Larry Ellison Biography: ఈ సృష్టిలో తల్లికి మించిన దైవం లేదు. ఒక బిడ్డ ఎదుగుదలకు తల్లి మాత్రమే ఎంతో త్యాగం చేస్తుంది. అయితే ప్రతి తల్లి ఏదో రకంగా తన జీవితాన్ని బిడ్డ కోసం దార పోస్తుంది. కానీ అందరూ అనుకున్న స్థాయిలో జీవితాన్ని పొందలేరు. అలా ఓ వ్యక్తి చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. ఆ తర్వాత పేదరికంని ఎదుర్కొన్నాడు. చదువు కోసం ఎన్నో తిప్పలు పడ్డాడు. కానీ చివరికి ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ అంటే ఎక్కువగా డబ్బు సంపాదించే స్థితికి ఎదిగాడు. ఆయనే ఒరాకిల్ సంస్థ అధినేత లారీ ఎలసన్. ఆయన జీవిత చరిత్ర లోకి వెళితే..
పురాతన కాలంలో చిన్న వయసులోనే పెళ్లిళ్లు అయ్యేవి. కానీ ఎలాంటి పెళ్లి చేసుకోకుండా ఫ్లోరెన్స్ అనే 19 ఏళ్ల యువతి బిడ్డను కనాల్సి వచ్చింది. ఆ బిడ్డ కూడా న్యూమోనియాతో బాధపడడంతో ఆ తల్లి రోదన మరింత ఎక్కువైంది. అయితే తన సహచరుడు సైనికుడు. కానీ అతడిని పెళ్లి చేసుకోలేదు కాబట్టి బిడ్డతో తనకు సంబంధం లేదని అన్నాడు. ఓవైపు వ్యాధితో ఉన్న బిడ్డ.. మరోవైపు తండ్రి లేకుండా బిడ్డను కన్నావని నిందలు.. ఈ అవమానాన్ని భరించలేక ఆ తల్లి తన బంధువులకు బిడ్డను ఇచ్చేసింది. ఈ బిడ్డను లిలియన్, లూయి ఎలాసాన్ అనే దంపతులు పెంచే బాధ్యతను తీసుకున్నారు. అయితే ఈ బిడ్డను తీసుకున్న తర్వాత వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తీవ్రంగా నష్టాలు వచ్చాయి. దీంతో వారు ఇరుకు ఇంట్లోకి మారాల్చి వచ్చింది. అయితే తన నష్టానికి కారణం ఈ బిడ్డ అంటూ పెంపుడు తండ్రి లూయి ఎప్పుడు అనేవాడు. కానీ పెంపుడు తల్లి లిలియన్ మాత్రం లారీ ఎలసన్ ను మాత్రం దగ్గరకు చేర్చుకునేది. అయితే తండ్రి అనే మాటలకు ఇష్టం లేక లారీ ఎలసన్ బాధపడేవారు.
అయితే ఎన్నో కష్టాల నడుమ లారీ ఎలసన్ కష్టంగా చదువును ప్రారంబించాడు. అలా యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండగా తనను ప్రేమగా చూసుకుని ఒకే ఒక్క తల్లి లిలియన్ మరణిస్తుంది. అయితే ఆ తర్వాత తనకు అసలు తల్లిదండ్రుల గురించి తెలిసినా తన ప్రేమ మాత్రం లీలియన్ పైనే ఉండేది. ఆ తర్వాత తండ్రి వద్దకు వెళ్లేవాడు కాదు లారీ ఎలసన్.
ఎన్నో కష్టాలు పడి చికాగో యూనివర్సిటీలో చేరిన లారీ ఎలసన్ రోడ్డుపై దొరికే ఫాస్ట్ ఫుడ్ తో కడుపు నింపుకొని.. చిన్న చిన్న పనులు చేస్తూ పుస్తకాలు కొనుగోలు చేసేవాడు. ఆ తర్వాత ప్రోగ్రామింగ్ కోర్సులో చేరేందుకు డబ్బులు ఉండేవి కాదు. అయినా కూడా కష్టాలు ఎదుర్కొంటూ 10 ఏళ్లపాటు చదువును పూర్తిచేసి empex అని కంపెనీలో ఉద్యోగం సాధించాడు. ఆ తర్వాత ఓ డేటాబేస్ సంస్థని ప్రారంభించాలని అనుకున్నాడు.. కానీ అనుకోకుండా software development laboratories ను ప్రారంభించాడు. ఎనిమిది మందితో ప్రారంభమైన ఈ సంస్థ మొదట్లో ఎన్నో ఓడిదడుగులను ఎదుర్కొంది. పెట్టుబడులు పెట్టేవారు ఎవరూ లేకపోవడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరగా ఒరాకిల్ సంస్థను ఏర్పాటు చేసి తన దశను మార్చుకున్నాడు.
అయితే ఈ సంస్థ ద్వారా తాను డబ్బు సంపాదించడం అని కాకుండా తనకు నచ్చిన విధంగా పనిచేయాలని అనుకున్నాడు. అలా ముందుకు వెళ్లిన ఆయన ఇప్పుడు 34 లక్షల కోట్ల రూపాయలతో ప్రపంచ కుబేరుడు ఎలాంటి మస్క్ ను వెనక్కి నెట్టాడు. ఇలా కృషి, పట్టుదలతో సాధిస్తే ఎంతటి పేదరికంను అయినా విజయవంతంగా జయించవచ్చని ఈయన జీవిత చరిత్ర తెలుపుతుంది.