Homeలైఫ్ స్టైల్Banana Fruits: అరటి పండుతో పాటు మిగిలిన పండ్లను ఒకే చోట పెడుతున్నారా.. ఇది తెలిస్తే...

Banana Fruits: అరటి పండుతో పాటు మిగిలిన పండ్లను ఒకే చోట పెడుతున్నారా.. ఇది తెలిస్తే ఇకపై ఆ తప్పు చేయరు!

Banana Fruits:సాధారణంగా మనం మార్కెట్ నుంచి కొన్ని పండ్లను తెచ్చుకున్నప్పుడు ఆ పండ్లను ఒక బుట్టలో వేసి డైనింగ్ టేబుల్ పై లేదా ఫ్రిజ్ పై పెడతాము ఈ క్రమంలోని నారింజ, ఆపిల్ ,బనానా సపోటా పండ్లు అన్నింటినీ కలిపి ఒకే చోట పెడుతుంటారు. ఇలా అన్నింటినీ ఒకే చోట కలిపి పెట్టే వారు తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. సైన్స్ ప్రకారం ఆలోచిస్తే ఈ విధంగా అరటి పండ్లతో కలిపి ఇతర పండ్లను పెట్టడం సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎందుకు పెట్టకూడదనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….

అరటి పండు త్వరగా పక్వానికి రావడానికి అరటి పండ్ల పై ఈథేన్ వాయువును వేయటం వల్ల అరటి పండ్లు తొందరగా పక్వానికి వస్తాయి. ఈ క్రమంలోనే అరటిపండు నుంచి ఈథేన్ గ్యాస్ వెలువడుతుందని  సైన్స్ చెబుతోంది. ఈ క్రమంలోనే అరటి పండ్లతో పాటు వేరే పండ్లను కూడా అక్కడ ఉంచడం వల్ల ఈ గ్యాస్ ప్రభావం ఆ పండ్లపై పడి అవి కూడా తొందరగా పండిపోతాయి. అలాగే ఆ పండ్ల పై కూడా ఈ రసాయన ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

అందుకే అరటి పండ్లతో పాటు మిగతా పండ్లను కలిపి పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా కలిపి పెట్టడం వల్ల అరటిపండ్లతో పాటు మిగతా పండ్ల కూడా తొందరగా పండిపోయి కుళ్ళి పోవడమే కాకుండా, ఆ పండ్ల పై కూడా ఈథేన్ గ్యాస్ ప్రభావం పడుతుంది అందుకోసమే అన్ని పండ్లను కలిపి ఒక చోట పెట్టకూడదు. అరటిపండ్లపై పరిశోధనల సాగిస్తున్న యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్ పరిశోధకులు డాక్టర్ డాన్ బెబర్ తెలిపిన సమాచారం ప్రకారం అరటిపండులో పాలీఫెనాల్ ఆక్సిడేస్ ఎంజైమ్ ఉంటుంది. ఇది అరటి పండులో ఉండే ఫినాలిక్ రసాయనాన్ని ఆక్సిజన్ సహాయంతో క్వినోన్‌లుగా మార్చడం వల్ల అరటిపండు తొందరగా చాక్లెట్ రంగులోకి మారుతుందని తెలిపారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper