Homeఎంటర్టైన్మెంట్Vadala Movie Glimpse: ఆసక్తి రేపుతున్న హారర్ థ్రిల్లర్ 'వదలా' గ్లింప్స్ వీడియో.. ట్విస్టులు మామూలుగా...

Vadala Movie Glimpse: ఆసక్తి రేపుతున్న హారర్ థ్రిల్లర్ ‘వదలా’ గ్లింప్స్ వీడియో.. ట్విస్టులు మామూలుగా లేవుగా!

Vadala Movie Glimpse: సీనియర్ హీరో జగపతి బాబు(Jagapathi Babu) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘వదలా’. ఇందులో సీనియర్ హీరోయిన్ లయ కూడా ప్రధాన పాత్ర పోషించింది. జగపతి బాబు కి జంటగా ఆమె సినిమాలో కనిపించనుంది. హీరో పాత్రలు పూర్తిగా మానేసి, క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వచ్చిన జగపతి బాబు, చాలా కాలం తర్వాత మళ్లీ హీరో గా చేసిన చిత్రమిది. ఇందులో ప్రముఖ సీనియర్ హీరోయిన్ ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా టైటిల్ ఆమె క్యారెక్టర్ కి సంబంధించినదే . కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. అందుకోసం ఒక ప్రత్యేక ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేశారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా గ్లింప్స్ వీడియో ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!

గ్లింప్స్ చూసిన తర్వాత ఇది ఒక థ్రిల్లర్ జానర్ సినిమా అని అర్థం అవుతోంది కానీ, అది హారర్ థ్రిల్లరా ?, లేదంటే సైకో కిల్లర్ జానర్ లో తెరకెక్కిందా అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. జగపతి బాబు కుటుంబం లోని ప్రతీ ఒక్కరిని హ్రితిక శ్రీనివాస్ చంపేస్తూ ఉంటుంది, ఎందుకు అలా చేస్తుంది అనేది సినిమా చూసిన తర్వాతే తెలుస్తుంది. గ్లింప్స్ ని చూస్తుంటే కచ్చితంగా ఇది థియేట్రికల్ అనుభూతి చెందాల్సిన సినిమానే అని అర్థం అవుతోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తమ్మా రెడ్డి భరద్వాజ్ నిర్మించాడు. ఆయన తో పాటుగా కిషోర్ నాయుడు అనే వ్యక్తి కూడా నిర్మాణం లో భాగం అయ్యేడు. చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ఆకెళ్ళ కృష్ణ దర్శకత్వం వహించగా, కార్తీక్ సంగీతం అందించాడు.

షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం , ఈ ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. జగపతి బాబు, లయ తప్ప, ఈ సినిమాలో నటించే నటీనటులంతా కొత్తవాళ్లే. గతంలో జగపతి బాబు , లయ కలిసి మనోహరం , నాలో ఉన్న ప్రేమ, హనుమాన్ జంక్షన్ , శివ రామ రాజు వంటి చిత్రాలు చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రమిది. అంతే కాకుండా జగపతి బాబు , ఆమని కలిసి గతం లో శుభ లగ్నం, మావిచిగురు వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఆమె కోడలుతో జగపతి బాబు కలిసి నటించడం విశేషం , సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ‘వదలా ‘ గ్లింప్స్ వీడియో ని మీరు కూడా చూసేయండి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular