Venezuela Earthquake: భూకంపాలు.. ఈ పేరు వినిపిస్తే ఆసియాలో జపాన్.. పాకిస్తాన్.. ఆఫ్ఘనిస్తాన్.. టర్కీ వంటి ప్రాంతాలు మాత్రమే మనకు గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఈ ప్రాంతాలలో గతంలో అనేక సందర్భాలలో భూకంపాలు చోటుచేసుకున్నాయి. భారీగా ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఆస్తి నష్టం కూడా భారీగానే వాటిల్లింది. ఈ నేపథ్యంలో జపాన్ నుంచి మొదలు పెడితే టర్కీ వరకు కట్టుకునే ఇళ్ల విషయంలో.. జాగ్రత్తలు పాటిస్తారు అక్కడి ప్రజలు.
తాజాగా వెనిజులా ప్రాంతంలో భీకరమైన భూకంపం వచ్చింది. వేలాది మంది చనిపోయారు. ఆస్తి నష్టం కూడా కోట్లల్లో చోటుచేసుకుంది. శిధిలాల తొలగింపు ఇంకా జరగలేదు. మృతులను వెలికితీస్తున్నారు. ప్రపంచ దేశాలు సహాయం చేస్తున్నాయి. ఒకరకంగా వెనిజులా ప్రాంతంలో ఇప్పుడు అత్యవసర పరిస్థితి ని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. సహాయక చర్యలు సాగుతూనే ఉన్నాయి. ఇంకా కొద్దిరోజులు గడిస్తే తప్ప వెనిజులాలో పరిస్థితి మునుపటి స్థితికి రాదు.
వెనిజులా ప్రాంతంలో ఈ స్థాయిలో భూకంపం రావడానికి ప్రధానంగా కొన్ని కారణాలను శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వెనిజులా లో కొంత ప్రాంతం దక్షిణ అమెరికా వైపు ఉంటుంది. ఇది చాలా సురక్షితమైనది.. ఇదేదేశంలో ఉత్తర తీర ప్రాంతం.. కరేబియన్ దీవుల ప్రాంతాలు క్రియాశీలకంగా ఉండే ఫలకాల సరిహద్దు మీద ఉన్నాయి. ఈ సరిహద్దు మీద కరేబియన్.. దక్షిణ అమెరికా ఫలకాలు కలిసి ఉంటాయి. ఈ రెండింటి మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ రకరకాల పగుళ్లు కనిపిస్తూ ఉంటాయి. అయితే అవి విడిగా ఉండవు. పరస్పరం కలిసి ఉంటాయి.
ఇక్కడ దక్షిణ ప్రాంతంలో విస్తరించిన ఫలకంతో పోల్చి చూస్తే కరేబియన్ ఫలకం ప్రతి ఏడాది రెండు సెంటీమీటర్ల మేర తూర్పు వైపు విస్తరిస్తోంది. దీనివల్ల అక్కడి పగుళ్ల ప్రాంతంలో ఒత్తిడి ఎక్కువవుతున్నది. ఇలా ఒత్తిడి పెరిగిపోయినప్పుడు భూకంపం ఏర్పడుతోంది. శాస్త్రవేత్తల పరిశీలనలో భాగంగా వెనిజులా దేశంలో సుమారు 80% జనాభా ఈ క్రియాశీలత ఎక్కువగా ఉన్న ఫలకాల ప్రాంతంలోనే జీవిస్తూ ఉండడం విశేషం.
స్వల్ప వ్యవధిలోనే.. ఒకే విధమైన పగుళ్లు చోటు చేసుకుంటే.. దానిని భూకంప ద్వయం అని పిలుస్తుంటారు. ద్వయం లో ప్రకంపనలు ఒకే స్థాయిలో ఉంటాయి. వెనిజుల ప్రాంతంలో భూకంప తీవ్రత కేవలం నిమిషం వ్యవధిలోనే కేవలం 7.2, 7.5 గా నమోదయింది. ఎందుకంటే పగుళ్లు తీవ్రస్థాయిలో నమోదు కావడం.. భూ ఫలకాల మీద ఒత్తిడి విపరీతంగా పెరగడంతో నష్టం అధికంగా ఉంది. ఇటువంటి చోట మరొక ప్రకంపన చోటుచేసుకునే అవకాశం ఉండదు.. భూకంపం ఏర్పడినప్పుడు సమీప ప్రాంతంలో పగుళ్ల వ్యవస్థ మీద ఒత్తిడి పెరిగితే.. మళ్లీ భూమిలో ప్రకంపనలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.
వెనిజులా ప్రాంతంలో తక్కువలోతులోనే భూకంపం ఏర్పడింది. కేవలం నేల నుంచి ఇవి 20 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఎక్కువ లోతులో ఏర్పడే ప్రకంపనలు అంతగా నష్టాన్ని కలగజేయవు. తక్కువ లోతులో ప్రకంపనలు ఏర్పడ్డాయి కాబట్టి.. నష్టం తీవ్రత అధికంగా ఉంది.
