Common health problem: ఒకప్పుడు జ్వరం వస్తే భయపడి పోయేవారు. ఎందుకంటే ఆ జ్వరం తగ్గేది కాదు. కేవలం జ్వరం మాత్రమే కొందరి ప్రాణాలను కూడా తీసింది. ఆ తర్వాత డయేరియా ఒక గ్రామంలో ప్రబలిందంటే అక్కడున్న వాళ్లంతా వనికి పోయేవారు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరికి ఈ సమస్య వచ్చి పదులకొద్దీ ప్రాణాలు పోయేవి. అలాగే జలుబు వంటి సమస్యలు వచ్చినా ఇబ్బంది పడేవారు. అయితే వీటి కోసం ఇప్పుడు మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇవి రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు వచ్చే కొత్త రోగాలు ఏంటి..? ఆస్పత్రిలో ఎక్కువగా ఏ వ్యాధి బాధితులు ఉంటున్నారు? ఈ వ్యాధులు ఎలా వస్తున్నాయి?
గతంలోనూ.. ప్రస్తుతం ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య ఏమాత్రం మారలేదు. కానీ రోగాలు మాత్రం మారాయి. అప్పుడు ఒక రకమైన రోగాలు ఉంటే.. ఇప్పుడు కొత్త రకమైన రోగాలు వస్తూ జనం ఆస్పత్రిల వెంట తిరుగుతున్నారు. ఒకప్పుడు ఏదైనా వ్యాధి లేదా జబ్బు వస్తే వాటిని నయం చేసుకోవడానికి సరైన మెడిసిన్స్ అందుబాటులో లేవు. కానీ ఆ వ్యాధులకు ఇప్పుడు మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చే కొత్త రోగాలకు మెడిసిన్స్ అందుబాటులో ఉన్నా కూడా.. కొంతమంది ఆహారపు అలవాట్లు వల్ల ఇవి ఎక్కువగా మారుతున్నాయి. అంటే వ్యాధులు అనేవి చాలామంది కోరి తెచ్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు.
ప్రతిరోజు ఎన్నో రకాల పదార్థాలను తింటూ ఉంటాం. ఈ పదార్థాల్లో దాదాపు 30 శాతం వరకు కెమికల్స్ ఉంటాయని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని ఆహార పదార్థాలు చాలా రోజులవి అయి ఉంటే.. మరికొన్ని పదార్థాలు ప్రాసెస్ చేసినవి లేదా ఆయిల్ తో కూడుకున్నవి ఉంటున్నాయి. ఇక చైనీస్ ఫుడ్ పేరుతో మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ఆహార పదార్థాలు అయితే దాదాపు 50% కంటే ఎక్కువగా కెమికల్స్ ఉంటున్నాయి. ఇవి శరీరంలోకి వెళ్లి అనేక రకాల కొత్త రోగాలను తీసుకువస్తున్నాయి.
ప్రస్తుత కాలంలో చాలామంది బ్లడ్ ప్రెషర్, షుగర్, కిడ్నీ సమస్య, యూరినల్ ఇన్ఫెక్షన్, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీటన్నిటికీ కారణం శరీరంలోని హార్మోలలో జరిగే మార్పులే. ఈ మార్పులన్నీ కల్తీ ఆహారం లేదా కృత్రిమ ఆహారం తీసుకోవడమే. అందువల్ల ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తే. ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ తెలిసి తెలియక ఆహారం తీసుకున్నా.. శరీరంలోని మలినాలను క్లీన్ చేసుకోవడానికి ఇప్పటికైనా ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అలా చేస్తే నిత్య ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కొత్త రోగాలు దరిచేరకుండా ఉంటాయి.