Ghaziabad Jewellery Shop Theft: అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. ఘజియాబాద్ నగరం. ఇక్కడ ఒక ప్రముఖ సంస్థ నగల దుకాణాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిరోజు ఇక్కడ భారీగా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఈ నగల దుకాణంలో ఇటీవల చోరీ జరిగింది. ఆ చోరి కూడా భారీ స్థాయిలో జరిగింది. సుమారు నాలుగు కోట్ల విలువైన నగలు మాయమయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగారు. అనేక ఆధారాలను పరిశీలించారు.. ఆ తర్వాత వారి విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. ఆ నిజాన్ని తట్టుకోలేక ఆ నగల యజమాని ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ప్లాన్ ప్రకారం
నగల దుకాణంలో నితిన్ అనే వ్యక్తి కొంత కాలం క్రితం ఉద్యోగంలో చేరాడు. అయితే అతడు ఉద్యోగం కోసం అందులో చేరలేదు. పక్క ప్రణాళిక ప్రకారమే అందులో చేరాడు. విధులను పక్కనపెట్టి బంగారు నగలు ఎక్కడ దాస్తున్నారు.. వాటి తాళాలు ఎక్కడ ఉంటున్నాయి.. సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి.. అనే విషయాలను పరిశీలించాడు. సరిగా ఈనెల 12న షోరూమ్ లో పనిచేసే సిబ్బందికి అతడు దావత్ ఇచ్చాడు. తనకు పెళ్లి కుదిరిందని.. అందువల్లే ఈ విందు ఇస్తున్నానని చెప్పాడు. ఆ పార్టీకి తనకు కాబోయే భార్య కాజల్.. అతడి తండ్రి హాజరయ్యారు. ఈ క్రమంలో షోరూం తాళాలను పర్యవేక్షించే క్యాషియర్ గౌతమ్ కు ఎక్కువ మోతాదులో మద్యం తాగించాడు.. అతడిని ఇంటి వద్ద దింపి.. తాళం చేతులు తీసుకున్నాడు.
వెంటనే మరుసటి రోజు తన స్నేహితులతో కలిసి నితిన్ నగల దుకాణానికి వచ్చాడు. ఆ తాళం చెవిలతో షట్టర్ ఓపెన్ చేశాడు. పావుగంట సమయంలోనే దాదాపు నాలుగు కోట్ల విలువైన ఆభరణాలు మొత్తం దోచుకున్నాడు. అయితే షో రూమ్ వద్ద ఎటువంటి అలారం వ్యవస్థ లేదు. దీంతో నితిన్ పని ఈజీ అయిపోయింది. అయితే సెక్యూరిటీ గార్డ్ ఉదయం ఇంటికి వెళ్లిపోయిన తర్వాత ఈ ఘటన జరిగింది. పోలీసులు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత నితిన్ ను అదుపులోకి తీసుకున్నారు. తన స్నేహితురాలితో పెళ్లి కోసమే తాను నగలు చోరీ చేసినట్టు అతడు ఒప్పుకున్నాడు. నితిన్, అతడి ప్రేయసి, ఆమె తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
స్నేహితురాలితో పెళ్లి కోసం ఈ స్థాయిలో బంగారాన్ని చోరీ చేసిన నితిన్ గురించి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకోవాలంటే బంగారం ఎందుకు.. కష్టపడి పని చేసుకుని భార్యను సాక వచ్చు కదా.. ఇప్పుడు దొంగతనాలకు అలవాటు పడ్డావు.. రేపటి నాడు ఏదైనా చేస్తావని చాలామంది అతడిని విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి ప్రేమించే అర్హత లేదని.. కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.
















చూడ్డానికి దేవదూతలా ఉంటాడు కానీ మోడీ ఓ కిల్లర్.. పక్కనే ఉండి పొగిడిన ట్రంప్
Donald Trump And Narendra Modi: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా చూశారా.. అందులో విక్టరీ వెంకటేష్ కుటుంబాన్ని ఉద్దేశించి రావు రమేష్..”మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి తెలియవు రా బాబు.. ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ పరిగెడుతూ ఉంటే.. మీరేంట్రా ఎలా ఉన్నారు.. వాడు అంత ఆవేశంగా ఉన్నాడు. వాడిని అలా వదిలేయకండిరా.. ఎక్కడైనా చూపించండి” అని ఒక డైలాగ్ అంటాడు.. ఈ డైలాగ్ ఫుల్ ఫేమస్. ఇది ఇప్పుడు ట్రంప్ కు వర్తించేలా ఉంది. ఎందుకంటే అతడి వ్యవహార శైలి అలా ఉంది.
ఏ మనిషికైనా కోపం ఉంటుంది.. ఇతర గుణాలు కూడా ఉంటాయి. కానీ ట్రంప్ వాటన్నింటిని ఏకకాలంలో ప్రదర్శిస్తూ ఉంటాడు. తాను అమెరికా అధ్యక్షుడి ని అనే గర్వం అతనిలో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే కోప్పడతాడు. అంతలోనే నవ్వుతుంటాడు. క్షణంలోనే మారిపోతుంటాడు. ప్రేమను ప్రదర్శిస్తాడు. ఏం చేస్తాడో తెలియదు.. ఎందుకు అలా ఉంటాడో తెలియదు. ఇరాన్ దేశంతో యుద్ధం అంటాడు.. అంతటితోనే ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి అంటాడు.. మాతో పోటీ పడితే యుద్ధం తప్పదు అంటాడు.. ఇజ్రాయిల్ తనకు మిత్ర దేశమంటాడు. తాను లేకపోతే ఇజ్రాయిల్ బతికి బట్ట కట్టేది కాదు అంటాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో షేడ్స్ అతనిలో ఉన్నాయి.
తాజాగా g7 సమ్మిట్ లో ట్రంప్ మరోసారి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. ఈసారి అతడి కన్ను నరేంద్ర మోడీ మీద పడింది. భారత ప్రధాని హోదాలో ఆయన అక్కడికి వెళ్లిన క్రమంలో.. ట్రంప్ మరోసారి తన చంచల స్వభావాన్ని ప్రదర్శించాడు..”చూసేందుకు దేవదూతలా ఉంటాడు. కానీ మోడీ ఒక కిల్లర్.. నాకు మంచి స్నేహితుడు. కానీ కఠినంగా ఉంటాడు. నవ్వుతూనే ఉంటాడు గాని.. చేసేది చేస్తుంటాడు. త్వరలోనే ఇండియాలో పర్యటిస్తాను. ట్రేడ్ డీల్ ముగింపు దశలో ఉంది” ఇలా మాట్లాడాడు ట్రంప్.
ఆమధ్య పాకిస్తాన్ దేశంతో అంట కాగాడు ట్రంప్. ఇప్పుడు భారత్ తో చెలిమి కోసం తాపత్ర పడుతున్నాడు. ప్రధానమంత్రిని జోకే పనిలోపడ్డాడు. ట్రేడ్ డీల్ అంటూ తెరపైకి ఏవేవో విషయాలను తీసుకొస్తున్నాడు. ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు గ్లోబల్ మీడియా సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఇలా ట్రంప్ ఎందుకు ప్రవర్తిస్తున్నాడు.. ఇతనికి ఏమైంది అనే కోణంలో అమెరికన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అంటే.. మామూలు విషయం కాదు. ఈ కథనం ప్రారంభంలో రావు రమేష్ డైలాగులను ప్రస్తావించాం కదా.. అవి నిజజీవితంలో ట్రంప్ కు వర్తించే విధంగా ఉన్నాయి.