spot_img
Homeఅత్యంత ప్రజాదరణబంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..?

బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..?


ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపే వారి సంఖ్య ఎక్కువని తెలిసిందే. బంగారంపై ఇష్టం ఉన్నా రోజురోజుకు బంగారం రేట్లు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే గత మూడు రోజులుగా బంగారం ధర అంతకంతకూ తగ్గుతుండటంతో బంగారం కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పాలి.

ఎవరైనా పెళ్లిళ్ల కోసం, ఇతారత్రా కారణాల వల్ల బంగారం కొనుగోలు చేయాలనుకుంటే కొనుగోలు చేస్తే మంచిది. బులియన్ మార్కెట్ నిపుణులు ఫైజర్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు సాధించడంతో బంగారం రేట్లు క్రమంగా తగ్గుతున్నట్టు చెబుతున్నారు. వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో 95 శాతం సత్ఫలితాలు సాధించడంతో బంగారం ధర దిగొస్తుంది. అయితే మళ్లీ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఒకవైపు పసిడి ధర క్రమంగా తగ్గుతుంటే మరోవైపు వెండి ధర మాత్రం ఆకాశాన్ని తాకుతుండటం గమనార్హం. వెండికి డిమాండ్ భారీగా పుంజుకోవడంతో వెండి ధర ఏకంగా 68,300 రూపాయలకు చేరింది. బంగారం విషయానికి వస్తే హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 51,630 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,300 రూపాయలుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ లో సైతం బంగారం ధర తగ్గడం గమనార్హం. ధర ఔన్స్ కు 0.10 శాతం తగ్గడంతో 1869 డాలర్ల క్షీణత నమోదైంది. వెండి ధర సైతం క్రమంగా తగుతూ 24.32 డాలర్లకు క్షీణించడం గమనార్హం. ప్రపంచ దేశాల్లో జరిగే కీలక పరిణామాలు, బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ఇతర అంశాలు బంగారం ధరపై ప్రభావ్నం చూపిస్తాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Chennai Love Story First Day Collections

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Kajal Aggarwal

Kajal Aggarwal: నన్ను కసాయి తల్లి అని అనుకున్నా పర్వాలేదు.. నేను అలాగే చేస్తాను : కాజల్...

Kajal Aggarwal: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకొని లేడీ సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్....
Japan And US

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Oktelugu Epaper