spot_img
Homeలైఫ్ స్టైల్Benefits Of Eating Home Cooked Food: బయట ఇష్టం వచ్చినట్టు తినడం కాదు.. ఇంటి...

Benefits Of Eating Home Cooked Food: బయట ఇష్టం వచ్చినట్టు తినడం కాదు.. ఇంటి తిండి తింటే ఎన్ని ప్రయోజనాలంటే..

Benefits Of Eating Home Cooked Food: నేటి కాలంలో చాలామంది బయట తిండి తింటున్నారు. బయట తిండి వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతాయో తెలిసినప్పటికీ కూడా ఆ అలవాటును మానుకోలేకపోతున్నారు. బయట తయారు చేసే ఆహార పదార్థాలలో శుచి ఉండదు. శుభ్రత అంతకంటే ఉండదు. అందులో వాడే నూనెలు.. ఇతర పదార్థాలు ఆరోగ్యానికి హానిచేస్తాయి. అందువల్ల వాటికి దూరంగా ఉండడం ఉత్తమం.

బయట తిండి తినొద్దంటున్నారు.. ఇంట్లో తిండి తింటే ప్రయోజనాలు ఏంటి.. బయట మాదిరిగా ఇంట్లో తిండిలో రుచి ఉంటుందా.. అనే ప్రశ్న మీలో ఉత్పన్నం కావచ్చు. ఇంటి తిండిలో ఉన్న ప్రయోజనాలు అనేకం. పో నివేదిక ప్రకారం ఇంట్లో వండుకునే ఆహారం ఆరోగ్యానికి చాలా వరకు మేలు చేస్తుంది. దీనివల్ల డయాబెటిక్, ఊబకాయం.. గుండె జబ్బులు రావు. అంతేకాదు మతిమరుపునకు కారణమయ్యే డిమెన్ షియా కూడా దూరం అవుతుంది.

జపాన్ దేశానికి చెందిన జరంటాలజీ ఎవల్యూషన్ అధ్యయనంలో 11,000 మంది ఇటీవల పాల్గొన్నారు. వారి సమాచారాన్ని విశ్లేషించి.. అనంతరం కీలక విషయాలను బయటపెట్టారు. మతిమరుపు నివారణలో జీవనశైలి మార్పులు ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. శారీరక శ్రమ.. లైఫ్ స్టైల్ వంటి అంశాలను పూర్తిగా మార్చుకోవడం వల్ల మతిమరుపు కేసులు దాదాపు 40 శాతం వరకు తగ్గినట్టు 2020లో లాన్ సెట్ కమిషన్ బయటపెట్టింది. అదే విషయాన్ని జపాన్ జరంటాలజీ ఎవల్యూషన్ అధ్యయనం వెల్లడించింది.

అనేక ప్రయోజనాలు

ఇంట్లో పండుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందుతాయి. కూరగాయలు.. పండ్లు ఎక్కువగా తినడం వల్ల.. శుద్ధి చేసిన ఆహార పదార్థాల జోలికి వెళ్లడం తగ్గిపోతుంది.

ఇంట్లో ఆహార పదార్థాలు వండుకునేటప్పుడు శ్రమ పడాల్సి ఉంటుంది. పప్పులు.. బియ్యం.. ఇతర పదార్థాలు కొన్ని రావడానికి బయటకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని వండడానికి అన్ని సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల శారీరక శ్రమ కలుగుతుంది.

వంట వండడం అనేది అంత సులువైన విషయం కాదు. మెదడు వేగంగా పనిచేయాలి. ఎలా ఉండాలి.. పదార్థాలు ఏ స్థాయిలో వేయాలి.. ఎంతమందికి వంట ఉండాలి.. అనే వాటిని నిర్ణయించుకోవాలి. ఆ వంటలను చేసి తీరును ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. రుచి కోసం ఎలాంటి పదార్థాలు వేయాలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. వీటివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఫలితంగా మతిమరుపు అనేది దూరమవుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper