సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనశైలికి డిఫరెంట్ ప్రవర్తించడం అభిమానులను షాక్ కు గురిచేసింది. బంధాలకు.. బంధువుత్వాలకు విలువ ఇవ్వనంటూనే రాంగోపాల్ వర్మ దీపావళి సందర్భంగా తన తల్లి.. సోదరితో కలిసి దీపావళి వేడుకల్లో సరదాగా గడిపాడు. అంతేకాకుండా వారితో కలిసి పటాసులు కాల్చడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: హనీమూన్ లోనూ కాజల్ సంపాదన ఆగట్లేదు !
రాంగోపాల్ వర్మ కాకుండా ఇలాంటి పని ఎవరూ చేసిన పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ రాంగోపాల్ వర్మ కుటుంబంతో దీపావళి సంబరాలను చేసుకోవడం అనేది సంచలనంగా మారింది. తన నైజానికి భిన్నంగా రాంగోపాల్ ప్రవర్తించడంపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది. నిత్యం ఎవరినో ఒకరిని గిల్లుతూ పబ్లిసిటీతో కాలంగడిపే వర్మ తన దృష్టిలో బంధాలకు విలువ లేదని చెబుతూ ఉంటాడు.
తాజాగా రాంగోపాల్ వర్మ తన కుటుంబంతో దీపావళి సంబురాలను జరుపుకున్న వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘నేను సహజంగా చాలా పిరికివాడిని.. అందుకే తల్లి వెనుక దాక్కున్నా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. వాయు.. శబ్ద కాలుష్యానికి తనవంతు సహకారం అందిస్తున్నట్టు వర్మ తనదైన వ్యంగ్యాన్ని ప్రదర్శించాడు.
Also Read: సినిమాలు ఆపేస్తానని చెప్పేవాడట !
అలాగే తన తల్లి.. సోదరిపై కూడా పంచ్ లు వేసి తనలోని రామును బయటికి తీశాడు. ‘దీపావళి సందర్భంగా వోడ్కా రుచి చూడమని నా తల్లి.. సోదరిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా..’ అంటూ వోడ్కా గ్లాస్ తన తల్లి ఇస్తున్నట్లుగా ఉన్న ఫొటో వర్మ ట్వీట్ చేశాడు. దీపావళి సందర్భంగా వర్మ తన కుటుంబంతో చాలా సరదాగా గడిపినట్లు ఫొటోలు.. వీడియోలు చూస్తే అర్థమవుతోంది.
తన మాటలు, సినిమాలతో అందరినీ ఇన్ స్పైర్ చేసే రాంగోపాల్ వర్మ రియల్ లైఫ్ లో మాత్రం కామెడీ వేషాలు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా రాంగోపాల్ వర్మ కుటుంబంతో దీపావళి వేడుకలు జరుపుకొని అందరికీ షాకివ్వడం కొసమెరుపు. ఇదిలా ఉంటే వర్మ ఇటీవల తెరకెక్కించిన ‘మర్డర్’..‘దిశ’ మూవీలు త్వరలోనే రిలీజుకు రెడీ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Me hiding behind my mother because I am basically a coward pic.twitter.com/OsJMpl14EI
— Ram Gopal Varma (@RGVzoomin) November 14, 2020
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Rgv diwali celebration with family
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com