spot_img
Homeబిజినెస్Telugu Couple Thar Desert Farmstay Success Story: తెలుగోళ్ళ సత్తా.. థార్ ఎడారి కాస్త...

Telugu Couple Thar Desert Farmstay Success Story: తెలుగోళ్ళ సత్తా.. థార్ ఎడారి కాస్త స్టార్ హోటల్ అయింది..

Telugu Couple Thar Desert Farmstay Success Story: కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు. ఈ మాట చాలామంది చాలా సందర్భాల్లో నిజం చేసి చూపించారు. ఈ జాబితాలో వీరు కూడా ఉన్నారు. కాకపోతే వీరు చేసిన అద్భుతం మామూలుది కాదు. ఏకంగా అది టైం మ్యాగజైన్ కు ఎక్కేసింది. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది.

అది రాజస్థాన్ రాష్ట్రం. థార్ ఎడారి.. అక్కడ 40 ఎకరాల విస్తీర్ణంలో ఒక వ్యవసాయ క్షేత్రం విస్తరించి ఉంది. అక్షేత్రం రాజస్థాన్లోని మనీ అనే ఒక గ్రామంలో ఉంది. కనుచూపుమేరా మొత్తం ఎడారి. అక్కడ ఫార్మ్ స్టే ను నిర్మించారు తెలుగు యువకులు. వారు కార్పొరేట్ ఉద్యోగాలను వదిలిపెట్టి.. నేలతల్లి ని వెతుక్కుంటూ వెళ్లారు.. చివరికి ఆ ఎడారి దిబ్బ ప్రాంతాన్ని అందమైన బృందావనంగా మార్చేశారు. కేవలం రాగులు, సజ్జలు మాత్రమే పండే ఆ ప్రాంతం మొత్తాన్ని సస్యశ్యామలం చేసేశారు.. ప్రపంచంలోనే దానిని అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా మార్చేశారు. అన్నట్టు ఆ ఫార్మ్ స్టే కు మహ్రో కేత్ అని పేరు పెట్టారు.

మహ్రో కేత్ లో 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ మొత్తం పది కాటేజీలు ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా సూర్యుని వెలుగు పడుతూనే ఉంటుంది. కాబట్టి పగటి సమయంలో విద్యుత్ దీపాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. గోధుమ నుంచి మొదలు పెడితే కంది వరకు అన్ని పంటలు పండుతాయి. టమాట, నిమ్మ, వంకాయలు, బెండ, క్యాబేజీ, మునగ, మొక్కజొన్న మాత్రమే కాకుండా బ్రసెల్స్ మొలకలు, కాలే, ఆయిస్టర్ మాష్రూమ్స్ వంటి అరుదైన జాతులు కూడా ఇక్కడ సాగవుతున్నాయి. కేవలం పర్యాటకులు ఇవి చూడ్డానికి మాత్రమే కాకుండా.. పనిచేయడానికి వస్తుంటారు. ఆ విధానాన్ని టైమ్స్ మ్యాగజైన్ ప్రముఖంగా ప్రస్తావించింది. ఇక ఇక్కడ పండిన పంటలను కేవలం గంటల వ్యవధిలోనే మనకి వంట వండి వడ్డిస్తారు. ఆ వంట కూడా ఆరు బయట తినాలి. జామ తోట మధ్యలో కుర్చీల మీద కూర్చొని హాయిగా తినవచ్చు. ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యుత్తమ రెస్టారెంట్లకు అందించే మిషలన్ కీ అనే అవార్డు కూడా సొంతం చేసుకుంది.

ఈ కథనం ప్రారంభంలో తెలుగు దంపతులు మహ్రో కేత్ ను అభివృద్ధి చేశారని చెప్పాం కదా.. ఆ దంపతుల పేరు రాజ్నూష్ అగర్వాల్, వేదిక. వీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బయో మాలిక్యులర్ ఇంజనీరింగ్ చదివారు. సొంతంగా వ్యాపారం చేస్తూ ఉండేవారు. కరోనా సమయంలో వేదికతో కలిసి అగర్వాల్ ఈ గ్రామంలోకి వచ్చాడు. అప్పుడు ఇక్కడ సజ్జలు, రాగులు తప్ప మరో పంట పండేది కాదు. పైగా అగర్వాల్ తండ్రి వేసిన జామ తోటకూడా ఎండిపోయే స్థితికి చేరుకుంది. ఆ పంటను కాపాడుకోవాలని వేదిక, అగర్వాల్ భావించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సహకరించడంతో దానిని సంరక్షించారు. ఆ తర్వాత వారి సూచనలు ఇవ్వడంతో ఇతర పంటలు కూడా సాగు చేశారు. తీవ్రంగా శ్రమించి గ్రీన్ హౌస్, ఏరో ఫోనిక్స్ విధానంలో వరి మినహా మీద అన్ని పంటలు సాగు చేయడం మొదలుపెట్టారు.

2022లో జోధ్పూర్ నగరానికి చెందిన వారికి తాజా కూరగాయలను అందించే వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వీరు చేస్తున్న వ్యవసాయం అందరి దృష్టిని ఆకర్షించడంతో.. అది కాస్త టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయింది. 2025లో దీనిని ఫార్మ్ స్టే ప్రాంతంగా మార్చేశారు. అదే కాదు చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న మహిళలను తమ వ్యవసాయ క్షేత్రంలో పనికి పెట్టారు. వారు వంట మినహా మిగతా అన్ని పనులు చేస్తారు. వచ్చిన పర్యాటకులకు జానపద కళలను ప్రదర్శిస్తారు.. అందువల్లే మిగతా స్టార్ హోటల్స్ కంటే మహ్రో కేత్ భిన్నంగా ఉంటుంది ఇందుకే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Oktelugu Epaper