HomeNewsTamil Nadu CM Vijay: జగన్ కోటరీ గట్టిగానే పనిచేసింది.. అయినప్పటికీ విజయ్ ఎలా వచ్చారు.....

Tamil Nadu CM Vijay: జగన్ కోటరీ గట్టిగానే పనిచేసింది.. అయినప్పటికీ విజయ్ ఎలా వచ్చారు.. బాబు ఏం చేశారు..

Tamil Nadu CM Vijay: వైయస్ జగన్మోహన్ రెడ్డి కజిన్ వైయస్ అనిల్ రెడ్డి. ఈయనకు తమిళనాడు రాజకీయాలు కొట్టినపిండి. పైగా ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి అత్యంత దగ్గర వ్యక్తి. అనిల్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు విజయ్. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. పైగా ఇటీవల డీఎంకే పార్టీ నేతలు అనిల్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. ఆయన సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. కీలకమైన సాక్షాలతో విషయాలను మొత్తం బయటపెట్టారు […]

Tamil Nadu CM Vijay: వైయస్ జగన్మోహన్ రెడ్డి కజిన్ వైయస్ అనిల్ రెడ్డి. ఈయనకు తమిళనాడు రాజకీయాలు కొట్టినపిండి. పైగా ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి అత్యంత దగ్గర వ్యక్తి. అనిల్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు విజయ్. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. పైగా ఇటీవల డీఎంకే పార్టీ నేతలు అనిల్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు. ఆయన సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు. కీలకమైన సాక్షాలతో విషయాలను మొత్తం బయటపెట్టారు డిఎంకే నేతలు. అయినప్పటికీ అనిల్ రెడ్డితో సంబంధాలను విజయ్ తెంపుకోవడానికి ఇష్టపడటం లేదు.

రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయి. అనిల్ రెడ్డితో ఏం అవసరం ఉందో తెలియదు. కాకపోతే విజయ్ ఆయనతో దగ్గర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కజిన్. పైగా ఆమధ్య జగన్.. విజయ్ భేటీ కావడానికి అనిల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. పైగా విజయ్ క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతారు. పైగా ఏపీకి, తమిళనాడుకు సరిహద్దు ఉంది. రెండు రాష్ట్ర రాజకీయాలలో అటు తెలుగువారు.. ఇటు తమిళం వారు వేలు పెడుతూనే ఉన్నారు. పైగా వ్యాపార సంబంధాలు దర్జాగా కొనసాగుతూ ఉంటాయి. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్.. ఆయన సిద్ధాంతాలను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. కాకపోతే ఏపీలో అది ఇంప్లిమెంట్ కాలేదు.

తమిళనాడుతో గెట్టు పంచాయతీలు లేకపోయినప్పటికీ.. కావేరి గోదావరి అనుసంధానాన్ని చంద్రబాబు తెరమీదకి తీసుకొచ్చారు. దీనికి తమిళనాడు సపోర్ట్ కావాలి. అందువల్లే విజయ్ ని అప్రోచ్ అయ్యారు. వాస్తవానికి ఇది జగన్ మోహన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు. అందువల్లే అనిల్ రెడ్డి ద్వారా అనేక రకాల ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డు కట్ట వేయడానికి తనవంతుగా వ్యూహాలు రచించారు. ఒక దశలో విజయ్ ఏపీకి రారు అని ప్రచారం జరిగింది. సాక్షి మీడియా కూడా ఇదే ప్రచారం చేసింది. కానీ చంద్రబాబు బుర్ర వేరే కదా. ప్లాన్ ఏ కాదు.. ప్లాన్ బి.. ప్లాన్ సి అమలు చేశారు..

చంద్రబాబు జగన్ ప్రయత్నాలను పసిగట్టి వేరే ప్లాంట్ రూపొందించారు. ఏపీలోని కీలక నాయకులను రంగంలోకి దింపారు. వారిని నేరుగా రికి రాదన్ పండిట్ వెెట్రివేల్ వద్దకు పంపించారు. రాధన్ పండిట్ మరెవరో కాదు.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి వ్యక్తిగత జ్యోతిష్యుడు. పైగా ఈయన విజయ్ కి రాజకీయ సలహాదారు కూడా.. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పండిట్ ఈయనకు సలహాలు ఇస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకె విజయం సాధిస్తుందని పండితు ముందుగానే అంచనాలు వేశారు.. అవి నిజం కావడంతో విజయ్ ఆయనను బాగా నమ్మారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈయన నియామకాన్ని డీఎంకే విమర్శించినప్పటికీ.. ఆ విమర్శలకు విజయ్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత పండిట్ విషయంలో తాను ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. వెట్రీ వేల్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి కి ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ కింద పనిచేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper