
గత కొంతకాలంగా జగన్ వర్సెస్ కోర్టులు అన్నట్లుగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రతీ విషయంలోనూ జగన్ కు కోర్టు నుంచి చీవాట్లు, వ్యతిరేక తీర్పులు రావడం పరిపాటిగా మారిందన్న టాక్ వైసీపీలో ఉంది. దీంతో ఏపీ కోర్టులోని కొందరు న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకు సీఎం జగన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సుప్రీం కోర్టు నుంచి ఏపీ ముఖ్యమంత్రికి కాస్త రిలీఫ్ దొరికింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లించే విషయంలో సుప్రీం నుంచి వచ్చిన స్టేతో జగన్ కు కాస్త లాభం చేకూరింది.
Also Read: జగన్.. జాగ్రత్త పడాల్సిందే.. పార్టీని పటిష్టం చేయాల్సిందే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన కరోనా ఏపీలోనూ ఆదాయానికి గండి కొట్టింది. దీంతో లాక్ డౌన్ పీరియడ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం కోత విధించి జీతాలు చెల్లించారు. అయితే ఆ తరువాత వాయిదాల పద్ధతిలో మిగతా మొత్తాన్ని చెల్లిస్తామని ప్రకటించారు. కాగా కొందరు కోత విధించిన 50 శాతం జీతంపై వడ్డీ కూడా చెల్లించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు కత్తిరించిన జీతాలపై 12 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది.
ఈ విషయంపై ప్రభుత్వం తరుపున న్యాయవాది సుప్రీం కోర్టుకు వెళ్లారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థతి బాగాలేనందున్న వడ్డీ చెల్లించలేమని న్యాయవాది వాదించారు. దీంతో ఈ వాదనను విన్న సుప్రీం కోర్టు హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చారు. ఇదిలా ఉండగా కోత విధించిన జీతాలను మూడు వాయిదా పద్ధతిలో చెల్లించాలి. అయితే ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన జగన్ ఐదు వాయిదాల్లో చేసేలా ఒప్పదం చేసుకున్నట్లు సమాచారం.
Also Read: పవన్ కళ్యాణ్ మళ్ళా మాట్లాడాడు
కాగా ఆ మొత్తాన్ని కూడా చెల్లించడం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. వడ్డీపై సుప్రీం నుంచి వచ్చిన ఆదేశాలతో అసలు మొత్తాన్ని కూడా చెల్లించకపోవడంతో వారు విస్మయానికి గురవుతున్నారు. అయితే ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు మాత్రం ఏ విధంగా స్పందించడం లేదు. వడ్డీ విషయం పక్కనబెట్టినా కోత విధించినా మొత్తం చెల్లించేలా ఉద్యోగ సంఘాలు యత్నించాలని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్