spot_img
Homeప్రవాస భారతీయులుUS Green Card New Rules: గ్రీన్ కార్డ్ షాక్.. అమెరికాలో ఉన్న వాళ్లు తట్టాబుట్టా...

US Green Card New Rules: గ్రీన్ కార్డ్ షాక్.. అమెరికాలో ఉన్న వాళ్లు తట్టాబుట్టా సర్దుకొని రావాల్సిందే..

US Green Card New Rules: అమెరికాలో వలసదారలపై మరో నిబంధన తీసుకొచ్చింది. ఇప్పటికే శాశ్వత వీసాపై పలు నిర్ణయాలు తీసకున్న ఇక్కడి ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇక నుంచి శాశ్వత నివాస హక్కు (గ్రీన్ కార్డు) పొందాలంటే సొంత దేశానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ కొత్త నిబంధనల ద్వారా అమెరికాలో ఉంటున్న వలదారులు.. ముఖ్యంగా భారతీయులపై తీవ్రప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంలో కొందరికి మినహాయింపు ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళితె..

అమెరికా వలస విధానాల్లో తాగాగా మార్పులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఈ దేశంలో తాత్కాలికంగా ఉంటున్న విదేశీయులు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, ఇకపై తప్పనిసరిగా తమ మాతృదేశానికి వెళ్లాలని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధి జాక్ కహ్లర్ కొత్త పాలసీ మెమోను విడుదల చేశారు. అమెరికా వలస చట్టాల అసలు ఉద్దేశాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తేల్చి చెప్పారు. దీంతో విజిట్ వీసా లేదా తాత్కాలిక వీసాపై ఉంటూ గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారిలో ఆందోళన మొదలైంది.

అయితే ఈ నిబంధనల్లో కొందరికి మినహాయింపు ఉంటుందని తెలపింది. కొన్ని ప్రత్యేక, అసాధారణ పరిస్థితుల్లో ‘అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్’ ద్వారా అమెరికా నుంచే గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అటువంటి మినహాయింపు కోరే వారి దరఖాస్తులను అధికారులు అత్యంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎవరైనా గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుని అది తిరస్కరణకు గురైతే, వారు అమెరికాలో అక్రమంగా ఉండకుండా చూసేందుకు ఈ కొత్త నిబంధనలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.

వలస వ్యవస్థను దుర్వినియోగం కాకుండా చూడటమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని జాక్ కహ్లర్ వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు, టూరిస్టు వీసాపై వచ్చిన వారు తమ పని పూర్తికాగానే దేశాన్ని వీడి వెళ్లాలని, గ్రీన్‌కార్డు హోదా పొందేందుకు అమెరికాకు రావడం ఒక మెట్టుగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల వలసల ప్రక్రియ మరింత క్రమబద్ధీకరించబడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

యూఎస్‌సీఐఎస్‌ చేపట్టిన కఠిన చర్యల ఫలితంగా ఇప్పటికే తీవ్ర ప్రభావం చూపింది. 2027 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బీ వీసా దరఖాస్తుల సంఖ్య ఏకంగా 38.5 శాతం పడిపోయింది. వీసాల ఆమోదంలో కూడా సంస్థ తన పద్ధతిని మార్చుకుంది. కేవలం ఉన్నత డిగ్రీలు, అధిక వేతనాలు పొందుతున్న నైపుణ్యం కలిగిన అభ్యర్థులకే పెద్దపీట వేస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper