Home Blog Page 110

తెలుగోడి పట్టుదల.. టీమిండియా ఫైనల్ కు..

India vs England 3rd T20
India vs England 3rd T20

Tilak Varma Captaincy: గెలవలసిన మ్యాచ్ అది.. భారీ అంతరంతో విజయం సాధించాల్సిన మ్యాచ్ అది.. విపరీతమైన ఒత్తిడి ఉంది. దీనికి తోడు విమర్శలు.. ఇవన్నీ కూడా అతనిలో పట్టుదల పెంచాయి. పైగా భవిష్యత్తు నాయకుడిగా ఎదగాలి అనుకుంటున్నాడు. అలాంటప్పుడు తనలో ఉన్న నైపుణ్యాన్ని.. నాయకత్వాన్ని బయటకి తీశాడు. ఫలితంగా అభిమానులు అంచనావేసిన ఫలితాన్ని అందించి.. అదరగొట్టాడు..

కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో టీం ఇండియా గెలిచి చూపించింది. ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 101 పరుగుల తేడాతో విజయం సాధించి.. ముక్కోణపు సిరీస్ లో ఫైనల్ వెళ్ళింది. శ్రీలంకతో ట్రోఫీ కోసం పోటీ పడనుంది. ఈ మ్యాచ్లో ముందుగా టీమిడియా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య 58, సూర్య వంశీ 38, గైక్వాడ్ 30, వి ప్రజ్ 30, కుమార్ కుషాగ్రా 58 పరుగులతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ తిలక్ వర్మ 59 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు వర్మ స్థిరంగా బ్యాటింగ్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు తీశాడు. సమయం దొరికినప్పుడల్లా బౌండరీలు కొట్టాడు. అనవసరమైన షాట్ల జోలికి వెళ్లలేదు. కెప్టెన్ అంటే ఎలా ఆడాలో అలానే ఆడి చూపించాడు. కుమార్ కుశాగ్రతో కలిసి నాలుగో వికెట్ కు ఏకంగా 104 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యం టీమిండియా కు ఆయువు పట్టు లాగా నిలిచింది. ఆఫ్గనిస్తాన్ బౌలర్ల జోరుకు కళ్లెం వేసింది.. అందువల్ల టీం ఇండియా ఏకంగా 319 పరుగులు చేసింది.

ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టును కేవలం 36.5 ఓవర్లలో 218 పరుగులకే ఆల్ అవుట్ చేసింది టీం ఇండియా. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో బహిర్ షా 57, ఫైజల్ 46, ఇమ్రాన్ 32 పరుగులు చేసినప్పటికీ.. మిగతా బ్యాటర్లు నిలబడకపోవడంతో ఆఫ్గనిస్తాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. టీమిండియాలో నిశాంత్ సింధు నాలుగు వికెట్లు పడగొట్టాడు. టీమి డే గెలుపులో కీలకపాత్ర పోషించాడు. యష్ ఠాకూర్ 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు. అన్సుల్ కాంబోజి, విప్రజ్, సూర్యాంష్, అనుకూల్ రాయ్ తలా ఒక వికెట్ తీశారు. తెలుగోడు తిలక్ వర్మ బ్యాటింగ్లో.. నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ట్రోఫీకి ఒక అడుగు దూరంలో నిలిచింది. శ్రీలంక జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే.. తిలక్ వర్మ ఆటగాడిగా మరో మెట్టు ఎక్కినట్టే.

ఫిఫా కప్ పాకిస్తాన్ లో.. నవ్వకండి ఇది సీరియస్ మేటర్

Pakistan FIFA Bid
Pakistan FIFA Bid

Pakistan FIFA Bid: అంతటి అమెరికా సొంతంగా నిర్వహించలేక మెక్సికో, కెనడాలో కలిసి సాకర్ కప్ కు ఆతిథ్యం ఇస్తోంది. సాకర్ కప్ అంటే అంత ఈజీ కాదు. ఈ టోర్నీ నిర్వహించాలంటే భారీగా డబ్బు ఖర్చు అవుతుంది. గత సీజన్లో ట్రోఫీ నిర్వహించిన ఖతార్ అప్పటికప్పుడు తాత్కాలికంగా మైదానాలు నిర్మించింది. భారీగా ఖర్చుపెట్టింది. తమ దేశంలో కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ.. కేవలం సాకర్ కప్ ను దృష్టిలో పెట్టుకొని బీర్ల విక్రయాలు జరిపింది.

పెద్ద పెద్ద దేశాలే తట్టుకోలేకపోతుంటే.. ఫిఫా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుందట. తినడానికి తిండి లేదు గాని.. రోజు బిర్యానీ కావాలి అన్నట్టుగా ఉంది పాకిస్తాన్ వ్యవహార శైలి. సాకర్ టోర్నీ నిర్వహించాలంటే ప్రపంచ స్థాయిలో మైదానాలు ఉండాలి. వందల కోట్ల బడ్జెట్ కావాలి.. అత్యంత ఆధునికమైన క్రీడా సామాగ్రి సమకూర్చాలి.. ఇవన్నీ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో సాకర్ కప్ నిర్వహించే అవకాశం దక్కదు.. కానీ ఫిఫా కప్ కు ఆతిధ్యం ఇచ్చేందుకు పాకిస్తాన్ కు అవకాశం ఉందట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. పాకిస్తాన్ రాజకీయ నాయకుడు నబిల్ గబోల్.

పాకిస్తాన్ దేశంలో ఉన్న భౌగోళిక స్వరూపం ఫిఫా కప్ నిర్వహణకు అనుకూలంగా ఉంటుందట. పాకిస్తాన్ దేశంలో కరాచీ నగరంలో ఉన్న లియారి అనే ప్రాంతంలో ఫుట్ బాల్ బాగా ఆడతారట. లియారి ప్రాంతంలో అద్భుతమైన మైదానం ఉందట.. అక్కడ ఫిఫా కప్ లో మ్యాచులు మొత్తం నిర్వహించవచట.. అయితే ప్రస్తుతం సాకర్ టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో లియారి ప్రాంతంలో వీధులు మొత్తం రంగురంగుల జెండాలతో కనిపిస్తున్నాయి. కలర్ఫుల్ డెకరేషన్స్ తో ఆకట్టుకుంటున్నాయి. భారీగా స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో ప్రజలు మ్యాచ్ లు లైవ్ చూస్తున్నారు.

స్థానిక ప్రాంతం మీద ఉన్న నమ్మకంతో గబోల్ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దేశంలో సాకర్ టోర్నీ నిర్వహించాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ ఆ స్థాయిలో మైదానాలు లేవు. ఒకవేళ పాకిస్తాన్ కిందా మీదా పడి నిర్వహించినప్పటికీ ఇక్కడ ఆడేందుకు ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశం. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.

ఇన్ స్టా లో తగిలాడు.. సహజీవనం దాకా తీసుకెళ్లాడు.. చివరికిలా

Instagram Love Affair Crime
Instagram Love Affair Crime

Instagram Love Affair Crime: కింద ఉన్న ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు.. శరత్. ఇతడిది కర్ణాటక. చేసేది వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా.. మనోడు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్గా ఉంటాడు. ఖతర్నాక్ ఫోటోలు పెడుతుంటాడు. రీల్స్ చేస్తుంటాడు. తన కష్టం గురించి చెప్పుకుంటాడు.

ఇతగాడికి అనూష అనే 20 సంవత్సరాల అమ్మాయి ఇన్ స్టా గ్రామ్ లో తగిలింది. మైకేల్ మదన కామరాజు.. ఆ అమ్మాయిని లైన్ లో పెట్టాడు. ప్రేమిస్తున్నాను చెప్పాడు. మొదట్లో ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. తర్వాత మనోడికి బెండ్ అయిపోయింది. వారిద్దరు ప్రేమలో పీకల లోతు మునిగిపోయారు. సీన్ కట్ చేస్తే బెంగళూరులో సహజీవనం మొదలుపెట్టారు.

ఒక బహుళ అంతస్తుల భవనంలో భార్యాభర్తలుగా చెప్పుకుంటూ జీవితాన్ని మొదలుపెట్టారు. గత ఆరు నెలలుగా వారిద్దరు కలిసి ఉన్నారు. అయితే ఒకరోజు అనూష చనిపోయింది.. దీనికి కారణం శరతే. ఎలాగైతే అనూషను ప్రేమించాడో.. అలాగే అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. గత నెల 20వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశం తట్టుకోలేక అనూషను అతడు గొంతు పిసికి.. దారుణంగా హత మార్చాడు. ఆ తర్వాత తనకు తెలిసిన న్యాయవాదిని కలిశాడు. జరిగిన విషయం చెప్పాడు. ఆ న్యాయవాది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో.. ఈ దారుణం పెరుగులోకి వచ్చింది. పోలీసుల శరత్ ను అరెస్ట్ చేశారు. అనూష మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వ్యక్తిగతంగా గొడవలు జరిగాయని.. అందువల్లే తనను అంతం చేశానని శరత్ చెప్పాడు. అయితే పోలీసులు మాత్రం మరో కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అనుషను చంపడానికి శరత్ ఎందుకు తెగించాడు.. దీని వెనక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బెంగళూరు నగరంలో కలకలం రేపింది.

ప్రాంతీయ పార్టీలను కబళిస్తూ.. బీజేపీ వైపు మళ్లిస్తూ.. పార్లమెంట్ లో బలం పెంచుతూ.. ‘కమలం’ పెద్ద స్కెచ్

BJP strategy
BJP strategy

BJP Operation Lotus strategy: అప్పట్లో బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నప్పుడు చికెన్ నెక్ రహదారి విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టింది. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వ్యక్తిగతంగా అమిత్ షా రిక్వెస్ట్ చేసినప్పటికీ మమత కరగలేదు. పైగా కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల మీద ఉల్టా కేసులు పెట్టింది. బెంగాల్లో అడుగుపెట్టిన వారి మీద దాడి చేసింది.

ఢిల్లీలో అప్పట్లో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. గణతంత్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి జండా ఎగరవేసిన తర్వాత.. ఎర్రకోట మీద ఖలిస్తాన్ వేర్పాటు వాదులు జెండా ఎగరవేశారు. అప్పట్లో ఈ చర్యను ఆప్ ప్రభుత్వం సమర్ధించింది. అదే కాదు పంజాబ్ నుంచి.. హర్యానా నుంచి కొంతమంది ప్రతీప శక్తులు ఢిల్లీ రావడానికి కారణమైంది.

మహారాష్ట్రలో శివసేన అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నాయకుల మీద విపరీతంగా కేసులు పెట్టారు. కొన్ని సందర్భాలలో వేరే శక్తులకు అవకాశం కల్పించారు. తద్వారా భారత ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. అంతేకాదు, మాఫియా శక్తులు బలపడేందుకు శివసేన కారణమైందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి.

ఇవన్నీ కూడా మోడీకి.. అమిత్ షా కు చికాకు కలిగించాయి. అందువల్లే ఈ దారుణాలకు ప్రాంతీయ పార్టీలు కారణమని వారు బలంగా నమ్మారు. పైగా దేశంలో జరుగుతున్న ఘోరాలకు.. అవాంఛనీయ సంఘటనలకు ప్రాంతీయ పార్టీలు దోహదం చేస్తున్నాయని వారిలో ఒక నమ్మకం ఏర్పడింది. ఇక అప్పటినుంచి వారు ఆపరేషన్ లోటస్ మొదలుపెట్టారు.

కొన్ని సంవత్సరాల క్రితమే మహారాష్ట్రలో శివసేన పార్టీని నిలుపునా చీల్చి పడేశారు మోడీ, షా. ఇప్పుడు ఏకంగా ఉద్దవ్ వర్గంలో ఉన్న 9 మంది ఎమ్మెల్యేలలో ఆరుగురిని ఆకర్షించారు. కాకపోతే వారు నేరుగా బిజెపిలో చేరకుండా.. ఇతర పార్టీలో చేరబోతున్నారు. ఆ తర్వాత బీజేపీలోకి చేరడానికి ఆస్కారం కల్పిస్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2024 ఎన్నికల్లో మహారాష్ట్రలో చెప్పుకునే స్థాయిలో బిజెపి పార్లమెంటు స్థానాలను గెలుచుకోలేకపోయింది. అందువల్లే తమకు ప్రతిబంధకంగా ఉన్న శివసేనను మరొకసారి చీల్చి పడేసే పనిని భుజాలకు ఎత్తుకున్నారు మోడీ, షా.

పశ్చిమ బెంగాల్లో టిఎంసి పార్టీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో ఇప్పుడు 20 మంది బయటకు వచ్చారు. వారంతా నేరుగా బిజెపిలో చేరలేదు. ఎన్ సి పి ఐ పార్టీలో చేరారు. వీరంతా దశలవారీగా మళ్లీ బిజెపి తీర్థం పుచ్చుకుంటారు. కేవలం ఎంపీలు మాత్రమే కాదు ఎమ్మెల్యేలు కూడా దాదాపు 58 మంది వేరే కుంపటి పెట్టారు. ప్రతిపక్షంగా తమనే గుర్తించాలని ఇప్పటికే స్పీకర్ కు లెటర్ రాశారు.

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ కంటే ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీలో కొంతమంది రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరారు. దీంతో ఎగువ సభలో బిజెపికి బలం పెరిగింది. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను చీల్చివేయడం.. రాజ్యసభ సభ్యులను.. పార్లమెంట్ సభ్యులను చేర్చుకోవడం ద్వారా బిజెపి గెట్టి ప్లాన్ వేసింది. ఇదంతా కూడా పార్లమెంట్లో 2/3 మెజారిటీ కోసం.. ఎందుకంటే ప్రస్తుత ఎన్డీఏ భుత్వం టిడిపి, నితీష్ కుమార్ సపోర్ట్ తో నడుస్తోంది. ఆల్రెడీ బీహార్ లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బిజెపి అభ్యర్థి ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు.. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బలంగా ఉంది.. ఇన్ని సానుకూలతలు కనిపిస్తున్న నేపథ్యంలో బిజెపి పెద్దలు వేసిన స్కెచ్ భారీగానే ఉంది.

పార్లమెంట్లో బలం పెంచుకోవడం.. అప్పర్ హౌస్ లో మరింత స్ట్రాంగ్ గా ఉండడంతో కీలకమైన బిల్లులు ఆమోదింప చేసుకోవాలని మోడీ, షా భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు.. డిలిమిటేషన్.. ఇంకా చాలా బిల్లులు ఈ టర్ములోనే పూర్తి చేసుకొని.. 2027 లేదా 2028 ఎన్నికలకు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని మోడీ, షా భావిస్తున్నారు.. బీహార్ లో జేడీయు.. ఆంధ్రప్రదేశ్లో టిడిపి ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తున్నాయి. అలాంటప్పుడు ఆ పార్టీల కోరికలు తీర్చాల్సిన అవసరం లేకుండానే.. బిజెపి ఇలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసి.. ఓడిస్తోందని.. ఆ పార్టీల ఎంపీలను కలిపేసుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆపరేషన్ లోటస్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. దీనిని ఆపే ప్రయత్నం గాని.. ఆపే సాహసం గాని ఎవరూ చేయడం లేదు. ఎందుకంటే మోడీ, షా తలుచుకుంటే ఏం చేస్తారో వారికి తెలుసు.

వామ్మో.. వాళ్లను నమ్ముకుంటే టీమిండియా నట్టేట మునిగేదే.. ఆఫ్ఘనిస్తాన్ ముందు ఇజ్జత్ పోయేది

India Vs Afghanistan Analysis
India Vs Afghanistan Analysis

India Vs Afghanistan Analysis: రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మీద టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఏకంగా 402 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం మీద ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. ఎంత తేడాతో గెలుస్తుంది అన్నది ఇక్కడ ప్రధానం. టీమిండియాలో కెప్టెన్ గిల్ 154, కిషన్ 125, రోహిత్ 48 పరుగులతో అదరగొట్టారు. టీమిండియా భారీ స్కోర్ చేయడంలో మీరు ముగ్గురు కీలకపాత్ర పోషించారు. ఓవర్ కు 8 చొప్పున పరుగులు తీస్తూ.. అదరగొట్టారు.

వీరి ముగ్గురి ఆట తీరు గొప్పగా ఉంటే.. మిగతా ప్లేయర్ల ఆట అత్యంత చండాలంగా ఉంది. అసలు చెప్పుకోవడానికి దరిద్రంగా ఉంది. పైగా వారేమీ అనామక ప్లేయర్లు కాదు. ఈ సిరీస్ ను మేనేజ్మెంట్ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సన్నాహకంగా భావిస్తుంది. అలాంటప్పుడు ఈ ప్లేయర్లు ఎంతో గొప్పగా ఆడాల్సి ఉండేది. అలాకాకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. రోహిత్, గిల్, కిషన్ భారీగా పరుగులు చేసినప్పటికీ.. వారి స్థాయిలో ఆడ లేక చేతులెత్తేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల ముందు తలవంచారు.

జైస్వాల్ నాలుగు, కేఎల్ రాహుల్ సున్నా, వాషింగ్టన్ సుందర్ 19, బ్రార్ మూడు, అర్ష్ దీప్ సింగ్ 3, ప్రిన్స్ యాదవ్ 5.. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో టీమిండియా దాదాపు 500 స్కోరు చేస్తుందనుకుంటే.. 402 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఒక దశలో గిల్, కిషన్ మూడో వికెట్ కు ఏకంగా 224 పరుగులు జోడించారు. కేవలం 140 బంతుల్లోనే వారు ఈ స్థాయిలో పరుగులు సాధించడం విశేషం. వారిద్దరు అవుట్ కావడంతో టీమిండియా పరిస్థితి దారుణంగా మారింది..

360 పరుగుల వద్ద టీమ్ ఇండియా గిల్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోతే.. మిగతా 6 వికెట్లను టీమిండియా కేవలం 62 పరుగుల వ్యవధిలో కోల్పోవడం విశేషం. ఏ ఆటగాడు కూడా సరిగ్గా ఆడలేకపోయాడు.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను ప్రతిఘటించలేకపోయాడు. దీంతో భారత్ స్కోరు 402 పరుగుల వద్ద ముగిసిపోయింది.. ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ చేసిందని అభిమానులు సంబర పడుతున్నప్పటికీ.. లోపాలు వెలుగు చూడడం.. కీలక ఆటగాళ్లు నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం ఆందోళన కలిగిస్తోంది.

చిన్నారి కోరికని నెరవేర్చిన పవన్ కళ్యాణ్.. వరంగల్ లో హృదయాలను హత్తుకునే ఘటనలు..

Pawan Kalyan Fulfills Child Wish
Pawan Kalyan Fulfills Child Wish

Pawan Kalyan Fulfills Child Wish: గత కొంతకాలంగా వరంగల్ లోని హన్మకొండ లో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరంజన్ అనే 17 ఏళ్ళ కుర్రాడు , పవన్ కళ్యాణ్ ని ఒక్కసారి కలవాలని ఉందని చివరి కోరిక కోరడం , ఆ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యి , పవన్ కళ్యాణ్ వరకు చేరడంతో, ఆయన వెంటనే నేడు వరంగల్ కి చేరుకొని ఆ చిన్నారికి , అతని కుటుంబానికి ఆర్ధిక సాయం అందించి , వాళ్లకు బోలెడంత ధైర్యం చెప్పి , బాలుడి వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు మొత్తం తానే భరిస్తానని మాటిచ్చాడు. అంతే కాకుండా, తల్లిదండ్రులకు ఉపాధి కోసం ఒక క్యాంటీన్ ని కూడా పెట్టించాడు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ చూపించిన ఈ చొరవ ని చూసి , సోషల్ మీడియా లో ఆయన అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు.

ఆ చిన్నారి ‘మీతో కలిసి సినిమా చూడాలని ఉంది’ అని అడగ్గా, పవన్ కళ్యాణ్ అందుకు బదులిస్తూ ‘కచ్చితంగా నీకు కాస్త ఆరోగ్యం కుదుట పడ్డాక ఇద్దరం కలిసి ఓజీ చిత్రాన్ని చూద్దాం. నేను ఒకవేళ ఓజీ 2 తీస్తే , నువ్వే నా స్పెషల్ చీఫ్ గెస్ట్’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఇక రామ్ చరణ్ వద్ద ఉన్నటువంటి పుడుల్ జాతి కుక్క ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీన్ని రామ్ చరణ్ ‘రైమ్’ అని పిలుస్తుంటాడు. వీటిలో ఒక కుక్క తనకు కావాలని నిరంజన్ అడగ్గా , అందుకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ ‘రామ్ చరణ్ దగ్గర మూడు కుక్కలు ఉన్నాయి, నువ్వు ఏ కుక్క ని కోరుతున్నావో తెలియదు. సింహం లాగా ఉంటుంది అదేనా?, నేను ఇంటికి వెళ్లిన తర్వాత కచ్చితంగా నీకోసం పంపిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.

కుర్రాడితో పవన్ కళ్యాణ్ జరిపిన ఈ సంభాషణలు కేవలం అభిమానులను మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులను , ఇతర పార్టీల కార్యకర్తలను కూడా ఆకర్షించింది. ఆ చిన్నారి ఎక్కువ కాలం బ్రతకడు , ఈ అరుదైన వ్యాధి కోటి లో ఒకరిద్దరికి మాత్రమే ఉంటుంది, దీనికి ప్రపంచం లో ఎక్కడా కూడా ట్రీట్మెంట్ లేదు. ఒకవేళ ట్రీట్మెంట్ ఉండుంటే , పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఈ చిన్నారి కి మెరుగైన వైద్యం అందేలా చేసి , ప్రాణాలను కాపాడి ఉండేవాడు. కానీ ఏమి చేస్తాం చెప్పండి, విధి రాత ని ఎవ్వరూ మార్చలేరు. అయినప్పటికీ ఆ బాలుడు బ్రతికేందుకు 1 శాతం అవకాశం ఉన్నా , బ్రతకాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుందాం. ఎన్ని రోజులు అతను ఈ భూమి మీద ఉంటాడో తెలియదు కానీ , ఉన్నన్ని రోజులు కచ్చితంగా నేడు పవన్ కళ్యాణ్ అతనికి ఇచ్చిన సర్ప్రైజ్ కారణంగా సంతోషంగా బ్రతుకుతాడు.

అన్నామలై స్పందనలు సంచలనంగా మారాయి

Annamalai NEET tweet

Annamalai NEET tweet : నిన్నటిదాకా అన్నామలై మాట్లాడితే.. అది ద్రవిడ వాదాన్ని చీల్చిచెండాడే స్వరం.. బీజేపీ గొంతుకగా ఉండేది. కానీ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాక అన్నామలై స్టాండ్ ఎలా ఉండబోతోంది. బీజేపీ నుంచి బయటకొచ్చాక ఆయన ఎలాంటి స్వతంత్ర రాజకీయ పార్టీతో ఎలా ముందుకెళతారన్నది ఆసక్తి రేపుతోంది. బీజేపీ నుంచి విడిపోవడం సఖ్యతతోనే విడిపోయారు.

తాజాగా నీట్ మీద అన్నామలై ట్వీట్ చేశాడు. ’టు టైర్ సెక్యూరిటీ పేపర్లకు కల్పించాలని.. సీసీటీవీ , బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నైజేషన్, పీఎంవో కార్యాలయం నుంచి డైరెక్ట్ గా మారిటన్.. ఇక్కడి వరకూ బాగానే ఉంది.అడిషినల్ సెక్యూరిటీ మెజర్స్ ను విద్యార్థులు మెచ్చుకుంటున్నారు. పరీక్షల టెన్షన్ లో ఉన్న విద్యార్థులకు ఇది కొత్త ప్రమాదంగా మారుతాయని.. కొత్త టెన్షన్ తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అన్నామలై స్పందనలు సంచలనంగా మారాయి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడాలి. 

2027 సంక్రాంతి పోటీ లో ఎందరు హీరోలు ఉన్న విజయం వాళ్ళదే అవుతుందా..?

Sankranti 2027 Movie Releases
Sankranti 2027 Movie Releases

Sankranti 2027 Movie Releases: సినిమాను తీయడం ఒకెత్తయితే దానిని రిలీజ్ చేయడం మరొకెత్తు గా మారింది. పెర్ఫెక్ట్ రిలీజ్ ఉన్నప్పుడు ఆ సినిమాలు సక్సెస్ లను సాధిస్తాయి. దాని కోసం సినిమావాళ్ళు పండుగ సీజన్ల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ సైతం వాళ్ళ కుటుంబం తో కలిసి థియేటర్ కి వచ్చి సినిమాలు చూస్తారు. అందుకే పండగ సీజన్ అనేది సినిమావాళ్లకు చాలా కీలకం…అందుకే అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు సైతం సంక్రాంతి పండుగను క్వాష్ చేసుకుంటూ ఉంటాడు.

ఇక ఇప్పటివరకు ఆయన సంక్రాంతికి సినిమాలను రిలీజ్ చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఈ ఇయర్ సంక్రాంతి కి చిరంజీవి తో చేసిన మన శంకర్ వరప్రసాద్ మూవీతో సక్సెస్ ను సాధించిన ఆయన వచ్చే ఏడాది సంక్రాంతికి మరో సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఆయన ఈ సినిమాని సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

ఇక ఈ సంక్రాంతికి వీళ్ళతో పాటు చిరంజీవి కూడా సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు. గోపీచంద్ మలినేని బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కొంతమంది చిన్న హీరోలు సైతం వాళ్ళ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నప్పటికి ఏ సినిమా బాగుంటే దానికి మాత్రమే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. అంతేతప్ప సినిమాలు ఎక్కువగా వచ్చినంత మాత్రాన ప్రతిదీ సంక్రాంతి కి సక్సెస్ ని సాధిస్తుందనేది సరైనది కాదు.

ఈ సినిమాలో కంటెంట్ ఉండి అది ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలిగితే మాత్రమే వాళ్ళు రిపీటెడ్ గా సినిమాను చూసి సినిమాకి భారీ కలెక్షన్స్ ను పెంచే ప్రయత్నం చేస్తారు. లేకపోతే మాత్రం ఈ హీరో మూవీ అయిన డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది. 2027వ సంవత్సరం సంక్రాంతి పండక్కి ఇప్పటినుంచే హీట్ పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది…

మన మిరప అంత డేంజరా.. చైనా ఎందుకు వద్దంటోంది..

Indian Chilli Export
Indian Chilli Export

Indian Chilli Export: మనదేశంలో మిరప ఎక్కువగా పండించే రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. ఇక్కడ పండే మిరపకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా టమాటా మిర్చి.. తేజ రకం మిర్చికి ఈ రెండు రాష్ట్రాలు పెట్టింది పేరు. అందువల్లే చైనా వ్యాపారులు మన తెలుగు రాష్ట్రాలలో పండిన మిరపకాయలను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎండు మిరపకాయల నుంచి కారం మాత్రమే కాకుండా.. కృత్రిమ రంగులలో ఉపయోగించే రసాయనాలను తయారు చేస్తూ ఉంటారు. ఈ రసాయనాలకు చైనాలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

సాధారణంగా మిర్చిలో రైతులు ఎక్కువగా క్రిమిసంహారకాలు వాడుతుంటారు. మిరప అనేది అత్యంత సున్నితమైన పంట. ఎక్కువ దిగుబడి సాధించడానికి రైతులు విపరీతంగా క్రిమిసంహారకాలు వాడుతూ ఉంటారు. గతంలో క్రిమిసంహారకాల వాడకం ఒక స్థాయి వరకు ఉండేది. కొంతకాలంగా మిరప మీద తెగుళ్లు విపరీతంగా దాడి చేస్తున్న నేపథ్యంలో దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. అందువల్ల రైతులు క్రిమిసంహారకాలను ఎక్కువగా వాడాల్సి వస్తోంది. దేశీయంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. ఎగుమతి అయ్యే మిరప విషయంలోనే కష్టాలు ఎదురవుతున్నాయి.

మన దగ్గర పండిన మిర్చి ఎక్కువగా చైనా దేశానికి ఎగుమతి అవుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో రెండు కంటైనర్ల మిర్చి మన దేశానికి చైనా తిరిగి పంపింది. దీనికి ప్రధాన కారణం క్రిమిసంహారకాలు అధికంగా ఉండటమే. ఈ స్థాయిలో క్రిమి సంహారకాలు వాడిన మిరపని పంపిస్తే తీసుకునేది లేదని చైనా స్పష్టం చేసింది. దీంతో మిరప వ్యాపారులు ఆందోళన చెపుతున్నారు. మిరపలో క్రిమిసంహారకాల వాడకాన్ని తగ్గించే విధంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని.. రైతులు సహజ సిద్ధమైన పద్ధతుల్లో మిరపని పండించే విధంగా చూడాలని వ్యాపారుడు కోరారు. పదేపదే పురుగుమందుల అవశేషాల ఉల్లంఘన జరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో భారత మార్కెట్ విలువ పడిపోతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చైనాకు ఎగుమతి అవుతున్న మిరపలో మెతా మెడోఫాస్.. మొనోక్రోటఫాస్.. ప్రొఫెనోపాస్.. ట్రయాజో పాస్.. ఇతియాన్.. క్లోరోపైరీఫాస్.. పిఫ్రోనిల్ వంటి ఆందోళన కలిగించే క్రిమిసంహారకాలు ఉన్నాయని ఆంధ్ర ప్రదేశ్ మిరప వ్యాపారుల సంఘం అధ్యక్షుడు వెలగపూడి సాంబశివరావు.. ప్రధాన కార్యదర్శి తోట రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా ప్రధానంగా ఈ క్రిమిసంహారకాలను చూపించి ఎగుమతులను తీసుకోవడం లేదని వారు పేర్కొన్నారు.. అంతేకాదు ప్రభుత్వం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని.. రైతులకు మేలైన విత్తనాలు.. పంట దిగుబడిలో తీసుకోవాల్సిన సూచనలు.. తెగుళ్ల బారిన పడకుండా మేలైన దిగుబడి అందించే వంగడాలను రూపొందించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.

రైతులకు పురుగుమందులు అమ్మే డీలర్ల మీద కఠినమైన పర్యవేక్షణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు.. గుంటూరు.. పల్నాడు.. ప్రకాశం.. కర్నూలు.. నంద్యాల.. తెలంగాణ.. కర్ణాటక వంటి రాష్ట్రాలలో మిరప పండించే రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని మిరప వ్యాపారులు చెబుతున్నారు. సక్రమంగా ఎగుమతులు చేయని పక్షంలో దేశీయంగా రేటు పడిపోతుందని.. అది రైతులకే నష్టం చేకూరుతుందని వ్యాపారులు చెబుతున్నారు..

అతిథులు వస్తే ‘పూర్ణకుంభం’తో ఎందుకు స్వాగతం పలుకుతారు.. దీని వెనకున్న అర్థం ఏంటీ..

Poornakumbham
Poornakumbham

Poornakumbham: భారతీయ హిందూ సాంప్రదాయాల్లో పాటించే కొన్నింటిని సాధారణంగా తీసుకుంటాం. కానీ వీటి వెనుక ప్రత్యేక అర్థం దాగి ఉంటుంది. అందులో ముఖ్యంగా దేవాలయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేద సభలు లేదా విశిష్ట అతిథుల రాక సందర్భంగా పూర్ణకుంభ స్వాగతంతో స్వాగతం పలుకుతూ ఉంటారు. ఎంతో ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఈ ఆచారం కేవలం స్వాగత విధానం మాత్రమే కాదు.. అతిథిని దైవస్వరూపంగా భావించి గౌరవించే సంస్కృతికి ప్రతీకగా భావిస్తారు. ఇలా పూర్ణకుంభంతో స్వాగతం పలకడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే?

‘పూర్ణ’ అంటే నిండుదనం, సంపూర్ణత అని అర్థం. ‘కుంభం’ అంటే కలశం లేదా పాత్ర. నీటితో నింపిన కలశంపై మామిడాకులు, కొబ్బరికాయను ఉంచి అలంకరించిన దానినే పూర్ణకుంభం అంటారు. ఇది శుభానికి, ఐశ్వర్యానికి, మంగళకరమైన ఆరంభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వేదకాలం నుంచే పూర్ణకుంభానికి విశిష్ట స్థానం ఉంది. పూర్ణకుంభంలో ఉపయోగించే ప్రతి వస్తువుకీ ఒక ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. రాగి లేదా ఇత్తడి పాత్ర విశ్వానికి ప్రతీకగా భావిస్తారు. అందులో నింపే నీరు సృష్టికి, జీవానికి మూలాధారంగా సూచిస్తుంది. కొబ్బరికాయ దైవత్వాన్ని, పవిత్రతను తెలియజేస్తుంది. మామిడాకులు ప్రకృతి, పచ్చదనం, జీవశక్తికి సంకేతాలుగా భావిస్తారు. ఈ సమ్మేళనం మొత్తం కలిసి సంపూర్ణ సృష్టిని సూచిస్తుందని పండితులు వివరిస్తారు.

వేదాలు, ఆగమ శాస్త్రాలు, పురాణాల్లో పూర్ణకుంభానికి విశేష ప్రాధాన్యం ఉంది. యజ్ఞాలు, ప్రతిష్ఠాపనలు, దేవాలయ మహాసంప్రోక్షణలు, వివిధ పూజా కార్యక్రమాల్లో కలశాన్ని దైవ స్వరూపంగా ఆరాధిస్తారు. లక్ష్మీదేవి, గంగాదేవి వంటి దైవశక్తులు కలశంలో నివసిస్తారని హిందూ సంప్రదాయం చెబుతుంది. అందుకే పూర్ణకుంభాన్ని శుభలక్షణంగా భావిస్తారు.

ప్రదాయం ప్రకారం.. ప్రతి ఒక్కరికీ పూర్ణకుంభ స్వాగతం ఇవ్వరు. ముఖ్యంగా పీఠాధిపతులు, జగద్గురువులు, మఠాధిపతులు, యతులు, వేద పండితులు, రాజులు లేదా పాలకులు వంటి విశిష్ట వ్యక్తులకు మాత్రమే ఈ గౌరవం అందించేవారు. వారు సమాజానికి మార్గదర్శకులని భావించి పూర్ణకుంభంతో ఆహ్వానించడం ద్వారా ప్రత్యేక మర్యాదను తెలియజేస్తారు.

దేవాలయాల్లోకి విచ్చేసే ఆధ్యాత్మిక గురువులు, స్వామీజీలు లేదా విశిష్ట అతిథులకు పూర్ణకుంభంతో స్వాగతం పలకడం ఆనవాయితీ. ఇది కేవలం వ్యక్తిని గౌరవించడం మాత్రమే కాదు, ఆయన ద్వారా దైవానుగ్రహం ఆలయానికి, భక్తులకు లభించాలని కోరుకునే భావన కూడా ఇందులో ఉంటుంది. అందుకే పూర్ణకుంభ స్వాగతాన్ని మంగళకరమైన కార్యక్రమంగా భావిస్తారు.

కాలం మారినా పూర్ణకుంభ స్వాగతానికి ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. దేశవ్యాప్తంగా జరిగే ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాల్లో ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. భారతీయ సంస్కృతిలో అతిథిని దేవుడిగా భావించే ‘అతిథి దేవో భవ’అనే భావనకు పూర్ణకుంభ స్వాగతం ఒక అద్భుతమైన ప్రతీకగా నిలిచింది.

తెలంగాణలో తొలి గవర్నమెంట్ కార్పొరేట్ స్కూల్ ఇది.. ఇందులో ప్రత్యేకతలు, వసతులు ఎలా ఉన్నాయంటే..

Government Corporate School
Government Corporate School

Government Corporate School: సాధారణంగా ప్రభుత్వ బడి అంటే అందరిలో ఒక రకమైన భావన ఉంటుంది. సరైన సదుపాయాలు ఉండవు. పుస్తకాలు, యూనిఫామ్ సక్రమంగా ఉండదు. మధ్యాహ్నం భోజనం సరిగా ఉండదు. ఉపాధ్యాయులలో బాధ్యత కనిపించదు. సరైన క్రమశిక్షణ లేకపోవడంతో విద్యార్థులు కూడా దారి తప్పుతుంటారు. అందువల్లే ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపడానికి తల్లిదండ్రులు వెనకడుగు వేస్తారు. గత కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలలో డ్రాప్ అవుట్లు పెరుగుతున్నాయి. దీనిని బట్టి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

తొలి గవర్నమెంట్ కార్పొరేట్ స్కూల్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గురుకులాలు.. ఇతర విద్యాలయాలు కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటికి అవి కార్పొరేట్ రూపును సంతరించుకోలేకపోతున్నాయి. ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెడుతున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆరుట్ల ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ తొలి పబ్లిక్ స్కూల్ ను నిర్మించారు. బుధవారం పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. పూరీలు కూడా చేశారు.. అయితే ఈ స్కూల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యను అందిస్తారు..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసింది.. కార్పొరేట్ పాఠశాలల కంటే దీటుగా ఇందులో ప్రభుత్వం వసతులు కల్పిస్తోంది. అంతేకాదు ఆరుట్ల ప్రాంతంలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.. ఈ పాఠశాలలో ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాస్ రూమ్ లు.. గ్రంథాలయాలు.. సైన్స్ ప్రయోగ కేంద్రాలు.. భోజన కేంద్రాలు.. క్రీడ మైదానాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థులు.. ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమై.. వారితో ముచ్చటించారు

ఈ స్కూల్ లో విద్యా ఉచితం. భోజనం కూడా ఉచితం. ప్రపంచ స్థాయిలో సౌకర్యాలు విద్యార్థులకు ఉచితంగానే ప్రభుత్వాన్ని ఇస్తుంది. ఇక్కడ విద్యార్థులను తీసుకురావడానికి ప్రత్యేకంగా బస్సులు ఉంటాయి. ఆరుట్ల , మంచాల, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి ప్రాంతాలలో పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేయబోతోంది. ఆరుట్ల పాఠశాలలో మొత్తం 1814 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రీ ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ విభాగం లో 600 మంది.. రెండు బ్లాక్లలో ఏర్పాటుచేసిన హైస్కూల్లో 800 మంది.. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది.. రెండో సంవత్సరంలో 14 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ఈ పాఠశాలలో ఒకే ప్రాంతంలో ఇంటర్ వరకు చదువుకునేందుకు విద్యార్థులకు సౌకర్యాలు కల్పించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగుతూ ఉంటుంది. విద్యార్థులకు ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం లంచ్.. ఈవినింగ్ స్నాక్స్ పెడతారు. చదువుతోపాటు ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తారు. సమీప గ్రామాల ప్రజలు ఈ స్కూలుకు రావడానికి బస్సు సౌకర్యం కూడా కల్పించారు. స్మార్ట్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేశారు.. అత్యంత ఆధునికమైన ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా క్రీడలను కూడా ప్రాధాన్యం కల్పించారు.

క్రికెట్ నుంచి క్యారమ్స్ వరకు అన్ని క్రీడలకు ప్రత్యేకమైన మైదానాలు.. కోర్టులు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా శిక్షకులను నియమించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నిర్వహణ సాగుతూ ఉంటుంది. ఈ పాఠశాల ప్రభుత్వం విద్య మీద పెడుతున్న దృష్టికి ప్రధాన నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలకు.. ప్రవేట్ పాఠశాలలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికి దోహదపడుతోంది. ఆరుట్ల స్కూల్ గనుక విజయవంతం అయితే.. తెలంగాణలో విద్యా విప్లవానికి రేవంత్ రెడ్డి నాంది పలికినట్టు అవుతుంది.

ఇజ్రాయెల్ తో పెట్టుకుంటే ఇత్తడైపోద్ది.. టర్కీకి అమెరికా హెచ్చరిక.. తీవ్ర ఉద్రిక్తత

US Warning To Turkey
US Warning To Turkey

US Warning To Turkey: ఇరాన్‌–అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. దాదాపు వందరోజులకుపైగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. చమురు సంక్షోభం నెలకొంది. తాజా శాంతి ఒప్పందంతో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిలో ఇజ్రాయెల్‌ శాంతి ఒప్పందంతో తమకు సంబంధం లేదని షాక్‌ ఇచ్చింది. ఇదే సమయంలో టర్కీ అధ్యక్షుడు రెజెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ఇజ్రాయెల్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ, దాడికి సిద్ధంగా ఉన్నామని, దేనికైనా తాము సిద్ధమని పేర్కొన్నారు. ఇది టర్కీ–ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. అమెరికా మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి టర్కీకి స్పష్టమైన వార్నింగ్‌ ఇచ్చారు. ఇజ్రాయెల్‌ జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు.

టర్కీ అధ్యక్షుడి ఘాటు వ్యాఖ్యలు…
టర్కీ అధ్యక్షుడు ఇజ్రాయెల్‌ చర్యలు తమ దేశ భద్రతను బెదిరిస్తున్నాయని, లెబనాన్, సిరియా వంటి పొరుగు దేశాల్లో ఇజ్రాయెల్‌ చేస్తున్న కార్యకలాపాలు టర్కీని కూడా ప్రభావితం చేస్తున్నాయని ఆరోపించారు. ఇజ్రాయెల్‌ను శత్రువుగా చూస్తున్నామని, దాడికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం ద్వారా టర్కీ తన సైనిక సామర్థ్యాన్ని, ప్రాంతీయ ప్రభావాన్ని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇది ఎర్డోగాన్‌ దేశీయ రాజకీయాల్లో ఉపయోగపడే వ్యూహం కూడా కావచ్చు. అయితే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దౌత్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయి.

అమెరికా మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి హెచ్చరిక..
అమెరికా మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి టర్కీకి స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఇజ్రాయెల్‌ జోలికి వెళ్లకూడదని, అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ అమెరికాకు సన్నిహిత మిత్రుడు కాబట్టి, దాని భద్రతపై అమెరికా ఎప్పుడూ రాజీపడదని పరోక్షంగా పేర్కొన్నారు. ఈ హెచ్చరికలో భారత్‌ ఇచ్చిన ఆయుధాల ప్రస్తావన కూడా ఉంది.

టర్కీ చుట్టూ ప్రమాదం..
టర్కీ చుట్టూ ఉన్న సైప్రస్, ఆర్మేనియా, గ్రీస్‌ ఇప్పటికే భారత్‌ నుంచి ఆయుధాలు పొందాయని, ఇజ్రాయెల్‌ కూడా వాటితో కలిస్తే టర్కీకి దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు. ఇది టర్కీని రాజకీయంగా, సైనికంగా ఒంటరిగా చేసే వ్యూహంగా కనిపిస్తుంది.

మూడు దేశాల్లో భారత ఆయుధాలు..
భారత్‌ ఇటీవల సైప్రస్, ఆర్మేనియా, గ్రీస్‌లతో రక్షణ సంబంధాలను బలపరచింది. ఆర్మేనియాకు పినాకా రాకెట్లు, ఆకాశ్‌ క్షిపణులు, హోవిట్జర్లు వంటి ఆయుధాలు సరఫరా చేసింది. గ్రీస్, సైప్రస్‌లు కూడా భారత్‌ బ్రహ్మోస్‌ క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థలపై ఆసక్తి చూపుతున్నాయి. ఇవి టర్కీకి ప్రత్యర్థులు. టర్కీకి పాకిస్తాన్, ఆజర్‌బైజాన్‌ మద్దతు ఇస్తున్నాయి. ఇది భారత్‌ రక్షణ ఎగుమతులు పెంచడం మాత్రమే కాదు ప్రాంతీయ సమతుల్యాన్ని నిర్మించే వ్యూహం.

ఇజ్రాయెల్‌తో కలిస్తే…
అమెరికా మాజీ అధికారి చెప్పినట్లు, ఇజ్రాయెల్‌ ఆర్మేనియా, సైప్రస్, గ్రీస్‌తో కలిస్తే టర్కీకి బహుముఖ సవాలు ఏర్పడుతుంది. తూర్పు మధ్యధరా ప్రాంతంలో గ్రీస్‌–సైప్రస్‌–ఇజ్రాయెల్‌ కూటమి ఇప్పటికే బలంగా ఉంది. ఆర్మేనియా కూడా చేరితే టర్కీ ఒంటరిగా మారుతుంది. అయితే టర్కీ నాటో సభ్య దేశం. బలమైన సైన్యం కలిగి ఉంది. నేరుగా యుద్ధం జరిగే అవకాశం తక్కువే. కానీ రెచ్చగొట్టే మాటలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.

తాజా పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో అలయన్స్‌లు ఎలా మారుతున్నాయో చూపిస్తున్నాయి. భారత్‌ రక్షణ దౌత్యం ద్వారా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. అమెరికా ఇజ్రాయెల్‌కు అండగా నిలబడటం స్పష్టం. టర్కీ మాత్రం ఇజ్రాయెల్‌ను శత్రువుగా చూడడం కొనసాగిస్తోంది. అయితే యుద్ధం ఎవరికీ మంచిది కాదు. దౌత్యం, చర్చలు మాత్రమే సుస్థిర పరిష్కారం. సైప్రస్‌ సమస్య, ఆర్మేనియా–అజర్‌బైజాన్‌ వివాదం, భారత్‌ వంటి దేశాలు సమతుల్య విధానం పాటించడం ద్వారా ప్రాంతీయ శాంతిని కాపాడవచ్చు. ఈ ఉద్రిక్తతలు టర్కీని ఒంటరిగా చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. కానీ వాస్తవికంగా చూస్తే, అన్ని దేశాలు తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

మార్కెట్లోకి మరో 5 ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్లు.. పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ ఎఫెక్ట్..

Five New Flex Fuel Cars
Five New Flex Fuel Cars

Five New Flex Fuel Cars: భారత ఆటోమొబైల్ రంగం రాబోయే రోజుల్లో చారిత్రాత్మక మార్పుకు సాక్ష్యంగా నిలవబోతోంది. పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణహిత ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మారుతి సుజుకీ కంపెనీ నుంచి వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే మిగతా కంపెనీలు సైతం ఈ ఇంధన వాహనాలను తీసుకొచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. వీటి రాకతో పెట్రోల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లకు గట్టి దెబ్బ పడే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మరి త్వరలో మార్కెట్లోకి రాబోయే ఆ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్లు ఏవంటే?

E20, E85, E100 వంటి ఇంధన మిశ్రమాలకు అనుగుణంగా మారుతి సుజుకీ కంపెన నుంచి మొదటి ఫ్లెక్సీ ఫ్యూయెల్ కారు వ్యాగన్ ఆర్ ను ఇప్పటికే మార్కెట్లోకితీసుకువచ్చారు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ కంపెనీకి చెందిన ఫ్రాంక్స్‌ను E85 ఇంధనానికి అనుగుణంగా రూపొందిస్తున్నారు. అంటే 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో ఈ కారు నడవగలదు. ఇథనాల్‌కు తగిన విధంగా ఇంజిన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్‌లో ప్రత్యేక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

Toyota Innova Hycross ఇప్పటికే భారత మార్కెట్లో ప్రీమియం MPVగా గుర్తింపు పొందింది. దీనిని కూడా టయోటా ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌లో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. హైబ్రిడ్ టెక్నాలజీలో ముందంజలో ఉన్న టయోటా, ఇప్పుడు ఇథనాల్ ఆధారిత ఇంజన్‌తో మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇది కుటుంబ వినియోగదారులకు పర్యావరణహిత ఎంపికగా మారే అవకాశం ఉంది.

Hyundai Creta కూడా త్వరలో ఇథనాల్ వెర్షన్‌లో రానున్న ప్రముఖ SUVలలో ఒకటి. హ్యుందాయ్ ఇప్పటికే పూర్తి 100 శాతం ఇథనాల్‌తో నడిచే క్రెటా ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. E100 ఇంధనంతో పనిచేసే ఈ మోడల్ విజయవంతమైతే, భారత మార్కెట్లో పూర్తిస్థాయి ఇథనాల్ కార్లకు మార్గం సుగమం కావచ్చు. దీంతో కాలుష్య నియంత్రణలో కూడా గణనీయమైన పురోగతి సాధించే అవకాశం ఉంది.

దేశీయ ఆటో దిగ్గజం Tata Motors తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుగా Tata Punchను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ మోడల్‌ను భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించగా మంచి స్పందన లభించింది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ఇప్పటికే పాపులర్‌గా ఉన్న పంచ్, ఇథనాల్ వెర్షన్‌తో మార్కెట్లోకి వస్తే మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

MG Hector కూడా ఫ్లెక్స్-ఫ్యూయల్ జాబితాలో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత మార్కెట్లో మంచి క్రేజ్ కలిగిన హెక్టర్‌ను ఇథనాల్ ఇంజన్‌తో పరిచయం చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. అధునాతన ఫీచర్లు, విశాలమైన క్యాబిన్‌తో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ SUV, కొత్త ఇంధన సాంకేతికతతో మరింత ఆకర్షణీయంగా మారవచ్చు.

మార్కెట్లోకి ఫ్లెక్సీ ఫ్యూయెల్ బైక్ లు.. పెట్రోల్ బైక్ ల పరిస్థితేంటి.. వాటిని వదులుకుంటారా..

Flex Fuel Bikes In India
Flex Fuel Bikes In India

Flex Fuel Bikes In India: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ద్విచక్ర వాహనాల్లో హీరో కంపెనీకి చెందిన స్ప్లెండర్ ప్లస్ (Splendor+), హెచ్‌ఎఫ్ డీలక్స్ (HF Deluxe) ఉంటాయి. ఇవి సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండడంతో పాటు కావాల్సిన మైలేజ్ ని అందిస్తాయి. అంతేకాకుండా మెయింటనెన్స్ విషయంలోనూ పెద్దగా ఇబ్బంది పెట్టకపోవడంతో వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. అయితేఇవి ఇప్పుడు సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex-Fuel – E85) టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా, పెట్రోల్ భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వాహనాలతో పాత వాటిపై ప్రభావం పడనుందా? వాటి అమ్మకాలు కొనసాగుతాయా?

హీరో మోటోకార్ప్ ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లను ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం.. హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ను రూ.72,792 గాను, స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ను రూ.82,710 గాను ధరలను నిర్ణయించింది. సాధారణ పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే ఇవి సుమారు రూ.5,000 నుండి రూ.13,000 వరకు ప్రీమియం ధరను కలిగి ఉన్నాయి. వీటి డెలివరీలు జూలై చివరి వారం నుండి మొదటగా ఢిల్లీ, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో ప్రారంభం కానున్నాయి. కస్టమర్లను ఆకర్షించడానికి కంపెనీ ప్రారంభ ఆఫర్ కింద రూ.4,000 వరకు తగ్గింపును కూడా ఇస్తోంది.

ఇథనాల్ ఇంధనం పెట్రోల్ కంటే భిన్నంగా ఉంటుంది. దీంతో హీరో కంపెనీ ఈ బైక్‌లలో దాదాపు 36 రకాల మెకానికల్ మార్పులను చేసింది. ఇందులో కొత్త ఫ్యూయల్ పంప్, సెకండరీ ఫ్యూయల్ ఫిల్టర్, అప్‌గ్రేడెడ్ ఈసీయూ ( Engine Control Unit)లను అమర్చారు. దీంతో పెట్రోల్ బైక్ కంటే ఇది 7శాతం ఎక్కువ పవర్ ను, 3 శాతం ఎక్కువ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

సాధారణ పెట్రోల్ బైక్‌లను జనం వదులుకుంటారా?
కస్టమర్లు తమ పాత పెట్రోల్ బైక్‌లను వెంటనే వదిలేసి వీటి వైపు మళ్లుతారా అంటే.. అది పూర్తిగా దేశంలో ఇథనాల్ ఇంధన లభ్యత పైనే ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త బైక్‌లు సాధారణ పెట్రోల్ (E20) నుంచి 85 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వరకు దేనితోనైనా నడవగలవు. ప్రస్తుతం సాధారణ పెట్రోల్ ధర రూ.100 కంటే ఎక్కువగా ఉండగా, భవిష్యత్తులో E85 ఇథనాల్ ఇంధనం రూ.60 నుండి రూ.70 లకే లభించే అవకాశం ఉంది. బంకుల్లో ఇథనాల్ ఇంధనం విరివిగా దొరకడం ప్రారంభమైతే, రోజువారీ ప్రయాణికులు ఖచ్చితంగా తమ పాత పెట్రోల్ బైక్‌ల స్థానంలో ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లను కొనడానికే మొగ్గు చూపుతారు.

భారత టూ-వీలర్ మార్కెట్‌పై ఈ బైక్‌ల ప్రభావం చాలా బలంగా ఉండబోతోంది. ఎందుకంటే హీరో సంస్థ ఈ ప్రయోగాన్ని ఏదో ఒక ప్రీమియం బైక్‌పై చేయకుండా, దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్ప్లెండర్, హెచ్‌ఎఫ్ డీలక్స్ లపైనే చేసింది. మిడిల్ క్లాస్ ప్రజలకు మైలేజ్ , తక్కువ ఖర్చు చాలా ముఖ్యం. ఇథనాల్ వాడకం వల్ల ఇంధన ఖర్చులు దాదాపు 30 నుండి 40శాతం వరకు తగ్గుతాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో మిగతా కంపెనీలు (హోండా, బజాజ్, టీవీఎస్) కూడా తమ 100cc బైక్‌లను ఫ్లెక్స్-ఫ్యూయల్ వేరియంట్లలో తీసుకురాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

Xiaomi కంపెనీ సరికొత్త ప్రయోగం.. ఈ సారి ఏకంగా ప్రీమయం ఫోన్ తో మార్కెట్లోకి..

Xiaomi 18 Pro Features
Xiaomi 18 Pro Features

Xiaomi 18 Pro Features: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ Xiaomi 18 గురించి అప్డేట్ ఇచ్చిన తరువాత దీని గురించి ఆసక్తి చర్చ సాగుతోంది. సాధారణంగా అన్ని కంపెనీలు మొదట స్టాండర్డ్ వేరియంట్‌ను లేదా అన్ని మోడళ్లను ఒకేసారి విడుదల చేస్తాయి. కానీ ఈసారి షావోమి తన స్టాండర్డ్ మోడల్ కంటే ముందే ప్రీమియం వేరియంట్ అయిన Xiaomi 18 Proని మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ ‘డిజిటల్ చాట్ స్టేషన్’ వెల్లడించారు. ఈ కొత్త ఫోన్ ఎలా ఉండబోతుందంటే?

షావోమి 18 ప్రో స్మార్ట్‌ఫోన్ మొదటగా సెప్టెంబర్ లేదా నవంబర్ నాటికి చైనాలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతే స్టాండర్డ్ షావోమి 18 మోడల్ మార్కెట్లోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ రెండు మోడళ్ల లాంచ్ మధ్య ఎక్కువ గ్యాప్ ఉండదని వచ్చే చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ (ఫిబ్రవరి) కంటే ముందే ఈ రెండు ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని టిప్‌స్టర్ పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్లోకి కూడా ఈ సిరీస్ త్వరగానే అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

షావోమి 18 ప్రో మోడల్‌లో ఈసారి డిజైన్ పరంగా భారీ మార్పులు చేయబోతున్నారు. ఫోన్ వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన రియర్ డిస్‌ప్లే ఇవ్వబోతున్నట్లు సమాచారం. దీని ద్వారా ఫోన్ లాక్ తీయకుండానే నోటిఫికేషన్లు చూడటం, మ్యూజిక్ కంట్రోల్ చేయడం లేదా మెయిన్ కెమెరాతో హై-క్వాలిటీ సెల్ఫీలు తీసుకోవడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా, ఐఫోన్ తరహాలోనే బాడీ ఫ్రేమ్‌పై ఒక ప్రత్యేకమైన AI Button కూడా రాబోతోంది. దీనిని సింగిల్ ప్రెస్ చేయడం ద్వారా వాయిస్ అసిస్టెంట్ ఆన్ చేయడం, ఆర్టికల్స్ సమరైజ్ చేయడం, రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ వంటి పనులను క్షణాల్లో చేసుకోవచ్చు.

షావోమి 18 ప్రో కెమెరా విభాగం విషయానికొస్తే.. దీని వెనుక భాగంలో ఏకంగా రెండు 200 మెగాపిక్సెల్ కెమెరాను, వీటికి తోడుగా ఒక 50 మెగాపిక్సెల్ అమర్చబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండటం వల్ల, ఎలాంటి క్వాలిటీ తగ్గకుండా లాస్‌లెస్ డిజిటల్ జూమ్ ఫీచర్‌ను యూజర్లు అందుకోవచ్చు. నైట్ సమయంలో ఫోటోగ్రఫీ, పోర్ట్రెయిట్ షాట్స్ కోసం ఇది సరికొత్త ఏఐ అల్గారిథమ్స్‌తో పనిచేస్తుంది.

షావోమి 18 ప్రో మోడల్ లో దాదాపు 6.3 అంగుళాల కాంపాక్ట్ సైజ్ AMOLED ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేయనుంది. డాల్బీ విజన్, డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉండడంతో బెజెల్స్ చాలా సన్నగా ఉండనున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో సిలికాన్-కార్బన్ టెక్నాలజీతో కూడిన 7,000mAh భారీ బ్యాట్రీని ప్యాక్ చేయనున్నారు. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుందని సమాచారం.

ఈ ఫోన్ అత్యంత వేగవంతమైనదిగా పనిచేయనుంది. ఇందులో Snapdragon 8 Elite Gen 6 Pro చిప్‌సెట్‌తో ఈ మొబైల్ రన్ కానుంది. భారీ గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను చాలా సులభంగా హ్యాండిల్ చేయగలిగే ఆండ్రాయిడ్ ఆధారిత హైపర్‌ఓఎస్ (HyperOS) సాఫ్ట్‌వేర్‌ను అందించనున్నారు.

కమ్ముకొస్తున్న కనీవినీ ఎరుగని కరువు.. ఆ 200 జిల్లాలలో అల్లకల్లోలమే

Water Scarcity Crisis
Water Scarcity Crisis

Water Scarcity Crisis: మొన్నటికి మొన్న దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని.. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని.. ఎల్ నీనో ప్రభావం అంతగా ఉండదని మీడియాలో వార్తలు వచ్చాయి.. కానీ ఈ మురిపం రెండు మూడు రోజులకే పరిమితమైంది. ఎందుకంటే రుతుపవనాల విస్తరణకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల మినహా మిగతా అన్నిచోట్ల ఎండలు దంచి కొడుతున్నాయి. వర్షపాతం ఏకంగా 36% లోటుకు చేరుకుంది. జూన్ నెలలో వర్షపాతం 36% లోటు పెద్ద ఇబ్బంది కాకపోయినప్పటికీ.. రుతుపవనాల విస్తరణకు ఏమాత్రం అనుకూల వాతావరణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

జూన్ 16 నాటికి దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు ఏకంగా 35 శాతానికి చేరుకుంది. మహారాష్ట్ర.. కొంకన్ తీరంలో ఇంతవరకు నైరుతీ రుతుపవనాలు విస్తరించలేదు. ఈ ప్రాంతంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడి వర్షాలు కురిస్తేనే గోదావరి నదికి వరద వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆ వరదే జీవనాధారం. పొడి వాతావరణం వల్ల కొన్ని రోజులుగా ఉత్తర దిశగా రుతుపవనాల విస్తరణ పూర్తిగా ఆగిపోయింది.. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఈ సమయానికి వాయవ్య భారతదేశం మాత్రమే సాధారణ వర్షపాతం కంటే ఒక ఐదు శాతం ఎక్కువగా పొందింది. తూర్పు, ఈశాన్యం, మధ్య భారతదేశం, దక్షిణ దీపకల్పంలో లోటు వర్షపాతం కొనసాగుతోంది.

ఈశాన్య భారతదేశంలో 43%.. మధ్య భారత దేశంలో 63%.. దక్షిణ ద్వీపకల్పంలో 14 శాతం లోటు వర్షపాతం కొనసాగుతోంది. 2000 నుంచి ఎల్ నీనో సంవత్సరాలను ఒకసారి పరిశీలిస్తే.. జూన్ వర్షపాత వ్యత్యాసాల విశ్లేషణలో 2015 జూన్ నెల నిలిచింది. ఆ సంవత్సరం జూన్ నెలలో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం 14% అధికంగా నమోదయింది. 2002 జూన్.. 2024 జూన్ నెలలో వర్షపాతం సాధారణ స్థాయిగా నమోదయింది.. అనంతరం జూలై నుంచి మిగతా నెలలో వర్షపాతం తక్కువగా నమోదయింది.

2009లో జూన్ నెలలో సాధారణం కంటే 47% తక్కువగా వర్షపాతం నమోదయింది. 2014లో సాధారణం కంటే 44 శాతం తక్కువగా వర్షపాతం నమోదయింది. 2023లో సాధారణం కంటే ఎనిమిది శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రం కాలానుగుణంగా వేడిగా మారడం వల్ల అది భారత దేశంలో రుతు పవనాల గమనాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఎల్ నీనో సాధారణంగా రుతుపవనాల ప్రారంభం.. రుతుపవనాల ముగింపు పై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని.. అందువల్లే ఈ స్థాయిలో వర్షపాతం తక్కువగా నమోదు అవుతుందని అధికారులు చెబుతున్నారు.

ఈ ఏడాది కాస్త ఆలస్యంగా జూన్ 4న కేరళలో వృత్తిపవనాలు ప్రవేశించాయి. అయితే అప్పటికే పశ్చిమ తీరం వెంబడి రుతుపవనాల పురోగతి వేగాన్ని కోల్పోయింది. వాతావరణంలో మార్పుల ఆధారంగా రుతుపవనాలు విడతలవారీగా కదులుతూ ఉంటాయి. ముంబై శివారు ప్రాంతానికి చేరుకున్న మొదటి విడత రుతుపవనాలు స్థిరంగా నిలబడలేకపోయాయి. దీనికి బదులుగా ముంబై నగరానికి ఉత్తరాన ప్రతికూల వాతావరణం వల్ల రుతుపవనాలు స్తంభించిపోయాయి.. ఒకవేళ వర్షాలు కురవాలి అంటే కచ్చితంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడాలి.. అప్పుడుగాని ఎల్ నీనో ప్రభావం తగ్గుతుంది.

ఇప్పటి అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 20 జిల్లాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని.. తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు మాత్రమే రైతులు వేసేలా అవగాహన కల్పించాలని కేంద్రం సూచించింది.. ఒకవేళ కరువు వల్ల పంటలు పండకపోతే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే చైనా ఎరువుల తయారీకి సంబంధించిన ముడి పదార్ధాలపై ఆంక్షలు విధించింది. దీంతో దేశీయంగా యూరియా ఉత్పత్తి వ్యయం కూడా పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దగ్గు మందు ఇక దొరకదు.. డాక్టర్ రాస్తేనే వాడాలి.. లేదంటే..

Over-the-counter cough syrup ban : సాధారణంగా కొద్దిగా జలుబు, దగ్గు రాగానే చాలామంది చేసే మొదటి పని.. పక్కనే ఉన్న మెడికల్ షాపునకు వెళ్లి ఒక దగ్గు సిరప్ (Cough Syrup) బాటిల్ కొనుక్కోవడం. కానీ ఇకపై ఆ పప్పులు ఉడకవు. మీ దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే కెమిస్ట్లు మీకు దగ్గు సిరప్ ఇస్తారు. దేశంలో కల్తీ దగ్గు సిరప్‌ల కారణంగా వరుసగా చోటుచేసుకుంటున్న విషాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 16న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డ్రగ్స్ రూల్స్-1945లో కీలక సవరణలు చేస్తూ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

నియంత్రణలోకి ‘సిరప్‌లు’.. లాజెంజ్‌లకు మినహాయింపు!

ఇప్పటివరకు దగ్గుకు సంబంధించిన సిరప్‌లు, టాబ్లెట్లు, లాజెంజ్‌లు, పిల్స్ వంటివి ఓవర్-ది-కౌంటర్ (OTC) కింద ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే సులభంగా లభించేవి. అయితే తాజా సవరణల ద్వారా ప్రభుత్వం మినహాయింపు జాబితా నుండి ‘సిరప్‌లు’ (Syrups) అనే పదాన్ని తొలగించింది. ప్రభుత్వం కేవలం ‘లిక్విడ్ సిరప్‌ల’ అమ్మకాలపైనే ఈ నియంత్రణ విధించింది. దగ్గుకు వాడే టాబ్లెట్లు, పిల్స్, లాజెంజ్‌లు (బిళ్ళలు) మాత్రం ఎప్పటిలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో దొరుకుతాయి.

ఈ కఠిన నిర్ణయానికి కారణం ఏమిటి?

గత కొంతకాలంగా కల్తీ దగ్గు సిరప్‌ల వల్ల దేశ, విదేశాల్లో సంభవిస్తున్న మరణాలే కేంద్రం ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం. గత ఏడాది సెప్టెంబర్‌లో మధ్యప్రదేశ్‌లో కల్తీ దగ్గు సిరప్ సేవించడం వల్ల కనీసం 24 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2022 నుండి భారతదేశంలో తయారై విదేశాలకు ఎగుమతి అయిన కొన్ని దగ్గు సిరప్‌ల వల్ల ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల్లో 140 మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. ఇది అంతర్జాతీయంగా భారత ఔషధ రంగ ప్రతిష్టపై ప్రభావం చూపింది.

ఈ నేపథ్యంలో మందుల నాణ్యత, భద్రతపై రాజీ పడకూడదని భావించిన కేంద్రం.. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ మార్పులు చేసింది. 2025 డిసెంబర్‌లోనే దీనికి సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రజలు, ఫార్మా సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించిన అనంతరం ఈ తుది నిర్ణయాన్ని ప్రకటించింది.

ఈ నిర్ణయం వల్ల సాధారణ ప్రజలకు తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ సుదీర్ఘ కాలంలో ఇది ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సొంత వైద్యం తగ్గడంతో పాటు, నకిలీ, కల్తీ మందుల మాఫియాకు ఈ నిర్ణయంతో అడ్డుకట్ట పడనుంది. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపుల యాజమాన్యాలు కూడా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.