Berojgari Bhatta Yojana: ఇప్పుడున్న రోజుల్లో జాబ్ రావాలంటే చాలా కష్టం అవుతోంది. కొందరు ఉన్నత విద్యా ఉన్నా సరైన ఉద్యోగం దొరకక నిరాశ చెందుతున్నారు. మిడిల్ క్లాన్ నుంచి కింది తరగతి వారైతే ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చివరకి తక్కువ జీతంతో ఏదో ఒక పనిని వెళ్లదీస్తున్నారు. మరికొందరు జాబ్ కోసం ప్రయత్నిస్తూ చదువుతూ ఉన్నారు. అయితే నిరుద్యోగుల ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం భృతి కింద నెలకు రూ.3000 ఇస్తోంది. అర్హులైన వారికి ఈ మొత్తాన్ని ఇస్తూ వారిని ఆదుకుంటోంది. మరి దీని వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వం Berojgari Bhatta Yojana అనే పథకాన్ని ఈ ఏడాదే ప్రారంభించింది. ప్రజలందరికీ ఉపాధిని కల్పించేందుకు సాయంగా నెలకు రూ.3000 వరకు చెల్లిస్లారు. కార్మిక శాఖ కింద అమలవుతున్న ఈ పథకం ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతోంది. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రారంభించనున్నారు. అయితే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీరు 21 నుంచి 35 ఏళ్ల లోపు వయసు వారే అయి ఉండాలి. డిగ్రీ లేకపోయినా, ఏజ్ గడువు దాటినా అర్హులు కాలేదు.
ఈ పథకం కింద లబ్ది పొందితే నెలకు రూ.3000 వరకు భృతి కింద చెల్లిస్తారు. అయితే ఈ పథకం కోసం దరఖాస్తు చేసేవారితో పాటు వారి ఇంట్లోకూడా ప్రభుత్వ ఉద్యోగులు అస్సలు ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నవారు దరఖాస్తు చేస్తే ఆ తరువాత చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలైతే My Sceems అనే వెబ్ వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ బిరోజ్ గారి పట్టాయోజన పేజీలోకి వెళ్లాలి.
అక్కడ దరఖాస్తు దారుడికి సంబంధించిన వివరాలు, ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అధికారులు వీటిని పరిశీలించి నిజమైన నిరుద్యోగులకు భృతి కింద రూ.3000లు చెల్లిస్తారు. చాలా మందికి ఈ విషయం తెలియక అర్హులైన వారు కూడా దరఖాస్తు చేయలేకపోతారు. అందువల్ల దీనిని తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసిన వెంటనే తెలుసుకొని అప్లై చేసుకోండి. వెంటనే నెలకు రూ.3000 వరకు వస్తాయి.