Rashmi- Ram Prasad: వరల్డ్ ఫేమస్ పోర్న్ స్టార్ మియా ఖలీఫాతో యాంకర్ రష్మీని పోల్చి షాక్ ఇచ్చాడు రామ్ ప్రసాద్. అందరి ముందే జరిగిన ఈ సంఘటనకు అందరూ అవాక్కయ్యారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా జడ్జెస్, యాంకర్స్, కమెడియన్స్ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఇందులో భాగంగా కొన్ని స్పెషల్ స్కిట్స్ చేశారు. తామంతా బాల్యంలోకి వెళ్లాలని రామ్ ప్రసాద్ కోరాడు. స్కిట్ లో నటిస్తున్న రామ్ ప్రసాద్, రష్మీ, ఇమ్మానియేల్ స్కూల్ పిల్లలుగా యూనిఫామ్ లోకి మారారు.

గౌనులో ఉన్న రష్మీని ఉద్దేశించి ఎక్కడో చూసినట్లుందని ఇమ్మానియేల్ అన్నాడు. ఎవరో కాదురా మియా ఖలీఫా అని రామ్ ప్రసాద్ అన్నాడు. మియా ఖలీఫా బ్లూ ఫిల్మ్స్ లో నటించే పోర్న్ స్టార్ కాగా ఆమెతో పోల్చడం తో వేదికపై ఉన్నవారంతా షాక్ అయ్యారు. చివరికి రష్మీ కూడా నోరెళ్లబెట్టింది. టీచర్ పాత్రలో ఉన్న ఇంద్రజ రామ్ ప్రసాద్ ని బెత్తంతో కొట్టి మందలించింది. కామెడీ పంచ్ పేరుతో రష్మీని పోర్న్ స్టార్ తో పోల్చి రామ్ ప్రసాద్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు.
ఇటీవల యాంకర్స్ పై కమెడియన్స్ పంచ్లు వివాదాస్పదం అవుతున్నాయి. వారి కామెడీ కౌంటర్లు హద్దుమీరుతున్నాయని యాంకర్స్ వాపోతున్నారు. జబర్దస్త్ మానేసిన అనసూయ ఆ నిర్ణయానికి ఇదొక కారణంగా చెప్పారు. జబర్దస్త్ కమెడియన్స్ వలన నేను బాడీ షేమింగ్ కి గురయ్యానని చెప్పారు. మనసు నొప్పించేలా సెటైర్లు, జోకులు ఉండేవి. ఎప్పుడైనా కోపం ప్రదర్శిస్తే అది ఎపిసోడ్లో చూపించరు. ఎడిటింగ్ లో తీసేస్తారని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. హైపర్ ఆది దాడి తట్టుకోలేక కొత్త యాంకర్ సౌమ్యరావు కూడా షో వదిలేశారనే ప్రచారం జరుగుతుంది.

సౌమ్యరావుపై ఆది వేస్తున్న జోకులకు హర్ట్ అయిన ఆమె అగ్రిమెంట్ బ్రేక్ చేసి జబర్దస్త్ కి గుడ్ బై చెప్పారని లేటెస్ట్ టాక్. ఆమెపై తెరకెక్కిన జబర్దస్త్ ఎపిసోడ్స్ మినహాయిస్తే భవిష్యత్ లో సౌమ్యరావు కనిపించరు అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. అనసూయ జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాక కొన్ని వారాలు రష్మీ యాంకర్ గా వ్యవహరించారు. సౌమ్యరావు రాకతో మళ్ళీ రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ కి పరిమితం అయ్యారు. ప్రస్తుతం జబర్దస్ కి సౌమ్యరావు, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు.