Homeజాతీయ వార్తలుCockroach Janata Party: భారత్ పై విదేశీ బొద్దింకల దండయాత్ర..

Cockroach Janata Party: భారత్ పై విదేశీ బొద్దింకల దండయాత్ర..

Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు విపరీతమైన చర్చలో ఉంది. ఈ పార్టీ ఇంతవరకు అధికారికంగా పుట్టలేదు. ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉండడంతో.. ఈ పార్టీ గురించి చర్చ మొదలైంది. అయితే ఈ పార్టీని మొదట్లో చాలామంది సానుకూలంగా తీసుకున్నారు. ఆ తర్వాత రాజకీయ చర్చల్లో ఈ పార్టీ గురించి ప్రస్తావన పెరగడం ప్రారంభమైంది. అంతేకాదు ఈ పార్టీ వెనుక […]

Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు విపరీతమైన చర్చలో ఉంది. ఈ పార్టీ ఇంతవరకు అధికారికంగా పుట్టలేదు. ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకోలేదు. కానీ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉండడంతో.. ఈ పార్టీ గురించి చర్చ మొదలైంది. అయితే ఈ పార్టీని మొదట్లో చాలామంది సానుకూలంగా తీసుకున్నారు. ఆ తర్వాత రాజకీయ చర్చల్లో ఈ పార్టీ గురించి ప్రస్తావన పెరగడం ప్రారంభమైంది. అంతేకాదు ఈ పార్టీ వెనుక అసలు వ్యక్తులు.. దీని వెనక ఉద్దేశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.

కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేసిన వ్యక్తి అమెరికాలో ఉన్నత విద్య చదువుతున్నారు. మరొక వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇంకో వ్యక్తి ఇంగ్లాండులో ఉన్నారు. వీరిలో ఇద్దరు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేశారు. ఒక వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. అయితే వీరి వెనక విదేశీ శక్తులు ఉన్నాయని.. అందువల్లే వీరు భారత ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు.

కాక్రోస్ జనతా పార్టీని ఆన్లైన్లో ఎక్కువగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర దేశాలకు చెందినవారు ఎక్కువగా అనుసరిస్తున్నారు. ఇందులో ఇండియన్స్ తక్కువ మంది ఉండడం విశేషం. పైగా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్దేశాలు వేరే విధంగా ఉన్నాయి.. ఇక ఈ పార్టీ సోషల్ మీడియాలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఇంకా కొంతమందిని అనుసరిస్తుంది. దీంతో దీని వెనకాల ఉన్న అసలు ఉద్దేశాలు ఏంటో అర్థమవుతున్నాయని బిజెపి నాయకులు అంటున్నారు.

“పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ను జైలుకు పంపించారు. ఉక్రెయిన్ లో జోకర్ ను తీసుకొచ్చి అధ్యక్షుడిని చేశారు. బంగ్లాదేశ్లో మహమ్మద్ యునెస్ చేతిలో పగ్గాలు పెట్టి దేశాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు భారత్ మీద పడ్డారు. పైగా మన దేశంలో బెంగాల్ రాష్ట్రంలో మమత ఓడిపోయింది. తమిళనాడులో ద్రావిడ సిద్ధాంతాన్ని.. సార్వభౌమత్వాన్ని వద్దనుకునే వ్యక్తులు ఓడిపోయారు.. అస్సాం నుంచి మొదలు పెడితే ప్రతి రాష్ట్రంలోనూ విదేశీ శక్తులకు కొమ్ముకాసే పార్టీలు అధికారంలోకి రాకుండా పోతున్నాయి.. అందువల్లే దేశం నుంచి కాకుండా.. దేశం బయటనుంచి దాడి చేస్తున్నారు.. అయితే ఈ శక్తుల ఆటలు సాగవని” బిజెపి నాయకులు అంటున్నారు.

కాక్రోచ్ జనతా పార్టీకి కాశ్మీరి వేర్పాటు వాద వ్యక్తులు.. అమెరికన్ డీప్ స్టేట్ శక్తులు.. దుబాయ్ కేంద్రంగా ఉగ్రవాదులకు సహకారం అందించే వ్యవస్థలు డబ్బులు ఇస్తున్నట్టు బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. అందువల్లేవారు మన దేశం మీద ఇలా దాడి చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ఇటువంటి వ్యక్తులు కొంతమేర సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తారని.. ఆ తర్వాత అంత చల్లారిపోతుందని బిజెపి నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper