Amit Shah: పాక్ తో సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్దరించే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఒప్పందం రద్దుతో మిగిలిన జలాలను కెనాల్ నిర్మించి రాజస్థాన్ కు తరలిస్తామని పేర్కొన్నారు. కాగా 1960లో భారత్, పాకిస్తాన్ మధ్య సింధు జాలల ఒప్పందం కుదరగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దానిని భారత్ రద్దు చేసిన విషయం తెలిసిందే.