Jagan Kapu Vote Bank Strategy: రాజకీయాల్లో కొంతమంది పనితీరుతో రాణిస్తారు. మరికొందరు సెంటిమెంట్ రాజకీయాలు నడిపి రాణిస్తారు. రెండో కోణంలో రాణించారు జగన్మోహన్ రెడ్డి. వైయస్ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న ప్రజాభిమానాన్ని తాను పొందగలిగారు. తండ్రి మాదిరిగా సంక్షేమ పథకాలు అందించి ప్రజల మనసు గెలవాలని చూసారు. కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డిలో రాజశేఖర్ రెడ్డిని చూసుకోలేదు. మహానేత కుమారుడిగా ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. రెండోసారి మాత్రం చాన్స్ ఇవ్వలేదు. అయితే రాజశేఖర్ రెడ్డి చేయలేనంతగా.. కులాలను, వర్గాలను విడదీసి వారి అభిమానాన్ని పొందాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఒక్కసారి మాత్రమే అందులో కూడా సక్సెస్ అయ్యారు. రెండోసారి విఫలమయ్యారు.
కాపుల మద్దతు అవసరం..
ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న కాపులు మద్దతు ఉండాల్సిందే. అయితే ఆ కాపులను 2019 ఎన్నికల్లో టర్న్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. కాపు రిజర్వేషన్ ఉద్యమం ద్వారా భారీగా లబ్ధి పొందారు. ఇప్పుడు కూడా అటువంటి వ్యూహాలకు పదును పెడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి కాపులే కారణమని జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. అందుకే వారిలో చీలిక తేవాలని చూస్తున్నారు. కాపుల వేళ్ళతో కాపులను పొడిచే సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. కాపు ఓటు బ్యాంకు ను చీల్చడమే కూటమిని దెబ్బతీసే ఏకైక మార్గం అని బలంగా నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో కాపులు ఆదరించని వైసీపీ కాపు నేతలు చాలామంది ఉన్నారు. వారిని ముందు పెట్టి ఇప్పుడు రాజకీయ క్రీడ మొదలుపెట్టారు.
వారిని ముందు పెడితే..
ఒక అంబటి రాంబాబు, పేర్ని నాని, తోట త్రిమూర్తులు, గుడివాడ అమర్నాథ్, కన్నబాబు, బొత్స సత్యనారాయణ.. ఇలాంటి వైసీపీ కాపు నేతలను ముందు పెట్టి కాపుల విషయంలో బలమైన ప్రచారానికి జగన్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ రూపంలో కూటమిలో డిప్యూటీ సీఎం పదవి ఉన్న కాపులకు ఎటువంటి ప్రయోజనం లేదని ప్రచారం మొదలుపెట్టారు. కాపు సామాజిక వర్గానికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని కోణంలో వ్యతిరేకతను నూరి పోయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై కాపు యువతలో, ఓటర్లలో అసంతృప్తిని పెంచగలిగితే.. ఆ ఓట్లు ఆటోమేటిక్గా తమ వైపు టర్న్ అవుతాయన్నది జగన్ ఆలోచన.
తక్కువగా అంచనా
అయితే జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గ ఆలోచనను తక్కువగా అంచనా వేస్తున్నారన్న విశ్లేషణ ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్య కాపుల విషయంలో జగన్ అనుసరించిన వైఖరి తెలియంది కాదు. ముఖ్యంగా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ప్రయోజనాలను సైతం రద్దుచేసి కాపులను ఒక ఓటు అ lస్త్రంగా మార్చుకున్న వైనాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకున్నారు. పైగా ఇదే వైసిపి కాపు నేతలు కాపు సామాజిక వర్గం విషయంలో చేసిన ప్రకటనలు కూడా గుర్తున్నాయి కాపు సామాజిక వర్గానికి. తమ కళ్ళను తమ చేతితో పొడుచుకునేందుకు కాపులు సిద్ధంగా లేరు. తప్పకుండా జగన్ ప్రయత్నం వికటిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
















నోరు జారిన ప్రసన్నకుమార్ రెడ్డి.. వేమిరెడ్డి రియాక్షన్ ఏంటో?
Vemireddy Prasanthi Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మహిళా నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పై వ్యక్తిగత కామెంట్స్ చేశారు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్. దానిపై చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి. కానీ పార్టీ అధినేత అమర్నాథ్ ను సమర్థిస్తూ మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం అభ్యంతరకరంగా ఉన్నాయి. మరోసారి నెల్లూరు జిల్లాలో రచ్చకు దారి తీసే అవకాశం ఉంది.
ప్రశాంతి రెడ్డి గెలుపు..
మొన్నటి ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి పై గెలిచారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ప్రసన్న కుమార్ రెడ్డి. తప్పకుండా గెలుస్తానన్నచోట ఓడిపోవడంతో ఆయనకు షాక్ తగిలింది. ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రమే కాదు నెల్లూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థులంతా ఓడిపోయారు. పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. అటువంటి చోట వైసిపి ఓడిపోవడానికి ప్రధాన కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉంది. అందుకే వేమిరెడ్డి దంపతులు అంటేనే వైసీపీ నేతలకు పూనకం వచ్చేలా ఉంది. వారిని ఉద్దేశించి దారుణంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
నిత్యం రాజకీయ వేడి..
కోవూరు నియోజకవర్గ నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గెలిచిన తరువాత ఒక రకమైన రాజకీయ వేడి కనిపిస్తోంది. అక్కడ ఓడిపోయిన మనస్థాపనతో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై వ్యక్తిగత కామెంట్లకు దిగుతున్నారు. గతంలో ఆమె వ్యక్తిగత జీవితం మాట్లాడేసరికి పెద్ద రచ్చ జరిగింది. ఏకంగా వేమిరెడ్డి అనుచరులు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ధ్వంసం చేశారు. అయితే అప్పట్లో కవ్వింపు చర్యలు చేపట్టడం వల్లే ఆ ఘటన జరిగింది. అయితే ఇప్పుడు కూడా మరోసారి ప్రసన్నకుమార్ రెడ్డి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటనలు చేస్తున్నారు. ఆమెను ఉద్దేశించి సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అంటూ సంబోధిస్తూ విమర్శలు చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి.
సోమిరెడ్డి అంటూ సంబోధన..
సోమిరెడ్డి కుటుంబంతో ప్రసన్నకుమార్ రెడ్డికి బంధుత్వం ఉంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సమీప బంధువు ప్రసన్నకుమార్ రెడ్డి. అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరుడిని ప్రశాంతి రెడ్డి వివాహం చేసుకున్నారు. కానీ సోమిరెడ్డి సోదరుడు అకాల మృతి చెందారు. దీంతో ప్రశాంతి రెడ్డి ప్రభాకర్ రెడ్డిని వివాహం ఆడారు. అయితే తనపై గెలిచిన ప్రశాంతి రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటూ ఇబ్బంది పెట్టేలా మాట్లాడారు. మరి దీనిపై వేమిరెడ్డి దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి.