటి అనవసర బాధ్యతలతో మునిగిపోతున్నారు. ఫలితంగా పాఠశాలల్లో నాణ్యమైన బోధన, విద్యార్థుల అభివృద్ధి వెనుకబడుతోంది. ఇప్పుడు గడ్డి సేకరణ కూడా జోడించడం అనవసరం. వీధి పశువుల సమస్య నిజమే. కానీ దానికి పరిష్కారం టీచర్ల భుజాల మీద మోపడం కాదు. గోశాలల నిర్వహణ, ఫండింగ్, స్థానిక స్వయం సహాయక సంఘాలు, పశు సంవర్ధన శాఖ – ఇవి బాధ్యత వహించాలి. టీచర్లను ఉపయోగించడం సులభమైన మార్గంగా కనిపిస్తోంది.

విద్యారంగంపై ప్రభావం..
గోవు సంరక్షణ రాజకీయ అజెండాలో భాగం. కానీ అది అమలు చేసేటప్పుడు విద్యారంగాన్ని బలి ఇవ్వడం సమంజసం కాదు. ఉత్తరప్రదేశ్‌లో గతంలో కూడా టీచర్లను గోశాలలకు ఫండ్‌ ఇవ్వమని ఆదేశాలు వచ్చాయి. ఇది ఆ సిలసిలాలో భాగమే. టీచర్ల మనోస్థైతి మరింత దిగజారుతుంది. పాఠశాలల్లో బోధన నాణ్యత క్షీణిస్తుంది.

బరేలీ ఘటన ఒక హాస్యాస్పద సంఘటనగా కనిపించినా, ఇది లోతైన సమస్యను బయటపెడుతోంది. ప్రభుత్వాలు టీచర్లను ‘‘మల్టీపర్పస్‌ వర్కర్స్‌’’గా చూడడం మానాలి. వారి ప్రధాన బాధ్యత విద్యాబోధన మాత్రమే కావాలి. గోవు సంరక్షణ మంచి ఉద్దేశమే కానీ, దాని భారం విద్యారంగం మీద పడకూడదు. సమస్యలకు సరైన సంస్థల ద్వారా, సరైన వనరులతో పరిష్కారాలు వెతకాలి. లేకపోతే ఇలాంటి ‘‘గడ్డి సేకరణ’’ ఆదేశాలు రాజకీయ, పాలనా వ్యవస్థలను మరింత హాస్యాస్పదం చేస్తాయి.

ఎన్టీఆర్ వల్ల ప్రశాంత్ నీల్ తిట్లు తింటున్నాడా..?

Prashanth Neel Dragon Movie
Prashanth Neel Dragon Movie

NTR and Prashanth Neel controversy: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేసే విధంగా కనిపిస్తుంది. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు…దాంతో పాటుగా ఈ గ్లింప్స్ లో ఏ మూవీ వరల్డ్ మొత్తాన్ని పరిచయం చేశారు. సినిమా ఎలా ఉండబోతుంది హీరో దేనికోసం ఫైట్ చేయబోతున్నాడనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. మొత్తానికైతే ప్రశాంత్ నీల్ మరోసారి ఒక డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ చేసిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని విశేషంగా అలరించింది. ముఖ్యంగా ఆయనలోని దర్శకుడిని పూర్తిస్థాయిలో ఎలివేట్ చేస్తూ ఒక హీరో నుంచి ఏం కావాలో దానిని పూర్తిస్థాయిలో రాబట్టుకుంటారు. అందుకే అతని సినిమాల్లో క్వాలిటీ ఉంటుంది. హీరో క్యారెక్టర్ లో ఒక నిజాయితీ ఉంటుంది. ఇక ఎలివేషన్స్ ఎమోషన్స్ ను సైతం ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ఏ హీరో అతనితో సినిమా చేసిన కూడా వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను అందించాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ను సైతం డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

ఎన్టీఆర్ లుక్కు కోసం తన బాడీ ని బిల్డ్ చేయమని చెప్తే ఎన్టీఆర్ బాగా సన్నబడి పోయాడు. ఈ విషయంలో ఎన్టీఆర్ భార్యతో పాటు అతని అభిమానులు కూడా నన్ను తిట్టుకున్నారు అంటూ ప్రశాంత్ నీల్ చెప్పారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని అంతలా సన్నబడమని చెప్పలేదట.

కేవలం బాడీ పెంచాలి అని చెప్పాడట. కానీ ఆయన తన డెడికేషన్ తో సన్నబడి మరి బాడీని బిల్డ్ చేసుకున్నాడు… సినిమా అంటే అతనికి చాలా పిచ్చని, నటన మీద అతనికి చాలా పట్టు ఉందని ఎలాంటి పాత్రనైనా సరే పోషించగలిగే కెపాసిటి ఎన్టీఆర్ కి ఉందని ప్రశాంత్ నీల్ అతని గురించి చాలా గొప్పగా చెప్పాడు.

ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ నీల్ ను ఎన్టీఆర్ అభిమానులు తారక్ రూపం మార్చేశాడని తిట్టడం కాదు సినిమా రిలీజ్ లేట్ అవుతుందని కూడా తిడుతున్నారట. బెస్ట్ క్వాలిటీ తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన చాలావరకు సమయాన్ని కేటాయించి మరి ఎన్టీఆర్ కి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారట…

ప్రభాస్ మంచితనానికి ఫిదా అయిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో..

Prabhas kindness praised by Bollywood star
Prabhas kindness praised by Bollywood star

Prabhas kindness praised by Bollywood star: సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటాడు. ఒక సక్సెస్ వస్తే చాలు అనుకునే సమయం నుంచి మనమే నెంబర్ వన్ హీరోగా మారాలి అనే రేంజ్ కొంతమంది మాత్రమే వెళ్తారు. అందులో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి భారీ సక్సెసులను అందించాయి. బాహుబలి లాంటి సినిమాలు అతన్ని పాన్ ఇండియా హీరోగా నిలబెడితే, ఇప్పుడు చేయబోతున్న సినిమాలు ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ కి దగ్గర చేయబోతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇంతకుముందు ఆయన వైవిద్యభరితమైన కథాంశాలతో సినిమాలు చేయకపోయిన కూడా కమర్షియల్ గా మాస్ ఎలిమెంట్స్ ని ఉండేలా చూసుకొని తన అభిమానులకు మంచి కిక్ ఇచ్చే సినిమాలైతే చేశాడు… ఇక ప్రస్తుతం ఆయన సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా మీదనే పూర్తి ఫోకస్ పెట్టాడు.

ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అయిన వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. ఆయన ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు… రీసెంట్ గా ప్రభాస్ వివేక్ ఒబెరాయ్ మధ్య కొన్ని యాక్షన్స్ సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రభాస్ వివేక్ ఒబెరాయ్ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి తన దగ్గరికి రావాలని చెబుతున్నాడట. ప్రభాస్ మంచితనానికి ఫిదా అయిపోయినా వివేక్ రియాల్ హీరో అంటే ప్రభాస్ మాత్రమే అని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. ఆయన సినిమాల్లో యాక్టింగ్ చేయడం విషయం పక్కనపెడితే హ్యుమానిటీ విషయంలో గానీ, ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడంలో గాని ప్రభాస్ తర్వాతే ఎవరైనా అంటూ ఆయన కామెంట్లు చేస్తుండటం విశేషం…

ప్రభాస్ లాంటి మంచి మనసున్న హీరోను నేను బాలీవుడ్ లో చూడలేదు అంటూ ఆయన కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ స్టార్ హీరోగా అవతరించిన కూడా తన ఫ్రెండ్స్ దగ్గర గాని రిలేటివ్స్ దగ్గర గాని చాలా హంబుల్ గా ఉంటాడనే విషయాన్ని చాలా మంది సెలబ్రిటీలు పలు సందర్భాల్లో తెలియజేశారు. మరోసారి బాలీవుడ్ హీరో అయిన వివేక్ ఒబెరాయ్ ఈ విషయాన్ని చెబుతూ ఉండడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…

హోరుగాలికి వంతెన కుప్పకూలిపోయింది.. చూస్తుండగానే ఆరుగురి ప్రాణాలు..

UP Hamirpur Bridge Collapse
UP Hamirpur Bridge Collapse

UP Hamirpur Bridge Collapse: అది మామూలు గాలి కాదు. ప్రచండమైన గాలి.. విపరీతమైన వేగంతో దూసుకొచ్చింది. దూసుకురావడమే కాదు, పెను ఉత్పాతాన్ని సృష్టించింది. ఆ గాలి తాకిడికి చిన్న చిన్న వస్తువులు కాదు, పెద్ద పెద్ద హోర్డింగులు చిగురుటకులా వణికి పోయాయి. విరిగిపోయి గాలిలో తేలియాడాయి. ఆ గాలి అక్కడితోనే ఆగిపోలేదు. ఆ స్థాయి నష్టం తోనే ఆగిపోలేదు. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఘోరమైన నష్టానికి కారణమైంది.

ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీకరమైన గాలులు వీచాయి. విపరీతంగా వర్షం కురిసింది. ఈ దారుణమైన ఘటన వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఎక్కువ సంఖ్యలో గాయపడ్డారు. అయితే ఈ సంఘటనలను మర్చిపోకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్పూర్ జిల్లాలోని బెత్వ నది మీద నిర్మిస్తున్న వంతెన హోరుగాలి తాకిడికి కూలిపోయింది. గాలి తాకిడికి బ్రిడ్జి మొత్తం ఊగిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు కన్నుమూశారు. అర్ధరాత్రి సమయంలో గాలి విపరీతంగా రావడంతో.. ఆ వేగానికి వంతెన ఊగిపోయి కూలిపోయింది. దీంతో గాడ నిద్రలో ఉన్న ఆరుగురు కార్మికులు చనిపోయారు.

కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఆ వంతెన ఈదురు గాలుల వల్ల ఊగిపోయి కూలిపోయింది. ముందుగా గడ్డర్లు ఊగిపోయాయి. ఆ తర్వాత ఐరన్ సామాగ్రి నేల కూలింది. దీంతో కార్మికులు నిద్రలోనే వాటి కింద పడిపోయి కన్నుమూశారు. పలువురు గాయపడ్డారు. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అదే స్థాయిలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. గాలుల తీవ్రత వల్ల నష్టం అపారంగా చోటుచేసుకుంటున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడు కూడా వేసవికాలంలో ఈ స్థాయిలో ఈదురుగాలులు వీచలేదు. వర్షాలు కురియలేదు. ఈసారి మాత్రమే భిన్నంగా పరిస్థితి ఉంది. దీనివల్ల ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణనష్టం కూడా విపరీతంగా చోటు చేసుకుంటున్నది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల ఉపరితలం విపరితంగా వేడెక్కిందని.. దానివల్ల వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. అందువల్లే ఇలా వర్షాలు.. గాలులు వీస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.. సాధ్యమైనంతవరకు ఈదురుగాలులు వీస్తున్నప్పుడు ఆరుబయట నిద్రపోకపోవడమే మంచిదని చెబుతున్నారు.

చదువుకుంటూనే సంపాదించే స్మార్ట్ మార్గాలు ఇవే.. స్కూడెంట్స్ కు బెస్ట్ ఆప్షన్స్..

Best earning methods for Students
Best earning methods for Students

Best earning methods for Students: పెరుగుతున్న కాలేజీ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, పోటీ పరీక్షల కోచింగ్ ఫీజులు విద్యార్థులపై ఆర్థిక భారం పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో చదువులకు ఆటంకం కలగకుండా ప్రతి నెలా కొంత పాకెట్ మనీ సంపాదించాలని చాలా మంది విద్యార్థులు కోరుకుంటున్నారు. ఒకప్పుడు పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో కేవలం స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే చాలు, ఇంట్లో నుంచే ఫ్రీలాన్సింగ్ ద్వారా ఆదాయం పొందే అవకాశాలు విస్తరించాయి. అవేంటో చూద్దాం..

ఫ్రీలాన్సింగ్‌:
ఫ్రీలాన్సింగ్‌లో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, ఇందులో పని చేసే సమయాన్ని విద్యార్థులే నిర్ణయించుకోవచ్చు. కాలేజీ లేదా చదువు పూర్తయ్యాక ఖాళీ సమయంలో పనులు పూర్తి చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా చాలా పనులకు పెద్ద డిగ్రీలు లేదా అనుభవం కూడా అవసరం ఉండదు. టైపింగ్ స్పీడ్, భాషపై పట్టు, కంప్యూటర్‌పై ప్రాథమిక అవగాహన ఉంటే సరిపోతుంది.ఫ్రీలాన్సింగ్ పనులను పొందేందుకు కొన్ని ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి. Upwork, Freelancer India, Truelancer, Fiverr వంటి వెబ్‌సైట్లలో ఖాతా సృష్టించి తమ నైపుణ్యాలను నమోదు చేసుకోవచ్చు. పని ఇచ్చే కంపెనీలు లేదా వ్యక్తులు అక్కడే ప్రాజెక్టులను పోస్టు చేస్తారు. ఆసక్తి ఉన్న ఫ్రీలాన్సర్లు వాటికి దరఖాస్తు చేసుకోవచ్చు.

డేటా ఎంట్రీ :
ప్రస్తుతం మార్కెట్లో డేటా ఎంట్రీ పనులకు మంచి డిమాండ్ ఉంది. ఎక్సెల్ షీట్లు అప్‌డేట్ చేయడం, PDF ఫైళ్లను Word డాక్యుమెంట్లుగా మార్చడం, ఆన్‌లైన్ ఫారమ్‌లు నింపడం, కంపెనీల రికార్డులను డిజిటల్ రూపంలో నమోదు చేయడం వంటి పనులు విద్యార్థులకు సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. ఈ పనులను రోజుకు కొన్ని గంటలు కేటాయించి పూర్తి చేస్తే నెలకు అదనపు ఆదాయం పొందవచ్చు.

ట్రాన్స్‌లేషన్ :
అలాగే ట్రాన్స్‌లేషన్ పనులు కూడా ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న రంగంగా మారాయి. ఇంగ్లీష్‌లో ఉన్న సమాచారం లేదా వ్యాసాలను తెలుగు, హిందీ వంటి ప్రాంతీయ భాషల్లోకి అనువదించే ప్రాజెక్టులకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ప్రాంతీయ కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో భాషపై పట్టు ఉన్న విద్యార్థులకు ఇవి మంచి అవకాశాలుగా మారుతున్నాయి.

కంటెంట్ రైటింగ్:
ఇక సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, కంటెంట్ రైటింగ్, వీడియో సబ్‌టైటిల్స్ తయారీ, ట్రాన్స్‌క్రిప్షన్ వంటి పనులు కూడా విద్యార్థులు ఇంటి నుంచే చేయగలిగేవే. యూట్యూబ్ ఛానెల్లు, చిన్న వ్యాపారాలు, డిజిటల్ మార్కెటింగ్ సంస్థలు ఫ్రీలాన్సర్ల సహాయాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో అవకాశాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

Fiverr :
ఈ ప్లాట్‌ఫారమ్‌లో చిన్నచిన్న సేవలను ‘గిగ్స్’ రూపంలో విక్రయించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు టైపింగ్, ట్రాన్స్‌లేషన్, డేటా ఎంట్రీ, పోస్టర్ డిజైన్, సోషల్ మీడియా పోస్టుల తయారీ వంటి సేవలను అందించవచ్చు. ప్రారంభంలో చిన్న మొత్తాలతో మొదలైనా, అనుభవం పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది.

ఎస్క్రో:
ఫ్రీలాన్సింగ్‌లో చెల్లింపుల భద్రత కోసం చాలా ప్లాట్‌ఫారమ్‌లు “ఎస్క్రో” (Escrow) వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. ఇందులో పని ఇచ్చే వ్యక్తి ముందుగానే డబ్బును ప్లాట్‌ఫారమ్ వద్ద జమ చేస్తాడు. ఫ్రీలాన్సర్ పని పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఆ డబ్బు విడుదల అవుతుంది. దీంతో మోసాలకు అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా కొత్తగా ఫ్రీలాన్సింగ్ ప్రారంభించే విద్యార్థులకు ఇది భద్రత కల్పిస్తుంది.

అయితే ఆన్‌లైన్ ఉద్యోగాల విషయంలో అప్రమత్తత కూడా చాలా అవసరం. ‘రోజుకు రూ. 5,000 సంపాదించండి’, ‘ఎటువంటి పని లేకుండా భారీ ఆదాయం’ వంటి ప్రకటనలను నమ్మకూడదు. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు లేదా డిపాజిట్ అడిగే సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నిజమైన ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్లు సాధారణంగా ఉద్యోగం కోసం డబ్బు అడగవు.

Xiaomi నుంచి సరికొత్త ఫోన్ మార్కెట్లోకి.. వెంటనే త్వరపడండి

Xiaomi 17T new smartphone launch
Xiaomi 17T new smartphone launch

Xiaomi 17T new smartphone launch: Xiaomi తన సరికొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో భాగంగా Xiaomi 17Tని భారత మార్కెట్‌లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు ఈ షియోమీ నుంచి వినియోగదారులను ఆకట్టుకునే మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు లేటేస్ట్ టెక్నాలజీతోవస్తున్న దీనిపై అంచనాలు ఎక్కువవయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితె..

Xiaomi 17T స్మార్ట్‌ఫోన్ 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రానుంది. ఇది 1.5K రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. దీనికి TÜV రీన్‌ల్యాండ్ ఐ-కేర్ సర్టిఫికేషన్ కూడా లభించింది. దీంతో ఇది కళ్ళపై ఒత్తిడిని తగ్గిస్తుంది.ఈ ఫోన్ మీడియాటెక్ యొక్క శక్తివంతమైన Dimensity 8500 Ultra ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్ , హై-ఎండ్ పర్ఫార్మెన్స్‌ను సులభతరం చేస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా, ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ పై పనిచేయనుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ ఇందులో ఉండే Leica-tuned ట్రిపుల్ కెమెరా సెటప్. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ , 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ పనిచేస్తుంది. ఇది 120x వరకు డిజిటల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుందని, తద్వారా ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది ఒక ‘టెలిఫోటో మాస్టర్’గా నిలుస్తుందని కంపెనీ భావిస్తోంది. Xiaomi 17Tలో 6,500 mAh సామర్థ్యం గల భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించనున్నారు. ఇది సుదీర్ఘ కాలం పాటు ఫోన్ ఛార్జింగ్ నిలిచి ఉండేలా చేస్తుంది. దీనికి తోడు, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇందులో చేర్చారు. దీనివల్ల తక్కువ సమయంలోనే ఫోన్ ఛార్జ్ అవుతుంది.

షియోమీ 17T స్మార్ట్‌ఫోన్ భారత్‌లో జూన్ 04, 2026న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. చాలా కాలం తర్వాత షియోమీ తన ‘T’ సిరీస్ ఫోన్‌ను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకువస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది.

‘ఉడుంపట్టు’ జాతీయం వెనుక అసలు కథ ఇదీ..

Story behind Udumpattu: తెలుగు భాషలో అనేక జాతీయాలు ప్రజల జీవన విధానం, ప్రకృతి పరిశీలన, జంతువుల లక్షణాలు వంటి అంశాల ఆధారంగా పుట్టుకొచ్చాయి. అలాంటి ప్రసిద్ధ జాతీయాల్లో ఒకటి ‘ఉడుంపట్టు’. ఎవరైనా ఒక పని ప్రారంభించిన తర్వాత అది పూర్తయ్యే వరకు వదలకుండా పట్టుదలతో కొనసాగిస్తే ‘ఉడుంపట్టు పట్టాడు” అని అంటారు. ఈ జాతీయం వెనుక ఒక ఆసక్తికరమైన చారిత్రక నేపథ్యం ఉంది.

ఉడుము అనేది బల్లి జాతికి చెందిన ఒక జంతువు. ఇది సాధారణంగా అడవుల్లో, రాళ్ల ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఆకారంలో పెద్దగా లేకపోయినా దీని శరీర నిర్మాణం చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా దీని కాళ్లకు, కోరలకు ఉండే పట్టు అసాధారణం. ఒకసారి గోడ లేదా రాయిని పట్టుకుంటే చాలా బలంగా పట్టుకుని వదలదు. అందుకే పురాతన కాలంలో దీనిని ప్రత్యేకంగా ఉపయోగించేవారని చెబుతారు.

పూర్వకాలంలో రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు భటులు ఎత్తైన కోట గోడలు ఎక్కడానికి ఎన్నో వ్యూహాలు అమలు చేసేవారు. ఆ సమయంలో ఉడుమును ఒక సాధనంగా ఉపయోగించేవారని పురాణ కథనాలు, జానపద గాథలు చెబుతున్నాయి. ఉడుము నడుముకు తాళ్లు కట్టి, దాని కోరలకు తేనె రాసి కోట గోడలపైకి వదిలేవారట. తేనెను నాకుతూ అది పైకి ఎక్కేది. ఒకసారి గోడను గట్టిగా పట్టుకున్న తర్వాత ఎంత బరువు వేలాడినా తన పట్టు వదలకుండా ఉండేదని చెబుతారు.

అలా ఉడుము యొక్క బలమైన పట్టుదల ప్రజలలో ఒక నానుడిగా మారింది. కాలక్రమేణా ‘ఉడుము పట్టుకున్నట్టు’ అనే మాట ‘ఉడుంపట్టు’ అనే జాతీయంగా స్థిరపడింది. అంటే ఏ పని అయినా మధ్యలో వదలకుండా, ఎంత కష్టం వచ్చినా పూర్తి చేసే వరకు కట్టుబడి ఉండే వ్యక్తిని సూచించడానికి ఈ పదాన్ని వాడటం ప్రారంభమైంది.

ప్రస్తుతం కూడా రాజకీయాలు, క్రీడలు, చదువు, వ్యాపారం వంటి రంగాల్లో పట్టుదలతో ముందుకు సాగే వారిని చూసి ‘అతనికి ఉడుంపట్టు ఉంది’ అని అంటుంటారు. ముఖ్యంగా లక్ష్య సాధనలో వెనక్కి తగ్గకుండా శ్రమించే వ్యక్తులను ప్రశంసించడానికి ఈ జాతీయం ఎక్కువగా ఉపయోగిస్తారు.

'పుష్ప 2' రికార్డ్ ను బ్రేక్ చేసే తెలుగు సినిమాలు ఇవేనా..?

Pushpa 2 record breaking Telugu movies
Pushpa 2 record breaking Telugu movies

Pushpa 2 record breaking Telugu movies: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమా పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. పాన్ ఇండియాలో ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభించింది. లాంగ్ రన్ లో ఈ సినిమా 1950 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడమే కాకుండా ‘బాహుబలి 2’ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అన్ని సినిమాల్లో ‘పుష్ప 2’ సినిమా భారీ రికార్డులను కొల్లగొట్టి అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది…ఇక ఇప్పుడు సినిమా రికార్డును బ్రేక్ చేయగలిగే తెలుగు సినిమా ఏది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం పెద్ది సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్న రామ్ చరణ్ సైతం ‘పుష్ప 2’ రికార్డును బ్రేక్ చేయగలుగుతాడు అంటూ అతని అభిమానులైతే కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు.

సినిమా యూనిట్ నుంచి కూడా ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తుందని లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ రాబడుతుందనే విషయం చెప్పడం కష్టం అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి…ఇక ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వస్తున్న ‘స్పిరిట్’ సినిమా కూడా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లకొడుతుందనే అంచనాలో ఉన్నారు. కాబట్టి అంతటి వసూళ్లను రాబడితే ‘పుష్ప 2’ సినిమా రికార్డు బ్రేక్ అవుతుందనే చెప్పాలి…

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ‘వారణాసి’ సినిమా వచ్చిందంటే చాలు ‘పుష్ప 2’ సినిమాతో పాటుగా మరిన్ని సినిమా రికార్డులు కూడా బ్రేక్ అవ్వబోతున్నాయనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా రాజమౌళి నుంచి వచ్చే సినిమాలు ఎంతటి పెను సంచలనాలను క్రియేట్ చేస్తాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ మూవీని రాజమౌళి చాలా ప్రెస్టేజీయస్ గా తెరకెక్కిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా ఇంకెలా ఉండబోతుందో మనం అంచనా వేసుకోవచ్చు… ఇక ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ సైతం భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి… మొత్తానికైతే రాబోయే సంవత్సరాల కాలంలో ‘పుష్ప 2’ సినిమా రికార్డు బ్రేక్ అవ్వడమే కాకుండా మరిన్ని కొత్త రికార్డులు కూడా క్రియేట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…