Homeవింతలు-విశేషాలుSaleshwaram Temple: ఇది తెలంగాణ అమర్ నాథ్.. అడుగడుగునా శివోహం.. ఎక్కడుంది.. ఎలా వెళ్లాలి..

Saleshwaram Temple: ఇది తెలంగాణ అమర్ నాథ్.. అడుగడుగునా శివోహం.. ఎక్కడుంది.. ఎలా వెళ్లాలి..

Saleshwaram Temple: మనదేశంలో శివుడికి సంబంధించిన ఆలయాలు చాలా ఉన్నాయి. జమ్ము కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు శివుడి ఆలయాలు చాలా ఉన్నాయి. శివుడి ఆలయాలకు సంబంధించి అమర్ నాథ్, కేదార్ నాథ్ ఆలయాలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఇవి శీతలమైన ప్రాంతంలో ఉంటాయి. హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉండడంతో.. ఈ యాత్ర అత్యంత కఠినంగా ఉంటుంది. అయినప్పటికీ చాలామంది భక్తులు అనేక కష్టాలకు ఓర్చి పరమ శివుడిని దర్శించుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో శివాలయాలు […]

Saleshwaram Temple: మనదేశంలో శివుడికి సంబంధించిన ఆలయాలు చాలా ఉన్నాయి. జమ్ము కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు శివుడి ఆలయాలు చాలా ఉన్నాయి. శివుడి ఆలయాలకు సంబంధించి అమర్ నాథ్, కేదార్ నాథ్ ఆలయాలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఇవి శీతలమైన ప్రాంతంలో ఉంటాయి. హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉండడంతో.. ఈ యాత్ర అత్యంత కఠినంగా ఉంటుంది. అయినప్పటికీ చాలామంది భక్తులు అనేక కష్టాలకు ఓర్చి పరమ శివుడిని దర్శించుకుంటారు.

తెలంగాణ రాష్ట్రంలో శివాలయాలు విస్తృతంగా ఉన్నాయి. అయితే ఇందులో తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుపొందిన సలేశ్వరం ఉంది. సలేశ్వరం యాత్ర చాలా భిన్నమైనది. అత్యంత కఠినమైనది. అటవీ అందాలను వీక్షిస్తూ.. కొండకోనలను పరిశీలిస్తూ నడకతోనే ఈ యాత్రను సాగించాలి. సాహసమైన యాత్రను ఇష్టపడే వారికి సలేశ్వరం యాత్ర అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మన్ననూరు అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో చైత్ర పూర్ణిమ సమయంలో మూడు రోజులపాటు ఈ యాత్ర నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న ఈ యాత్ర మొదలవుతుంది. దాదాపు 34 కిలోమీటర్లు దట్టమైన అడవుల్లో వాహనాల ప్రయాణించాలి. దాదాపు 3 కిలోమీటర్ల వరకు కొండలు.. లోయలను దాటుకొని.. చెంచు లు అమితంగా ఆరాధించే లింగమయ్య స్వామిని దర్శించుకోవాలి. ఈ లోయలో అత్యంత పురాతనమైన ఆలయాన్ని సలేశ్వర ఆలయం అని పిలుస్తుంటారు.

ఈ ఆలయం ఒక సహజ గుహలో ఏర్పడింది. దట్టమైన అడవి కావడంతో అటవీశాఖ అధికారులు కఠినమైన నిబంధనలు విధిస్తారు. ఈ యాత్రలో శ్రమ ఉంటుంది. సాహసం అంతకుమించి ఉంటుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో మందనూరు అనే ప్రాంతం వస్తుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం బస్సు ఎక్కి మన్ననూరు చెక్ పోస్ట్ వద్ద దిగవచ్చు. ఒకవేళ సొంత వాహనాలు ఉంటే నేరుగా అక్కడికి చేరవచ్చు. మననూరు నుంచి రాంపూర్ పెంట వరకు ఆర్టీసీ ప్రత్యేకమైన బస్సులు నడుపుతుంది. వ్యాసంత వాహనాలు ఉంటే కూడా అక్కడికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో సలేశ్వరం జడ్జి పాయింట్ వరకు ఆటోలు నడుస్తుంటాయి. ఎడ్జ్ పాయింట్ ప్రాంతాన్ని మోకల కురువ అటవీ ప్రాంతం అని పిలుస్తారు. ఇక్కడి నుంచి సాహస యాత్ర మొదలవుతుంది. ఒక కిలోమీటర్ పాటు ట్రెక్కింగ్ చేయాలి. ఆ తర్వాత చెప్పుల కురువ ప్రాంతానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో కిలోమీటర్ నటిస్తే మోకాల కురువ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఒక కిలోమీటర్ పాటు కఠినమైన సాహస యాత్ర చేస్తే సలేశ్వరం ఆలయ ప్రాంతం వస్తుంది.

ఇది దట్టమైన అడవి ప్రాంతం కావడంతో అటవీశాఖ అధికారులు కఠినమైన నిబంధనలు విధిస్తున్నారు. ఈ ప్రాంతంలో పులులు.. ఇతర క్రూరమృగాలు తిరుగుతూ ఉంటాయి. పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా.. ప్లాస్టిక్ ఏమాత్రం లేకుండా యాత్ర సాగించాలని అటవీ శాఖ అధికారులు ఇప్పటికే సూచనలు చేశారు. యాత్రికలు ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్ధాలు పడేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మృగాలు దాడి చేసే అవకాశం ఉండడంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సలేశ్వరం యాత్రలో కొండలు.. గుట్టలు.. లోయలు.. వాగులు దర్శనమిస్తుంటాయి.. వాటిని దాటుకుంటూ స్వామివారిని దర్శించుకోవడాన్ని యాత్రికులు గొప్ప అనుభూతిగా భావిస్తుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper