Dhanush vs Telugu heroes: సినిమా ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టం… హీరోలైన, దర్శకులైన, ప్రొడ్యూసర్స్ అయిన ఒక్క సినిమా ఫ్లాప్ అయిందంటే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు… ఇక ప్రస్తుతం వాళ్ళందరు సూపర్ సక్సెస్ ను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది కొత్త హీరోలు సైతం మంచి సినిమాలను చేయడానికి తీవ్రమైన ఆసక్తి చూపిస్తున్నప్పటికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి మాత్రమే గొప్ప గౌరవమైతే దక్కుతోంది. ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. నిజానికి ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కార్మికులకు చేతి నిండా పని లేకుండా పోతోంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో బిజినెస్ అనేది కూడా పెద్ద ఎత్తున జరగడం లేదు. ఇక తమిళ్ సినీమా ఇండస్ట్రీలో ధనుష్ వరుస సినిమాలను చేస్తున్నాడు. ఒక సంవత్సరానికి రెండు నుంచి మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ధనుష్ కూడా స్టార్ హీరోనే అయినప్పటికి ఆయన మాత్రం సంవత్సరంలో రెండు నుంచి మూడు సినిమాలు చేస్తుండగా మన స్టార్ హీరోలు మాత్రం రెండు, మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేయడం పట్ల పలువురు సినిమా మేధావులు సైతం కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు…
ఈ సంవత్సరం ఇప్పటికే రాయన్, కుబేర సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ధనుష్ ఇప్పుడు ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు… ఇదంతా చూసి మన స్టార్ హీరోలు ధనుష్ ని ఫాలో అవుతూ సంవత్సరానికి రెండు సినిమాలు కాకపోయిన కనీసం ఒక్క సినిమానైనా రిలీజ్ చేస్తే బాగుంటుంది అంటూ విమర్శకులు విమర్శిస్తుండడం విశేషం…
ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు స్టార్ట్ అయినప్పుడే సినీ కార్మికులందరికి పని దొరుకుతోంది. దీనివల్ల సినిమా ఇండస్ట్రీలో మనీ ఎక్కువగా రొటేట్ అవుతూ ఉంటుంది. అలాగే బాక్సాఫీస్ కలెక్షన్స్ సైతం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కొన్ని ఇండస్ట్రీ లెక్కలను సైతం క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ డిస్ట్రిబ్యూటర్లు ఒక సినిమాతో నష్టపోయిన కూడా తమ తదుపరి సినిమాతో హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆ డిస్ట్రిబ్యూటర్స్ ను కలిసి వాళ్ళకి కొంచెం తక్కువ రేట్ కి ఒక ఏరియా రైట్స్ అప్పగించడానికి రైట్స్ ఉంటాయి….అలా కాకుండా రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే ఒకవేళ తేడాకొడితే డిస్టిబూటర్లు చాలా వరకు నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి రావచ్చు…