spot_img
Homeబిజినెస్Vivo V70 Features: Vivo V70 మొబైల్స్ ఫీచర్స్ లీక్.. ధర తెలిస్తే క్యూ కడుతారు..

Vivo V70 Features: Vivo V70 మొబైల్స్ ఫీచర్స్ లీక్.. ధర తెలిస్తే క్యూ కడుతారు..

Vivo V70 Features: భారతదేశంలో మొబైల్ మార్కెట్లోకి ఏ కొత్త మొబైల్ వచ్చినా.. దాని గురించి ప్రత్యేక చర్చ ఉంటుంది. అందులోనూ ఇప్పటికే ఆదరణ పొందిన బ్రాండ్ల నుంచి ఫోన్ వస్తుందంటే.. దానిని కొనాలని చూస్తుంటారు. వినియోగదారులకు అనుగుణంగా కంపెనీలు సైతం ఆకర్షించే మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తుంటారు. ఇందులో భాగంగా చైనా కంపెనీ Vivo నుంచి త్వరలో కొత్త సిరీస్ రాబోతుంది. దీని గురించి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఈ ఫోన్ వివరాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఇది ప్రీమియం ఫీచర్లను కలిగి మధ్యతరగతి ప్రజలకు అనుకూలమైన ధరతో ఉండే అవకాశం ఉంది. ఇంతకీ ఈ మొబైల్ ఏదంటే?

Vivo నుంచి V 70 మొబైల్ మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.ఏప్రిల్2న ఇది లాంచ్ కానుంది. ఆన్ లైన్ లో లీకైన సమాచారం మేరకు ఈ ఫోన్ డిస్ ప్లే 6.83 AMOLED తో ఉండనుంది. ఇది 1.5 కే రిజల్యూషన్ తో పనిచేస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేసే ఈ మొబైల్ మీడియా టెక్ 7360 డైమెన్సిటీ ప్రాసెసర్ ను కలిగి ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్ తో పాటు 256 జీబీ స్టోరేజ్ ను కలిగి ఉండే అవకాశం ఉంది.

వివో ఫోన్లు కెమెరాకు పెట్టింది పేరు. ఇందులో 200 MP మెయిన్ కెమెరా ఉండనుంది. 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ తో పనిచేయనుంది. 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేస్తుంది. ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ వారితో పాటు సోషల్ మీడియా కంటెంట్ సృష్టించేవారికి ఈ మొబైల్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే హై రిజల్యూషన్ తో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో ప్రతీ ఫోన్ లో బ్యాటరీ వ్యవస్థ బాగుండాలని కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా వివో కొత్త సిరీస్ లో 7000 mAh బ్యాటరీ ఉండనుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేయనుంది. బిజీగా ఉండేవారు తొందరగా ఛార్జింగ్ కావాలంటే ఈ చార్జర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే రోజంతా వినియోగించినా కూడా బ్యాటరీ డౌన్ తగ్గకుండా ఉంటుంది.

మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగానే ఈ ఫోన్ల ధరలు ఉంటాయని చాలా మంది భావన. అందుకు అనుగుణంగానే వీవో వి 70 ఫోన్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 37,999తో విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రెడ్ మీ నోట్ 15 ప్రో ప్లస్, రియల్ మీ 16 ప్రో ప్లస్ వంటి మొబైల్స్ కు ఈ కొత్త వీ 70 సిరీస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular