Tollywood Heroes: ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టమైన విషయం అనేది మనందరికీ తెలుసు… ఒక డైరెక్టర్ ఒక కథను రాసుకొని దాన్ని ఒక ప్రొడ్యూసర్ కి చెప్పి ఒప్పించి దాంట్లోకి ఒక హీరోని సెట్ చేసి సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు.ఒక సినిమా చేసి దాన్ని రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ఆ సినిమా ప్రమోషన్స్ ని ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటారు.ఇక అందులో భాగంగా ఈ మధ్య క్యూ అండ్ ఏ అనే శేషన్ ని నిర్వహించడం జరుగుతుంది. ఇక దాని ద్వారా సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంభందించిన ప్రమోషన్స్ లో భాగంగా చాలామంది రిపోర్టర్లు సినిమాకు సంబంధించిన క్వశ్చన్స్ కాకుండా వివిధ రకాల క్వశ్చన్ లు అడుగుతూ ఆ హీరో, హీరోయిన్స్ ని ఇబ్బంది పెడుతున్నారు.
ఇక రీసెంట్ గా నాని హీరో గా వస్తున్న హాయ్ నాన్న అనే సినిమాకు సంబంధించిన క్యూ అండ్ ఏ లో పాల్గొన్న నాని పక్కన ఒక చిన్న పాప ఉందని కూడా చూడకుండా ఒక రిపోర్టర్ లిప్ లాక్ గురించి అడగడం జరిగింది.దానికి కూడా నాని ఏ మాత్రం కోపానికి రాకుండా చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చాడు. ఇక ఇదే విషయం మీద పవన్ సాధినేని అనే ఒక డైరెక్టర్ స్పందిస్తూ క్యూ అండ్ ఏ అనే శేషన్ లో సినిమా కి సంబంధం లేని క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నారు.అసలు ఏంటి ఈ రిపోర్టర్స్ అసలు ఒక సినిమా అంటే వీళ్లు ఏం అనుకుంటున్నారు అంటూ ఆయన ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా వదలడం జరిగింది.
ఇక అలాగే నాని హీరో గా వచ్చిన గత చిత్రాలు అయిన జర్సి , శ్యామ్ సింగరయ్ లాంటి సినిమాలు సక్సెస్ అయినప్పటికీ కమర్షియల్ గా పెద్ద గా వర్క్ ఔట్ అవ్వలేదు అంటూ ఒక రిపోర్టర్ ఆ సినిమాల గురించి డీ గ్రేడ్ చేసి మాట్లాడటం తో ఆ సినిమా ప్రొడ్యూసర్లు సైతం రిపోర్టర్లు మీద తీవ్రమైన ఆగ్రహానికి గురవుతున్నారు. ఆ సినిమాలకి డబ్బులు వచ్చాయా రాలేదా అనే విషయం పక్కన పెడితే ఆ సినిమాలు మా బ్యానర్ లో తీసినందుకు మేము చాలా గర్వ పడుతున్నాం ఇంకా ఇలాంటి సినిమాలు చాలా చేస్తాం.అయిన మాకు లేని ఇబ్బంది వాళ్లకెందుకు అని అంటున్నారు. ఇక ఇది ఇప్పుడు అనే కాదు సాయిధరమ్ తేజ్ హీరో గా వచ్చిన విరూపాక్ష సినిమా టైం లో కూడా ఒక రిపోర్టర్ అసభ్య కరమైన క్వశ్చన్స్ అడగటం మనం చూశాం…
ఇక మొన్న హీరో సిద్ధార్థ్ చిన్నా సినిమా క్యూ అండ్ ఏ లో భాగంగా ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకి సిద్దు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తు క్వశ్చన్స్ అడిగేటపుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అడగండి…అని కౌంటర్ ఇచ్చాడు.అయితే ఈ రిపోర్టర్లు ఇలా రెచ్చిపోవడానికి కారణం క్వశ్చన్ అడుగుతున్న రిపోర్టర్ ఆ స్టార్ హీరో ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఉండటం తో వాళ్ళు ఎలాగైనా పాపులర్ కావాలని వాళ్ళకి ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడుగుతున్నారు.అందుకే ఇక మీదట పియర్వో లు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు గా తెలుస్తుంది…ఇక మీదట క్వశ్చన్స్ అడిగే వాళ్లు కనిపించకుండా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది…ఇంతకు ముందు మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ను కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగటం జరిగింది…ఇక ఇలాంటి నేపద్యం లోనే వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు గా తెలుస్తుంది…