Homeవింతలు-విశేషాలుTiger Laziness Viral Video: కలియుగంలో అంతే.. పులులకు కూడా మనుషుల్లాగే బద్ధకం.. కావాలంటే ఈ...

Tiger Laziness Viral Video: కలియుగంలో అంతే.. పులులకు కూడా మనుషుల్లాగే బద్ధకం.. కావాలంటే ఈ వీడియో చూడండి!

Tiger Laziness Viral Video: ఈ భూమ్మీద ఉన్న జంతువుల్లో మనిషికి తప్ప మిగతా వాటికి బద్ధకం అనేది ఉండదు.. పైగా అవి చైతన్యవంతంగా ఉంటాయి. ఆకలిగా ఉంటే మాత్రమే తింటాయి. నిద్ర వస్తే పడుకుంటాయి. వేరే ప్రాంతానికి వెళ్లాలంటే నడుచుకుంటూ పోతుంటాయి.కానీ, మనిషి మాదిరిగానే బద్దకం.. తిన్న తర్వాత కాస్త నడుం వాల్చాలనే తీరు ఓ జంతువులో ఉంది. ఆ జంతువు ఏనుగు కాదు. నీటిలో ఉండే మొసలి కూడా కాదు. ఇంతకీ ఆ జంతువు ఏంటంటే..

Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!

ఈ భూమి మీద ఉన్న క్రూరమైన జంతువులలో పులి ముందు వరుసలో ఉంటుంది. ఆకలిగా ఉన్నప్పుడు వేటాడుతుంది. ఎదురుగా ఉన్న జంతువు ఎంత బలవంతమైనదైనా సరే వేటాడుతూ ఉంటుంది. ముందుగా గొంతు వద్ద దంతాలతో పట్టుకుంటుంది. ఊపిరి ఆడకుండా చేస్తుంది. స్వరాన్ని కొరికేసి.. పచ్చి నెత్తురు తాగుతుంది. ఆ తర్వాత తన పదునైన దంతాలతో చనిపోయిన జంతువు శరీర భాగాలను చీల్చి చీల్చి తినేస్తుంది. అందువల్లే పులి దాడి చేస్తే ఏ జంతువు కూడా బతికి బట్ట కట్టదు అంటారు.

అడవుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో పులులు జనావాసాల్లోకి రావడం ఇటీవల పెరిగిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అడవులకు దగ్గరగా ఉన్న గ్రామాలలో పులులు రావడం సర్వసాధారణంగా మారిపోయింది. ఏపీ రాష్ట్రంలోని పోలవరం నియోజకవర్గం లో ఇటీవల పులి సంచరిస్తోందనే వార్తలు మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. పులి పాదముద్రలు.. అది చంపి తినేసిన పశువుల కళేబరాలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. వాటి ఆధారంగా పులి కదలికలను వారు అంచనా వేశారు.

పోలవరం నియోజకవర్గం లోని అడ్డతీగల మండల పరిధిలో ఉన్న వీరభద్ర పురం గ్రామంలో పెద్దపులి సంచరించింది. అక్కడి నుంచి కొనలోవ, కొట్టం పాలెం, గౌరయ్యపేట గ్రామాల్లో పులి సంచరించింది. అయితే ఓ ప్రాంతంలో ఆవు దూడను చంపి తినేసిన పులి.. కడుపు నిండడంతో అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. దీంతో మనుషుల మాదిరిగానే దట్టంగా పరుచుకున్న పచ్చిక మీద పడుకుంది. భుక్తయాసంతో బాధపడుతూ అటూ ఇటూ దొర్లింది. అటవీశాఖాధికారులు డ్రోన్ ద్వారా పులి కదలికలను చిత్రీకరించారు. ఆ వీడియోను బయటికి విడుదల చేశారు. ఈ వీడియోని చూసిన వారంతా కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇన్ని రోజులుగా పులి అంటే అడవికి రాజు అనుకున్నాం.. మనుషుల కంటే ఎక్కువ బద్ధకం ఉన్న జంతువని తెలిసిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular