Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Lokesh Kanagaraj Film: అల్లు అర్జున్ లోకేష్ తరువాత ఆ కన్నడ డైరెక్టర్...

Allu Arjun Lokesh Kanagaraj Film: అల్లు అర్జున్ లోకేష్ తరువాత ఆ కన్నడ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా..?

Allu Arjun Lokesh Kanagaraj Film: తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కిస్తున్న వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు సినిమాతో ఫ్యాన్ ఇండియాలో పోయిన సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు… ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్ లో రాకా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనకరాజు డైరెక్షన్ […]

Allu Arjun Lokesh Kanagaraj Film: తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కిస్తున్న వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు సినిమాతో ఫ్యాన్ ఇండియాలో పోయిన సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు… ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్ లో రాకా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన కన్నడ దర్శకుడు ఆయన రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమాని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. కాబట్టి ఇక మీదట కూడా ఆచితూచి మరి ముందుకు అడుగులు వేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి రీసెంట్ గా ‘కాంతార చాప్టర్ వన్’ సినిమాతో 800 కోట్ల కలెక్షన్స్ కొల్ల గొట్టాడు. కాబట్టి ఇప్పుడు చేయబోతున్న సినిమా విషయంలో కూడా ఆయన చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రిషబ్ శెట్టి సైతం తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

ఇంతకుముందు ఎన్టీఆర్ కి కథను వినిపించాడనే వార్తలైతే వచ్చాయి. అయితే ఎన్టీఆర్ తో సెట్ అవ్వకపోవడంతో ఆయన అల్లు అర్జున్ కి కథ వినిపించినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రిషబ్ శెట్టి మాత్రం అటు హీరోగా పెను సంచాన్లను క్రియేట్ చేస్తూనే దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…

పాన్ ఇండియా నటుడిగా దర్శకుడిగా పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఫ్యూచర్లో ఇంకెన్ని సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper