Homeఅంతర్జాతీయంDhruv Rathee: ధృవ్ రాఠీ అరెస్ట్.. ఈసారి నోయిడా పోలీసులు.. ఇందులో నిజమెంత..

Dhruv Rathee: ధృవ్ రాఠీ అరెస్ట్.. ఈసారి నోయిడా పోలీసులు.. ఇందులో నిజమెంత..

Dhruv Rathee:  ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఢిల్లీ నిరసనల నేపథ్యంలో.. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకెళ్లడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత.. నిజంగానే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పరిధిలోని పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారా.. అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద […]

Dhruv Rathee:  ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఢిల్లీ నిరసనల నేపథ్యంలో.. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకెళ్లడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత.. నిజంగానే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పరిధిలోని పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారా..

అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరగాల్సిన నిరసనలో పాల్గొనేందుకు ధృవ్ రాఠీ ప్రయత్నించారు. ఈ క్రమంలో గురుగ్రామ్ లోని తన నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాలపై నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. పోలీసులు చర్య పై ధృవ్ రాఠీ అప్పుడే తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశాడు. తనను అరెస్ట్ చేయలేదని.. అపహరించినట్టుగా తీసుకెళ్లాలని అతడు ఆరోపించాడు. దాదాపు ఒకరోజు పాటు అదుపులో ఉంచిన తర్వాత అక్టోబర్ 11న ఆయనను విడుదల చేశారు. పోలీసుల చర్య పట్ల ధృవ్ రాఠీ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా నోయిడా పోలీసులు ధృవ్ రాఠీ ని అరెస్ట్ చేశారు అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతవరకు అధికారికంగా పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇటీవల తనను కొంతమంది అనుసరిస్తున్నారని సోషల్ మీడియాలో ధృవ్ రాఠీ వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఆయన అధికారికంగా ఎక్కడ కూడా ఈ విషయాన్ని వెల్లడించలేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిపాలన.. పోలీసుల చర్యలు.. రాజకీయ విమర్శలు వంటి విషయాలు సోషల్ మీడియాలో తరచుగా చర్చకు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ధృవ్ రాఠీ అరెస్టుకు సంబంధించిన ప్రచార కూడా రాజకీయంగా చర్చకు దారి తీసింది.

ధృవ్ రాఠీ ని పోలీసులు అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది. ఒకవేళ ఆయనను అరెస్ట్ చేస్తే.. పోలీసులు అధికారికంగా సమాచారం చెబితేనే ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోలు ఫేక్ అని తెలుస్తోంది. మనదేశంలో ధ్రువ్ రాఠీకి భారీగానే అభిమానులున్నారు. ఆయన పోస్ట్ చేసే వీడియోలను ఓవర్గం వారు విపరీతంగా చూస్తుంటారు. మనదేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుంచి మొదలు పెడితే యోగి వరకు అందరి మీద ధ్రువ్ రాఠీ వీడియోలు చేస్తుంటాడు. బీజేపీని ధ్రువ్ రాఠీ తీవ్రంగా విమర్శిస్తుంటాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper