
విరాట్ కోహ్లీ పోరాటం వృథా
ఆస్ట్రేలియా గడ్డపై భారత విజయాలకు బ్రేక్ పడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(85; 60 బంతుల్లో 4పోర్లు, 3 సిక్సర్లు) పోరాడిన సిడ్ని వేదికగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా 12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. విరాట్ తోడుగా మరో బ్యాట్స్‌మెన్ రాణించకపోవడం.. చెత్త ఫీల్డింగ్ భారత్ విజయావకాశాలను దెబ్బతీశాయి. మరోవైపు సమష్టిగా రాణించిన ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది.
