Wife Tips to Handle Husband: సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ గా మారింది. ఆ వీడియోలో కొందరు మహిళలు అన్నం తింటూ కనిపించారు. వారంతా కూడా వ్యవసాయ కూలీల లాగా కనిపిస్తున్నారు. ఇందులో ఒక మహిళ వద్దకు యువతి వచ్చింది. బహుశా ఆమెకు ఇటీవల వివాహం జరిగినట్టు కనిపిస్తోంది. ఆ యువతి ఇక్కడ అన్నం తింటున్న మహిళతో మాటలు కలవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తన వైవాహిక జీవితంలో చోటుచేసుకుంటున్న విషయాలను వివరించింది. ఆ యువతి చెప్పిన మాటలను మొత్తం ఆ మహిళ విన్నది. ఆ తర్వాత తన అనుభవసారాన్ని మొత్తం వివరించి.. ఆ యువతి సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని చూపించింది. ఆ మహిళ మాటలు విన్న ఆ యువతి.. వాటిని అనుసరిస్తానని ప్రకటించింది.
Also Read: Husband and Wife: భార్యతో రొమాంటిక్ రిలేషన్ బాగుండాలంటే ఈ 5 సూత్రాలు పాటించాలి…
తన మాట వినడం లేదని.. తన భర్త కొంగు పట్టుకొని తిరగడం లేదని ఆ యువతి ఆ మహిళతో వాపోయింది..” అందరి భర్తలు కొంగుచాటు కృష్ణుడి లాగా ఉంటారు. మరి నా భర్త ఏమిటి ఇలా ఉన్నాడు. వాళ్ల అమ్మ మాట వింటున్నాడు. వాళ్ల నాన్నకు సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళవైపు బంధువులతో సన్నిహితంగా ఉంటున్నాడు. నాతో అంతంతమాత్రంగానే ఉంటున్నాడు. దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను.. అతడికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. పైగా అతడు నా మాట వినిపించుకోవడం లేదు. ఇది నా అహాన్ని దెబ్బతీస్తోంది. దీనివల్ల నేను మన:శాంతిగా ఉండలేకపోతున్నానని” ఆ యువతి ఆ మహిళతో చెప్పింది.. దీనికి ఆ మహిళ ఒక పరిష్కార మార్గాన్ని చూపించింది..” థమ్స్ అప్ లో మరగు మందు కలుపు. ఆ తర్వాత అది నీ భర్తకు తాగిపించు. దెబ్బకు నీ మాట వింటాడు. నీ చుట్టూ తిరుగుతాడు. నీకొంగు పట్టుకుని వస్తుంటాడు.. వెనకట పెద్దలు ఇలానే చేసేవారు. నువ్వు కూడా అలానే చేసి సంసారాన్ని సక్కదిద్దుకో. నీ భర్తను నీ వాడిని చేసుకో” అని ఆ మహిళ సలహా ఇచ్చింది. దానికి యువతి సరే అన్నది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. దీనిని కావాలని తీశారా? సోషల్ మీడియాలో ప్రచారం కోసం ఇలా చిత్రీకరించారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియదు గాని.. మొత్తానికి అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. అయితే ఈ వీడియో ఏదో సరదా కోసం చిత్రీకరించారని.. రియాల్టీలో ఇలా ఉండదని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే మరుగు మందు మనుషులను ప్రభావితం చేయదని.. అలా చేస్తుందని నమ్మి డబ్బులు పోగొట్టుకోవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram