Homeఎంటర్టైన్మెంట్Actor John Cena : అమ్మ జాన్ సీనా.. ఆస్కార్ వేదికపై నగ్నత్వం వెనుక అసలు...

Actor John Cena : అమ్మ జాన్ సీనా.. ఆస్కార్ వేదికపై నగ్నత్వం వెనుక అసలు నిజం ఇదీ

Actor John Cena : లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్లో ప్రతి ఏడాది ఆస్కార్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఆ వేడుకలకు హాజరయ్యే అతిరథ మహారధులు, లబ్ద ప్రతిష్టులైన నటులు అద్భుతమైన దుస్తులు ధరించి వస్తారు. ప్రత్యేకమైన డిజైనర్ల ద్వారా దుస్తులను రూపొందించుకొని.. వాటిని ధరించి ఆ వేడుకల్లో మెరిసిపోతుంటారు. ఇక ఆస్కార్ వేడుకలు అంటే నెక్స్ట్ లెవెల్ అనే లాగా ప్రదర్శనలుంటాయి. కానీ సోమవారం అకాడమీ అవార్డులు ప్రకటించే ముందు డబ్ల్యు డబ్ల్యు ఈ(WWE) రెజ్లర్, నటుడు జాన్ సీనా నగ్నంగా దర్శనమిచ్చాడు. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.. ఓ తరహా సినిమా అవార్డుల ఫంక్షన్లో నటీనటులు నగ్నంగా కనిపిస్తారనే ప్రచారం ఉంది. కానీ అకాడమీ అవార్డులో ఇప్పటివరకు ఒక నటుడు ఇలా నగ్నంగా కనిపించిన ఉదంతాలు లేవు. జాన్ సీనా అలా నగ్నంగా కనిపించడంతో వెస్ట్రన్ నుంచి స్థానిక మీడియా వరకు జాన్ సీనా గురించే చర్చ జరిగింది.. ఇంతకీ అతడు నగ్నంగా ఎందుకు వచ్చాడు? నిజంగానే నగ్నంగా ఉన్నాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే దీనిపై అకాడమీ క్లారిటీ ఇచ్చింది.

Actor John Cena,
Actor John Cena,

జాన్ అకాడమీ అవార్డులు ప్రకటించే వేదిక మీదకు వచ్చే ముందు అతని ఫోటోలు తీశారు. అయితే అతడు గోచిలాంటి దుస్తులు ధరించాడు. ఇక్కడ అకాడమీ అత్యంత తెలివిగా ఆ ఫోటోలు తీసి విడుదల చేసింది. దీంతో నిజంగానే జాన్ నగ్నంగా ఉన్నాడని అందరూ అనుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆ తరహా ఫోటోలు దర్శనమిచ్చాయి. ఫలితంగా ఒక్కసారిగా జాన్ వార్తల్లో వ్యక్తయ్యాడు. సోషల్ మీడియాలో అతడి పేరు తెగ చక్కర్లు కొట్టింది.

అకాడమీకి కూడా ఇలాంటి ప్రచారమే కావాలి కాబట్టి.. అది నెరవేరింది. ఇక వేదికపై విజేతను ప్రకటించే ముందు అకాడమీ సిబ్బంది ఒక దుప్పటిలాంటి వస్త్రాన్ని తీసుకొచ్చి జాన్ కు చుట్టారు. ఆ ఫోటోలను కూడా అకాడమీ నిర్వాహకులు బయటికి విడుదల చేశారు.. దీంతో జాన్ ముందుగా వేదిక మీదికి వచ్చే సమయంలో నగ్నంగా లేడని.. కేవలం ప్రచారం కోసమే ఇలా చేశాడని.. అకాడమీ కూడా దాని ప్రోత్సహించిందని.. తేటతెల్లమైంది. దీంతో అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు అవాక్కవుతున్నారు.. ప్రచారం కోసం ఇలా కూడా చేస్తారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో జాన్ హవా ఏ మాత్రం తగ్గలేదు. వాస్తవానికి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా మీడియా నుంచి సోషల్ మీడియా వరకు.. అదే చర్చనీయాంశంగా ఉంటుంది. కానీ తొలిసారిగా జాన్ అకాడమీ అవార్డ్స్ కంటే తనే ముందు వరుసలో ఉన్నాడు. నెటిజన్లు తెగ శోధించిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper