Gold Prices: బంగారం ధర గత ఏడాది ఇదే సమయానికి 70 నుంచి 80 వేల మధ్యలో ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా ₹1,20,000 కు దాటిపోయింది. ఇంకా పెరుగుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మనదేశంలో వేడుకలకు, వివాహాలకు కచ్చితంగా బంగారం వాడుతుంటారు. ఇటీవల కాలంలో మనుషులలో ఆర్థిక స్థిరత్వం పెరిగిన నేపథ్యంలో బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. బంగారం లేనిది వేడుక జరగదు అన్నట్టుగా చాలామంది వ్యవహరిస్తున్నారు.
ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో బంగారం వినియోగం అధికంగా ఉంటుంది. వినియోగం తగ్గట్టుగా మనదేశంలో బంగారం ఉత్పత్తి కాదు కాబట్టి దిగుమతి చేసుకోక తప్పడం లేదు. ఇటీవల కాలంలో బంగారం కొనుగోలు పెరగడంతో ఇతర దేశాల నుంచి దిగుమతులు అధికమయ్యాయి. డిమాండ్ అధికంగా ఉండడంతో రేట్ కూడా అదే స్థాయిలో ఉంటోంది. పైగా క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉండడంతో బంగారం మీద పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగిపోయిందని.. అందువల్ల ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర ఒకానొక దశలో 10 గ్రాముల ధర లక్షకు చేరుకున్నప్పుడు.. అక్కడ వరకు ఆగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ధర అంతకుమించి అనే స్థాయిలో పెరగడంతో ఏకంగా లక్ష ఇరవై వేలకు చేరుకుంది. ఇంకా పెరుగుతుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రముఖ మార్కెట్ రంగ నిపుణుడు స్మిత్ టక్కర్ మాత్రం బంగారం ధరల గురించి యావత్ భారతదేశం ఆశ్చర్యపోయే వార్త చెప్పారు. బంగారం ధరలు త్వరలోనే తగ్గుముఖం పడతాయని ఆయన అంచనా వేశారు. బంగారం ధరలు ఏకంగా 40 శాతానికి పడిపోతాయని.. ఇలాంటి సమయంలో పెట్టుబడి పెట్టే వారంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వడ్డీ రేట్లు పెరుగుతూ ఉండడం.. ప్రపంచ వ్యాప్తంగా వ్యత్యాసమైన పరిస్థితులు ఏర్పడడం వంటివి బంగారం ధరలు పడిపోవడానికి కారణంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల రిటైల్ ఇన్వెస్టర్లు ఈ రిస్కులను గమనించాలని ఆయన కోరారు. స్మిత్ ను ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 6.21 లక్షల మంది అనుసరిస్తున్నారు.
బంగారం ధరలు తగ్గితే అంతిమంగా వినియోగదారులు లాభపడతారని స్మిత్ పేర్కొన్నారు. ఆ సమయంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని ఆయన అంచనా వేశారు. బంగారం ధర తగ్గుముఖం పడితే అప్పుడు స్థిరాస్తి వ్యాపారాలు జోరందుకుంటాయని.. భూముల ధరలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అదే జరిగితే ఒక వర్గం వారు మాత్రమే ఇళ్ల స్థలాలు.. గృహాలు కొనుగోలు చేస్తారని.. మిగతా వారంతా పెరిగిన ధరలను పోల్చి చూస్తూ బాధపడతారని స్మిత్ వెల్లడించారు. వాస్తవానికి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెరిగితే బంగారం ధర తగ్గుతుందని ఆయన అంచనా వేశారు.. మొత్తంగా చూస్తే స్మిత్ అంచనాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
View this post on Instagram