spot_img
Homeవింతలు-విశేషాలుPurple Potato Farming Profit: ఇవి మామూలు ఆలుగడ్డలు కావు... ఎకరానికి 20 లక్షల ఆదాయం..

Purple Potato Farming Profit: ఇవి మామూలు ఆలుగడ్డలు కావు… ఎకరానికి 20 లక్షల ఆదాయం..

Purple Potato Farming Profit: వ్యవసాయం చేయడం వేరు.. దానిద్వారా భారీగా లాభాలు సంపాదించడం వేరు. అందువల్లే చాలామంది రైతులు వ్యవసాయంలో అంతగా లాభాలు గడించలేకపోతున్నారు. కొంతమంది మాత్రం వినూత్నంగా వ్యవసాయం చేసి.. అందులో భారీగా లాభాలు సంపాదిస్తున్నారు. ఆ జాబితాలో ఇతడికి ప్రథమ స్థానం ఇవ్వచ్చు. ఇంతకీ అతడు చేసిన అద్భుతం ఏంటి.. ఏ స్థాయిలో లాభాలు వస్తున్నాయి.. దీని వెనక పడిన కష్టం ఏంటి.. ఇలా అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

అతడి పేరు గురుజోత్. వయసు 27 సంవత్సరాలు. లా చదివాడు. ఆయన ఇప్పటికీ వ్యవసాయం అంటే చాలా ఇష్టం. కాకపోతే అందరూ చేసినట్టుగా కాకుండా.. భిన్నంగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అదే అతడితో 125 ఎకరాల్లో పర్పుల్ పొటాటో పంటను సాగు చేసే విధంగా ప్రేరేపించింది. మనదేశంలో పర్పుల్ పొటాటోను సాగు చేయడం బహుశా ఇదే తొలిసారి అని తెలుస్తోంది.

గురుజ్యోత్ సాగు చేసిన పొటాటో పంటను ఢిల్లీలోని సూపర్ మార్కెట్లో అమ్ముతుంటారు.. పర్పుల్ పొటాటోలో అంతో సైనిన్స్ అనే ప్రత్యేక పోషకాలు ఉంటాయి. అందువల్లే వీటితో తయారుచేసిన వంటకాలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది.. ఒకసారి గురు జోత్ ఢిల్లీలో సూపర్ మార్కెట్లో పర్పుల్ పొటాటోను అమ్ముతుండగా పరిశీలించాడు. వాటి ధర ఎంత అని అడిగితే 500 అని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. ఇక అప్పటినుంచి ఈ పంటను సాగు చేయడం మొదలుపెట్టాడు.

బొలివియా ప్రాంతం నుంచి 20 కిలోల పర్పుల్ పొటాటో తెప్పించాడు. మొదట్లో మూడు గుంటల్లో వేశాడు. ఆ తర్వాత వాటిని విత్తనాలుగా మార్చేశాడు. మరో పంట వేశాడు. మూడు నెలల్లో పంట చేతికి వచ్చింది. మన దేశ వాతావరణానికి సరిపడే విధంగా విత్తనాలను సిద్ధం చేసుకున్నాడు. ఆ తర్వాత పంటను అమ్మడం మొదలుపెట్టాడు. ఎకరంలో 10 లక్షల పైగా లాభం రావడం మొదలుపెట్టింది. తను మాత్రమే కాకుండా.. తోటి రైతులకు కూడా దీనిని పండించే అవకాశం కల్పించాడు. కిలో విత్తనాలను ఐదువేల రూపాయలకు అమ్మడం ప్రారంభించాడు. విత్తనం ఇవ్వడంతో పాటు కొన్ని షరతులు కూడా విధించేవాడు. పండిన పంటలో కొంతమేర తనకు విత్తనాల రూపంలో ఇచ్చి.. మిగతాది అమ్ముకునే అవకాశాన్ని రైతులకు కల్పించాడు. ఇలా మొత్తం 125 ఎకరాల్లో ఈ పర్పుల్ పొటాటో పంటను సాగు చేసి ఎకరానికి లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.

బొలీవియా నుంచి తెప్పించినప్పటికీ.. మన వాతావరణానికి అనుకూలంగా ఈ పంటను మార్చాడు గురు జ్యోత్.. పర్పుల్ పొటాటో తొక్క మందంగా ఉంటుంది. అందువల్ల ఎంతటి కఠినమైన పరిస్థితినైనా ఎదుర్కొంటాయి.. అందువల్లే ఈ పంట దిగుబడి అధికంగా ఉంటుంది. మరోవైపు పర్పుల్ పొటాటో లో గురు జ్యోత్ రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే ఇతని ఆసక్తిని గమనించిన సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇనిస్ట్యూట్ పర్పుల్ బంగాళదుంపలకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని.. అందులో ఉన్న పోషకాలను గమనించి.. దానిలోనే మరికొన్ని మార్పులు చేసింది. కార్బోహైడ్రేట్లు.. కేలరీలు తక్కువగా ఉండేలా.. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేలా పోర్టిఫైడ్ రకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి కు ప్రియా జామునియా అని పేరు పెట్టారు. గుర్ జ్యోత్ వల్ల పంజాబ్లోని దోయాబ ప్రాంతం పర్పుల్ పొటాటో కు క్యాపిటల్ గా మారింది. అక్కడి రైతులు భారీగా సంపాదిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Oktelugu Epaper