Homeజాతీయ వార్తలుOrry Instagram Reels Income: ఇతడి బిజినెస్ వేరే లెవెల్.. ఒక్క రీల్ చేస్తే 76...

Orry Instagram Reels Income: ఇతడి బిజినెస్ వేరే లెవెల్.. ఒక్క రీల్ చేస్తే 76 లక్షలు..

Orry Instagram Reels Income: మనదేశంలో అత్యంత పాపులారిటీ ఉన్న వాళ్లలో విరాట్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్.. ముందు వరుసలో ఉంటారు. వీరికి పెద్ద పెద్ద కంపెనీలు డబ్బులు చెల్లిస్తూ ఉంటాయి. వీరికి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. అందువల్ల మీరు పెట్టే ఒక పోస్ట్ కు లక్షలలో వసూలు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో కోట్లల్లో కూడా వసూలు చేస్తూ ఉంటారు.

మనదేశంలో సినిమా రంగం.. క్రికెట్.. ఇతర క్రీడలలో పేరు తెచ్చుకున్న వారికి విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. వారికి పెద్ద పెద్ద కంపెనీలు భారీగా డబ్బులు చెల్లిస్తూ ఉంటాయి. అయితే ఒక వ్యక్తి మాత్రం ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చి.. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాడు. ఒక్క రీల్ కు ఏకంగా 76 లక్షలు వసూలు చేస్తున్నాడు. అతని పేరు ఓర్హాన్ అవత్రామణి. ఇతడు బాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఫోటోలు దిగుతుంటాడు. వారితో కలిసి పార్టీలకు హాజరవుతూ ఉంటాడు. ఇతడుని చాలామంది ముద్దుగా ఓరి అని పిలుస్తుంటారు. అలాగని ఇతడు వ్యాపారవేత్త కాదు. నటుడు అంతకంటే కాదు. ఈ స్థాయిలో అతడు పాపులారిటీ సొంతం చేసుకోవడం వెనుక పెద్ద కథ ఉంది

ఇతడు పెద్దపెద్ద పార్టీలలో కనిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత పెయిడ్ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ ఉంటాడు. ఈవెంట్లకు హాజరవుతూ ఉంటాడు. తద్వారా ఒక డిన్నర్ కు ఇతడు 15 నుంచి 25 లక్షల వరకు తీసుకుంటాడు. అంతేకాదు వేడుకలకు తనను పిలిస్తే.. అందరి ముందు గొప్పగా స్పీచ్ ఇస్తాడు. కలిసి షాట్స్ కూడా వేస్తూ ఉంటాడు.. గత నెలలో ఇతడు ఒక్క రీల్ కోసం ఏకంగా 76 లక్షలు వసూలు చేశాడు.. పైగా భిన్నంగా ఫోజులు ఇస్తూ ఉంటాడు. షారుక్ ఖాన్ మాదిరిగా గతంలో ఇతడు ఫోజు ఇవ్వడంతో ఒక్కసారిగా ఇతడు ఫేమస్ అయిపోయాడు. ఆ తర్వాత క్రేజీ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు అతడు ప్రతినెల లక్షలలో సంపాదిస్తూ ఉన్నాడు. అయితే ఈ స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నప్పటికీ.. తన ఆర్థిక వ్యవహారాలు మొత్తం తల్లిదండ్రులు చూసుకుంటారని అతడు చెబుతున్నాడు. ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చి.. ఈ స్థాయిలో డబ్బు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు కదా.

ఇతడు బాలీవుడ్ స్టార్స్ దిశా.. సారా.. ఆలియా.. జాన్వి.. ఖుషి వంటి వారితో అత్యంత చనువుగా ఉంటాడు. వారితో కలిసి ఫోటోలు దిగుతుంటాడు. కొన్ని సందర్భాలలో వారి కార్లలోనే ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. అందరూ ఇతడి స్థాయి చూసి కుళ్లుకుంటారు. కానీ అతను మాత్రం తన వ్యాపారాన్ని సాగించుకుంటూ వెళ్తుంటాడు. అందువల్లే ఇప్పుడు ఇతడు ఈ స్థాయిలో డబ్బు సంపాదించాడు. అనధికారిక సమాచారం ప్రకారం ఇతడు దాదాపు 30 కోట్ల వరకు తన ఆస్తులను కూడబెట్టినట్టు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Learn by KK Create (@learn.kkcreate)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular