Homeలైఫ్ స్టైల్Viral Dosa Story: ఓ తల్లి చేసిన మామూలు దోశ.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు.....

Viral Dosa Story: ఓ తల్లి చేసిన మామూలు దోశ.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు.. ఆ స్టోరీ ఏంటో తెలుసా?

Viral Dosa Story: మనలో చాలామందికి ఉదయం టిఫిన్ తినడం అలవాటు. ప్రతిరోజు ఇడ్లీ తినలేం. అలాగని పూరి కూడా ఆరగించలేం. వడను కూడా ఎక్కువగా తీసుకోలేం. కానీ దోశను మాత్రం రోజూ పెట్టినా తినేస్తాం. దోశ అనేది అద్భుతమైన డిష్. మినప్పప్పు.. బియ్యపు పిండి.. ఇంకా ఇతర దినుసులతో కలిపి పిండి రుబ్బుతారు. దాన్ని పులియబెడతారు. మరుసటి రోజు వేడివేడి పెనం మీద దోశ ను పోస్తారు. ఇక ప్రాంతాన్ని బట్టి దోశలు మారుతూ ఉంటాయి. […]

Viral Dosa Story: మనలో చాలామందికి ఉదయం టిఫిన్ తినడం అలవాటు. ప్రతిరోజు ఇడ్లీ తినలేం. అలాగని పూరి కూడా ఆరగించలేం. వడను కూడా ఎక్కువగా తీసుకోలేం. కానీ దోశను మాత్రం రోజూ పెట్టినా తినేస్తాం.

దోశ అనేది అద్భుతమైన డిష్. మినప్పప్పు.. బియ్యపు పిండి.. ఇంకా ఇతర దినుసులతో కలిపి పిండి రుబ్బుతారు. దాన్ని పులియబెడతారు. మరుసటి రోజు వేడివేడి పెనం మీద దోశ ను పోస్తారు. ఇక ప్రాంతాన్ని బట్టి దోశలు మారుతూ ఉంటాయి. ఆనియన్.. మసాలా.. నుంచి మొదలు పెడితే ఎన్నో రకాల దోశ లు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు ఫుడ్ రంగంలోకి వచ్చి.. రకరకాల దోశలను తయారు చేస్తున్నాయి. అవుట్లెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఫ్రాంచైజీలు కూడా ఇచ్చేస్తున్నాయి.

అయితే కర్ణాటక రాష్ట్రంలో అవసరం కోసం పుట్టిన ఒక దోశ ఇప్పుడు ఏకంగా ఆ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కూడా పొందింది. ఆ దోశ పేరు దావనగరే బెన్నె. 1928లో చిన్నమ్మ అనే మహిళ తన బిడ్డలకు ఆకలి తీర్చడానికి దోశలు అమ్మడం మొదలు పెట్టింది. ఆమె స్వయంగా తయారు చేసిన తెల్లటి వెన్న ను దోశ పిండిలో పోయడం మొదలుపెట్టింది. అది విపరీతమైన రుచిని అందించింది . అలా ఆ దోశ కర్ణాటక రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. బెంగళూరు నగరంలో ఉన్న పెద్ద పెద్ద హోటల్స్ నుంచి మొదలు పెడితే.. చిన్నచిన్న ఫుడ్ అవుట్ లెట్ ల వరకు ఈ దోశలు విక్రయిస్తున్నారు. పైగా ఈ దోశ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించింది. ముఖ్యంగా ఐటీ విభాగంలో పనిచేసేవారు ఈ దోశ లను ఇష్టంగా తింటారు. వెన్న వేయడం వల్ల ఈ దోశ లు అద్భుతంగా ఉంటాయి.

ఈ దోశలు కర్ణాటక రాష్ట్రంలోనే కాదు.. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటి రాష్ట్రాల్లో కూడా లభిస్తున్నాయి. చాలామంది ఈ దోశ తయారీ నేర్చుకొని.. వ్యాపారం సాగిస్తున్నారు. ముఖ్యంగా పెద్దపెద్ద హోటల్స్ నిర్వాహకులు దోశ ఫెస్టివల్స్ నిర్వహించినప్పుడు.. కచ్చితంగా ఈ కన్నడ దోశకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ దోశ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper