spot_img
Homeఅత్యంత ప్రజాదరణరైతుల ఆందోళన.. ప్రతిపక్షాల కుట్రనా..!

రైతుల ఆందోళన.. ప్రతిపక్షాల కుట్రనా..!

Political parties behind Farmers Protest

దేశానికి 70శాతం ఆహారాన్ని అందిస్తున్న పంజాబ్, హర్యానా రైతులే ఇప్పుడు వ్యవసాయ చట్టాలపై రోడ్డెక్కారు. కేంద్రంపై పోరుబాట పట్టారు.. రైతుల ఆందోళనల్లో 70శాతం ఆ రెండు రాష్ట్రాల రైతులే. దేశమంతా ఇంతటి తీవ్రత లేదు. దక్షిణాదిన అన్నపూర్ణ ఆంధ్రా రైతులు, ఇప్పుడు బాగా పండిస్తున్న తెలంగాణ రైతులు కూడా ఆందోళన చేయడం లేదు. మరి ఆ రైతులే ఎందుకు ఆందోలన చేస్తున్నారన్నది ఇక్కడ అంతుబట్టని విషయంగా ఉంది. వారి వెనుక ప్రతిపక్షాలు, కాంగ్రెస్, కొందరు దళారులు ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి..

Also Read: భారత్ బంద్ విజయవంతం.. అనుహ్యంగా రాత్రి 7గంటలకు చర్చలు..!

వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టేలా కేంద్రం ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మొదలైన పోరాటం దేశవ్యాప్తమవుతున్నది. అన్నదాత పోరాటానికి అన్నివర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. పండుగలను పక్కకు పెట్టి మరీ రైతులు నిరసనల్లో పాల్గొంటున్నారు. పంజాబ్‌, రాజస్థాన్‌, హర్యానా తదితర రాష్ర్టాల్లో నిరసనలు హోరెత్తుతుండగా.. బీహార్‌తోపాటు మరికొన్ని రాష్ర్టాల్లో రైతు ఉద్యమం నివురుగప్పిన నిప్పులా మారింది.

నూతన వ్యవసాయ చట్టాలతో పంటలకు మద్దతు ధర దక్కడం ఇక మిథ్యేనని వ్యవసాయరంగ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే దేశంలో పలు పంటలకు మద్దతు ధర దక్కడం గగనంగా మారగా.. తాజా చట్టాలతో ఇక ఏ పంటకూ మద్దతు ధర లభించదని అంటున్నారు. ఇప్పటికే దేశంలోని మెజారిటీ రాష్ర్టాలు మద్దతు ధరను అమలు చేయడం లేదు. స్థానిక వ్యాపారులు వారికి నచ్చిన ధర ఇచ్చి పంటలను కొంటున్నారు.

ధరల నియంత్రణ, ధాన్యం మద్దతు ధర అమలు, నిత్యావసర సరుకుల అధిక నిల్వలపై ఆంక్షలతో ఎంతో కీలకంగా వ్యవహరించే పౌరసరఫరాలశాఖ.. కేంద్రం తెచ్చిన కొత్తచట్టాలతో కోరలు పీకిన పాములా మారిపోయింది. రైతులు, వ్యాపారులు పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు.. కొనుగోలు చేయవచ్చనే వెసులుబాటు ఉండటంతో పొరుగు రాష్ర్టాల నుంచి ధాన్యంతోపాటు ఇతర పంటల దిగుమతిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. గతంలో రాష్ట్ర సరిహద్దుల్లో సివిల్‌సైప్లె అధికారులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఇతర రాష్ర్టాల నుంచి పంట ఉత్పత్తుల అక్రమ రవాణాను అడ్డుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండాపోయింది. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ వంటి నిత్యావసరాల నిల్వలపై ఉన్న ఆంక్షలను కేంద్రం నూతన చట్టాల ద్వారా ఎత్తివేసింది. దీంతో మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలను నియంత్రణలో ఉంచే అధికారం సివిల్‌ సైప్లెకి లేకుండాపోయింది.

పౌరసరఫరాలశాఖకు ఉన్న అధికారాలను నూతన వ్యవసాయ చట్టాల రూపంలో తొలిగించడంతో అంతిమంగా ఆ ప్రభావం వినియోగదారుడిపై పడనున్నది. బడా వ్యాపారులు ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకులను కొనుగోలు చేసి కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచుతారు. తర్వాత మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తారు. అనంతరం అధిక ధరలకు నిల్వ చేసిన సరుకుకు మార్కెట్లోకి విడుదల చేస్తారు. ఈ విధంగా నూతన చట్టాల వల్ల కార్పొరేట్‌ కంపెనీలకు లాభం చేకూరుతుండగా వినియోగదారునిపై మాత్రం పెను భారం పడనున్నది.

Also Read: రైతును రాజుగా బతకనివ్వండి.. బానిసగా మార్చొద్దు: పీపుల్స్ స్టార్

తెలంగాణ ప్రభుత్వం ఈసారి కూడా ధాన్యం మొత్తాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇతర ఏ రాష్ట్రం కూడా మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేశాక.. దానిని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయని పక్షంలో పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం అసలు ధరకు, మద్దతు ధరకు మధ్య చాలా వ్యత్యాసం ఉండటంతో అటు అన్నదాత కానీ, ఇటు రాష్ర్ట ప్రభుత్వం కానీ నష్టపోవాల్సిందే. రైతు సంక్షేమం కోరే తెలంగాణ ప్రభుత్వానికి రిస్క్‌ తప్పదా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేసే రాష్ట్రాలకు కొత్త వ్యవసాయచట్టాలు పెనుశాపంగా మారనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దాదాపు అన్ని పంటలను మద్దతు ధరకు కొంటున్నది. దీంతో వ్యాపారులు కచ్చితంగా అదేధర పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త చట్టాలతో పంటల కొనుగోళ్లు, అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేయడంతో వ్యాపారులు తక్కువ ధరకు పంటలు లభించే రాష్ర్టాలవైపే చూస్తారని నిపుణులు చెప్తున్నారు. దీంతో మద్దతు ధర చెల్లించి తీసుకున్న పంట ఉత్పత్తులను తర్వాత కొనేదెవరని పలు రాష్ర్టాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ర్టాల్లో తక్కువ ధరకు ధాన్యం లభించడంతో ఇప్పటికే మిర్యాలగూడ ప్రాంతంలోని రైస్‌మిల్లర్లు అక్కడి నుంచి భారీ మొత్తంలో దిగుమతి చేసుకున్నారు. ఇక వ్యవసాయ చట్టాలతో గేట్లుబార్లా తెరిస్తే మద్దతు ధర చెల్లించి పంటలను కొనుగోలు చేసే రాష్ర్టాల పరిస్థితి అగమ్యగోచరంగా మారనున్నదని దక్షినది ప్రభుత్వలు అనుకుంటున్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES
spot_img

Most Popular