Homeప్రవాస భారతీయులుAmerica TTA : అమెరికాలో టీటీఏ మహాసభలు.. ఎప్పటి నుంచో తెలుసా..

America TTA : అమెరికాలో టీటీఏ మహాసభలు.. ఎప్పటి నుంచో తెలుసా..

America TTA : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) అగ్రరాజ్యంలో భారీ మహాసభలకు ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు టీటీఏ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల ఆధ్వర్యంలో జరుగనున్నాయి. సియాటెల్‌ కన్వెన‍్షన్‌ సెంటర్‌లో ఈ ఏడాది మే నెలలో మూడు రోజులు (24, 25, 26 తేదీల్లో) ఈ సభలు నిర్వహించనున్నారు. ఈ సభలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

ప్రారంభమైన ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్స్‌..
ఈ మెగా కన్వెన్షన్‌ కోసం ఇప్పటికే కింగ్‌ ఆఫ్‌ ఫండ్‌ రైజింగ్‌ పేరిట ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నారు. అమెరికాలోని 32 రాష్ట్రాల్లో విస్తరించిన టీటీఏ ఇప్పటికే పలు చోట్ల ఈవెంట్లు నిర్వహించింది. వీటికి మంచి స్పందన కూడా వచ్చిందని వంశీరెడ్డి తెలిపారు. మహా సభల్లో భాగంగా సీతారాముల కల్యాణం కన్నులపండువగా నిర్వహిస్తామన్నారు. ఇందుకు భద్రాచలం నుంచి పండితులను అమెరికాకు తీసుకువస్తామని పేర్కొన్నారు.

ప్రత్యేక సావనీర్‌..
మహాసభల్లో టీటీఏ సావనీర్‌ విడుదల చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక సంచిక రూపొందించనున్నారు. ఈమేరకు తెలుగు కవుల నుంచి రచనలు ఆహ్వానిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్‌ కంటెస్ట్‌ కూడా ఏర్పాటు చేశారు. టాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించి బెస్ట్‌ షార్ట్‌ఫిల్మ్‌లకు అవారడ్డులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సెలబ్రేషన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను mytelanganaus.org వెబ్‌సైట్‌తోపాటు సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు వివరించారు. టీటీఏను ఏర్పాటు చేసిన డాక్టర్‌ పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్మ డాక్టర్‌ విజయపాల్‌రెడ్డి, కోచైర్ డాక్టర్‌ మోహన్‌రెడ్డి పటోళ్ల, సభ్యులు భరత్‌రెడ్డి మాదాడి సేవలను వంశీరెడ్డి కొనియాడారు. వారిబాటలో నడవడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఏర్పాట్ల పర్యవేక్షణ..
ఇక టీటీఏ మహాసభల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సభ్యులకు బాధ్యతలు అప్పగించారు. వివిధ విభాలను ఏర్పాటు చేసి వంశీరెడ్డితోపాటు టీటీఏ ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్‌రెడ్డి మల్లిపెద్ది, జనరల్ సెక్రటరీ కవితారెడ్డి, కోశాధికారి సహోదర్ పెద్దిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్‌ దివాకర్ జంధ్యం, జాయింట్ సెక్రటరీ శివారెడ్డి కొల్ల, జాయింట్ ట్రెజరర్ మనోహర్ బోడ్కె, నేషనల్ కో-ఆర్డినేటర్ ప్రదీప్ మెట్టు, ఇంటర్నల్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కూనవరపు, నేషనల్ ఇంటర్నల్ అఫైర్స్ కో-ఆర్డినేటర్ వెంకన్నగారి సురేన్రెడ్డి, మీడియా కమ్యూనికేషన్ డైరెక్టర్ నిషాంత్ సిరికొండ, మెంబర్షిప్ అడ్వైజర్ అమిత్‌రెడ్డి సురకంటి, ఎథిక్స్ కమిటీ డైరెక్టర్ గణేశ్‌ మాధవ్, ఉమెన్స్ ఫోరం అడ్వైజర్ స్వాతి చెన్నూరి, హెల్త్ వెల్‌నెస్ అడ్వైజర్ జ్యోతిరెడ్డి, ఇండియా కో-ఆర్డినేటర్ ద్వారకనాథ్‌రెడ్డి తదితరులకు బాధ్యతలు అప్పగించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Balakrishna Injury

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...
Rajamouli

Rajamouli Next Movie: రాజమౌళి నెక్స్ట్ సినిమా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోందా…

Rajamouli Next Movie: ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా చేయడం...
Oktelugu Epaper