Home Blog Page 218

Xiaomi నుంచి సరికొత్త ఫోన్ మార్కెట్లోకి.. వెంటనే త్వరపడండి

Xiaomi 17T new smartphone launch
Xiaomi 17T new smartphone launch

Xiaomi 17T new smartphone launch: Xiaomi తన సరికొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో భాగంగా Xiaomi 17Tని భారత మార్కెట్‌లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు ఈ షియోమీ నుంచి వినియోగదారులను ఆకట్టుకునే మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు లేటేస్ట్ టెక్నాలజీతోవస్తున్న దీనిపై అంచనాలు ఎక్కువవయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితె..

Xiaomi 17T స్మార్ట్‌ఫోన్ 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రానుంది. ఇది 1.5K రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. దీనికి TÜV రీన్‌ల్యాండ్ ఐ-కేర్ సర్టిఫికేషన్ కూడా లభించింది. దీంతో ఇది కళ్ళపై ఒత్తిడిని తగ్గిస్తుంది.ఈ ఫోన్ మీడియాటెక్ యొక్క శక్తివంతమైన Dimensity 8500 Ultra ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్ , హై-ఎండ్ పర్ఫార్మెన్స్‌ను సులభతరం చేస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా, ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ పై పనిచేయనుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ ఇందులో ఉండే Leica-tuned ట్రిపుల్ కెమెరా సెటప్. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ , 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ పనిచేస్తుంది. ఇది 120x వరకు డిజిటల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుందని, తద్వారా ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది ఒక ‘టెలిఫోటో మాస్టర్’గా నిలుస్తుందని కంపెనీ భావిస్తోంది. Xiaomi 17Tలో 6,500 mAh సామర్థ్యం గల భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించనున్నారు. ఇది సుదీర్ఘ కాలం పాటు ఫోన్ ఛార్జింగ్ నిలిచి ఉండేలా చేస్తుంది. దీనికి తోడు, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇందులో చేర్చారు. దీనివల్ల తక్కువ సమయంలోనే ఫోన్ ఛార్జ్ అవుతుంది.

షియోమీ 17T స్మార్ట్‌ఫోన్ భారత్‌లో జూన్ 04, 2026న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. చాలా కాలం తర్వాత షియోమీ తన ‘T’ సిరీస్ ఫోన్‌ను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకువస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది.

‘ఉడుంపట్టు’ జాతీయం వెనుక అసలు కథ ఇదీ..

Story behind Udumpattu: తెలుగు భాషలో అనేక జాతీయాలు ప్రజల జీవన విధానం, ప్రకృతి పరిశీలన, జంతువుల లక్షణాలు వంటి అంశాల ఆధారంగా పుట్టుకొచ్చాయి. అలాంటి ప్రసిద్ధ జాతీయాల్లో ఒకటి ‘ఉడుంపట్టు’. ఎవరైనా ఒక పని ప్రారంభించిన తర్వాత అది పూర్తయ్యే వరకు వదలకుండా పట్టుదలతో కొనసాగిస్తే ‘ఉడుంపట్టు పట్టాడు” అని అంటారు. ఈ జాతీయం వెనుక ఒక ఆసక్తికరమైన చారిత్రక నేపథ్యం ఉంది.

ఉడుము అనేది బల్లి జాతికి చెందిన ఒక జంతువు. ఇది సాధారణంగా అడవుల్లో, రాళ్ల ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఆకారంలో పెద్దగా లేకపోయినా దీని శరీర నిర్మాణం చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా దీని కాళ్లకు, కోరలకు ఉండే పట్టు అసాధారణం. ఒకసారి గోడ లేదా రాయిని పట్టుకుంటే చాలా బలంగా పట్టుకుని వదలదు. అందుకే పురాతన కాలంలో దీనిని ప్రత్యేకంగా ఉపయోగించేవారని చెబుతారు.

పూర్వకాలంలో రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు భటులు ఎత్తైన కోట గోడలు ఎక్కడానికి ఎన్నో వ్యూహాలు అమలు చేసేవారు. ఆ సమయంలో ఉడుమును ఒక సాధనంగా ఉపయోగించేవారని పురాణ కథనాలు, జానపద గాథలు చెబుతున్నాయి. ఉడుము నడుముకు తాళ్లు కట్టి, దాని కోరలకు తేనె రాసి కోట గోడలపైకి వదిలేవారట. తేనెను నాకుతూ అది పైకి ఎక్కేది. ఒకసారి గోడను గట్టిగా పట్టుకున్న తర్వాత ఎంత బరువు వేలాడినా తన పట్టు వదలకుండా ఉండేదని చెబుతారు.

అలా ఉడుము యొక్క బలమైన పట్టుదల ప్రజలలో ఒక నానుడిగా మారింది. కాలక్రమేణా ‘ఉడుము పట్టుకున్నట్టు’ అనే మాట ‘ఉడుంపట్టు’ అనే జాతీయంగా స్థిరపడింది. అంటే ఏ పని అయినా మధ్యలో వదలకుండా, ఎంత కష్టం వచ్చినా పూర్తి చేసే వరకు కట్టుబడి ఉండే వ్యక్తిని సూచించడానికి ఈ పదాన్ని వాడటం ప్రారంభమైంది.

ప్రస్తుతం కూడా రాజకీయాలు, క్రీడలు, చదువు, వ్యాపారం వంటి రంగాల్లో పట్టుదలతో ముందుకు సాగే వారిని చూసి ‘అతనికి ఉడుంపట్టు ఉంది’ అని అంటుంటారు. ముఖ్యంగా లక్ష్య సాధనలో వెనక్కి తగ్గకుండా శ్రమించే వ్యక్తులను ప్రశంసించడానికి ఈ జాతీయం ఎక్కువగా ఉపయోగిస్తారు.

'పుష్ప 2' రికార్డ్ ను బ్రేక్ చేసే తెలుగు సినిమాలు ఇవేనా..?

Pushpa 2 record breaking Telugu movies
Pushpa 2 record breaking Telugu movies

Pushpa 2 record breaking Telugu movies: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమా పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. పాన్ ఇండియాలో ఈ సినిమాకి విశేషమైన ఆదరణ లభించింది. లాంగ్ రన్ లో ఈ సినిమా 1950 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడమే కాకుండా ‘బాహుబలి 2’ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అన్ని సినిమాల్లో ‘పుష్ప 2’ సినిమా భారీ రికార్డులను కొల్లగొట్టి అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది…ఇక ఇప్పుడు సినిమా రికార్డును బ్రేక్ చేయగలిగే తెలుగు సినిమా ఏది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం పెద్ది సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్న రామ్ చరణ్ సైతం ‘పుష్ప 2’ రికార్డును బ్రేక్ చేయగలుగుతాడు అంటూ అతని అభిమానులైతే కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు.

సినిమా యూనిట్ నుంచి కూడా ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తుందని లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ రాబడుతుందనే విషయం చెప్పడం కష్టం అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి…ఇక ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వస్తున్న ‘స్పిరిట్’ సినిమా కూడా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లకొడుతుందనే అంచనాలో ఉన్నారు. కాబట్టి అంతటి వసూళ్లను రాబడితే ‘పుష్ప 2’ సినిమా రికార్డు బ్రేక్ అవుతుందనే చెప్పాలి…

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేస్తున్న ‘వారణాసి’ సినిమా వచ్చిందంటే చాలు ‘పుష్ప 2’ సినిమాతో పాటుగా మరిన్ని సినిమా రికార్డులు కూడా బ్రేక్ అవ్వబోతున్నాయనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా రాజమౌళి నుంచి వచ్చే సినిమాలు ఎంతటి పెను సంచలనాలను క్రియేట్ చేస్తాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ మూవీని రాజమౌళి చాలా ప్రెస్టేజీయస్ గా తెరకెక్కిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా ఇంకెలా ఉండబోతుందో మనం అంచనా వేసుకోవచ్చు… ఇక ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీ సైతం భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి… మొత్తానికైతే రాబోయే సంవత్సరాల కాలంలో ‘పుష్ప 2’ సినిమా రికార్డు బ్రేక్ అవ్వడమే కాకుండా మరిన్ని కొత్త రికార్డులు కూడా క్రియేట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…

'పెద్ది' మూవీలో జాన్వీ కపూర్ రామ్ చరణ్ ను కాకుండా అతన్ని లవ్ చేస్తుందా..?

Janhvi Kapoor love track in Peddi movie
Janhvi Kapoor love track in Peddi movie

Janhvi Kapoor love track in Peddi movie: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన్ పెద్ది సినిమా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి డివైడ్ టాక్ వచ్చింది. కొంత మంది బాగుంది అంటే మరి కొంతమంది అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదనే సమాధానం చెప్పారు… ఈ మూవీకి సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ని జూన్ ఒకటోవ తేదీన హైదరాబాద్ లో రంగ వైభవంగా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ చేసిన ఈ సినిమాలో అతని క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుందంటూ దర్శకుడు క్లారిటీ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే దేవర సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన జాన్వికపూర్ ఈ సినిమాలో కూడా డిఫరెంట్ పాత్రలో కనిపించబోతుందనే విషయం మనకు చాలా క్లారిటీగా తెలుస్తుంది…

ఈ సినిమాలో ఒక విలేజ్ గర్ల్ గా కనిపించబోతున్న జాన్వీ కపూర్ మొదట రామ్ చరణ్ ని కాకుండా దివ్యాందు శర్మని ప్రేమిస్తుందట. రామ్ చరణ్ పరిచయమైన తర్వాత దివ్యాందు శర్మ ఒక మోసగాడు అని తెలుసుకొని ఆ తర్వాత రామ్ చరణ్ తో ప్రేమలో పడుతుందట. ఊరి కోసం రామ్ చరణ్ పడుతున్న కష్టాన్ని చూసి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కంటతడి పెట్టుకుంటాడనే విషయాన్ని బుచ్చిబాబు చాలా స్పష్టంగా తెలియజేశాడు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన హీరోయిజం తో పాటు ఎమోషన్ ని కూడా భారీగా పండించబోతున్నారట. క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెట్టుకుంటారని బుచ్చిబాబు చెబుతున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…

మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమాతో ఒక సక్సెస్ ను సాధిస్తే పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన వాడవుతాడు. లేకపోతే మాత్రం ఆయన మరోసారి డీలా పడిపోతాడనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమాను ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది సినీ పెద్దలు చూశారట. వాళ్ళు పాజిటివ్ గా స్పందించినట్టుగా తెలుస్తుంది…

వైసిపి ఆదాయం 140 కోట్లు.. ఖర్చు 340.20 కోట్లు.. ఇది ఎలా సాధ్యం..

YSRCP income and expenditure controversy
YSRCP income and expenditure controversy

YSRCP income and expenditure controversy: అధికారం ముగిసిన తర్వాత చూడాలి అయ్యవారి చిత్రాలని వెనకటికి ఒక సామెత ఉండేది. ఆ సామెత ఇప్పుడు మార్చి చదువుకోవాలేమో.. ఎందుకంటే వైసిపి అలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది. వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీకి భారీగా విరాళాలు వస్తూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలలో వైసిపి వ్యవహార శైలి పూర్తి విభిన్నం కదా.. ఆదాయం, ఖర్చుల విషయాలను కూడా అదే స్థాయిని చూపించింది.

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ సంస్థ నివేదిక ప్రకారం 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అత్యధిక ఆదాయాన్ని సాధించిన రీజినల్ పార్టీగా వైసిపి (140 కోట్లతో) మూడవ స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాలలో టిడిపి 228.31 కోట్లు, టిఎంసి 219 కోట్లతో కొనసాగుతున్నాయి. అయితే ఖర్చుల పరంగా 340. 20 కోట్లతో వైసిపి తొలి స్థానంలో ఉంది. బీజేడి, టిఎంసి తర్వాత స్థానాలలో కొనసాగుతున్నాయి. దేశంలో 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం 36 మాత్రమే ఆడిట్ రిపోర్ట్ సమర్పించాయి. వాటి ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ బయటపెట్టింది.

వైసీపీకి ఆదాయం 140 కోట్లు ఉన్నప్పటికీ.. ఆ స్థాయిలో ఖర్చుపెట్టడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏకంగా 340.20 కోట్లు ఖర్చు ఎలా సాధ్యమైందో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆదాయానికి మించి చేసిన ఖర్చును.. ఎలా భర్తీ చేస్తారని.. ఇది ఎలా సాధ్యమవుతుందని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపించారా.. చేసిన ఖర్చును ఎక్కువ చేసి చూపించారా.. ఖర్చుకు.. వచ్చిన ఆదాయానికి లంకె కుదరకపోవడం ఏంటని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు వైసిపికి భారీగా విరాళాలు వచ్చాయి. ఇందులో కొన్ని కాంట్రాక్టు సంస్థలు భారీగా ఆ పార్టీకి విరాళాలు సమర్పించాయని తెలుస్తోంది. వచ్చిన వాటిల్లో కొన్ని విరాళాలు మాత్రమే వైసిపి చూపించిందని.. మిగతా వాటిని దాచిందని టిడిపి నేతలు అంటున్నారు. పైగా ఖర్చు విషయంలో కూడా వైసిపి చెప్పిన సమాచారానికి పొంతనలేదని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. తమ పార్టీ దేశంలోనే రిచెస్ట్ రీజినల్ పార్టీగా నిలిచిందని వారు చెబుతున్నారు. 228.31 కోట్ల ఆదాయం ఉన్నప్పటికీ.. ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఉందని.. ఆదాయానికి మించిన ఖర్చు తాము చేయలేదని.. కానీ వైసీపీకి ఇది ఎలా సాధ్యమైందో అర్థం కావడం లేదని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

వైసిపికి ఈ స్థాయిలో ఆదాయం వచ్చి.. ఖర్చు అంతకు మించిన స్థాయిలో ఉన్నప్పటికీ.. దీనికి సంబంధించిన ఒక వార్తను కూడా ఆ పార్టీ మీడియా విభాగం పబ్లిష్ చేయలేదని.. దీనినిబట్టి ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ఆర్థిక వ్యవహారాలకు పాల్పడే వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో దోచుకుని ఉంటారో అర్థం చేసుకోవచ్చని టిడిపి నేతలు వివరిస్తున్నారు. బహుశా దేశంలో ఇటువంటి ఆర్థిక వ్యవహారాలకు పాల్పడే రీజినల్ పార్టీలలో వైసిపి ప్రథమ స్థానంలో ఉంటుందని.. ఆ పార్టీ రికార్డును ఏ పార్టీ కూడా చెరిపి వేయలేదని టిడిపి నేతలు వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు.

అతడు జట్టులో ఉన్నాడు.. రాసి పెట్టుకోండి ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరు దే..

RCB IPL trophy hopes
RCB IPL trophy hopes

RCB IPL trophy hopes: దాదాపు 18 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ లభించింది. 2025 సీజన్లో బెంగళూరు ఐపిఎల్ విజేతగా నిలిచింది. ఈ సీజన్లో కూడా బెంగళూరు ఫైనల్ వెళ్లిపోయింది. క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్ జట్టు మీద అద్భుతమైన విజయం సాధించి.. బెంగళూరు వరుసగా రెండవ సీజన్లో కూడా ఫైనల్ వెళ్లిపోయి సరికొత్త చరిత్ర సృష్టించింది. బెంగళూరులో విరాట్ కోహ్లీ నుంచి మొదలు పెడితే కృనాల్ పాండ్యా వరకు అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. వీరంతా సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నారు.

బెంగళూరు ఈసారి కూడా ట్రోఫీ సాధిస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ జట్టు ఆడుతున్న తీరు అలా ఉంది మరి. ప్రతి మ్యాచ్లో కూడా వీరోచితమైన పోరాటం చేస్తోంది బెంగళూరు. ఫలితంగా ఏకపక్ష విజయాలు సాధిస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. అయితే బెంగళూరులో మిగతా ఆటగాళ్లు ఎలా ఉన్నప్పటికీ.. జోష్ హేజిల్ వుడ్ ఉంటే చాలు ట్రోఫీ ఆ జట్టు సొంతమవుతుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్ వుడ్ జట్లకు లక్కీ చాం లాంటివాడని గణాంకాలు చెబుతున్నాయి. వైట్ బాల్ ఫార్మేట్ లో అతడు ప్రాతినిధ్యం వహించిన జట్లు ఇప్పటివరకు ఫైనల్ మ్యాచ్లలో ఓడిపోలేదు.

2010లో అండర్-19 వరల్డ్ కప్ ను ఆసీస్ సొంతం చేసుకుంది. 2012లో సిఎల్ టి20 టోర్నీలో సిడ్నీ సిక్సర్స్ విజయం సాధించింది. 2015లో వన్డే వరల్డ్ కప్ ను కంగారు జట్టు సొంతం చేసుకుంది. 2020లో బిబిఎల్ టోర్నీలో సిడ్నీ సిక్సర్స్.. 2021లో చెన్నై సూపర్ కింగ్స్.. 2021 టి20 వరల్డ్ కప్ లో కంగారు జట్టు.. 2023లో వన్డే వరల్డ్ కప్ లో మళ్లీ కంగారు జట్టు సొంతం చేసుకున్నాయి.. 2025 ఐపీఎల్ ఫైనల్ లో బెంగళూరు గెలుపును అందుకుంది. ఈ జట్లు ఫైనల్ లలో ట్రోఫీలు గెలవడంలో హేజిల్ వుడ్ కీలకపాత్ర పోషించాడు. అయితే ఐపీఎల్ ఫైనల్ లో కూడా ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని కన్నడ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ గనుక బెంగళూరు విషయంలో అతడు కీలకపాత్ర పోషిస్తే.. ఇక తిరుగు ఉండదు. అంతేకాదు అతడి క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం నమోదు అవుతుంది.

ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో హేజిల్ వుడ్ విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. బంతిని వైవిద్యంగా ఎలా వేయాలో నేర్చుకుంటున్నాడు. అంతేకాదు మైదానంలో పరుగులు పెడుతూ సరికొత్తగా సాధన చేస్తున్నాడు. ఫైనల్ మ్యాచ్లో హేజిల్ వుడ్ చుక్కలు చూపించడం ఖాయమని బెంగళూరు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆ స్టార్ డైరెక్టర్ కి 10 ఏళ్లుగా అవకాశం ఇవ్వని వెంకటేష్.. కారణం ఏంటంటే..?

Venkatesh and director controversy
Venkatesh and director controversy

Venkatesh and director controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ పేరు చెబితే చాలు ఫ్యామిలీ సినిమాలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఎందుకంటే అతను ఫ్యామిలీ సినిమాలను చేసి ప్రేక్షకులను థియేటర్ కి రప్పించాడు. ముఖ్యంగా ఆయన లాంటి నటుడు ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. శోభన్ బాబు తర్వాత ఆ రేంజ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన నటుడు కూడా తనే కావడం విశేషం… వెంకటేష్ సినిమా పండక్కి వచ్చిందంటే ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అవతలిపక్క ఏ హీరో ఉన్నా కూడా వెంకటేష్ సినిమా చూసిన తర్వాతే ఫ్యామిలీ ఆడియన్స్ మిగతా వాళ్ళ సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.

ఇక గత సంవత్సరం సంక్రాంతికి పండక్కి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని సాధించిన ఘనత అతనికే దక్కింది… అలాంటి వెంకటేష్ ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

డైరెక్టర్ తేజ వెంకటేష్ తో 10 సంవత్సరాల క్రితం నుంచి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆ సినిమా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. కారణం ఏదైనా కూడా తేజ కి వెంకటేష్ వాళ్ళ అన్నయ్య సురేష్ బాబుకి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే రానా ని హీరోగా పెట్టి ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమా చేశాడు.

ఆ మూవీ సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక సురేష్ బాబు చిన్న కొడుకు అయిన అభిరామ్ ను హీరోగా పెట్టి అహింస మూవీ చేశాడు. వెంకటేష్ తో ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో తేజఉన్నారట. గతంలో వెంకటేష్ కి ఒక మంచి కథను వినిపించినప్పటికి అది చివరి నిమిషంలో పట్టాలెక్కలేదు. మరి ఎందుకని వీళ్ళ కాంబినేషన్లో సినిమా సెట్ అవ్వడం లేదనే ధోరణిలో కూడా వెంకటేష్ సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… ఇక వెంకటేష్ తేజ కాంబినేషన్లో ఒక సినిమా పడితే ఆ మూవీకి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అయితే దక్కుతుంది…

ఆ హిట్ మూవీ సీక్వెల్ లో నాగార్జున నటిస్తున్నాడా..?

Nagarjuna
Nagarjuna

Nagarjuna acting in Hit movie sequel: నాగార్జున హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. కెరియర్ స్టార్టింగ్ లో రొమాంటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత మాస్ హీరోగా అవతరించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను చేయడంలో కూడా అతనిని మించిన వారు ఎవరు లేరనెంతల పేరు ప్రఖ్యాతలను పొందాడు. ఇక పౌరాణిక సినిమాలకు కూడా నాగార్జున కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ముఖ్యంగా అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించిన ఆయన ఆ తర్వాత కాలంలో కూడా షిరిడి సాయిబాబా, ఓం నమో వెంకటేశాయ లాంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. అయితే ఇప్పుడు నాగార్జున ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ లో నటించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన మనం సినిమా వాళ్ళ ఫ్యామిలీ మూవీ లాగా హిస్టరీ లో అలా నిలిచిపోయిందని చెప్పాలి. ఇక అలాంటి సినిమాకి సీక్వెల్ గా మనం 2 మూవీ చేయాలనే ఉద్దేశ్యంలో నాగార్జున ఉన్నాడట. ఇక ఇప్పటికే విక్రమ్ కే కుమార్ అతనికి కథనైతే వినిపించాడు.

ఆ కథ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉండడంతో నాగార్జున ‘మనం 2’ సినిమా చేద్దామా అనే ధోరణిలో ఆలోచిస్తున్నారట. ఇక మనం 2 అనే సినిమా చేస్తే ఆ సినిమా మొదటి పార్ట్ ని మించి ఉండాలి. లేకపోతే మనం అనేది ఒక క్లాసికల్ మూవీ నిలిచిపోయింది. కాబట్టి దాని పేరు చెడిపోయే ప్రమాదం ఉందనే రీతిలో నాగార్జున ఆలోచిస్తున్నారట.

ఇక మొత్తానికైతే నాగార్జున ఈ సినిమా చేసే అవకాశం ఉందా? లేదా అని ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి… ఒకవేళ ఈ సినిమా కనుక చేసినట్లయితే అది కొంతవరకు కత్తి మీద సాము లాంటిదనే చెప్పాలి. విక్రమ్ కే కుమార్ ఈ సినిమాని చాలా కంఫర్ట్ జోన్ లో చిత్రీకరించాల్సిన అవసరమైతే ఉంటుంది. లేకపోతే మాత్రం సినిమా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది…

తెలంగాణ జనసేన నాయకులు ఇచ్చి పడేశారు.. ప్రొ. నాగేశ్వర్ అభిమానులు ష్ గప్ చుప్

Telangana Janasena leaders
Telangana Janasena leaders

Telangana Janasena leaders: అనవసరం ఏపీ రాజకీయాలలో వేలుపెట్టి.. అనవసరమైన మాటలు మాట్లాడి.. పైగా యుద్దం ప్రారంభం.. ముగింపు అంటూ వ్యాఖ్యలు చేసింది ప్రొఫెసర్ నాగేశ్వర్. అంతే కాదు, కొంతమంది జర్నలిస్టులను వెంట పెట్టుకుని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ కూడా పెట్టారు ప్రొఫెసర్ నాగేశ్వర్.

అక్కడ తనకు జరగుతున్న ఇబ్బందుల మీద, నమోదైన కేసుల మీద, ఇంకా తనకు ఎదురవుతున్న వేధింపుల మీద మాట్లాడాల్సిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. తనను విక్టిమ్ గా అక్కడ పరిచయం చేసుకున్నారు. తన మీదకు ఆంధ్రా పోలీసులు వస్తున్నట్టు.. వారు దాడులు చేస్తున్నట్టు ప్రచారం చేసుకున్నారు. ఇక ఆయనకు వంత పాడే వారంతా స్థాయి మరిచి విమర్శలు చేశారు.

బక్కా జడ్సన్ , ప్రథ్వీ రాజ్ లాంటి వాళ్లయితే ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుట్ర చేశారని, వారికి రేవంత్ వంత పాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వాళ్ల మీద ఆంధ్రా వాళ్లు కుట్ర చేస్తున్నారని, నాగేశ్వర్ భుజం మీద తుపాకీ పెట్టి తమ మీద ఫైరింగ్ చేస్తున్నారని.. ఇలా అడ్డగోలుగా మాట్లాడారు. చివరికి ఈ వ్యహారానికి ఆంధ్రా , తెలంగాణ సెంటిమెంట్ కూడా పూసేందుకు వెనుకాడ లేదు.

బక్కా జడ్సన్, ప్రథ్వీరాజ్ లాంటి వాళ్లు తమ స్థాయి మరిచి పవన్ కల్యాణ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో తెలంగాణ జనసేన నాయకులు తెరమీదకు వచ్చారు. ఎక్కడయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ విలేకరుల సమావేశం పెట్టి జనసేన, టీడీపీ నాయకుల మీద విమర్శలు చేశాడో.. అక్కడే వారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అనుచరుల కంటే ఎక్కువ స్వరంతో విమర్శించారు.

‘మేమంతా ఎస్సీలమే, దళితులమే. తెలంగాణ ఉద్యమంలో ముందుభాగంలో నిలిచినవాళ్లమే. నిన్న ఏమో మాట్లాడిర్రు కదరా.. ఇప్పుడు మేమొచ్చినం. తెలంగాణ మీ సొత్తా, మీ జాగీరా, తొక్కి నార తీస్తం. ఏమోపీకుతామని అడ్డంపొడువు మాటలు మాట్లాడిర్రు కదరా.. ఇప్పుడు రండి’ అంటూ తీవ్రస్వరంతో మాట్లాడారు. జన సేన నాయకులు కూడా సాలిడ్ కౌంటర్ ఇవ్వడంతో ఏం చేయలేని పరిస్థితి ప్రొఫెసర్ నాగేశ్వర్ అనుచరులకు ఏర్పడిందని, గత్యంతరం లేక వారు సైలెంట్ అయిపోయారని జనసేన నాయకులు అంటున్నారు.

కాక్రోచ్ జనతా పార్టీ గొంతును ఎందుకు మూసేశారు?

Cockroach Janata Party
Cockroach Janata Party

Cockroach Janata Party: ఇటీవల సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న పార్టీ సీజేపీ(కాక్రోజ్‌ జనతా పార్టీ). ఈ సీజేపీపై ఢిల్లీ హైకోర్టు తాజా వ్యాఖ్యలు సోషల్‌ మీడియా స్వేచ్ఛపై మరోసారి చర్చనీయాంశం చేశాయి. ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ అనే వ్యంగ్యాత్మక ఎక్స్‌ అకౌంట్లను జాతీయ భద్రత కారణాలతో నిలిపివేయడానికి వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్‌పై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ అకౌంట్లను కేంద్ర సమాచార సాంకేతికత శాఖ ఆదేశాల మేరకు ఎక్స్‌(ట్విటర్‌) ప్లాట్‌ఫామ్‌ బ్లాక్‌ చేసింది. దీనికి వ్యతిరేకంగా సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే హైకోర్టును ఆశ్రయించారు.

వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే..
జాతీయ భద్రత అనే ముసుగులో వ్యక్తి స్వేచ్ఛను అణచివేత చేస్తున్నారని సీజేపీ తరఫున వాదనలు వినిపించారు. జస్టిస్‌ పురుషైంద్రకుమార్‌ కౌరవ్‌ నేతృత్వంలోని బెంచ్‌ కేసును విచారించి, కేంద్ర ఐటీ శాఖ, ఎక్స్‌ సంస్థకు నోటీసులు జారీ చేసింది. బ్లాకింగ్‌ ఆర్డర్‌ను వెంటనే సమీక్షించాలని రివ్యూ కమిటీని ఆదేశించడం గమనార్హం. కోర్టు ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా, స్వేచ్ఛకు సంబంధించిన విషయాల్లో న్యాయవ్యవస్థ కఠినంగా ఉంటుందని సంకేతం ఇచ్చింది. కేసును జులై 7వ తేదీకి వాయిదా వేయడంతో, తీర్పు ఏమిటి అనే ఆసక్తి పెరిగింది.

డిజిటల్‌ యుగంలో ప్రధాన సవాల్‌..
ఈ కేసు భారతదేశంలో డిజిటల్‌ యుగంలో ఎదురవుతున్న ప్రధాన సవాలును ప్రతిబింబిస్తుంది. జాతీయ భద్రత, సామాజిక సామరస్యం దృష్ట్యా కొన్ని కంటెంట్‌లను నియంత్రించాల్సిన అవసరం ఉందని వాదిస్తుంది. ప్రత్యేకించి వ్యంగ్య, విమర్శాత్మక అకౌంట్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే ప్రమాదకరం కావచ్చు. అయితే భద్రత అనే పేరుతో వ్యతిరేక గొంతుకలను అణచివేయడం జరుగుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని వాదిస్తారు. బ్లాకింగ్‌ నిర్ణయాలు పారదర్శకంగా, కారణాలు స్పష్టంగా చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండు భిన్న వాదనల నేపథ్యంలో సమతుల్యం ఎలా సాధ్యం అనేది న్యాయవ్యవస్థ ముందున్న ప్రశ్న.

జులై 7న కేసు విచారణలో కోర్టు బ్లాకింగ్‌ విధానాల సమీక్ష, పారదర్శకత,అకౌంట్‌ యజమాని హక్కులపై కీలక పర్యవేక్షణ చేయవచ్చు. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి బ్లాకింగ్‌ ఆర్డర్లకు మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. సోషల్‌ మీడియా యుగంలో వ్యక్తి స్వేచ్ఛ, బాధ్యత, భద్రత మధ్య సరైన సమన్వయం ఎలా ఉండాలనేది ఈ కేసు ద్వారా మరోసారి చర్చకు వస్తోంది. తీర్పు ఏ వైపు ఉన్నా, ఇది డిజిటల్‌ హక్కుల చర్చను మరింత లోతుగా తీసుకెళ్తుంది.

మహేష్ బాబు ఆ సూపర్ హిట్ సినిమాలో బాలకృష్ణ గెస్ట్ గా చేయాల్సిందా...ఎందుకు మిస్ అయిందంటే..?

Mahesh Balakrishna movie combination
Mahesh Balakrishna movie combination

Mahesh Balakrishna movie combination: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు విభిన్న తరహా సినిమాలను చేశాడు. నాని లాంటి ప్రయోగాత్మకమైన సినిమాని చేశాడు అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ సినిమా కూడా ప్రయోగాత్మకమైన సినిమానే ఈ సినిమాలో మహేష్ బాబు తనను తాను తక్కువ చేసుకుని మరి నటించడం అనేది మామూలు విషయం కాదు… కమర్షియల్ సినిమాలను చేసి మినిమం గ్యారెంటీ సక్సెస్ లు సాధించొచ్చు కానీ ఆయన ప్రయోగత్మకమైన సినిమాలను చేసినప్పుడు తన నట పొటెన్షియాలిటీ బయటపడుతుందనే ఉద్దేశ్యంతో ప్రయోగాత్మకమైన సినిమాలను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు… ఆయన హీరోగా చేసిన ‘దూకుడు’ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేశారట. అయితే అందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో బాలయ్య బాబు ను నటింపజేయలని ప్రయత్నం చేశారట. బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఓవరాల్ గా ఈ సినిమా ఫ్లో ను చూస్తే మూవీలో అది చాలా అడ్డంకి గా మారుతుందని ఆ పాత్ర ను సినిమా నుంచి తీసేసారట.

బాలయ్య బాబుతో ఆ క్యారెక్టర్ లో నటింపజేసిన తర్వాత తీసేయడానికి వీలు ఉండదు కాబట్టి ముందుగానే ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని మరి శ్రీనువైట్ల ఆ పాత్రను తీసేసినట్టుగా గతంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు… ఇక మొత్తానికైతే ఆ టైమ్ లో మహేష్ బాబు దూకుడు, బిజినెస్ మెన్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నాడు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు మహేష్ బాబు తన హవాని కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ప్రస్తుతం వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ సినిమా కోసం అతను విపరీతంగా కష్టపడుతున్నాడు… ఇక ఇప్పటి వరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్ నిల్చోబెడితే ఇకమీదట నుంచి ఆయన చేయబోతున్న సినిమాలు ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాన్సెప్ట్ లను డిజైన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…

మహేష్ బాబును ఇమిటేట్ చేసే నటులు వీళ్లనా..?

actors imitating Mahesh Babu
actors imitating Mahesh Babu

Actors imitating Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సక్సెస్ ల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహేష్ బాబు లాంటి నటుడు ఈరోజు సూపర్ స్టార్ గా ఎదిగాడు అంటే ఆయన చాలావరకు కసరత్తులు చేశారనే చెప్పాలి. మహేష్ బాబును ఇమిటేట్ చేస్తూ కొంతమంది కుర్ర హీరోలు సైతం రాణిస్తున్నారు అనే విషయం మనలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా అడవి శేషు, రామ్ లాంటి కుర్ర హీరోలు మహేష్ బాబు ను ఇమిటేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ యాక్టింగ్ లో మనకు అది కనిపిస్తూనే ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన నవీన్ పోలిశెట్టి సైతం కొన్ని సందర్భాల్లో మహేష్ బాబుని ఇమిటెడ్ చేస్తుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇప్పటికే ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడమే కాకుండా కమర్షియల్ సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేశాడు.

ముఖ్యంగా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి పెట్టింది పేరుగా మారిన మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న వారణాసి సినిమాతో మరోసారి సంచలనాన్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా మీద 1500 కోట్ల వరకు బడ్జెట్ అయితే కేటాయిస్తున్నారు.

ఓవరాల్ గా ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టడమే కాకుండా ప్రేక్షకులు అందరి చేత శభాష్ అనిపించుకునేలా విజువల్స్ ఉంటాయని చెబుతున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వం కూడా ఈ సినిమాకి చాలావరకు ప్లస్ అవ్వనుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళి ఈ మూవీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు.

గతంలో ఆయన చేసిన సినిమాల కంటే కూడా ఈ సినిమాని చాలా ప్రస్టేజీయస్ గా తీసుకున్నాడు. ఎందుకంటే ఈ సినిమా పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రపంచ స్థాయి ప్రేక్షకుల ముందు మనం తగ్గకూడదనే ఉద్దేశ్యంతో వాళ్ళందర్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇప్పటికీ చిరంజీవి ని బీట్ చేయలేకపోతున్న హీరోలు వీళ్లేనా..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi unbeatable records: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి… ఇక ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం…కెరీర్ మొదటి నుంచి కూడా చిరంజీవికి భారీ పోటీని ఇస్తున్న వాళ్లలో బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు ఉన్నారు. నిజానికి వెంకటేష్ నాగార్జున లతో పోలిస్తే బాలకృష్ణ మాత్రం చిరంజీవికి ఎప్పటికప్పుడు భారీ పోటీని ఇస్తూనే వచ్చాడు. కానీ చిరంజీవిని బీట్ చేసే అవకాశం మాత్రం తనకు రాలేదు.

కొన్ని సార్లు తన సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసినప్పటికి ఫైనల్ గా ఆ ఇయర్ లో మాత్రం చిరంజీవి డామినేషన్ కనిపిస్తూ ఉండేది. చిరంజీవి మాత్రం తన సత్తా చాటుతూ ఎప్పటికప్పుడు బాలయ్యను డామినేట్ చేస్తూ వచ్చాడు. ఇక ఇప్పటికి కూడా చిరంజీవి టాప్ పొజిషన్లో ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…

సీనియర్ హీరోలుగా పేరు సంపాదించుకున్న వీళ్ళందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి మొదటి నుంచి కూడా భారీ కసరత్తులైతే చేస్తూ వచ్చారు. ఇక ఇది ఏమైనా కూడా సీనియర్ హీరోలందరిలో ఇప్పటికి మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉండడం విశేషం…రాబోయే రోజుల్లో బాలయ్య బాబు చిరంజీవిని బీట్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి.

ఇక చిరంజీవి రీసెంట్ గా వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి వీళ్ళందర్నీ బీట్ చేసి మరోసారి టాప్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు… బాలయ్య చేసిన ‘అఖండ 2’ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఈ సినిమాకి భారీ నష్టాలైతే వచ్చాయి. వెంకటేష్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 300 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఈ మధ్యకాలంలో నాగార్జున నుంచి సరైన సినిమా అయితే రాలేదు…

వైభవ్ సూర్యవంశీ.. చూస్తూ ఉండండి ముకేశ్ అంబానీని దాటేస్తాడు.. అంతలా సంపాదిస్తున్నాడు మరి

Vaibhav Suryavanshi earnings shocking
Vaibhav Suryavanshi earnings shocking

Vaibhav Suryavanshi earnings shocking: మామూలుగా అయితే 15 సంవత్సరాల ప్రాయంలో ఎవరైనా సరే స్కూల్ కి వెళ్తారు. లేదా ఇంటర్లో చేరుతారు. ఎకనమికల్ గా స్ట్రాంగ్ గా లేని వారు ఏదో ఒక పని చూసుకుంటారు. ఆర్థికంగా బాగున్నవారు చదువుల మీద దృష్టి పెడతారు. తోటి పిల్లలతో ఆడుకుంటారు. అయితేనేమో స్కూలు.. లేకుంటే కాలేజీ.. ఇలా సాగిపోతూ ఉంటుంది వారి ప్రస్థానం.

15 సంవత్సరాల ప్రాయంలో మిగతా పిల్లల కంటే విచిత్రంగా.. ఎవరూ అంచనా వేయలేని విధంగా వైభవ్ సూర్య వంశీ చిచ్చరపిడుగు మాదిరిగా క్రికెట్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. సునామి తరహాలో ఆడుతున్నాడు.. కనీసం మానవ మాత్రులకు సాధ్యం కానీ రికార్డులను నమోదు చేస్తున్నాడు. అంతటి గేల్ సూర్యవంశీని ఉద్దేశించి బేబీ మాన్ స్టార్ అని వ్యాఖ్యానించాడంటే.. అతడి బ్యాటింగ్ స్టైల్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. రాజస్థాన్ జట్టులో గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ.. వైభవ్ సూర్య వంశీ నిలబడితేనే ఆ జట్టు గెలుస్తోంది అంటే.. అతడి ప్రభావం ఏ స్థాయిలో ఉందో అవగతం చేసుకోవచ్చు.

వైభవ్ సూర్య వంశీ కి బీహార్ రాష్ట్రంలో తాజ్ పూర్ ప్రాంతంలో 40 లక్షల విలువైన ఇల్లు ఉంది. ఇంటి వెనకాల మైదానంలో ఆదోడు ప్రాక్టీస్ చేసేవాడు. ఐపీఎల్ ద్వారా ఏడాదికి అతనికి 1.10 కోట్లు లభిస్తున్నాయి. ఒక్కో మ్యాచ్ కు 7.5 లక్షలు కూడా అదనంగా వస్తున్నాయి. ఇటీవల దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై లో మూడు కోట్ల విలువైన ప్లాట్ కొనుగోలు చేశాడు. అదే కాదు రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ ఓనర్ ఇతడికి బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడు. 2025లో ఐపీఎల్ టాటా కర్వ్ ఈవీ వాహనాన్ని ఇతడు గెలుచుకున్నాడు. 2026 లో అండర్ 19 వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడినందుకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఇతడికి 50 లక్షలు బహుమతిగా ఇచ్చింది.

15 సంవత్సరాల వయసులోనే అతని ఏకంగా కోట్ల సంపాదనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే క్రికెట్లో ఓనమాలు దిద్దుతున్న సూర్యవంశం పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఇప్పుడే ఈ స్థాయిలో ఆదాయం సంపాదిస్తున్నాడు అంటే.. వచ్చే రోజుల్లో అంతకుమించి అనే స్థాయిలో ఆర్జించి ముఖేష్ అంబానీ కచ్చితంగా బీట్ చేస్తాడని సోషల్ మీడియాలో అతడి అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. సూర్యవంశీ ఇక పై కూడా అదే స్థాయిలో దూకుడు కొనసాగిస్తాడని.. అతడికి ఆ స్థాయి ఉందని.. సురేష్ రైనా చెప్పినట్టుగా టీమిండియా క్రికెట్ భవిష్యత్తు మొత్తాన్ని ఇతడు భద్రంగా చూసుకుంటాడని.. అందులో అనుమానం లేదని భారత క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

నాగార్జున ప్రొడ్యూసర్ గా ఆ యంగ్ హీరో తో ఒక సినిమా చేయాలనుకున్నాడు...ఆ హీరో హ్యాండ్ ఇచ్చాడా..?

Nagarjuna
Nagarjuna

Nagarjuna planned movie with young hero: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోలు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుండటం విశేషం… నాగార్జున లాంటి స్టార్ హీరో సైతం తన కెరియర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయినప్పటికి తను హీరోగా నిదొక్కుకొని ప్రస్తుతం తన హవాను కొనసాగిస్తున్నాడు. సీనియర్ హీరోల్లో తను కూడా ఒకడిగా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… నాగార్జున హీరో గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా చాలా సక్సెసులనైతే అందుకున్నాడు. ముఖ్యంగా అతను సినిమా చేయాలంటే ఆ కథలో చాలా వెయిట్ ఉండాలి. దానికి తగ్గట్టుగానే దర్శకుడికి ఆ కథను సక్సెస్ఫుల్గా చేయగలిగే కెపాసిటి ఉండాలి. అలాంటివి ఉన్నప్పుడే నాగార్జున వాళ్ళతో సినిమాలను చేస్తాడు. లేకపోతే మాత్రం వారిని తీసి పక్కన పెట్టేస్తాడు అనేది వాస్తవం. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక హీరోతో నాగార్జున ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారట. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే నవీన్ పోలిశెట్టిగా తెలుస్తుంది.

కామెడీ టైమింగ్ గాని అతని యాక్టింగ్ గాని చాలా బాగుంటుంది. అందువల్లే నాగార్జున అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ నవీన్ పోలిశెట్టి మాత్రం వాళ్ళు చెప్పిన కథ అంత పెద్దగా ఎఫెక్ట్ గా అనిపించకపోవడంతో తను సినిమా నో చెప్పారట.

ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున కొంతమంది కుర్ర హీరోలతో సినిమాలను చేసి వాళ్లకు సక్సెస్ లను అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటివి నాగార్జున నవీన్ పోలిశెట్టి విషయంలో ఎందుకని కథ విషయంలో అంత పర్ఫెక్ట్ గా వర్క్ చేయలేకపోయారు అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశముగా మారింది.

ఇక ఏది ఏమైనా కూడా నవీన్ పోలిశెట్టి లాంటి కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇప్పటివరకు ఆయన చేసిన నాలుగు సినిమాల్లో నాలుగు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి అంటే అతను కథ మీద ఎంత ఫోకస్ తో ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు…

ఆ ఇద్దరు దర్శకులను రిపీట్ చేస్తున్న చిరంజీవి, బాలయ్య..

Chiranjeevi and Balakrishna
Chiranjeevi and Balakrishna

Chiranjeevi and Balakrishna: సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు వాళ్లకు సక్సెస్ లను ఇస్తే చాలు ఆ దర్శకులను రిపీటెడ్ గా సినిమాలు చేస్తూనే ఉంటారు. దానికి ఉదాహరణగా మనం చిరంజీవి, బాలయ్య బాబులను తీసుకోవచ్చు. 2023 వ సంవత్సరంలో బాలయ్యకు ‘వీర సింహారెడ్డి’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇక అదే సంవత్సరం బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సైతం భారీ విజయాన్ని సాధించింది. అందుకే చిరంజీవి సైతం మరోసారి బాబీ ని రిపీట్ చేస్తూ అతనికి అవకాశాన్ని ఇచ్చాడు. బాబీ ఇంతకు ముందు బాలయ్య బాబుతో ‘డాకు మహరాజ్’ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించడంతో చిరంజీవి అతన్ని పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. రెండో సినిమాతో చిరంజీవిని ఎలా చూపిస్తాడు.

ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. బాబీకి ఇప్పటివరకు 90% సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి ఆయన సినిమా వస్తుంది అంటే చాలు అది మినిమం గ్యారంటి సినిమాగా ప్రేక్షకులు ఒక అంచనాకి వచ్చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే బాబీ చిరంజీవిని ఎలా చూపిస్తాడు.

ప్రేక్షకులందరిని మెప్పించే విధంగా ఈ సినిమా ఉండబోతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ సైతం ఒక కీలకపాత్రలో నటించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కూడా చాలా వైల్డ్ గా ఉండబోతుందట. ఇక చిరంజీవి బాబీ ఇంతకు ముందు చేసిన వాల్తేరు వీరయ్య సినిమా మాస్ కమర్షియల్ ప్రేక్షకులను అలరించింది.

ఇప్పుడు వస్తున్న సినిమాతో వాళ్ళని టార్గెట్ చేస్తూనే ఒక డెప్త్ స్టోరీని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారట… గోపీచంద్ మలినేని, బాబీ ఇద్దరు కూడా మరోసారి వాళ్ళని నమ్మిన హీరోలకు సక్సెస్ లను అందిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఈ రెండు సినిమాలను కూడా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు…

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అప్డేట్ ఏంటి..?

Pawan Kalyan new movie update
Pawan Kalyan new movie update

Pawan Kalyan new movie update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏదో ఒక సినిమాను సెట్స్ మీద ఉంచుతాడు. కానీ ఫస్ట్ టైమ్ ఆయన ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి కూడా కమిట్ అవ్వడం లేదు. ఎందుకంటే ఆయన ఒకేసారి రెండు మూడు సినిమాలకు కమిటై ఉంటాడు కాబట్టి వాటిని నిదానంగా పూర్తి చేసుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయిందో అప్పటినుంచి ఆయన ఖాళీగానే ఉన్నాడు. ఇక ఇప్పటికైనా ఆయన కాంబినేషన్లో ఎవరితో సినిమా చేస్తున్నాడు. ఎలాంటి కథతో మనల్ని మరోసారి మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడనే విషయంలో సరైన క్లారిటి అయితే రావడం లేదు. సురేందర్ రెడ్డి కథను ఫైనల్ చేసినప్పటికి ఆ కథ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాలను కూడా ఎక్కడ చెప్పడం లేదు. ఇక దానికి తోడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో రెండు కథలను రీమేక్ చేయాలని చెప్పారట. ఆ కథలను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది…

ఇక మీదట పవన్ కళ్యాణ్ చేసే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఆయన డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటూ క్వాలిటీ సినిమాలు చేయగలిగితే ఇప్పటికి ఆయన్ని బీట్ చేసే హీరో ఎవరు ఉండరు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు చూసుకుంటూనే అవకాశం దొరికిన ప్రతిసారి మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించకపోవడంతో ఆయన దర్శకుల విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దానివల్లే ఆయన ఇప్పటి వరకు మరో సినిమాకి కమిట్ అవ్వడం లేదు. సురేందర్ రెడ్డి సినిమా ఉంది అని చెప్తున్నారు.

కానీ అది ఎప్పుడు అనే విషయంలో ఇంకా క్లారిటి రావడం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఆయన నుంచి కొత్త సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు… ఇక గత సంవత్సరం ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించిన సుజీత్ సైతం తనతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…