Indian Air Force: 2025 మే 7న భారతదేశం పాకిస్తాన్‌పై ‘ఆపరేషన్ సిందూర్‘ పేరుతో లక్ష్య దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఆరోకి తగిన వైన్య కేంద్రాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే). పంజాబ్ ప్రాంతాలలో లక్ష్యంగా పెట్టబడ్డాయి. అత్యధిక ప్రిసైజ్ గైడెడ్ క్షిపణులు, ఆధునిక వైమానిక సాంకేతికత వాడి లక్షిత దాడులు చేసింది. భారత వైమానిక దళం గగనతలంలోని రక్షణాన్ని ఉల్లంఘించకుండా శ్రద్ధగా కృషి చేసి, ప్రత్యర్థి సైనిక కేంద్రాలకు తీవ్రమైన నష్టం కలిగించింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) తన ప్రభావం ప్రపంచానికి స్పష్టంగా తెలియజేసింది. ఈ యుద్ధ కార్యాచరణలో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. రాడార్, సెన్సార్లు, ఇంటెలిజెన్స్ డేటా సమన్వయం, ఆధునిక విమానాలతో లక్షిత దాడులు సమర్థవంతంగా చేపట్టబడ్డాయి. పాక్‌దళాలపై జరిపిన ప్రిసైజ్ ఎయిర్‌స్ట్రైక్స్ అత్యంత ప్రావీణ్యంతో చూశారు.
భారత్‌వైపు ప్రంపచ దేశాల చూపు..
నాటో కూటమి, యూరోపియన్ యూనియన్ దేశాలు భారత్ ఎయిర్ ఫోర్స్‌ను ఆసక్తితో, ఆశ్చర్యంతో పరిశీలిస్తున్నాయి. బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ భారత ఎయిర్‌లిఫ్ట్, శిక్షణ, వ్యూహాత్మక ఆపరేషన్స్‌లో సహకరిస్తోంది. బ్రిటీష్ ఎయిర్ ఎక్స్‌పార్ట్స్ భారత సైనికులను శిక్షణ దిస్తున్నారు.
ఫ్రాన్స్ మిలటరీ చీఫ్ భారత్‌లో కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ, పాకిస్తాన్ డ్రోన్ దాడులు ఎదుర్కోవడంలో ప్రావీణ్యం గురించి అవగాహన పొందడానికి పర్యటిస్తున్నారు. ఫ్రెంచ్ వారు పినాకా మల్టీ బ్యారల్ లాంచర్స్ సాంకేతికతకు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.
గ్రీస్ ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ సమన్వయం విధానాలు క్లుప్తంగా నేర్చుకోవాలని చూస్తుంది. టర్కీ సంపర్క ప్రస్తావనతో, భారత్ సామర్థ్యం గ్రీస్‌కు అత్యంత ఆకర్షణీయంగా మారింది.
ఆయుధాల కొనుగోలు, సైనిక భాగస్వామ్యం ..
ఫిలిప్పీన్స్ 200 బిలియన్ డాలర్ల విలువైన ఆకాశ్ బ్యాటరీ వ్యవస్థ సరఫరా కోసం ప్రయత్నిస్తోంది. వియత్నాం బ్రహ్మోస్ మిసైల్ సిస్టం కొనుగోలు చేస్తోంది. ఇండోనేషియా భారత్ వార్ ఫెయిర్ సాంకేతికతపై ఆసక్తి చూపిస్తోంది. పశ్చిమ ఆసియా, అరబ్, ఆఫ్రికా దేశాలు భారత సైనిక నిపుణుల సహకారం కోసం ఆశ చూపిస్తున్నాయి.
పరిమిత కాలంలో భారత సైన్యం ప్రదర్శించిన జ్ఞానం, సాంకేతికత, సమర్థత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన అంశాలు. ట్రైనింగ్, ప్లానింగ్, ప్లాంనింగ్ ఎక్సిక్యూషన్, ఇంటెలిజెన్స్ సమన్వయం సమర్థవంతంగా జరగడం వల్లే పాక్ దాడులు తిప్పికొట్టబడ్డాయి. ఈ విజయం భారత్‌వైపు ప్రపంచ ఆశయాలు మరింత పెంచింది. భారత వైమానిక దళం ఆధునిక సాంకేతికత, ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు, వ్యూహాత్మక ఆపరేషన్స్ లోని దేశాలతో సమంజసంగా పనిచేయగల సామర్థ్యంతో ప్రపంచ సైన్యాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.