Viral Video: పదిమందిని బాగు చేసిన వాడికంటే.. పదిమందిని ముంచిన వాడికే ఈ లోకంలో విలువ ఎక్కువ.. ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. ఆ డైలాగ్ ఇతడికి నూటికి నూరు కాదు.. ఏకంగా కోటి శాతం సరిపోతుంది. మామూలుగా అయితే అతడు ఒక వ్యాపారవేత్త. గతంలో బాగానే ఉండేవాడు. వేల కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత డబ్బు మీద మరింత దుర్బుద్ధి పుట్టింది. ఇంకేముంది రకరకాల అవకతవకలకు పాల్పడ్డాడు. చివరికి దొరికిపోయాడు. అయితే మనదేశంలో వ్యవస్థలలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకొని దేశం దాటి వెళ్లిపోయాడు. ఇది జరిగి కూడా పుష్కరకాలం దాటిపోయింది. అయినప్పటికీ అతడు మన దేశానికి రావడం లేదు. పైగా రకరకాల విలాసాలకు పాల్పడుతూ.. అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.
ఆ వ్యాపారికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సహజంగానే ఆ వ్యాపారి విలాస పురుషుడు. వయసు 70 దాటినా ఇంకా స్వీట్ 25 అనుకునే రకం అతడు.. చేతిలో డబ్బుంది.. విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. అందుకే నచ్చిన అమ్మాయిలతో మెచ్చినట్టుగా గడుపుతున్నాడు. గడపడం మాత్రమే కాదు అ
ఆ దృశ్యాలను రికార్డు కూడా చేస్తున్నాడు. తన సామర్థ్యం ఎలా ఉందో వీడియోలో చూసుకుంటూ మురిసిపోతున్నాడు. అలా వీడియో రికార్డు చేసే క్రమంలో అతడి వాత్సాయన లీలలు బయటపడ్డాయి. సోషల్ మీడియాలోకి ఎక్కేశాయి. దీంతో ఆ దృశ్యాలు చూస్తున్న వారంతా వామ్మో.. ఇతడేంటి ఇలా ఉన్నాడు. ముసలోడే కానీ మహానుభావుడు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే ఇదంతా నిజం కాదని.. కృత్రిమ మేధను ఉపయోగించి రూపొందించిన వీడియో అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఆ వయసులో ఇంతటి సామర్థ్యం ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. “ఆయన ఆర్థిక నేరాలు చేసి దేశం దాటి వెళ్లిపోయిన వ్యాపారి. గతంలో మన దేశంలో ఉన్నప్పుడు విలాసాలకు పాల్పడేవాడు. ఇప్పుడు విదేశాలలో ఉంటున్నాడు. ఒకరకంగా దినదిన గండం మాదిరిగా జీవిస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఇంత స్వేచ్ఛగా ఎలా ఉంటాడు.. పైగా అంత డబ్బు ఖర్చు పెట్టి అలాంటి పనులకు ఎలా పాల్పడతాడు.. సొసైటీలో అతడికి ఒక గౌరవం అంటూ ఉంది కదా. అతడికి కూడా భార్యా పిల్లలు ఉన్నారు కదా.. అటువంటి వ్యక్తి ఇలాంటి చిలిపి చేష్టలకు ఎలా పాల్పడతాడని” కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆర్థిక నేరాల ద్వారా మాత్రమే కాకుండా.. పడక మీద విన్యాసాలతో కూడా ఆ వ్యాపారి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
View this post on Instagram